te_tw/bible/kt/ark.md

3.2 KiB

మందసం

నిర్వచనం:

ఈ పదం "మందసం"అక్షరాలా కొయ్యతో చేసిన నలుచదరం పెట్టెను చెప్పడానికి వాడతారు. దేన్నైనా భద్రంగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. మందసం పెద్దది చిన్నది అయి ఉండవచ్చు. దేనికి ఉపయోగిస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది.

  • ఇంగ్లీషు బైబిల్లో, ఈ పదాన్ని మొదటిగా చాలా పెద్దది అయిన, లోక వ్యాప్తమైన వరద నుండి తప్పించుకోడానికి నోవహు నిర్మించిన కొయ్యతో చేసిన నలుచదరం నావను సూచిస్తూ వాడారు. ఓడకు సమతలంగా ఉన్న అడుగు, పై కప్పు, గోడలు ఉన్నాయి.
  • ఈ పదాన్ని అనువదించడంలో "చాలా పెద్దనావ” లేక “ఓడ” లేక “రవాణా నౌక” లేక “పెద్ద పెట్టె ఆకారపు ఓడ."
  • ఈ హీబ్రూ పదాన్ని పెద్ద ఓడకు ఉపయోగిస్తారు. ఇదే పదాన్ని బుట్ట, లేక పెట్టె కోసం కూడా ఉపయోగిస్తారు. మోషే పసివాడుగా ఉండగా అతని తల్లి అతణ్ణి దాచి నైలు నదిలో వదిలిన బుట్ట లేక పెట్టె. అలాటి సందర్భంలో సాధారణంగా దీన్ని "బుట్ట" అని తర్జుమా చెయ్యవచ్చు.
  • "నిబంధన మందసం," అనే పద బంధంలో వివిధ హీబ్రూ పదాలు ఉపయోగిస్తారు. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"పెట్టె” లేక “మంజూష” లేక “కంటైనర్."
  • ఒక్కొక్క సందర్భంలో దీన్ని అనువదించడానికి ఎన్నుకునే పదం ప్రాముఖ్యం. ఆ వస్తువును దేనికి వాడతారో దాన్ని బట్టి ఉంటుంది.

(చూడండి: నిబంధన మందసం, బుట్ట)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H727, H8392, G2787