te_tn/te_tn_65-3JN.tsv

49 lines
26 KiB
Plaintext
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
3JN front intro kwv9 0 # 3 యోహాను రాసిన పత్రిక పరిచయం

## భాగం 1: సాధారణ పరిచయం

### 3 యోహాను పత్రిక రూపురేఖలు. పరిచయం (1:1)

1. ఆతిథ్యాన్ని చూపించడానికి ప్రోత్సాహం, హెచ్చరికలు(1:2-8)
1. దియోత్రెఫే, దేమేత్రి (1:9-12)
1.ముగింపు (1:13-14)

### 3 యోహాను ప్రత్రికను ఎవరు రాశారు?

ఈ ఉత్తరం రచయిత పేరును ఇవ్వడం లేదు. రచయిత తనను తాను **పెద్ద**గా మాత్రమే గుర్తించుకొన్నాడు (1:1). ఈ ఉత్తరాన్ని బహుశా అపొస్తలుడైన యోహాను తన జీవితం చివరిభాగంలో వ్రాశాడు.

### 3 యోహాను పత్రిక ఏమి చెపుతుంది?

యోహాను ఈ ఉత్తరాన్ని గాయికి అనే విశ్వాసికి రాశాడు. తన ప్రదేశాల ద్వారా ప్రయాణిస్తున్న తోటి విశ్వాసులకు ఆతిథ్యమివ్వాలని యోహాను గాయిని ఆదేశించాడు.

### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?

అనువాదకులు “యోహాను నుండి మూడవ పత్రిక” లేదా “యోహాను రాసిన మూడవ పత్రిక” లాంటి సాంప్రదాయ శీర్షికలతో ఈ పత్రికను పిలువవచ్చు. లేదా “యోహాను నుండి మూడవ పత్రిక” లేదా “యోహాను రాసిన మూడవ పత్రిక” లాంటి స్పష్టమైన శీర్షికను వారు ఎంపిక చేయవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

## భాగం 2: ముఖ్యమైన మతపరమైనా, సాంస్కృతిక అంశాలు

### ఆతిథ్యం అంటే ఏమిటి?

పురాతన సమీప తూర్పు దేశాలలో ఆతిథ్యం ఒక ముఖ్యమైన అంశం. విదేశీయులు లేదా బయటి వ్యక్తుల పట్ల స్నేహంగా ఉండడమూ, వారికి అవసరమైతే సహాయం అందించడమూ చాలా ముఖ్యం. 2 యోహాను పత్రిక, అబద్ధపు బోధకులకు ఆతిథ్యం చూపించకుండా ఉండేందుకు యోహాను క్రైస్తవులను నిరుత్సాహపరిచాడు. 3 యోహాను పత్రికలో, నమ్మకమైన బోధకులకు ఆతిథ్యం చూపించాలని యోహాను క్రైస్తవులను ప్రోత్సహించాడు

## భాగం 3: ముఖ్యమైన అనువాద సమస్యలు

### రచయిత తన ఉత్తరంలో కుటుంబ సంబంధాలను ఏవిధంగా ఉపయోగించాడు?

రచయిత **సోదరుడు,** **పిల్లలు** పదాలను ఉపయోగించాడు, ఇవి కొంత గందరగోళానికి గురిచేసేవిగా ఉన్నాయి. యూదులను సూచించడానికి లేఖనాలు తరచుగా **సోదరులు** అనే పదాన్ని ఉపయోగించాయి. అయితే ఈ ఉత్తరంలో క్రైస్తవులను సూచించడానికి యోహాను ఈ పదాన్ని ఉపయోగించాడు. అంతే కాకుండా యోహాను కొంతమంది విశ్వాసులను తన **పిల్లలు** అని పిలిచాడు. వీరు క్రీస్తుకు విధేయత చూపాలని తాను బోధించిన విశ్వాసులు.

యోహాను **అన్యజనులు** అనే పదాన్ని గందరగోళానికి గురిచేసే విధంగా ఉపయోగించాడు. యూదులు కాని వ్యక్తులను సూచించడానికి లేఖనాలు తరచుగా **అన్యజనులు** అనే పదాన్ని ఉపయోగించాయి. అయితే ఈ ఉత్తరంలో, యేసును విశ్వసించని వారిని సూచించడానికి యోహాను ఈ పదాన్ని ఉపయోగించాడు.
3JN 1 1 rni7 figs-you 0 General Information: ఇది యోహాను గాయికి రాసిన వ్యక్తిగత లేఖ. **నీవు**, **నీ** అని రాసిన అన్ని సందర్భాలు గాయిని సూచిస్తున్నాయి, అవి ఏకవచనం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
3JN 1 1 w99t figs-explicit ὁ πρεσβύτερος 1 The elder ఇది యేసు అపొస్తలుడు మరియు శిష్యుడైన యోహానును సూచిస్తుంది. అతను తన వృద్ధాప్యం కారణంగా లేదా సంఘంలో నాయకుడు కావడం వలన తనను తాను **పెద్ద** అని సూచిస్తున్నాడు. రచయిత పేరు స్పష్టంగా చెప్పవచ్చు: “నేను, పెద్దనైన యోహాను, వ్రాస్తున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
3JN 1 1 lls6 translate-names Γαΐῳ 1 Gaius యోహాను ఈ ఉత్తరాన్ని రాస్తున్న ఇతను తోటి విశ్వాసి. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
3JN 1 1 mp9w ὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ 1 whom I love in truth నేను నిజంగా ప్రేమిస్తున్నాను
3JN 1 2 v6dv περὶ πάντων…σε εὐοδοῦσθαι καὶ ὑγιαίνειν 1 everything for you to prosper and to be healthy నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి, మరియు ఆరోగ్యంగా ఉండాలి”
3JN 1 2 i269 καθὼς εὐοδοῦταί σου ἡ ψυχή 1 just as your soul prospers “నీవు ఆత్మీయంగా ఆరోగ్యవంతుడివిగా ఉన్నట్టుగానే”
3JN 1 3 b4zh ἐρχομένων ἀδελφῶν 1 brothers came “తోటి విశ్వాసులు వచ్చినప్పుడు” ఈ ప్రజలు అందరూ బహుశా పురుషులై ఉంటారు.
3JN 1 3 y7q3 figs-metaphor σὺ ἐν ἀληθείᾳ περιπατεῖς 1 you are walking in truth ఒక మార్గంలో నడవడం ఒక వ్యక్తి తన జీవితాన్ని ఏవిధంగా జీవిస్తున్నాడనేదానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: “నీవు దేవుని సత్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని జీవిస్తున్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
3JN 1 4 w79m figs-metaphor τὰ ἐμὰ τέκνα 1 my children యేసునందు విశ్వాసం ఉంచడానికి తాను బోధించిన వారు తన పిల్లలుగా యోహాను మాట్లాడుతున్నాడు. ఇది వారి పట్ల ఆయనకున్న ప్రేమనూ, ఆసక్తినీ నొక్కి చెపుతుంది. తానే వారిని ప్రభువు వద్దకు నడిపించాడని కూడా చెపుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నా ఆత్మీయ పిల్లలు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
3JN 1 5 vl13 0 Connecting Statement: దేవుణ్ణి సేవించడానికి ప్రయాణం చేస్తున్న ప్రజలను గురించిన శ్రద్ధ తీసుకోవాలని గాయికి ఆదేశించడం ఈ ఉత్తరం రాయడంలో యోహాను యొక్క ఉద్దేశ్యం. తరువాత అతడు ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు, ఒకరు దుష్టుడైన వ్యక్తి, మరొకరు మంచి వ్యక్తి.
3JN 1 5 tmh1 ἀγαπητέ 1 Beloved ఇక్కడ **ప్రియమైన** పదం ఒక తోటి విశ్వాసిగా గాయి కోసం తన ప్రేమను చూపించడం కోసం ఉపయోగించబడింది. మీ భాషలో ప్రియమైన స్నేహితుడు కోసం ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించండి.
3JN 1 5 gs6x πιστὸν ποιεῖς 1 you are doing a faithful thing “మీరు దేవునికి నమ్మకమైనదానిని చేస్తున్నారు” లేదా “మీరు దేవునికి స్వామిభక్తితో ఉన్నారు”
3JN 1 5 g4gz ὃ, ἐὰν ἐργάσῃ εἰς τοὺς ἀδελφοὺς καὶ τοῦτο ξένους 1 whenever you work for the brothers, and this for strangers మీరు తోటి విశ్వాసులకు సహాయం చేసినప్పుడు, ముఖ్యంగా మీకు తెలియని వారికి
3JN 1 6 wzf6 οἳ ἐμαρτύρησάν σου τῇ ἀγάπῃ ἐνώπιον ἐκκλησίας 1 who have borne witness of your love in the presence of the church ఈ పదాలు **అపరిచితులను** గురించి వివరిస్తున్నాయి (5 వ వచనం). ""అపరిచితులైన వారిని నీవు ఏవిధంగా ప్రేమించావో సంఘంలోని విశ్వాసులకు చెప్పారు”
3JN 1 6 pb64 καλῶς ποιήσεις, προπέμψας 1 You do well to send them on their journey ప్రయాణిస్తున్న విశ్వాసులకు సహాయం చేయడంలో గాయి యొక్క సహజ అభ్యాసం విషయంలో యోహాను అతనిని అభినందిస్తున్నాడు. ఇది గాయి నిరంతరం చేసే పని అని చూపించే విధంగా దీనిని అనువదించండి.
3JN 1 7 d8y1 figs-metonymy γὰρ τοῦ ὀνόματος ἐξῆλθον 1 because they went out for the sake of the name ఇక్కడ **పేరు** పదం యేసును సూచిస్తుంది. దీని అర్థం: (1) యేసు గురించి ఇతరులకు చెప్పడానికి వారు ఉన్న చోటనుండి బయలుదేరారు, లేదా (2) వారు ఉన్న చోటునుండి బయలుదేరారు ఎందుకంటే వారు యేసును విశ్వసించినందుచేత వారు విడిచి వెళ్ళాలని వారిని బలవంతం చేశారు. లేదా (3) ఈ రెండూ విషయాలు. ప్రత్యామ్నాయ అనువాదం: “వారు యేసును గురించి ప్రజలకు చెప్పడానికి బయలుదేరినప్పటి నుండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
3JN 1 7 yzc8 μηδὲν λαμβάνοντες 1 receiving nothing (1) అవిశ్వాసులు వారికి ఏదైనా ఇచ్చి వారికి సహాయం చేయలేదు లేదా (2) అవిశ్వాసుల నుండి ఎటువంటి సహాయం లేదా కానుకలూ అంగీకరించలేదు అని దీని అర్థం కావచ్చు.
3JN 1 7 hk3p τῶν ἐθνικῶν 1 the Gentiles ఇక్కడ **అన్యజనులు** అంటే కేవలం యూదులుకాని వారు మాత్రమే అని కాదు. యేసు నందు విశ్వాసం ఉంచని ఎటువంటి ప్రజలైనా కావచ్చు.
3JN 1 8 d2l7 ἵνα συνεργοὶ γινώμεθα τῇ ἀληθείᾳ 1 so that we become fellow workers for the truth తద్వారా ప్రజలకు దేవుని సత్యాన్ని ప్రకటించడంలో మనం వారికి సహకరిస్తాము
3JN 1 8 ab01 figs-personification τῇ ἀληθείᾳ 1 for the truth యోహాను, గాయి, ఇతరులు ఒక వ్యక్తికోసం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ “సత్యం” చెప్పబడింది. దీని అర్థం (1) UST లో ఉన్నట్లుగా “దేవుని నుండి వచ్చిన సత్య సందేశం” లేదా దీని అర్థం (2) “సత్యం అయిన దేవుడు”. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
3JN 1 9 tm9q τῇ ἐκκλησίᾳ 1 the church సంఘం పదం గాయినీ, దేవుణ్ణి ఆరాధించడానికి కలిసి విశ్వాసుల గుంపునూ సూచిస్తుంది.
3JN 1 9 cz9d translate-names Διοτρέφης 1 Diotrephes అతను సంఘం ఒక సభ్యుడు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
3JN 1 9 s82w ὁ φιλοπρωτεύων αὐτῶν 1 who loves to be first among them “వారి మధ్య అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడేవాడు” లేదా “అతను వారి నాయకుడిగా వ్యవహరించడానికి ఇష్టపడేవాడు”
3JN 1 9 dp1v figs-exclusive ἡμᾶς 1 us **మమ్ములను** పదం ప్రత్యేకమైనది; ఇది యోహానునూ, అతనితో పాటు ఉన్నవారినీ సూచిస్తుంది. దీనిలో గాయి లేదు. యోహాను తనను తాను సూచించుకోవడం కూడా మర్యాదపూర్వక మార్గం కావచ్చు. UST చూడండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
3JN 1 9 rrgg figs-metonymy 1 **దియోత్రెఫే** మమ్ములను అంగీకరించడం లేదు, అంటే యోహానునీ, యోహానుతో ఉన్నవారినీ భౌతికంగా తిరస్కరించాడు అని కాదు. అయితే అతడు యోహాను అధికారాన్ని లేదా హెచ్చరికలను అంగీకరించడం లేదని చెప్పాడానికి ఇది క్లుప్త మార్గం. UST చూడండి. (చూడండి:[[rc://te/ta/man /translate/figs-metonymy]])
3JN 1 10 f6qj λόγοις πονηροῖς φλυαρῶν ἡμᾶς 1 accusing us with evil words అంటే, అతడు మమ్మును గురించి చెడు విషయాలు చెపుతున్నాడు, ఖచ్చితంగా అవి నిజం కాదని చెప్పాడు
3JN 1 10 wi6a αὐτὸς ἐπιδέχεται τοὺς ἀδελφοὺς 1 he does not receive the brothers తోటి విశ్వాసులను స్వాగతించడం లేదు
3JN 1 10 it7p figs-ellipsis τοὺς βουλομένους κωλύει 1 stops those who are willing ఇక్కడ పదాలు ఇంకా మిగిలే ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అవుతాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “విశ్వాసులను స్వాగతించాలనుకునే వారిని అతడు నిలువరిస్తున్నాడు” UST చూడండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
3JN 1 10 g98b ἐκ τῆς ἐκκλησίας ἐκβάλλει 1 puts them out of the church విశ్వాసుల సమూహాన్ని విడిచిపెట్టమని అతడు వారిని బలవంతం చేస్తున్నాడు
3JN 1 11 a3z8 ἀγαπητέ 1 Beloved ఇక్కడ **ప్రియమైన** పదం తోటి విశ్వాసిగా గాయి కోసం ఒక ప్రియమైన పదంగా ఉపయోగించబడింది. [3 యోహాను 1:5] (../01/05.md) లో మీరు దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.
3JN 1 11 pv24 μὴ μιμοῦ τὸ κακὸν 1 do not imitate what is evil ప్రజలు చేసే చెడు పనులను అనుకరించవద్దు
3JN 1 11 sz2h figs-ellipsis ἀλλὰ τὸ ἀγαθόν 1 but what is good ఇక్కడ పదాలు ఇంకా మిగిలి ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అవుతాయి. . ప్రత్యామ్నాయ అనువాదం: “అయితే ప్రజలు చేసే మంచి పనులను అనుకరించండి.” UST చూడండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
3JN 1 11 cm8t ἐκ τοῦ Θεοῦ ἐστιν 1 is from God “దేవుని నుండి వచ్చేవి”
3JN 1 11 zan2 figs-metaphor οὐχ ἑώρακεν τὸν Θεόν 1 has not seen God ఇక్కడ “చూడటం” పదం తెలుసుకోవడం లేదా అర్థం చేసుకోవడం కోసం ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుణ్ణి తెలుసుకోలేదు” లేదా “దేవుణ్ణి విశ్వసించలేదు” UST కూడా చూడండి. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
3JN 1 12 pl7i figs-activepassive Δημητρίῳ μεμαρτύρηται ὑπὸ πάντων 1 Demetrius is borne witness to by all దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేమేత్రి గురించి తెలిసిన వారందరూ అతని గురించి సాక్ష్యమిస్తారు” లేదా “దేమేత్రి గురించి తెలిసిన ప్రతి విశ్వాసి అతని గురించి మంచి సంగతులు చెపుతున్నారు.” UST చూడండి. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-activepassive]])
3JN 1 12 m22h translate-names Δημητρίῳ 1 Demetrius యోహాను తాను దర్శించడానికి వచ్చినప్పుడు గాయి, మరియు సంఘం ఆహ్వానించాలని యోహాను కోరుకొన్న వ్యక్తి ఇతడు కావచ్చు. అతడు ఈ ఉత్తరాన్ని అందచేసిన వ్యక్తి కావచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
3JN 1 12 rad4 figs-personification ὑπὸ αὐτῆς τῆς ἀληθείας 1 by the truth itself సత్యం కూడా అతని గురించి మంచి విషయాలు మాట్లాడుతుంది."" ఇక్కడ **సత్యం** ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా వర్ణించబడింది. ఇక్కడ **సత్యం** “దేవుని నుండి వచ్చిన సత్యమైన సందేశాన్ని” సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యం తెలిసిన ప్రతి ఒక్కరూ అతడు మంచి వ్యక్తి అని యెరుగుదురు.” UST కూడా చూడండి. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-personification]])
3JN 1 12 mftm figs-ellipsis 1 ఈ ఉపవాక్యం నుండి పదాలు మిగిలి ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అయ్యాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు అతడు సత్యం వలన సాక్ష్యం పొందాడు.” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-ellipsis]])
3JN 1 12 s712 figs-explicit καὶ ἡμεῖς δὲ μαρτυροῦμεν 1 And we also bear witness యోహాను ధృవీకరిస్తున్నది ఇక్కడ సూచించబడింది, స్పష్టంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు మేము కూడా దేమేత్రి గురించి మంచివాడని మాట్లాడుతున్నాము.” UST కూడా చూడండి. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-explicit]])
3JN 1 12 a16a figs-exclusive ἡμεῖς 1 we ఇక్కడ **మేము** పదం యోహానునూ, అతనితో ఉన్నవారందరినీ సూచిస్తుంది, గాయిని చేర్చలేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
3JN 1 13 v27c 0 General Information: యోహాను గాయికి రాసిన ఉత్తరానికి ఇది ముగింపు. ఈ విభాగంలో, యోహాను గాయిని చూడటానికి వస్తున్నట్లు ప్రస్తావించాడు, మరియు అభివందనాలతో ముగిస్తున్నాడు.
3JN 1 13 am6k figs-doublet οὐ θέλω διὰ μέλανος καὶ καλάμου σοι γράφειν 1 I do not wish to write them to you with ink and pen ఇది జంటపదం. ఎందుకంటే **సిరా మరియు పెన్ను** ఇప్పటికే పేర్కొన్న వ్రాత ప్రక్రియను సూచిస్తుంది. సిరా మరియు పెన్ను కాకుండా వేరే వాటితో వ్రాస్తానని యోహాను చెప్పడం లేదు. ఈ ఇతర విషయాలు రాయడానికి తాను ఇష్టపడనని చెప్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను వాటి గురించి మీకు వ్రాయడానికి ఇష్టపడను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
3JN 1 14 r8i4 figs-idiom στόμα πρὸς στόμα 1 mouth to mouth ఇక్కడ **నోటి నుండి నోటికి** వాక్యం ఒక జాతీయం. అంటే “వ్యక్తిగతంగా” అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: “వ్యక్తిగతంగా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
3JN 1 15 v8yj εἰρήνη σοι 1 Peace to you దేవుడు మీకు శాంతిని ఇస్తాడు గాక
3JN 1 15 mhs1 ἀσπάζονταί σε οἱ φίλοι 1 The friends greet you ఇక్కడి విశ్వాసులు మీకు అభివందనాలు తెలియచేస్తున్నారు
3JN 1 15 lq8r ἀσπάζου τοὺς φίλους κατ’ ὄνομα 1 Greet the friends by name అక్కడ ఉన్న విశ్వాసులలో ప్రతి ఒక్కరికీ మా అభివందనాలు తెలియచెయ్యండి