te_tn/te_tn_64-2JN.tsv

56 KiB
Raw Permalink Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
22JNfrontintrovpa90
32JN11uspyfigs-123personὁ πρεσβύτερος1The elder

ఈ సంస్కృతిలో, పత్రిక రచయితలు తమ పేర్లను ముందుగా ఇస్తారు, మూడవ వ్యక్తిలో తమను తాము సూచిస్తారు. అది మీ భాషలో గందరగోళంగా ఉంటే, మీరు ఇక్కడ మొదటి వ్యక్తిని ఉపయోగించవచ్చు. లేదా మీ భాషలో ఒక లేఖ యొక్క రచయితను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉంటే మరియు అది మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను, పెద్ద, ఈ లేఖ వ్రాస్తున్నాను” (See:[[rc://te/ta/man/translate/figs-123person]])

42JN11z4tkfigs-explicitὁ πρεσβύτερος1The elder

పెద్దవాడు  అంటే యేసు అపొస్తలుడు, శిష్యుడైన యోహాను అని అర్ధం. అతను తన వృద్ధాప్యం కారణంగా, లేదా అతను సంఘంలో నాయకుడవ్వడం వలన, లేదా తనను తాను సంఘంలోనూ, వయసులోనూ “పెద్దవాడు”నని పేర్కొన్నాడు. మీకు వృద్ధుడైన, గౌరవనీయ నాయకుడికి ఒక పదం ఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “యోహాను అను నేను ఈ పత్రిక రాస్తున్నాను” లేదా ప్రత్యామ్నాయ అనువాదం: “పెద్దనైన యోహాను అను నేను, ఈ పత్రిక రాస్తున్నాను” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-explicit]])

52JN11y7hwfigs-123personἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς1to the chosen lady and her children

ఈ సంస్కృతిలో, పత్రిక రచయితలు మొదట తమ పేర్లను ఇస్తారు, మూడవ వ్యక్తిలో తమను తాము సూచిస్తారు. అది మీ భాషలో గందరగోళంగా ఉంటే, మీరు ఇక్కడ మొదటి వ్యక్తిని ఉపయోగించవచ్చు. లేదా మీ భాషకు ఒక పత్రిక రచయితను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్టమైన మార్గం ఉంటే, అది కూడా మీ పాఠకులకు ఉపయోగకరంగా ఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయఅనువాదం: “పెద్దనైన నేను ఈ పత్రిక రాస్తున్నాను” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-123person]])

62JN11a9w3figs-metaphorἐκλεκτῇ κυρίᾳ1to the chosen lady
72JN11ueevfigs-idiomἐκλεκτῇ κυρίᾳ1to the chosen lady

ఈ సందర్భంలో, ఎంచుకున్న  అనే పదం రక్షణ పొందటానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది.ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు రక్షించిన సంఘానికి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])

82JN11axtyfigs-metaphorκαὶ τοῖς τέκνοις αὐτῆς1and her children

ఆమె పిల్లలు అనే అర్ధానికి మూడు అవకాశాలు ఉన్నాయి. (1)  ఎన్నికైన అమ్మ ఒక సంఘాన్నిఅలంకారికంగా సూచించినట్లే, ఇక్కడ ఆమె పిల్లలు అంటే, ఆ సంఘంలో భాగమైన వ్యక్తులను అలంకారికంగా సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆ గుంపులోని విశ్వాసులకు” (2) ఈ పత్రిక స్త్రీకి సంబోధించినట్లయితే, అది ఆమె జీవసంబంధమైన పిల్లలను సూచిస్తుంది, లేదా (3) ఇది స్త్రీ విశ్వాసానికి దారితీసిన వ్యక్తులకు అలంకారికంగా సూచించవచ్చు. ఆమె ఆధ్యాత్మిక పిల్లలు. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])

92JN11src4figs-abstractnounsἀγαπῶ ἐν ἀληθείᾳ1love in truth

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు సత్యం అనే నైరూప్య నామవాచకం వెనుక ఉన్న ఆలోచనను సమానమైన వ్యక్తీకరణతో వ్యక్తీకరించవచ్చు. ఇది రెండు విషయాలలోను ఒకటి అని అర్ధం.(1) సత్యం అనే పదం యోహానును ఎలా ప్రేమిస్తుందో వివరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నిజమైన ప్రేమ” (2)  సత్యం అనే పదం యోహాను ప్రేమకు కారణాన్ని అందిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రేమ ఎందుకంటే మన ఇద్దరికీ సత్యం తెలుసు” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-abstractnouns]])

102JN11a50ffigs-hyperboleπάντες οἱ ἐγνωκότες τὴν ἀλήθειαν1all who have known the truth

యేసు క్రీస్తు గురించి నిజమైన సందేశాన్ని తెలుసుకొనిన,అంగీకరించిన విశ్వాసులను సూచించడానికి యోహాను సత్యాన్ని ఎరిగిన వారందరూ అనే పదబంధాన్ని ఉపయోగిస్తాడు. యోహాను ఎక్కువగా  అన్నీ అనే పదాన్ని సాధారణీకరణగా ఉపయోగిస్తున్నాడు, అంటే అతనితో ఉన్నా, ఆ సంఘంలోని వ్యక్తులందరికీ తెలిసిన విశ్వాసులందరూ. ప్రత్యామ్నాయ అనువాదం: “నాతో ఉన్నట్టి, సత్యాన్ని తెలుసుకొని అంగీకరించే వారందరూ” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hyperbole]])

112JN12spdgfigs-abstractnounsτὴν ἀλήθειαν1the truth

క్రైస్తవులు విశ్వసించే నిజమైన సందేశాన్ని సూచించడానికి యోహాను  సత్యం అనే నైరూప్య నామవాచకాన్ని ఉపయోగిస్తాడు. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు ఈ పదం వెనుక ఉన్న ఆలోచనను సమానమైన వ్యక్తీకరణతో వ్యక్తీకరించవచ్చు.ప్రత్యామ్నాయ అనువాదం: “నిజమైన సందేశం” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-abstractnouns]])

122JN12et6bfigs-exclusiveἡμῖν…ἡμῶν1us…us

మీ భాష ఈ వ్యత్యాసాన్ని సూచిస్తే, మాకు అనే సర్వనామం ఇక్కడ, ఇంకా ఉపదేశంలో కలుపుకొని ఉంటుంది, ఎందుకంటే యోహాను తనను, పత్రిక గ్రహీతలను సూచించడానికి ఎల్లప్పుడూ ఉపయోగిస్తాడు. “మేము” అనే సర్వనామం కూడా మీ అనువాదంలో ఉపయోగించాలని ఎంచుకుంటే “మా” అనేసర్వనామం వలె ఉంటుంది. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-exclusive]])

132JN12a7rmfigs-idiomεἰς τὸν αἰῶνα1to the age

ఇది ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఎప్పటికైనా” (చూడండి:rc://eteta/man/translate/figs-idiom)

142JN13gad9figs-abstractnounsἔσται μεθ’ ἡμῶν χάρις, ἔλεος, εἰρήνη, παρὰ Θεοῦ Πατρός καὶ παρὰ Ἰησοῦ Χριστοῦ1Grace, mercy, and peace will be with us from God the Father and from Jesus Christ

మీ భాషలో ఇది మరింత స్పష్టంగా ఉంటే, మీరు  కృప, దయశాంతి    అనే నైరూప్య నామవాచకాల వెనుక ఉన్న ఆలోచనను, శబ్ద పదబంధాలతో తండ్రియైన దేవుడు, యేసుక్రీస్తు అంశంగా మీరు వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తండ్రియైన దేవుడూ, యేసుక్రీస్తూ మన పట్ల దయ చూపిస్తారు, మన యెడల కృప చూపిస్తారు, ఇంకా శాంతియుతంగా ఉండటానికి వీలు కల్పిస్తారు” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-abstractnouns]])

152JN13zfgrἔσται μεθ’ ἡμῶν χάρις, ἔλεος, εἰρήνη1Grace, mercy, and peace will be with us

ఈ సంస్కృతిలో, లేఖను రాసేవారు సాధారణంగా పత్రికకు సంబంధించి ప్రధాన విషయాన్ని ప్రవేశపెట్టే ముందు పొందుకొనే వ్యక్తికి శుభాకాంక్షలు లేదా ఆశీర్వాదం ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ఆశీర్వాదానికి బదులుగా, యోహాను ఒక ప్రకటన చేశాడు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే చేస్తాడనే  అతని విశ్వాసాన్ని ఇది వ్యక్తపరుస్తుంది. మీ అనువాదంలో  కూడా ఇట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుందని నిర్ధారించుకోండి.

162JN13vpl9guidelines-sonofgodprinciplesΠατρός…Υἱοῦ1Father…Son

తండ్రి, కుమారుడు అనేది దేవునికీ, యేసుక్రీస్తుకి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు. వాటిని ఖచ్చితంగా, స్థిరంగా అనువదించాలని నిర్ధారించుకోండి. (చూడండి:[[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])

172JN13w6trfigs-abstractnounsἐν ἀληθείᾳ καὶ ἀγάπῃ1in truth and love
182JN14ir6vfigs-youσου1your

మీ అనేపదం ఇక్కడ ఏకవచనం, ఎందుకంటే యోహాను  సంఘాన్ని అలంకారికంగా “అమ్మ” అని సంబోధిస్తున్నాడు. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-you]])

192JN14ajlfgrammar-connect-logic-resultἐχάρην λείαν1

మీ భాషలో మొదట గాని, తరువాత గాని ఫలితాన్ని చెప్పడం మరింత సహజంగా ఉంటే, మీరు దీన్ని తర్వాత ఉంచవచ్చు మీ పిల్లలు కొందరు సత్యంననుసరించి నడుస్తున్నట్లు నేను కనుగొన్నాను, UST లోవలె. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-result]])

202JN14a3vsfigs-metaphorτῶν τέκνων σου1your children

[1: 1] (../01/01.md) లో పిల్లలు అనే పదాన్ని మీరు ఎలా అనువదించారో చూడండి. ఇది మూడు విషయాలలో ఒకటి అని అర్ధం. (1) ఇది ఒక నిర్దిష్ట సమాజంలో భాగమైన ప్రజలను సూచిస్తుంది. (2) ఈ పత్రిక అసలు స్త్రీకి సంబోధించినట్లయితే, అది ఆమె జీవసంబంధమైన పిల్లలు లేదా (3) ఆమె ఆధ్యాత్మిక పిల్లలు అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: “మీ గుంపులోని విశ్వాసులు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

212JN14w2b6figs-metaphorπεριπατοῦντας ἐν ἀληθείᾳ1walking in the truth

ఒక వ్యక్తి జీవితాన్ని నడక అనే వ్యక్తీకరణతో యోహాను అలంకారికంగా సూచించడం జరిగింది. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యం ప్రకారం జీవించడం” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])

222JN14ddnxfigs-abstractnounsἐν ἀληθείᾳ1

మీ భాషలో దీని కోసం ఒక నైరూప్య నామవాచకాన్నిఉపయోగించకపోతే, మీరు విశేషణంతో ఒక పదబంధాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవునినుండి వచ్చిన నిజమైన సందేశంతో ఏకీభవించే విధంగా” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-abstractnouns]])

232JN14s7hrκαθὼς ἐντολὴν ἐλάβομεν παρὰ τοῦ Πατρός1just as we have received a commandment from the Father

ఒక ఆజ్ఞను పొందుకొన్నారు దేవుడు విశ్వాసులకు ఏదైనా చేయమని ఆజ్ఞాపించాడనే ఆలోచనను వ్యక్తపరుస్తుంది.ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, “ఆజ్ఞ” అనే క్రియ వాక్యంతో “తండ్రి” కి సంబంధించిన అంశంగా మీరు చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తండ్రి మనకు ఆజ్ఞాపించినట్లే”

242JN14w7f1guidelines-sonofgodprinciplesτοῦ Πατρός1the Father

తండ్రి దేవునికి ముఖ్యమైన శీర్షిక. దీన్ని ఖచ్చితంగానూ, స్థిరంగానూ అనువదించడానికి జాగ్రత్తగా ఉండండి. (చూడండి:[[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])

252JN15r4hxκαὶ νῦν1

లేఖకు సంబంధించిన ప్రధాన అంశం ఏమిటో దానిని సూచిస్తుంది,లేదా దానికి సంబంధించిన మొదటి ప్రధాన అంశాన్ని సూచిస్తుంది. మీ భాషలో ప్రధాన అంశాన్ని పరిచయం చేయడానికి సహజమైన విధానాన్ని  ఉపయోగించండి.

262JN15c9xifigs-youσε,…σοι1you…you
272JN15xjsufigs-metaphorκυρία1

verse 1 లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])

282JN15u38ffigs-explicitοὐχ ὡς ἐντολὴν καινὴν γράφων σοι1not as writing a new commandment to you

యోహాను వ్రాసే వ్యక్తిగా తనను తాను స్పష్టంగా సూచించడు. మీరు క్రియ విషయాన్ని మీ భాషలో పేర్కొనవలసి వస్తే, మీరు ఇక్కడ ఒక సర్వనామం జోడించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను మీకు క్రొత్త ఆజ్ఞను వ్రాస్తున్నట్లు కాదు” (See:[[rc://te/ta/man/translate/figs-explicit]])

292JN15uhs8figs-explicitἀπ’ ἀρχῆς1from the beginning

మొదటి నుండి అనే పదం యోహాను, అతని సభ్యులు  మొదటసారిగా యేసుక్రీస్తును విశ్వసించిన సమయాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మేము మొదట నమ్మినప్పటి నుండి” (See: [[rc://te/ta/man/translate/figs-explicit]])

302JN15vmm8ἀρχῆς, ἵνα ἀγαπῶμεν ἀλλήλους1the beginning—that we should love one another

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు ఇక్కడ క్రొత్త వాక్యాన్ని ప్రారంభించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం మొదటి నుండి ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన ఆజ్ఞాపించాడు.”

312JN16nw4gfigs-metaphorπεριπατῶμεν κατὰ…ἐν…περιπατῆτε1we should walk according to…you should walk in

ఈ సందర్భాలలో నడక అని తెలియచేయడమనేది, అలంకారికంగా “లోబడి నడుచుకోవడం” అనిఅర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: “మేము లోబడి నడుచుకోవాలి… మీరు దానిని అనుసరించాలి” (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])

322JN16cl95figs-youἠκούσατε…περιπατῆτε1you heard…you should walk

ఈ పద్యంలో  మీరు అనే పదం బహువచనం, ఎందుకంటే యోహాను విశ్వాసుల సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. 13 వవచనంలో తప్ప, మిగిలినపత్రిక  అంతటా ఇది ఉంది, ఎందుకంటేయోహాను అక్కడ సంఘాన్ని స్త్రీగానూ, దాని సభ్యులను ఆమె పిల్లలుగానూ సూచిస్తూ  తన రూపకాలంకారాన్ని తిరిగి వస్తాడు. (see: [[rc://te/ta/man/translate/figs-you]])

332JN17u749grammar-connect-logic-resultὅτι1

ఇక్కడ, కోసం మునుపటి వచనాలలో దేవుణ్ణి ప్రేమించి,  ఆయనకు లోబడి నడుచుకోవాలి అనే ఆజ్ఞ గురించి యోహాను  వ్రాసిన కారణాన్ని పరిచయం చేస్తాడు - ఎందుకంటే విశ్వాసులవలె నటిస్తున్న వారు చాలా మంది ఉన్నారు, కానివారు దేవుణ్ణి ప్రేమించరు, లేదా ఆయనకు లోబడి నడుచుకోరు. ఈ కారణాన్ని మీ భాషలో పరిచయం చేయడానికి సహజమైన రీతిలో ఉపయోగించండి. UST చూడండి. (See: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-result]])

342JN17w25mfigs-explicitὅτι πολλοὶ πλάνοι ἐξῆλθαν εἰς τὸν κόσμον1For many deceivers have gone out into the world

యోహాను  1011 verses చర్చిస్తున్న తప్పుడు బోధకులకు ఇది ఒక తిరుగులేని సూచనగా ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: “చాలామంది వంచకులు అనేకులు బయలుదేరి ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తిరుగుతున్నారు” (See: [[rc://te/ta/man/translate/figs-explicit]])

352JN17x8ylfigs-metonymyἸησοῦν Χριστὸν ἐρχόμενον ἐν σαρκί1Jesus Christ coming in flesh

శరీరంతో వచ్చాడు అనే వ్యక్తీకరణ ఒక వ్యక్తి నిజమైన, భౌతిక శరీరంతో ఉండడం ఒక అన్యోపదేశం, ఒక ఆధ్యాత్మిక జీవిగా ఉండడం మాత్రమే కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసుక్రీస్తు నిజమైన మానవునిగా వచ్చాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])

362JN17vqnbfigs-explicitοὗτός ἐστιν ὁ πλάνος καὶ ὁ ἀντίχριστος1

ఇది అనే పదాన్ని సూచించడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. (1) యోహాను ఇతరులు చేసే మోసకరమైన చర్యను లేదా ఈ వ్యక్తులు చేస్తున్న బోధను సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇది వంచకుడైన క్రీస్తు విరోధి పని” లేదా “ఈవిధమైన బోధ మోసగాడైన క్రీస్తు విరోధి నుండి వస్తుంది” (2) వంచాకులనుగూర్చి సంఘంలోని ఏ సభ్యుడైనా యోహాను  సూచిస్తూ ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం:“అలాంటి వ్యక్తి వంచకుడు, క్రీస్తు విరోధి” ఇది సహాయకరంగా ఉంటే, మీరు ఈ అర్థాలలో ఒకదాన్ని స్పష్టంగా చేయవచ్చు. (See: [[rc://te/ta/man/translate/figs-explicit]])

372JN17vfdnὁ πλάνος καὶ ὁ ἀντίχριστος1

మీ అనువాదంలో, వంచకుడు,క్రీస్తువిరోధి ఒకే వ్యక్తి., ఇద్దరుకాదు అని స్పష్టం చేయడం సహాయకరంగా ఉండవచ్చు.

382JN18it9tfigs-explicitβλέπετε ἑαυτούς1Watch yourselves

దీని తాత్పర్యం ఏమిటంటే, విశ్వాసులు తమనుతాము కాచుకొని ఉండాలి అంటే, జాగ్రత్తగా ఉండడం, తద్వారా వారు వంచకులైన క్రీస్తు విరోధుల వలన మోసపోరు.ప్రత్యామ్నాయ అనువాదం: “వంచకులూ, క్రీస్తు విరోధులు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్త వహించండి”[[rc://te/ta/man/translate/figs-explicit]]

392JN18i8n6figs-explicit1

ఏమిటి అనేపదం తదుపరి పదబంధంలో ప్రతిఫలం గా నిర్వచించడం జరిగింది. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరుఇక్కడ“బహుమానం” అని కూడా చెప్పవచ్చు. UST చూడండి. (See: [[rc://te/ta/man/translate/figs-explicit]])

402JN18r9kyfigs-exclusiveεἰργασάμεθα1

ఇక్కడ మేము అనే పదం యోహనును, అతని సభ్యులను, ఇతరులందరినీ కలుపుకొని, యోహాను వ్రాస్తున్న విశ్వాసుల విశ్వాసాన్ని పెంపొందించడానికి కృషి చేశారు. (See: [[rc://te/ta/man/translate/figs-exclusive]])

412JN19mn3vfigs-metaphorπᾶς ὁ προάγων καὶ μὴ μένων ἐν τῇ διδαχῇ τοῦ Χριστοῦ1everyone who goes ahead and does not remain in the teaching of Christ

యోహాను క్రీస్తు బోధను గూర్చి నమ్మకమైన విశ్వాసులు ఉండే ప్రదేశమని అలంకారికంగా సూచిస్తున్నాడు. ఇంకా తప్పుడు బోధలు చేసే వారి బోధను దాటి వెళ్ళే ప్రదేశంగా కూడా  సూచిస్తున్నాడు. దాటి పోతుంది అనే ఈ వ్యక్తీకరణ యేసు బోధించని క్రొత్త బోధను గూర్చి, ఇంకా తప్పుడు విషయాలను బోధించడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు బోధించని విషయాలు బోధించే ప్రతి ఒక్కరూ” (See: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

422JN19x3aefigs-infostructureπᾶς ὁ προάγων καὶ μὴ μένων ἐν τῇ διδαχῇ τοῦ Χριστοῦ1

ఈ రెండు పదబంధాలు ఒకే విషయాన్ని గూర్చి అని అర్ధం, ఒకటి సానుకూలంగా పేర్కొంది (దాటి పోతుంది) మరొకటి ప్రతికూలంగా పేర్కొంది (నిలిచి ఉండదు). ఇది మీ భాషలో సహజంగా ఉంటే, USTలో వలె మీరు వీటి క్రమాన్ని రివర్స్ చేయవచ్చు. (See: [[rc://te/ta/man/translate/figs-infostructure]])

432JN19xty9figs-explicitΘεὸν οὐκ ἔχει1does not have God

దేవుణ్ణి కలిగి ఉండటం అంటే రక్షకుడిగా యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సంబంధంపెట్టుకోవడం. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు దీన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవునికి చెందినది కాదు” లేదా “దేవునితో సరైన సంబంధం లేదు” (See: [[rc://te/ta/man/translate/figs-explicit]])

442JN19x523ὁ μένων ἐν τῇ διδαχῇ, οὗτος καὶ τὸν Πατέρα καὶ τὸν Υἱὸν ἔχει1The one who remains in the teaching, this one has both the Father and the Son

క్రీస్తు బోధను అనుసరించే ఎవరైనా తండ్రి, కుమారులకు ఇద్దరికీ చెందినవారు

452JN19xwoegrammar-connect-logic-contrastὁ μένων ἐν τῇ διδαχῇ1

ఈ పదబంధం మునుపటి వాక్యానికి భిన్నంగా ఉంటుంది. ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, USTలో వలె ఈ వ్యత్యాసాన్ని గుర్తించడానికి, మీరు ఒక పదం లేదా పదబంధాన్ని ఉపయోగించవచ్చు.(See: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])

462JN19vg19figs-nominaladjοὗτος1this one

యోహాను ఒక విధమైన వ్యక్తిని సూచించడానికి ఇది అనే నామవాచకంగా ప్రదర్శించే విశేషణాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక అనే పదాన్ని జోడించడం ద్వారా ULT దీనిని సూచిస్తుంది. మీ భాష ఈ విధంగా విశేషణాలను ఉపయోగించకపోతే, మీరు దీన్ని సమానమైన పదబంధంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “అటువంటి ఒక వ్యక్తి” లేదా “ఆ రకమైన వ్యక్తి” (See:[[rc://te/ta/man/translate/figs-nominaladj]])

472JN19k8cvguidelines-sonofgodprinciplesτὸν Πατέρα καὶ τὸν Υἱὸν1the Father and the Son

దేవునికీ, యేసుక్రీస్తుకీ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. ఈ శీర్షికలను స్థిరంగానూ, కచ్చితంగానూ వ్యక్తీకరించాలని నిర్ధారించుకోండి. (See: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])

482JN110x7pwfigs-explicitεἴ τις ἔρχεται πρὸς ὑμᾶς, καὶ ταύτην τὴν διδαχὴν οὐ φέρει1

ఇక్కడ ఎవరైనా అనే పదం ఎవరైనా గురువూ లేదా బోధకుడు అని సూచిస్తుంది. యేసు బోధించిన వాటిని బోధించని ఏ గురువునైన స్వాగతించాలని యోహాను కోరుకోలేదు,  ప్రత్యేకంగా యేసు మానవుడిగా వచ్చాడని చెపుతున్నాడు (see verse7). ప్రత్యామ్నాయ అనువాదం: “బోధకునిగా చెప్పుకుంటూ ఎవరైనా మీ వద్దకు వస్తే, అతను దీని కంటే భిన్నంగా బోధిస్తాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])

492JN110xafifigs-metaphorταύτην τὴν διδαχὴν οὐ φέρει1

యోహాను ఒక బోధ లేదా ఒక సందేశం గురించి మాట్లాడుతున్నాడు, అది ఒక వస్తువులాగ ఎవరైనా తీసుకొని రాగలరు. మీరు మీ భాషలో ఈ విధమైన అలంకారాన్ని ఉపయోగించకపోతే, మీరు అదే అర్ధాన్ని కలిగి ఉన్న రూపకాన్ని ఉపయోగించవచ్చు లేదా వాడుక భాషను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇదే సందేశాన్ని బోధించదు” (See:[[rc://te/ta/man/translate/figs-metaphor]])

502JN110ls1cfigs-explicitμὴ λαμβάνετε αὐτὸν εἰς οἰκίαν1do not receive him into your house

విశ్వాసులు తమఇళ్లలోకి ఒక తప్పుడు భోదకున్ని చేర్చుకోవాలన్ని యోహాను కోరుకోలేదు, ఆ విధంగా అంగీకరించడం వలన కలిగీ ఫలితం, అతన్ని గౌరవించి, అతని అవసరాలను తీర్చడం ద్వారా అతని తప్పుడు బోధకు మద్దతు ఇవ్వడం. ప్రత్యామ్నాయ అనువాదం: “వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, అతనికి మద్దతు ఇవ్వవద్దు లేదా ప్రోత్సహించవద్దు” (See:[[rc://te/ta/man/translate/figs-explicit]])

512JN110lbctfigs-explicitχαίρειν αὐτῷ μὴ λέγετε1do not say to him, “Greetings”

తప్పుడు బోధకున్ని సాదారణంగా గౌరవించవద్దని యోహాను విశ్వాసులను హెచ్చరించాడు. దీని అర్థం ఏమిటంటే, వారు తప్పుడు బోధకుని ఆమోదిస్తున్నట్లుగా లేదా తప్పు నేర్పేవానికి ఇతరుల దృష్టిలో మంచి స్థితిని ఇచ్చేలా కనిపించే దేనినైన చేయమని అతను కోరుకోవాదం లేదు. ప్రత్యామ్నాయ అనువాదం: “అతనిక సాదారణంగా శుభాలు చెప్పవద్దు” (See: [[rc://te/ta/man/translate/figs-explicit]])

522JN111uheaὁ λέγων…αὐτῷ χαίρειν1the one who says to him, “Greetings”

అతనికి గౌరవప్రదమైన బహిరంగ శుభాకాంక్షలు ఇచ్చేవ్యక్తి

532JN111n7ztκοινωνεῖ τοῖς ἔργοις αὐτοῦ τοῖς πονηροῖς1shares in his evil deeds

పాలుపంచుకోవడంలో అనే క్రియ తప్పుడు బోధకుని కార్యాచరణకు సహాయపడటమూ, అనుకూలం అనే భావననువ్యక్తపరుస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “అతని దుర్మార్గాలలో పాల్గొవడం” లేదా “అతని చేసే చెడు పనులలో అతనికి సహాయపడడం”

542JN112gq26figs-ellipsisοὐκ ἐβουλήθην διὰ χάρτου καὶ μέλανος1I did not want with paper and ink

ఒక వాక్యం పూర్తి కావడానికి అనేక భాషలలో వాక్యానికి అవసరమయ్యేకొన్ని పదాలను ఇక్కడ యోహాను  వదిలివేస్తాడు. ఇది మీ పాఠకులకుఉపయోగకరంగా ఉంటే, మీరు ఈపదాలను ముందు నుండి వాక్యంలో అందించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేనువీటిని కాగితం,సిరాతో వ్రాయడానికి ఇష్టపడడంలేదు” (See: Ellipsis)(See[[rc://te/ta/man/translate/figs-ellipsis]])

552JN112nx77figs-metonymyδιὰ χάρτου καὶ μέλανος1with paper and ink

** కాగితం, సిరా**కాకుండా వేరే వాటితో ఈ విషయాలు వ్రాస్తానని యోహాను  చెప్పడం లేదు. దానికి బదులుగా,అతనురచనను సూచించడానికి, ఆ వ్రాత పదార్థాల గురించి అలంకారికంగా మాట్లాడుతున్నాడు. అతనువిశ్వాసులను వ్యక్తిగతంగా సందర్శించాలనీ, వారితో నేరుగా తన సంభాషణను కొనసాగించాలనికోరుకుంటున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈవిషయాలను వ్రాతపూర్వకంగా సంభాషించడానికి” (See: [[rc://te/ta/man/translate/figs-metonymy]])

562JN112v4v2figs-idiomστόμα πρὸς στόμα λαλῆσαι1to speak mouth to mouth

నోటి నుండి నోటితో అనే వ్యక్తీకరణ ఒక జాతీయం, అంటే వారి సమక్షంలో మాట్లాడటం. ఇదే అర్థంతో మీ భాషలో ఒక జాతీయాన్నిఉపయోగించండి లేదా ఆ అర్థాన్ని స్పష్టంగా వ్యక్తపరచండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ముఖాముఖిమాట్లాడటం” లేదా “మీతో వ్యక్తిగతంగా మాట్లాడటం” (See:rc://te/ta/man/translate/figs-idiom)

572JN112auwqfigs-activepassiveἵνα ἡ χαρὰ ὑμῶν πεπληρωμένη ᾖ1so that your joy might be made complete

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు దీన్ని క్రియాశీల రూపంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా ఇది మీ ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది” (See:[[rc://te/ta/man/translate/figs-activepassive]])

582JN112hwtkfigs-abstractnounsἵνα ἡ χαρὰ ὑμῶν πεπληρωμένη ᾖ1so that your joy might be made complete

ఇది మీ భాషలో స్పష్టంగా ఉంటే, మీరు దీన్ని క్రియాశీల రూపంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా ఇది మీ ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది” (See:[[rc://te/ta/man/translate/figs-abstractnouns]])

592JN112lt77translate-textvariantsἡ χαρὰ ὑμῶν πεπληρωμένη ᾖ1your joy might be made complete

ఇక్కడ 2 యోహాను సాధారణ పరిచయంకు సంబంధించిన  వచన సమస్యను గురించి, 3 భాగంలోని గమనికను చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “మా ఆనందం పరిపూర్ణమవుతుంది” (See: [[rc://te/ta/man/translate/translate-textvariants]])

602JN112k9ytfigs-exclusiveὑμῶν1

మీ కు బదులుగా, మీరు ఇక్కడ “మా” ఉపయోగిస్తే, ఇందులో యోహానునూ, పత్రికను పొందుకొనే ఇద్దరూ ఉంటారు. (See:[[rc://te/ta/man/translate/figs-exclusive]])

612JN113fh6jfigs-metaphorτὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς1The children of your…sister
622JN113aonwfigs-idiomτὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς1your chosen sister

ఈ సందర్భంలో, ఎన్నికైన అనే పదం రక్షణ  పొందటానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని సూచిస్తుంది. యోహాను  ఉపయోగించిన సందర్భంలోని అలంకారంలో, ఇది రక్షణ పొందటానికి దేవుడు ఎన్నుకున్న సంఘం, లేదా వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసునందు విశ్వాసముంచిన సమాజంలోని సభ్యులు” (See:[[rc://te/ta/man/translate/figs-idiom]])

632JN113a4rcἀσπάζεταί σε1The children of your chosen sister greet you

ఈ సంస్కృతిలో ఆచారం ప్రకారం, యోహాను తనతో ఉన్న వ్యక్తులతో పాటు, తాను ఎవరికి వ్రాస్తున్నాడో ఆ తెలిసిన వ్యక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికను ముగించాడు. మీ భాషలో పత్రిక శుభాకాంక్షలు పంచుకోవడానికి ఒక నిర్దిష్టమైన విధానం ఉండవచ్చు. అలా అయితే, మీరు ఆ విధానాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీకు వారు శుభాకాంక్షలు పంపుచున్నారు” లేదా “మిమ్మల్ని  జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నారు.”

642JN113qjdzfigs-youσε…σου1your…you

మీరు మరియు మీ అనే సర్వనామాలు ఇక్కడ ఏకవచనం, ఒకసమాజానికి యోహాను వ్రాసే అలంకారానికి అనుగుణంగా, ఇది ఒక మహిళ. (See:[[rc://te/ta/man/translate/figs-you]])