te_tn/te_tn_54-2TH.tsv

65 KiB

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
22THfrontintrokrd60

థెస్సలొనీకయులకు వ్రాసిన 2వ పత్రిక యొక్క పరిచయము

భాగము 1: సాధారణ పరిచయము

2వ థెస్సలొనీకయుల పత్రిక యొక్క విభజన

  1. శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు (1:1-3)
  2. హింసనుండి క్రైస్తవులు శ్రమపడుట
  • వారు దేవుని రాజ్యముకు మరియు ఆయన ఇచ్చిన శ్రమలనుండి విమోచన వాగ్ధానముకు యోగ్యులు (1:4-7)
  • క్రైస్తవులను హింసించు ప్రతియొక్కరికి దేవుడు తీర్పు తీర్చును (1:8-12)
  1. కొంతమంది విశ్వాసులు క్రీస్తు రెండవ రాకడను గూర్చి అపార్థము చేసుకొనియున్నారు
  • క్రీస్తు రాకడ ఇంకా రాలేదు లేక జరగలేదు (2:1-2)
  • క్రీస్తు రాకడకు జరగబోయే సంఘటనల గూర్చిన పరిచయము (2:3-12)
  1. దేవుడు థెస్సలొనీక క్రైస్తవులను రక్షించుననే పౌలు నిశ్చయత
  • “స్థిరముగా ఉండుటకొరకు” అతని పిలుపు (2:13-15)
  • దేవుడు వారిని ఆదరించాలని అతని ప్రార్థన (2:16-17)
  1. థెస్సలొనీక విశ్వాసులను తన కొరకు ప్రార్థన చేయాలని అభ్యర్థిస్తునాడు.(3:1-5)
  2. చలనములేని విశ్వాసులను గూర్చి పౌలు ఇస్తున్న ఆజ్ఞలు (3:6-15)
  3. ముగింపు (3:16-17)

2వ థెస్సలొనీకయుల పుస్తకమును ఎవరు వ్రాశారు?

2వ థెస్సలొనీకయుల పుస్తకమును పౌలు వ్రాశాడు. పౌలు తార్సు పట్టణమునకు చెందినవాడు. పౌలు తన ప్రారంభ జీవితములో సౌలుగా పిలువబడియున్నాడు. క్రైస్తవుడు కాకమునుపు, పౌలు ఒక పరిసయ్యుడైయుండెను. అతను క్రైస్తవులను హింసించియుండెను. అతను క్రైస్తవుడైన తరువాత, అతను యేసును గూర్చి ప్రజలకు బోధించుటకు రోమా సామ్రాజ్యమందంతట అనేకమార్లు ప్రయాణము చేసియుండెను.

పౌలు ఈ పత్రికను కొరింథీ పట్టణములో ఉన్నప్పుడే వ్రాసియుండెను.

2వ థెస్సలొనీక పుస్తకము దేనిని గూర్చి మాట్లాడుచున్నది?

పౌలు ఈ పత్రికను థెస్సలొనీక లో ఉన్నటువంటి విశ్వాసులకు వ్రాసియుండెను. అక్కడున్న విశ్వాసులు హింసను పొందినందున ఆయన వారిని ప్రోత్సహించియుండెను. వారు దేవునిని మెప్పించే విధానములోనే జీవించాలని అతను వారికి చెప్పియుండెను. మరియు ఆయన మరియొకమారు వారికి క్రీస్తు రాకడను గూర్చి బోధించాలనుకున్నాడు.

ఈ పత్రిక పేరును ఎలా తర్జుమా చేయాలి?

తర్జుమాదారులు ఈ పుస్తకమును “2 థెస్సలొనీకయులకు” లేక “రెండవ థెస్సలొనీకయులకు” అనే సంప్రదాయ పేరుతో పిలువవచ్చును. లేదా “థెస్సలొనీకలోని సంఘముకు పౌలు వ్రాసిన రెండవ పత్రిక,” లేక “థెస్సలొనీకలోని క్రైస్తవులకు రెండవ పత్రిక” అనే స్పష్టమైన పేరుతో వారు ఈ పుస్తకమును పిలుచుటకు ఎన్నుకోవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

భాగము 2: భక్తిపరమైన మరియు సంస్కృతిపరమైన ప్రాముఖ్య విషయాలు

యేసు “రెండవ రాకడ” అనగానేమిటి?

భూమికి యేసు చివరిసారిగా తిరిగి వచ్చుటనుగూర్చి పౌలు ఈ పత్రికలో ఎక్కువ వ్రాశాడు. యేసు తిరిగి వచ్చినప్పుడు, ఆయన మనుష్యులందరికి తీర్పు తీర్చును. ఆయన సృష్టియంతటిని పాలించును. మరియు ఆయన అక్కడ ప్రతిచోట సమాధానము కలుగజేయును. క్రీస్తు రాకడకు మునుపు “నాశన పుత్రుడు” వచ్చునని పౌలు వివరించియున్నాడు. ఈ వ్యక్తి సాతానుకు లోబడుతాడు మరియు అనేకమంది ప్రజలు దేవునిని తిరస్కరించునట్లు చేయును. అయితే యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఈ వ్యక్తిని నాశనము చేయును.

భాగము 3: తర్జుమాపరమైన కీలక అంశాలు

పౌలు ఉపయోగించిన “క్రీస్తులో,” “ప్రభువునందు,” మొదలగు మాటలకు అర్థము ఏమిటి?

క్రీస్తు మరియు విశ్వాసులు అన్యోన్య సహవాసమును కలిగియుందురని వ్యక్తము చేయుటకు పౌలు ఈ మాటలను ఉపయోగించియున్నాడు. ఇటువంటి మాటలను గూర్చిన ఎక్కువ వివరములకు రోమా పత్రిక యొక్క పరిచయమును దయచేసి చూడండి.

2వ థెస్సలొనీక పుస్తకములోనున్న వాక్యములో కీలక విషయములు ఏమిటి?క్రిందనున్న వచనములవరకు, బైబిలుపరమైన ఆధునిక అనువాదములకు పాత అనువాదములకు వ్యత్యాసముండును. యుఎల్.టి వాక్యములో ఆధునిక తర్జుమా ఉంటుంది మరియు పాత అనువాదమును పేజి క్రింద భాగములో పెట్టియుందురు. స్థానిక ప్రాంతములో బైబిలును తర్జుమా చేసినట్లయితే, తర్జుమాదారులు ఆ అనువాదములనే ఉపయోగించుకొనవలెను. ఒకవేళ స్థానిక భాషలో తర్జుమా లేకపోయినట్లయితే, తర్జుమాదారులు ఆధునిక తర్జుమాలనే ఉపయోగించకొనవలెను.

  • “నాశన పుత్రుడు బయలుపరచబడును” (2:3). యుఎల్.టి, యుఎస్.టి మరియు ఆధునిక తర్జుమాలు ఎక్కువ శాతము ఇలాగే తర్జుమా చేసియుందురు. పాత తర్జుమాలలో “పాప పుత్రుడు బయలుపరచబడును” అని వ్రాసియుందురు.
  • ‘రక్షణ కొరకు దేవుడు మిమ్మును తోలిపంటగా ఎంచుకొనియున్నాడు” (2:13) అని కొన్ని యుఎల్.టి, యుఎస్.టి మరియు ఆధునిక తర్జుమాలు ఎక్కువ శాతము ఇలాగే తర్జుమా చేసియుందురు. పాత తర్జుమాలలో, “రక్షణ కొరకు దేవుడు మిమ్మును మొదటిగా ఎంచుకొనియున్నాడు”

(చూడండి: [[rc://te/ta/man/translate/translate-textvariants]])

32TH1introm9870

2 థెస్సలొనీకయులకు 01 సాధారణ విషయాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

1-2 వచనాలు అధికారికంగా ఈ పత్రికను పరిచయము చేయును. పూర్వ కాలములో తూర్పు ప్రాంతాలవైపు ఈ పత్రికలను సాధారణముగా ఈ విధమైన పరిచయముతో ఆరంభించి వ్రాసేవారు.

ఈ అధ్యాయములో తర్జుమాపరమైన ఇతర కీలక విషయాలు

అసంబంధము

అసాధ్యమైనవాటిని వివరించుటకు కనిపించే నిజమైన వ్యాఖ్యయే అసంబంధము అని చెప్పవచ్చు. అసంబంధమైన వ్యాఖ్యాలు 4-5 వచనములలో కనిపిస్తాయి: “మీ హింసలన్నిటిలో మీరు కలిగియున్న విశ్వాసము మరియు సహనమునుగూర్చి మేము మాట్లాడుకొనుచున్నాము. మీరు సహించిన యాతనలనుగూర్చి మేము మాట్లాడుకొనుచున్నాము. దేవుని నీతియుతమైన తీర్పుకు ఇది చిహ్నమైయున్నది.” హింస కాల సమయములో దేవునియందు విశ్వసించుటయనునది దేవుని నీతియుతమైన తీర్పుకు చిహ్నమైయున్నదని ప్రజలు సాధారణముగా ఆలోచించరు. అయితే 5-10 వచనాలలో దేవునియందు విశ్వసించినవారికి ఆయన వారికి ఎలా బహుమానములు ఇచ్చునని మరియు వారిని ఎదిరించినవారికి ఆయన ఎలా తీర్పు తీర్చును అనే విషయాలను పౌలు వివరించుచున్నాడు. ([2 Thessalonians .1:4-5] (./04.md))

42TH11b6vffigs-exclusive0General Information:

ఈ పత్రికకు పౌలు రచయిత, కాని ఈ పత్రికను అందజేయువారిగా సిల్వాను మరియు తిమోతిని కూడా కలుపుకొనుచున్నాడు. ఆయన ఈ పత్రికను థెస్సలొనీక లోని సంఘముకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆరంభించుచున్నాడు. “మనము” మరియు “మన” అనే పదాలు పౌలును, సిల్వాను మరియు తిమోతిని సూచిస్తున్నాయి. “మీరు” అనే పదము బహువచనముకు సంబంధించింది, ఇది థెస్సలొనీక లోని విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://te/ta/man/translate/figs-you]])

52TH11hm3eΣιλουανὸς1Silvanus

ఇది లాటిన్ భాషలోని “సిలాస్” అనే పదమునుండి వచ్చింది. ఇదే వ్యక్తినే అపొస్తలుల కార్యముల గ్రంథములో పౌలు తోటి ప్రయాణికుడిగా పట్టిక చేయడం జరిగింది.

62TH12g6rbχάρις ὑμῖν1Grace to you

పౌలు సహజముగా తన పత్రికలో ఈ శుభాకాంక్షలను ఉపయోగించును.

72TH13m6z50General Information:

పౌలు థెస్సలొనీక లోని విశ్వాసులకు వందనాలు తెలియజేయుచున్నాడు.

82TH13ea59figs-hyperboleεὐχαριστεῖν ὀφείλομεν τῷ Θεῷ πάντοτε1We should always give thanks to God

పౌలు “అనేకమార్లు” లేక “తరచుగా” అనే అర్థమిచ్చే “ఎల్లప్పుడూ” అనే పదము ఉపయోగించుచున్నాడు. ఈ వాక్యము థెస్సలొనీక లోని విశ్వాసుల జీవితాలలో దేవుడు చేయుచున్న గొప్పతనమును నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hyperbole]])

92TH13h6t9figs-gendernotationsἀδελφοί1brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-gendernotations]])

102TH13u3m8καθὼς ἄξιόν ἐστιν1This is appropriate

చేయడానికి ఇది సరియైన విషయము లేక “ఇది మంచిది”

112TH13xy7kπλεονάζει ἡ ἀγάπη ἑνὸς ἑκάστου, πάντων ὑμῶν, εἰς ἀλλήλους1the love each of you has for one another increases

మీరు యథార్థముగా ఒకరినొకరు ప్రేమించండి

122TH13bmn6ἀλλήλους1one another

ఇక్కడ “ఒకరినొకరు” అనే మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము.

132TH14kx1nfigs-rpronounsαὐτοὺς ἡμᾶς1we ourselves

ఇక్కడ “మేమే” అనే పదము పౌలు అతిశయమును నొక్కి చెప్పుటకు ఉపయోగించబడియున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])

142TH15dad9figs-activepassiveκαταξιωθῆναι ὑμᾶς τῆς Βασιλείας τοῦ Θεοῦ1You will be considered worthy of the kingdom of God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని రాజ్యములో మీరు పాలిభాగస్తులుగా ఉండుటకు ఆయన మిమ్మును యోగ్యులనుగా పరిగణించియున్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

152TH16wrg20Connecting Statement:

పౌలు మాట్లాడుతూ, దేవుడు న్యాయవంతుడనేదానిని గూర్చి ఆయన మాట్లాడుచున్నాడు.

162TH16cxx1εἴπερ δίκαιον παρὰ Θεῷ1it is righteous for God

దేవుడు సరియైనవాడు లేక “దేవుడు న్యాయవంతుడు”

172TH16id3ifigs-metaphorπαρὰ Θεῷ, ἀνταποδοῦναι τοῖς θλίβουσιν ὑμᾶς θλῖψιν1for God to return affliction to those who afflict you

ఇక్కడ “తిరిగి వచ్చుట” అనేది వారు ఒకరికి చేసినదానినే తిరిగి వారే అనుభవించునట్లు చేయుట అనే అర్థమిచ్చే రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును యాతన పెట్టినవారిని దేవుడు యాతన పెట్టును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

182TH17hxy2figs-metaphorκαὶ ὑμῖν…ἄνεσιν1and relief to you

ప్రజలకు “తిరిగి ఇచ్చేందుకు” దేవుడు సరియైనవాడని (6వ వచనము) ఈ మాటలను వివరణ ఇచ్చుచున్నవి. వారు ఒకరికి చేసినదానినే తిరిగి వారే అనుభవించునట్లు చేయుట అనే అర్థమిచ్చే రూపకలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు మీకు ఉపశనము కలిగించుటకు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

192TH17lu43figs-ellipsisὑμῖν…ἄνεσιν1relief to you

నెమ్మది కలుగజేయువాడు లేక ఉపశనము కలిగించువాడు దేవుడు ఒక్కడేనని మీరు ఇక్కడ స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు ఉపశనమును కలిగించువాడు దేవుడు ఒక్కడే” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])

202TH17yix7ἀγγέλων δυνάμεως αὐτοῦ1the angels of his power

ఆయన శక్తివంతమైన దూతలు

212TH18y3uvἐν πυρὶ φλογός διδόντος ἐκδίκησιν τοῖς μὴ εἰδόσι Θεὸν, καὶ τοῖς1In flaming fire he will take vengeance on those who do not know God and on those who

దేవునిని ఎరుగనివారినందరిని దేవుడు మండుచున్న అగ్నిలో వేసి శిక్షించును లేక “దేవునిని ఎరుగనివారినందరిని ఆయన మండుచున్న అగ్నితో శిక్షించును”

222TH19plw5figs-activepassiveοἵτινες δίκην τίσουσιν1They will be punished

ఇక్కడ “వారు” అనే పదము సువార్తకు విధేయత చూపని ప్రజలను సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు వారిని శిక్షించును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

232TH110ugk9ὅταν ἔλθῃ…ἐν τῇ ἡμέρᾳ ἐκείνῃ1when he comes on that day

ఇక్కడ “ఆ రోజున” అనే మాట యేసు లోకానికి తిరిగి వచ్చే రోజును సూచించి చెప్పబడియున్నది.

242TH110bi2ufigs-activepassiveἐνδοξασθῆναι ἐν τοῖς ἁγίοις αὐτοῦ, καὶ θαυμασθῆναι ἐν πᾶσιν τοῖς πιστεύσασιν1to be glorified by his people and to be marveled at by all those who believed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన ప్రజలు ఆయనను మహిమపరిచినప్పుడు మరియు విశ్వసించినవారందరూ ఆయన సన్నిధిలో నిలిచియున్నప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

252TH111ik19καὶ προσευχόμεθα πάντοτε περὶ ὑμῶν1we also pray continually for you

పౌలు వారికొరకు ఎన్నిమార్లు ప్రార్థన చేయుచున్నాడన్న విషయమును అతను ఇక్కడ నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: మేము నిరంతరము మీ కొరకు ప్రార్థించుచున్నాము” లేక “మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాము”

262TH111hiv9τῆς κλήσεως1calling

ఇక్కడ “పిలుచుట” అనే పదము దేవుని పిల్లలుగా ఉండుటకు ప్రజలను ఆయన నియమించుటను లేక ఆయన ఎన్నుకొనుటను సూచించుచున్నది, మరియు యేసు ద్వారా ఆయన రక్షణ సందేశమును ప్రకటించుటను సూచించుచున్నది.

272TH111r8gkπληρώσῃ πᾶσαν εὐδοκίαν ἀγαθωσύνης1fulfill every desire of goodness

మీరు ఆశించిన ప్రతి విధానములో మంచి చేయుటకు సామర్థ్యము కలిగియుండండి

282TH112q994figs-activepassiveὅπως ἐνδοξασθῇ τὸ ὄνομα τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ, ἐν ὑμῖν1that the name of our Lord Jesus may be glorified by you

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మన ప్రభువైన యేసు నామమును మహిమపరచాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

292TH112pg2ifigs-activepassiveκαὶ ὑμεῖς ἐν αὐτῷ1you will be glorified by him

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మిమ్మును మహిమపరచును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

302TH112z8k9κατὰ τὴν χάριν τοῦ Θεοῦ ἡμῶν1because of the grace of our God

దేవుని కృపనుబట్టి

312TH2introjq9r0

2వ థెస్సలొనీకయులకు 02 సాధారణ విషయాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

“ఆయనతో ఉండుటకు మనమంతా సమకూడియుండుట”

ఆయనయందు విశ్వసించినవారందరు సమకూడినప్పుడు యేసు తనను తాను పిలుచుకొనే సమయమును ఈ వాక్యభాగము సూచించును. క్రీస్తు చివరి మహిమగల రాకడను ఇది సూచిస్తుందో లేదో అని పండితులు అభిప్రాయపడ్డారు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/believe]])

నాశన పుత్రుడు

ఈ మాట ఈ అధ్యాయములో “నాశన కుమారుడు” మరియు “ధర్మములేనివాడు” అని అర్థమిచ్చే విధముగా ఉన్నది. సాతానుడు ఈ లోకములో చాలా హుషారుగా పనిచేయుచున్నాడని పౌలు తెలియజేయుచున్నాడు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/antichrist]])

దేవుని ఆలయములో కూర్చుండుట

పౌలు ఈ పత్రికను వ్రాసిన తరువాత రోమీయులు అనేక సంవత్సరములు నాశనము చేసిన యెరూషలేము దేవాలయమును పౌలు సూచిస్తూ ఉండవచ్చును. లేదా ఈయన భవిష్యత్తులోని భౌతిక సంబంధమైన దేవాలయమును సూచిస్తూ ఉండవచ్చును, లేక దేవుని ఆత్మీయ దేవాలయముగా సంఘమును సూచిస్తూ ఉండవచ్చును. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])

322TH21r36t0General Information:

యేసు తిరిగి వచ్చే దినమును గూర్చి విశ్వాసులు మోసపోకూడదని పౌలు వారిని హెచ్చరించుచున్నాడు.

332TH21q1uqδὲ1Now

“ఇప్పుడు” అనే పదము పౌలు హెచ్చరికలలో విషయమును మార్చుటను సూచించుచున్నది.

342TH21cvg5figs-gendernotationsἀδελφοί1brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-gendernotations]])

352TH22b8b2εἰς τὸ μὴ ταχέως σαλευθῆναι ὑμᾶς…μηδὲ θροεῖσθαι1that you not be easily disturbed or troubled

మీరు సులభముగా మీకు మీరే కలత చెందవద్దు

362TH22d334διὰ πνεύματος, μήτε διὰ λόγου, μήτε δι’ ἐπιστολῆς, ὡς δι’ ἡμῶν1by a message, or by a letter that seems to be coming from us

చెప్పబడిన మాట ద్వారా లేక మా నుంచి వచ్చినదని తెలియజేసే వ్రాసిన పత్రిక ద్వారా

372TH22k4dkὡς ὅτι1to the effect that

అని చెప్పడం

382TH22ib6mἡ ἡμέρα τοῦ Κυρίου1the day of the Lord

విశ్వాసులందరికొరకు యేసు భూమికి తిరిగి వచ్చినప్పటి సమయమును ఈ వాక్యము సూచించును.

392TH23l9c50General Information:

పౌలు నాశన పుత్రుడు గూర్చి బోధించుచున్నాడు.

402TH23ej66μὴ ἔλθῃ1it will not come

ప్రభువు దినము రాదు

412TH23y7chἡ ἀποστασία1the falling away

ఇది ప్రజలందరూ దేవునినుండి వెళ్లిపోయే భవిష్యత్తు కాలమును సూచించుచున్నది.

422TH23e86vfigs-activepassiveἀποκαλυφθῇ ὁ ἄνθρωπος τῆς ἀνομίας1the man of lawlessness is revealed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నాశన పుత్రుడిని బయలుపరచును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

432TH23tkg9figs-metaphorὁ υἱὸς τῆς ἀπωλείας1the son of destruction

సమస్తమును సంపూర్ణముగా నాశనము చేయాలనే గురిని కలిగియున్న ఒక కుమారుని కనిన ఒక వ్యక్తిగా పౌలు నాశనమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వాడు చేయగలిగినంతగా సమస్తమును నాశనమును చేసేవాడు ఒకడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

442TH24t485figs-activepassiveπάντα λεγόμενον θεὸν ἢ σέβασμα1all that is called God or that is worshiped

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు దేవునిగా పరిగణించే ప్రతీది” లేక ప్రజలు ఆరాధించే ప్రతియొక్కటి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

452TH24wj33ἀποδεικνύντα ἑαυτὸν ὅτι ἔστιν Θεός1exhibits himself as God

దేవునిగా తననుతాను చూపించుకొనుట

462TH25rsz1figs-rquestionοὐ μνημονεύετε…ταῦτα1Do you not remember ... these things?

పౌలు ముందుగా వారితో ఉన్నప్పుడు వారితో చేసిన ఈ బోధను జ్ఞాపకము చేసికొనుటకు పౌలు ఈ వ్యంగ్య ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని ఒక వ్యాఖ్యగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ విషయాలన్నీ... మీరు జ్ఞాపకము చేసుకొనుచున్నారని నేను అనుకొనుచున్నాను.” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rquestion]])

472TH25lkk7ταῦτα1these things

ఇది యేసు తిరిగి వచ్చుటను, ప్రభువు దినమును మరియు నాశన పుత్రుడిని సూచించును.

482TH26ask4figs-activepassiveτὸ ἀποκαλυφθῆναι αὐτὸν ἐν τῷ αὐτοῦ καιρῷ1he will be revealed only at the right time

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమయము వచ్చినప్పుడు దేవుడు నాశన పుత్రుడిని బయలుపరచును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

492TH27si9iμυστήριον…τῆς ἀνομίας1mystery of lawlessness

ఇది దేవునికి మాత్రమే తెలిసిన పరిశుద్ధమైన రహస్యమును సూచించుచున్నది.

502TH27fcu7ὁ κατέχων1who restrains him

ఒకరిని అణచడం అనేది వారిని ముందుకెళ్ళకుండా పట్టుకోవడం లేక వారు చేయాలనుకున్నవాటిని చేయకుండా ఆపడము అని అర్థము.

512TH28hn67figs-activepassiveκαὶ τότε ἀποκαλυφθήσεται ὁ ἄνομος1Then the lawless one will be revealed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ తరువాత నాశనపుత్రుడు తనను తాను చూపించుకొనుటకు దేవుడు వానిని అనుమతించును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

522TH28vay9figs-metonymyτῷ πνεύματι τοῦ στόματος αὐτοῦ1with the breath of his mouth

ఇక్కడ “శ్వాస” అనే పదము దేవుని శక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన పలికిన మాట శక్తి ద్వారా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])

532TH28hy3yκαὶ καταργήσει τῇ ἐπιφανείᾳ τῆς παρουσίας αὐτοῦ1bring him to nothing by the revelation of his coming

యేసు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు, ఆయన తనను తాను కనుపరచుకొనును, అప్పుడు ఆయన అక్రమ పుత్రుడిని నాశనము చేయును.

542TH29bd5mἐν πάσῃ δυνάμει, καὶ σημείοις, καὶ τέρασιν ψεύδους1with all power, signs, and false wonders

అన్ని విధములైన శక్తులద్వారా, సూచక క్రియల ద్వారా మరియు తప్పుడు మహత్కార్యములద్వారా

552TH210tf75ἐν πάσῃ ἀπάτῃ ἀδικίας1with all deceit of unrighteousness

ప్రజలందరూ దేవునియందు విశ్వాసముంచకుండ తనయందే విశ్వాసముంచునట్లు నమ్మించుటకు ప్రజలను మోసము చేయుటకు ప్రతి విధమైన చిన్న చిన్న చెడ్డ పనులను ఇతను ఉపయోగించుకొనును.

562TH210v366τοῖς ἀπολλυμένοις1These things will be for those who are perishing

సాతాను ద్వారా శక్తి పొందిన ఈ మనుష్యుడు యేసుని నమ్మని ప్రతియొక్కరిని నాశనము చేయును.

572TH210pf48ἀπολλυμένοις1who are perishing

ఇక్కడ “నాశనము చేయుట” అనే మాటకు నిత్యమూ లేక నిత్య నాశనము అనే ఉద్దేశమును కలిగియున్నది.

582TH211sj1vδιὰ τοῦτο1For this reason

ప్రజలు సత్యమును ప్రేమించనందున

592TH211en8efigs-metaphorπέμπει αὐτοῖς ὁ Θεὸς ἐνέργειαν πλάνης, εἰς τὸ πιστεῦσαι αὐτοὺς τῷ ψεύδει1God is sending them a work of error so that they would believe a lie

దేవుడు ప్రజలనందరినీ ఏదో ఒక దగ్గరికి పంపించుచున్నాడన్నట్లుగా దేవుడు ప్రజలకు ఏదో జరగడానికి అనుమతించుచున్నాడని పౌలు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారిని మోసము చేయుటకు దేవుడు నాశన పుత్రుడిని అనుమతించును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

602TH212d63efigs-activepassiveκριθῶσιν πάντες1they will all be judged

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారికందరికీ తీర్పు తీర్చును” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

612TH212pkw8οἱ μὴ πιστεύσαντες τῇ ἀληθείᾳ, ἀλλὰ εὐδοκήσαντες τῇ ἀδικίᾳ1those who did not believe the truth but instead took pleasure in unrighteousness

అవినీతిలో సంతోషించినవారందరూ ఎందుకంటే వారు సత్యమును ప్రేమించలేదు

622TH213w83a0General Information:

పౌలు విశ్వాసులకొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాడు మరియు వారిని ప్రోత్సహించుచున్నాడు.

632TH213bcd50Connecting Statement:

పౌలు ఇప్పుడు అంశాలను మారుస్తున్నాడు.

642TH213b3hhδὲ1But

అంశమును మార్చుటకు పౌలు ఇక్కడ ఒక గురుతు ఉండుటకు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.

652TH213dze5figs-hyperboleἡμεῖς…ὀφείλομεν εὐχαριστεῖν…πάντοτε1we should always give thanks

“ఎల్లప్పుడూ” అనే పదము సర్వసాధారణముగా చెప్పే పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hyperbole]])

662TH213m418ἡμεῖς…ὀφείλομεν1we should

ఇక్కడ “మేము” అనే పదము పౌలు, సిల్వాను మరియు తిమోతిని సూచించుచున్నది.

672TH213ia4xfigs-activepassiveἀδελφοὶ ἠγαπημένοι ὑπὸ Κυρίου1brothers loved by the Lord

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులారా, ప్రభువు మిమ్మును ప్రేమించుచున్నందున” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

682TH213v15jfigs-gendernotationsἀδελφοὶ1brothers

ఇక్కడ “సహోదరులు” అనే మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, ఈ పదములో స్త్రీలు మరియు పురుషులు ఉందురు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులారా మరియు సహోదరీలారా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-gendernotations]])

692TH213l7a8figs-metaphorἀπαρχὴν εἰς σωτηρίαν ἐν ἁγιασμῷ Πνεύματος καὶ πίστει ἀληθείας1as the firstfruits for salvation in sanctification of the Spirit and belief in the truth

థెస్సలొనీక విశ్వాసులు “ప్రథమ ఫలాలు” అన్నట్లుగా రక్షించబడుటకు వారు ప్రథమ ప్రజల మధ్యలో ఉన్నారని చెప్పబడియున్నది. “రక్షణ,” “పవిత్రీకరణ,” “నమ్ముట,” మరియు “సత్యము” అనే నైరూప్య నామపదాలు తీసివేయుటకు దీనిని వ్యాఖ్యగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యమును నమ్మిన మొట్ట మొదటి ప్రజల మధ్యలో, మరియు దేవుడు తనకొరకు తన ఆత్మ ద్వారా రక్షించుకొనిన మరియు ప్రత్యేక పరచుకొనిన ప్రజల మధ్యలో” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])

702TH215u9ssἄρα οὖν, ἀδελφοί, στήκετε1So then, brothers, stand firm

యేసునందు తమకున్న విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలని పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు.

712TH215l4vrfigs-metaphorκρατεῖτε τὰς παραδόσεις1hold tightly to the traditions

ఇక్కడ “సంప్రదాయాలను” అనే పదము పౌలు మరియు ఇతర అపొస్తలులు బోధించిన క్రీస్తు సత్యములను సూచించుచున్నవి. తన చదువరులు వాటిని తమ చేతులతో గట్టిగా పట్టుకోవాలన్నట్లుగా పౌలు వాటి విషయమై మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంప్రదాయాలను జ్ఞాపకము చేసికొనుట” లేక “సత్యములను నమ్ముట” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

722TH215whp8figs-activepassiveἐδιδάχθητε1you were taught

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మీకు బోధించియున్నాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

732TH215z2vsfigs-explicitεἴτε διὰ λόγου, εἴτε δι’ ἐπιστολῆς ἡμῶν1whether by word or by our letter

మాట ద్వారా అనే మాట ఇక్కడ “నియమాల ద్వారా” లేక “బోధనల ద్వారా” అనే మాటలకొరకు ఉపలక్షకాలంకారమునైయున్నది. మీరు ఇంకా స్పష్టమైన అన్వయించుకొనదగిన సమాచారమును ఇవ్వవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మీకు చెరసాలలో చెప్పిన వాటి ద్వారా కాని లేక పత్రికలో మేము మీకు వ్రాసిన వాటి ద్వారా కాని” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]] మరియు [[rc://te/ta/man/translate/figs-synecdoche]])

742TH216njk10Connecting Statement:

దేవుని ఆశీర్వాదములతో పౌలు ఇక్కడ ముగించుచున్నాడు.

752TH216g8m1δὲ1Now

పౌలు ఇక్కడ ఈ మాటను అంశమును మార్చుటకు ఉపయోగించుచున్నాడు.

762TH216yge9figs-inclusiveδὲ ὁ Κύριος ἡμῶν…ὁ ἀγαπήσας ἡμᾶς καὶ δοὺς1may our Lord ... who loved us and gave us

“మన” మరియు “మనకు” అనే పదాలు విశ్వాసులందరిని సూచించుచున్నాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])

772TH216cm54figs-rpronounsαὐτὸς…ὁ Κύριος…Ἰησοῦς Χριστὸς1Lord Jesus Christ himself

“ప్రభువైన యేసు క్రీస్తు” అనే మాటను నొక్కి చెప్పుటకు ఇక్కడ “తానే” అనే మాటను ఉపయోగించుచున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])

782TH217x3rrfigs-metonymyπαρακαλέσαι ὑμῶν τὰς καρδίας, καὶ στηρίξαι ἐν1comfort and establish your hearts in

ఇక్కడ “హృదయములు” అనే మాట భావోద్రేకముల స్థానమును సూచించుచున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును ఆదరించుటకు మరియు మిమ్మును బలపరచుటకు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])

792TH217yw5fπαντὶ ἔργῳ καὶ λόγῳ ἀγαθῷ1every good work and word

మీరు చేసే మంచి పనులన్ని మరియు చెప్పే మంచి మాటలన్ని

802TH3introb8hk0

2వ థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక 03 సాధారణ అంశాలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

ఏ పనులు చేయనివారు మరియు సోమరులు

థెస్సలోనికయలోని సంఘములో పని చేయగలిగిన వారితో తరచుగా సమస్య వచ్చేది, వారు పని చేయడానికి ఇష్టమేగాని వారు అలా చేయుటకు తిరస్కరించేవారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])

మీ సహోదరుడు పాపము చేస్తే మీరు ఏమి చేస్తారు?

ఈ అధ్యాయములో, దేవునిని మహిమపరిచే విధానములో క్రైస్తవులు జీవించవలసిన అవసరత ఉందని పౌలు బోధించుచున్నాడు. క్రైస్తవులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని మరియు వారు చేయుచున్న ప్రతి పనిని ఒకరితో ఒకరు లెక్క ఒప్పజెప్పుకోవాలని బోధించబడియున్నారు. సంఘములో ఎవరైనా పాపము చేసినట్లయితే వారు పశ్చాత్తాప పడేలా విశ్వాసులను ప్రోత్సహించే బాధ్యత సంఘానికి ఉంటుంది. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/repent]] మరియు [[rc://te/tw/dict/bible/kt/sin]])

812TH31k33i0General Information:

పౌలు తన కొరకును మరియు తనతో ఉన్నవారికొరకును ప్రార్థన చేయమని విశ్వాసులను ఆడుగుచున్నాడు.

822TH31jy75τὸ λοιπὸν1Now

అంశమును మార్చుటకు “ఇప్పుడు” అనే పదమును పౌలు ఇక్కడ ఉపయోగించుచున్నాడు.

832TH31m1s5figs-gendernotationsἀδελφοί1brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-gendernotations]])

842TH31r54vfigs-metaphorἵνα ὁ λόγος τοῦ Κυρίου τρέχῃ καὶ δοξάζηται, καθὼς καὶ πρὸς ὑμᾶς1that the word of the Lord may rush and be glorified, as it also is with you

దేవుని వాక్యము ఒక స్థలమునుండి మరియొక స్థలము పరిగెత్తుతుందన్నట్లుగా పౌలు దేవుని వాక్యమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీతో జరిగినట్లుగానే మన ప్రభువైన యేసును గూర్చిన మన సందేశమును ఎక్కువమంది ప్రజలు వింటారు మరియు దానిని గౌరవిస్తారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://te/ta/man/translate/figs-activepassive]])

852TH32xg2hfigs-activepassiveῥυσθῶμεν1that we may be delivered

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనలను రక్షించునుగాక” లేక “మనలను దేవుడు కాపాడునుగాక” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])

862TH32p1ctοὐ γὰρ πάντων ἡ πίστις1for not all have faith

యేసును అనేకమంది ప్రజలు విశ్వసించలేదు

872TH33yx9gὃς στηρίξει ὑμᾶς1who will establish you

మిమ్మును బలపరచినవాడు

882TH33p91kτοῦ πονηροῦ1the evil one

సాతాను

892TH34xk85πεποίθαμεν1We have confidence

మనము విశ్వాసము కలిగియున్నాము లేక “మనము నమ్మియున్నాము”

902TH35giz4figs-metonymyκατευθύναι ὑμῶν τὰς καρδίας1direct your hearts

ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి ఆలోచనలకొరకు లేక మనస్సు కొరకు పర్యాయ పదముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు అర్థము చేసుకొనేలా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])

912TH35wre3figs-metaphorεἰς τὴν ἀγάπην τοῦ Θεοῦ, καὶ εἰς τὴν ὑπομονὴν τοῦ Χριστοῦ1to the love of God and to the endurance of Christ

దేవుని ప్రేమ మరియు క్రీస్తు సహనము అనేవి మార్గములో చేరుకునే అంతిమ గురి అన్నట్లుగా పౌలు వాటిని గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును ఎంతగా ప్రేమించియున్నాడు మరియు క్రీస్తు మీకొరకు ఎంత సహనమును చూపియున్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

922TH36mst30General Information:

ఊరకనే ఉండకూడదనేదానిని గూర్చి మరియు పనిచేయాలనేదానిని గూర్చి పౌలు విశ్వాసులకు కొన్ని చివరి సంగతులను చెప్పుచున్నాడు.

932TH36v33vδὲ1Now

పౌలు అంశమును మార్చుటకు ఇక్కడ ఈ మాటను ఉపయోగించుచున్నాడు.

942TH36x9l8figs-gendernotationsἀδελφοί1brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-gendernotations]])

952TH36y4a9figs-metonymyἐν ὀνόματι τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ1in the name of our Lord Jesus Christ

నామము అనేది ఇక్కడ యేసు క్రీస్తు వ్యక్తి కొరకు పర్యాయ పదముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు తనకు తానే మాట్లాడియున్నట్లుగా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])

962TH36jvw1figs-inclusiveτοῦ Κυρίου ἡμῶν1our Lord

ఇక్కడ “మన” అనే పదము విశ్వాసులందరినీ సూచించుచున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])

972TH37h222μιμεῖσθαι ἡμᾶς1to imitate us

నేను నడుచుకొనినట్లుగా మరియు నా తోటి పనివారు నడుచుకొనినట్లుగా నడుచుకొనుటకు

982TH37b1i1figs-doublenegativesοὐκ ἠτακτήσαμεν ἐν ὑμῖν1We did not live among you as those who had no discipline

అనుకూల మాటను నొక్కి చెప్పుటకు పౌలు ద్వంద్వ అనానుకూల మాటలను ఉపయోగించుచున్నాడు. దీనిని అనుకూల వచనముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రమశిక్షణ కలిగినవారివలె మేము మీ మధ్యన జీవించాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])

992TH38d9h1figs-merismνυκτὸς καὶ ἡμέρας ἐργαζόμενοι1we worked night and day

మేము రాత్రియందును మరియు పగటి వేళయందును పని చేసియున్నాము. ఇక్కడ “రాత్రి” మరియు “పగలు” అనే పదాలు అలంకార పదములు. ఆ పదాలకు “ఎల్లప్పుడూ” అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఎల్లప్పుడూ పని చేసియున్నాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-merism]])

1002TH38w8fqfigs-doubletἐν κόπῳ καὶ μόχθῳ1in difficult labor and hardship

పౌలు తన పరిస్థితులు ఎంత క్లిష్టముగా ఉన్నాయన్న విషయమును తెలియజేయుచున్నాడు. శ్రమించి పనిచేయడం అనేది ఎక్కువ ప్రయాసతోకూడిన పని అని తెలియజేయుచున్నది. కష్టించి పని చేయడం అనేది నొప్పిని మరియు శ్రమించుటను తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])

1012TH39sn3kfigs-doublenegativesοὐχ ὅτι οὐκ ἔχομεν ἐξουσίαν, ἀλλ’1We did this not because we have no authority. Instead, we did

అనుకూల మాటను నొక్కి చెప్పుటకు పౌలు ద్వంద్వ అనానుకూల మాటలను ఉపయోగించుచున్నాడు. దీనిని అనుకూల వచనముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము మీ వద్దనుండి ఆహారమును పుచ్చుకొనుటకు అధికారము కలదు, కాని మేము అలా చేయకుండా మా ఆహారము కొరకు మేము పనిచేసియున్నాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])

1022TH310c652figs-doublenegativesτις οὐ θέλει ἐργάζεσθαι, μηδὲ ἐσθιέτω1The one who is unwilling to work must not eat

దీనిని అనుకూలమైన వచనములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి తినాలనుకుంటే అతను తప్పకుండ పని చేయాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])

1032TH311ey6cfigs-metaphorτινας περιπατοῦντας…ἀτάκτως1some walk idly

ఇక్కడ “నడుచుకొనుట” అనే మాట జీవితములో ప్రవర్తనను తెలియజేయును. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది ఏ పని పాట లేకుండా జీవిస్తున్నారు” లేక “కొంతమంది సోమరులుగా ఉన్నారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

1042TH311iv1zἀλλὰ περιεργαζομένους1but are instead meddlers

మధ్యవర్తులు ఎవరనగా వారిని ఎటువంటి సహాయము కోరకుండానే ఇతరుల గొడవల మధ్యలో జోక్యము కలుగజేసుకునే ప్రజలు.

1052TH312bm6zμετὰ ἡσυχίας1with quietness

నిశబ్దముగా, సమాధానకరముగా, మరియు తేలికపాటి పధ్ధతిలో. ఇతర ప్రజల సమస్యలలోనికి మధ్యవర్తులు వెళ్ళకూడదని పౌలు హెచ్చరించుచున్నాడు.

1062TH313jx8tδέ1But

కష్టము చేసి పనిచేసేవారితో సోమరులైన విశ్వాసులను పొల్చుతూ పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.

1072TH313e59vfigs-youὑμεῖς…ἀδελφοί1you, brothers

“మీరు” అనే ఈ పదము థెస్సలొనీకయలోని విశ్వాసులందరినీ సూచించును. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])

1082TH313usu9figs-gendernotationsἀδελφοί1brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదానికి తోటి క్రైస్తవులు అని అర్థము, ఆ పదములో స్త్రీలు పురుషులు ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు మరియు సహోదరీలు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-gendernotations]])

1092TH314mzs4εἰ…τις οὐχ ὑπακούει τῷ λόγῳ ἡμῶν1if anyone does not obey our word

మా విధివిధానాలకు ఎవరైనా విధేయత చూపించకపోయినట్లయితే

1102TH314nv3vfigs-idiomτοῦτον σημειοῦσθε1take note of him

అటువంటి వ్యక్తిని గమనించండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “అటువంటి వ్యక్తిని కనిపెట్టి బహిరంగముగా గుర్తించండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])

1112TH314y552ἵνα ἐντραπῇ1so that he may be ashamed

ఒక క్రమశిక్షణ క్రియగా సోమరులైన విశ్వాసులకు దూరంగా ఉండాలని పౌలు విశ్వాసులను ఆదేశించుచున్నాడు.

1122TH316nef40General Information:

పౌలు థెస్సలొనీక విశ్వాసులకు చివరి పలుకలను చెప్పుచున్నాడు.

1132TH316whb9figs-explicitαὐτὸς…ὁ Κύριος τῆς εἰρήνης, δῴη ὑμῖν1may the Lord of peace himself give you

ఇది థెస్సలొనీకయులకై పౌలు చేసిన ప్రార్థనని మీరు స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సమాధానకరుడైన ప్రభువు తానె మీకు ఇచ్చును గాకని నేను ప్రార్థించుచున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])

1142TH316zl1sfigs-rpronounsαὐτὸς…ὁ Κύριος τῆς εἰρήνης1the Lord of peace himself

ఇక్కడ “తానె” అనే పదము ప్రభువు వ్యక్తిగతముగా సమాధానమును విశ్వాసులకు ఇచ్చునని నొక్కి చెప్పుటకు వాడబడియున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rpronouns]])

1152TH317c2cbὁ ἀσπασμὸς τῇ ἐμῇ χειρὶ, Παύλου, ὅ ἐστιν σημεῖον ἐν πάσῃ ἐπιστολῇ, οὕτως γράφω1This is my greeting, Paul, with my own hand, which is the sign in every letter

ఈ పత్రిక నిజముగా నావద్దనుండే వచ్చిందనుటకు ఒక గురుతుగా, ప్రతి పత్రికలో నేను వ్రాస్తున్నట్లుగానే, పౌలు అనే నేను నా స్వంత చేతులతో ఈ శుభాకాంక్షలను వ్రాయుచున్నాను

1162TH317wg3fοὕτως γράφω1This is how I write

ఈ పత్రిక తన వద్దనుండే వస్తోందని మరియు ఇది తప్పు చేవ్రాలు కాదని పౌలు గారే దానిని స్పష్టము చేయుచున్నారు.