te_ta/translate/writing-quotations/01.md

9.2 KiB

వివరణ

ఎవరన్నా ఒకరు ఒక దానిని చెప్పారని చెప్పినప్పుడు, మనం తరచుగా ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు మరియు వారు ఏమి చెప్పారో తరచుగా చేపుతుంటాము. ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అనే సమాచారాన్ని ఉల్లేఖనం అంచు అంటారు. ఆ వ్యక్తి చెప్పినదానిని ఉల్లేఖనం. (దీనిని కోట్ అని కూడా పిలుస్తారు.) కొన్ని భాషలలో ఉల్లేఖనం మార్జిన్ మొదటగానీ, చివర గానీ లేదా ఉల్లేఖనం రెండు భాగాల మధ్య కూడా రావచ్చు.

ఉల్లేఖనం అంచు క్రింద గీతాలు గీయబడ్డాయి.

  • ఆమె, "ఆహారం సిద్ధంగా ఉంది. వచ్చి తినండి.
  • "ఆహారం సిద్ధంగా ఉంది. వచ్చి తినండి" ఆమె చెప్పింది.
  • "ఆహారం సిద్ధంగా ఉంది," ఆమె చెప్పింది "వచ్చి తినండి."

కొన్ని భాషలలో, ఉల్లేఖనం అంచులలో ఒకటి కంటే ఎక్కువ క్రియా పదాలు ఉండవచ్చు "అంటే" అని అర్ధం.

కానీ అతని తల్లి జవాబిచ్చింది మరియు చెప్పింది, "లేదు, బదులుగా అతనిని యోహాను అని పిలుస్తారు." (లూకా 1:60 ULT)

ఎవరో ఏదో చెప్పారని వ్రాసేటప్పుడు, కొన్ని భాషలు విలోమ కామాలతో (" ") అని పిలువబడే ఉల్లేఖన గుర్తులతో (చెప్పబడిన దానిని) ఉంచుతాయి. కొన్ని భాషలు ఈ ఉల్లేఖనం చుట్టూ ఉల్లేఖన గుర్తులను వినియోగిస్తాయి. మూలాలు ఉన్న («») వంటి గుర్తులు లేదా మరేదైనా ఇతర చిహ్నాలను ఉపయోగిస్తాయి.

కారణాలు ఇది అనువాద సమస్య

  • అనువాదకులు ఉల్లేఖన అంచును తమ భాషలో చాలా స్పష్టంగానూ, సహజంగానూ ఉంచాలి.
  • అనువాదకులు ఉల్లేఖనం అంచు ఒకటి లేదా రెండు “చెప్పిన” అనే క్రియలను కలిగి ఉండాలని కోరుకుంటున్నారో లేదో నిర్ణయించుకోవాలి.
  • ఉల్లేఖనం చుట్టూ ఏ గుర్తులు ఉపయోగించాలో అనువాదకులు నిర్ణయించుకోవాలి.

బైబిల్ నుండి ఉదాహరణలు

ఉల్లేఖనం ముందు ఉల్లేఖనం అంచు

జెకర్యా దేవదూతతో ఇలా అన్నాడు, "ఇది ఎలా జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే నేను వృద్ధుడిని, నా భార్య కూడా చాలా వృద్ధురాలు." (లూకా 1:18 యు.ఎల్.టి)

ఉల్లేఖనాన్ని నిలిపివేయ్యండి> అప్పుడు కొంతమంది పన్ను వసూలు చేసేవారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు, వారు అతనితో, "బోధకుడా, మేము ఏమి చేయాలి?" (లూకా 3:12 ULT) ఉల్లేఖనాన్ని నిలిపివేయ్యండి.

ఆయన వారితో ఇలా చెప్పాడు "మీకు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువ తీసికొన వద్దు” (లూకా 3:13 యు.ఎల్.టి)

ఉల్లేఖనం తరువాత ఉల్లేఖనం అంచు

యెహోవా దీని గురించి పశ్చాత్తాపపడ్డాడు. "ఇది జరగదు,"ఆయన చెప్పాడు (అమోసు 7:3 ULT)

ఒక ఉల్లేఖనం రెండు భాగాల మధ్య ఉల్లేఖనం అంచు

"వారి నుండి నా ముఖాన్ని దాచిపెడతాను, ఆయన అన్నాడు"వారి చివరి స్థితి ఏమవుతుందో చూస్తాను; వారు మొండి ప్రజలు, విశ్వసనీయత లేని ప్రజలు.” (ద్వితీయోపదేశకాండము 32:20 ULT )

ఉల్లేఖనాన్ని నిలిపివేయ్యండి "ఆయన అన్నాడు కనుక మీ నాయకులు నాతో కూడా రావచ్చు, ఈ మనిషి ఏ విషయంలో అయినా దోషి అయితే అతని మీద నేరారోపణ చేయవచ్చు.” (అపొస్తలుల కార్యములు 25:5 ULT)

”చూడండి, రోజులు రాబోతున్నాయి” -ఇది యెహోవా వాక్కు-నేను నా ప్రజలైన ఇశ్రాయేలును నేను ఇచ్చిన దేశానికి వారిని తీసుకొని వస్తాను.” (యిర్మియా 30:3 ULT)

అనువాద వ్యూహాలు

(1). ఉల్లేఖనం అంచు ఎక్కడ ఉంచాలో నిర్ణయించండి. (2.) “చెప్పాడు” అని అర్థం ఇచ్చే ఒకటి లేదా రెండు పదాలను వినియోగించడం గురించి నిర్ణయించండి.

అనువాదం వ్యూహాల ఉదాహరణలు అన్వయించడమైంది

(1). ఉల్లేఖనం అంచు ఎక్కడ ఉంచాలో నిర్ణయించండి.

  • ఆయన అన్నాడు" కనుక మీ నాయకులు నాతో కూడా రావచ్చు, ఈ మనిషి ఏ విషయంలో అయినా దోషి అయితే అతని మీద నేరారోపణ చేయవచ్చు (అపొస్తలుల కార్యములు 25:5 ULT)
  • ఆయన అన్నాడు, కనుక మీ నాయకులు నాతో కూడా రావచ్చు, ఈ మనిషి ఏ విషయంలో అయినా దోషి అయితే అతని మీద నేరారోపణ చేయవచ్చు. "
  • కనుక మీ నాయకులు నాతో కూడా రావచ్చు, ఈ మనిషి ఏ విషయంలో అయినా దోషి అయితే అతని మీద నేరారోపణ చేయవచ్చు. "ఆయన అన్నాడు.

“కనుక మీ నాయకులు నాతో కూడా రావచ్చు, ఆయన అన్నాడు, ఈ మనిషి ఏ విషయంలో అయినా దోషి అయితే అతని మీద నేరారోపణ చేయవచ్చు.”

(2). “చెప్పాడు” అని అర్థం ఇచ్చే ఒకటి లేదా రెండు పదాలను వినియోగించడం గురించి నిర్ణయించండి.

  • అయితే అతని తల్లి జవాబిచ్చింది మరియు చెప్పింది, "అలా కాదు, అతడికి యోహాను అని పెట్టాలి.” (లూకా 1:60 ULT)
  • అయితే అతని తల్లి జవాబిచ్చింది, "అలా కాదు, అతడికి యోహాను అని పెట్టాలి.”
  • అయితే అతని తల్లి ఇలా చెప్పింది,"అలా కాదు, అతడికి యోహాను అని పెట్టాలి.”
  • అయితే అతని తల్లి ఇలా జవాబిచ్చింది,"అలా కాదు, అతడికి యోహాను అని పెట్టాలి.”