te_ta/translate/writing-proverbs/01.md

8.8 KiB

వివరణ

సామెతలు జ్ఞానాన్ని అందించే క్లుప్త పలుకులు లేక ఒక సత్యం. తక్కువ పదాలలో సామెతలు ఎక్కువ జ్ఞానాన్ని ఇస్తాయి కనుక మనుష్యులు వాటిలో ఆనందిస్తారు. బైబిలులోని సామెతలు తరచుగా రూపకాలనూ, సాదృశ్యాలనూ వినియోగిస్తాయి

ద్వేషం విభేదాలను రేపుతుంది ప్రేమ దోషాలన్నిటినీ కప్పివేస్తుంది. (సామెతలు 10:12 ULT)

సామెతలలోనుండి మరొక ఉదాహరణ

సోమరీ చీమ వైపు చూడు, దాని విధానాలను గమనించు, తెలివి తెచ్చుకో వాటికి సేనాపతీ, అధికారీ, నాయకుడూ ఉండడు, అయినా వేసవి కాలంలో అది ఆహారాన్ని సిద్ధపరచుకొంటుంది. పంట కాలంలో ధాన్యం పోగుచేసుకొంటుంది.

కారణం ఇది ఒక అనువాద సమస్య

ప్రతీ బాషకూ సామెతలు చెప్పే ఒక విధానం ఉంటుంది. బైబిలులో అనేక సామెతలు ఉన్నాయి. ప్రజలు మీ బాషలో సామెతలను చెప్పే విధానంలో అవి అనువదించబడాలి.

బైబిలు నుండి ఉదాహరణలు

గొప్ప సంపదల కంటే మంచి పేరు యెంచుకొనదగినది వెండి, బంగారాల కంటే దయ శ్రేష్ట మైనది. (సామెతలు 22:1 ULT)

దీని అర్థం చాలా డబ్బు కలిగియుండడం కంటే మంఛి వ్యక్తిగా ఉండడమూ, మంచి పేరు కలిగి యుండడమూ శ్రేష్టమైనది.

పళ్ళ మీద పులుపు, కళ్ళల్లో పొగ ఉన్నట్టు సోమరిపోతును పంపే వారికి అతడు అలాగే ఉంటాడు. (సామెతలు 10:26 ULT)

దీని అర్థం ఏదైనా పని చెయ్యడానికి సోమరిపోతును పంపేవారికి అతడు చాలా బాధాకరమైన వాడుగా ఉంటాడు.

నిజాయితీ ఉన్న వారిని యెహోవా మార్గం కాపాడుతుంది అయితే దుష్టులకు అది నాశనకరం. (సామెతలు 10:29 ULT)

దీని అర్థం, సరియైన దానిని చేసే ప్రజలను యెహోవా కాపాడుతాడు, అయితే చెడ్డవారిని ఆయన నాశనం చేస్తాడు.

అనువాద వ్యూహాలు

ఒక సామెతను అక్షరాల అనువదించడం సహజంగా ఉండి, మీ బాషలో సరియైన అర్థాన్ని ఇస్తున్నట్లయితే ఆ విధంగా చెయ్యడానికి ఆలోచించండి, లేకపోతే ఈ క్రింద కొన్ని ఎంపికలు ఉన్నాయి.

(1). సామెతలను ప్రజలు మీ బాషలో ఏవిధంగా పలుకుతారో చూడండి. ఆ పద్దతులలో ఉపయోగించండి (2). సామెతలోని కొన్ని వస్తువులు మీ బాషగుంపులో అనేకమంది ప్రజలకు తెలియనప్పుడు వాటి స్థానంలో ప్రజలకు తెలిసిన వస్తువులనూ, మీ బాషలో అదేవిధంగా పనిచేస్తున్నట్లయితే అటువంటివాటిని పరిగణించండి. (3). బైబిలులో ఉన్న సామెతకు సమాన బోధ ఉన్న సామెతను మీ బాషలో ప్రత్యామ్నాయంగా చెయ్యండి.(4). అదే బోధను ఇవ్వండి, కాని సామెత రూపంలో కాదు.

అనువాద వ్యూహాల ఉదాహరణలు అన్వయించబడ్డాయి

(1). ప్రజలు మీ బాషలో సామెతలను ఏవిధంగా పలుకుతారో చూడండి, వాటిలో ఒక విధానాన్ని వినియోగించండి

గొప్ప సంపదల కంటే మంచి పేరు యెంచుకొనదగినది.

వెండి, బంగారం కంటే దయ శ్రేష్టమైనది.(సామెతలు 22:1 ULT)

ప్రజలు తమ భాషలో సామెతను పలికే పద్ధతుల కోసం ఇక్కడ కొన్ని తలంపులు ఉన్నాయి.

గొప్ప సంపదలు కలిగి యుండడం కంటే మంచి పేరు కలిగియుండడం శ్రేష్టమైనది, వెండి, బంగారం కలిగియుండడం కంటే ప్రజల దయ పొందియుండడం మంచిది. తెలివిగలవారు గొప్ప సంపదల కంటే మంచి పేరును యెంచుకొంటారు. వెండి, బంగారు కంటే దయను యెంచుకొంటారు గొప్ప సంపదల కంటే మంఛి పేరును కలిగియుండడానికి ప్రయత్నించండి. సంపదలు నీకు నిజంగా సహాయం చేస్తాయా? నేను మంచి పేరును కలిగియుంటాను.

(2). సామెతలోని కొన్ని వస్తువులు మీ బాష గుంపులో అనేకమంది ప్రజలకు తెలియనప్పుడు వాటి స్థానంలో ప్రజలకు తెలిసిన వస్తువులనూ, మీ బాషలో అదేవిధంగా పనిచేస్తున్నట్లయితే అటువంటివాటిని పరిగణించండి.

ఎండాకాలంలో మంచు లేక కోతకాలంలో వానలు ఎలా ఉంటాయో,

మూర్ఖుడికి గౌరవం తగినది కాదు.(సామెతలు 26:1 ULT)

వేడికాలంలో చల్లని గాలి గాలి వీయడం సహజం కాదు లేక కోతకాలంలో వానలు రావడం సహజం కాదు; మూర్ఖుడిని గౌరవించడం సహజం కాదు.

(3). బైబిలులో ఉన్న సామెతకు సమాన బోధ ఉన్న సామెతను మీ బాషలో ప్రత్యామ్నాయంగా చెయ్యండి.

రేపటి గురించి గొప్పలు చెప్పుకోవద్దు (సామెతలు 27:1 ULT) మీ కోళ్ళు పొదిగే ముందు వాటిని లెక్క పెట్టవద్దు. (4).అదే బోధను ఇవ్వండి, కాని సామెత రూపంలో కాదు తమ తండ్రిని శపించే వారూ, తమ తల్లిని దీవించని వారూ,

తమ సొంత దృష్టిలో శుద్ధులు అనుకొనేవారు, తమ కల్మషం నుండి శుద్ధులు కానివారు ఉన్నారు.(సామెతలు 30:11-12 ULT)

తమ తల్లిదండ్రులను గౌరవించని ప్రజలు తాము నీతిమంతులం అని తలస్తారు, వారు తమ పాపం నుండి తొలగిపోలేదు.