te_ta/translate/writing-background/01.md

18 KiB
Raw Permalink Blame History

వివరణ

ప్రజలు ఒక కథను చెప్పినప్పుడు, సంఘటనలు జరిగిన క్రమంలో సాధారణంగా చెపుతారు. ఈ సంఘటనల క్రమం కథావరుసను తయారు చేస్తుంది. కదాక్రమం అంతటిలో క్రియాపదాలు ఉంటాయి, అవి కథను ముందుకు నడిపిస్తాయి. అయితే కొన్నిసార్లు రచయిత కథాక్రమంలో ఒక విరామాన్ని తీసుకొంటారు, పాఠకులు కథను ఎక్కువగా అర్థం చేసుకోడానికి కొంత సమాచారాన్ని ఇస్తాడు. ఇటువంటి సమాచారాన్ని నేపథ్యసమాచారం అని పిలుస్తారు. రచయిత ఇంతకుముందే చెప్పిన సంఘటనలకు ముందు జరిగిన వాటిని గురించిన నేపథ్య సమాచారం కావచ్చును లేదా కథలో ఉన్నదానికి సంబంధించిన సమాచారం కావచ్చును, కథలో తరువాత జరగబోయే వాటిని గురించిన సమాచారం కావచ్చును.

ఉదాహరణ - ఈ క్రింది గీతగీసిన వాక్యాలు కథలో నేపథ్య సమాచారాన్ని తెలియచేస్తున్నాయి.

పీటర్, జాన్ వేటాడడానికి వెళ్ళారు, ఎందుకంటే తరువాత రోజు వారి గ్రామంలో విందు జరుగబోతుందిపీటర్ పేతురు గ్రామంలోనే ఒక మంచి వేటగాడుఅతడు ఒక రోజున మూడు అడివి పందులను చంపాడు. ఒక అడివి పంది కనిపించేంత వరకూ వారు ప్రతీ చిన్న పొదనూ వెదికారు. ఆ పంది పారిపోయింది. అయితే వారు దానిని కాల్చి చంపారు. ఒక తాడుతో దాని కాళ్ళను కట్టివేశారు దానిని వారితోపాటు గ్రామానికి తీసుకొనివచ్చారు, ఒక కర్రమీద దానిని మోస్తూవెళ్ళారు. వారు దానిని గ్రామంలోనికి తీసుకొనివచ్చినప్పుడు, పీటర్ సోదరుడు ఆ పంది తనదనిగుర్తించాడు. పీటర్ పొరపాటున తన సోదరుని పందిని చంపాడు.

నేపథ్య సమాచారం తరచుగా ఇంతకుముందు జరిగిన దానిని గురించి చెపుతుంది లేదా ఆ తరువాత జరగబోయేదానిని చెపుతుంది. దీనికి ఉదాహరణలు “వారి గ్రామం తరువాత రోజు పండుగను చేసుకాబోతుంది.” అతడు ఒకానొక దినాన్న మూడు అడివి పందులను చంపాడు.” “వారు దానిని తమతో తీసుకొనివచ్చారు,” పీటర్ పొరపాటున తన సోదరుని పందిని చంపాడు.

తరచుగా నేపథ్య సమాచారం చర్యల క్రియాపదాలకు బదులు “ఉండింది” “ఉండేవారు” మొదలైన “ఉండే” క్రియాపదాలను వినియోగిస్తూ ఉంటుంది. దీనికి ఉదాహరణలు గ్రామంలో పీటర్ మంచి వేటగాడుగా ఉండేవాడు, “అది అతని సొంత పందిగా ఉంది.”

నేపథ్య సమాచారం కథలోని సంఘటనల క్రమంలో భాగం కాదని పాఠకునికి చెప్పెపదాలతో కూడా గుర్తించబడుతుంది. ఈ కథలో “ఎందుకంటే,” “ఒకప్పుడు,” “కలిగియుంది” అను పదాలు.

ఒక రచయిత నేపథ్య సమాచారాన్ని ఈ కింది కారణాలకోసం వినియోగిస్తాడు.

  • అతని పాఠకులు కథలో ఆసక్తిని కలిగియుండడంలో సహాయం చెయ్యడానికి
  • అతని పాఠకులు కథలో ఉన్నదానిని అర్థం చేసుకోవడంలో సహాయం చెయ్యడానికి
  • కథలో ఒక భాగం ఎందుకు ప్రాముఖ్యమో తన పాఠకులు అర్థం చేసుకోవడంలో సహాయం చేయ్యడానికి
  • ఒక కథలోని ఏర్పాటును చెప్పడానికి
  • కథా ఏర్పాటులో ఇవి ఉంటాయి:
  • కథ ఎక్కడ జరిగింది
  • కథ ఎప్పుడు జరిగింది
  • కథ ఆరంభం అయినప్పుడు అక్కడ ఉన్నది ఎవరు
  • కథ ఆరంభం అవుతున్నప్పుడు ఏమి జరుగుతుంది

కారణాలు ఇది ఒక అనువాద సమస్య

  • నేపథ్య సమాచారాన్ని గుర్తించడానికీ, కథాక్రమ సమాచారాన్ని గుర్తించడానికి బాషలలో వివిధ విధానాలు ఉన్నాయి.
  • బైబిలులోని సంఘటనల క్రమాన్ని అనువాదకులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఏ సమాచారం నేపథ్య సమాచారం, ఏ సమాచారం కథాక్రమ సమాచారం అని తెలుసుకోవాలి.
  • అనువాదకులు తమ సొంత పాఠకులు కథలో సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకొనే విధానంలో, నేపథ్య సమాచారాన్ని గుర్తించే విధానంలో కథను అనువాదం చెయ్యాలి, వారు ఏ సమాచారం నేపథ్య సమాచారమో, ఏ సమాచారం కథాక్రమ సమాచారమో తెలుసుకొనేలా అనువదించాలి.

బైబిలు నుండి ఉదాహరణలు

తరువాత హాగరు అబ్రాముకు ఒక కొడుకును కన్నది. అబ్రాము హాగరు కన్న తన కొడుకుకు ఇష్మాయేల్ అనే పేరు పెట్టాడు. అబ్రాముకు హాగరు ఇష్మాయేల్ ను కన్నప్పుడు అతని వయస్సు 86 సంవత్సరాలు. (ఆదికాండము 16:16 యు.ఎల్.టి)

మొదటి వాక్యము మనకు రెండు సంఘటనలను తెలియజేస్తుంది. హాగరు కుమారునికి జన్మ ఇచ్చింది, అబ్రాము తన కుమారునికి పేరు పెట్టాడు. రెండవ వాక్యం ఆ సంఘటనలు జరిగినప్పుడు అబ్రాముకు వయస్సును గురించిన నేపథ్య సమాచారాన్ని తెలియజేస్తుంది.

మరియు యేసు తన సేవ మొదలు పెట్టినప్పుడు ఆయన వయసు సుమారు ముప్పయి సంవత్సరాలు. ఆయన హేలీ కుమారుడైన యోసేపు కుమారుడని యెంచబడ్డాడు. (లూకా 3:23 యు.ఎల్.టి)

మరియు యేసు 30 సంవత్సరాల వయసులు ఆయన ఆరంభించాడు. ఆయన హేలీ కుమారుడైన యోసేపు కుమారుడని యెంచబడ్డాడు

ఈ వచనానికి ముందు ఉన్న వచనాలు యేసు బాప్తిస్మం పొందాడని చెపుతున్నాయి. యేసు వయస్సు, ఆయన పితరులను గురించిన నేపథ్య సమాచారాన్ని ఈ వాక్యం పరిచయం చేస్తుంది. ఈ కథ 4 వ అధ్యాయంలో మరల ఆరంభం అవుతుంది, అక్కడ యేసు అరణ్యప్రదేశంలోనికి వెళ్ళడం గురించి చెపుతుంది.

తరువాత విశ్రాంతి దినాన ఆయన పంట చేలలో పడి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు తెంపి వలుచుకొని తింటూ ఉన్నారు. అయితే పరిసయ్యులు కొందరు వారితో “విశ్రాంతి దినాన చేయకూడని పని మీరు చేయుచున్నారేమిటి!” అన్నారు. (లూకా 6:1-2ఎ యు.ఎల్.టి)

ఈ వచనాలు కథా ఏర్పాట్లను గురించి తెలియజేస్తున్నాయి. విశ్రాంతి దినాన పంట చేలలో సంఘటనలు జరిగాయి. యేసు, ఆయన శిష్యులు, కొందరు పరిసయ్యులు అక్కడ ఉన్నారు. యేసు శిష్యులు కంకులను తెంపి వాటిని తింటూ ఉన్నారు. కథలో ముఖ్యమైన భాగం ఈ వాక్యం, “అయితే కొందరు పరిసయ్యులు ఇలా అన్నారు” తో ఆరంభం అయ్యింది.

అనువాదం వ్యూహాలు

అనువాదాలు స్పష్టంగానూ, సహజంగానూ ఉంచడానికి ప్రజలు మీ బాషలో కథలు ఏ విధంగా చెపుతారో అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది. మీ బాష నేపథ్య సమాచారాన్ని ఏ విధంగా గుర్తిస్తుందో గమనించాలి. దీనిని అధ్యయనం చెయ్యడానికి మీరు కొన్ని కథలను రాయాలి. నేపథ్య సమాచారం కోసం మీ బాషలో ఎటువంటి క్రియాపదాలను వినియోగిస్తున్నాయో గమనించండి. నేపథ్య సమాచారానని సూచించడానికి ఎటువంటి పదాలు లేక గుర్తులు సూచించబడ్డాయో గమనించండి. మీరు అనువాదం చేస్తున్నప్పుడు వీటినే చెయ్యండి, దానిని ద్వారా మీ అనువాదం స్పష్టంగానూ, సహజంగానూ ఉంటుంది, ప్రజలు సులభంగా అర్థం చేసుకొంటారు.

(1). ఒక నిర్దిష్టమైన సమాచారం నేపథ్య సమాచారం అని సూచించడానికి మీ బాషా విధానాన్ని వినియోగించండి.

(2). ముందున్న సంఘటనలు మొదట ప్రస్తావించేలా సమాచారాన్ని తిరిగి క్రమపరచండి. (నేపథ్య సమాచారం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇది అన్ని సమయాలలో సాధ్యం కాదు).

అన్వయించిన అనువాద వ్యూహాల ఉదాహరణలు

(1). ఒక నిర్దిష్టమైన సమాచారం నేపథ్య సమాచారం అని సూచించడానికి మీ బాషా విధానాన్ని వినియోగించండి. ఈ క్రింది ఉదాహరణలు యు.ఎల్.టి ఇంగ్లీషు అనువాదాలలో ఇది ఏ విధంగా జరిగిందో వివరిస్తాయి.

ఇప్పుడు యేసు తన సేవ మొదలు పెట్టినప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు. ఆయన హేలీ కుమారుడైన యోసేపు కుమారుడని యెంచబడ్డాడు . (లూకా 3:23 యు.ఎల్.టి)

ఇంగ్లీషు బాష “ఇప్పుడు” పదం కథలో ఒక విధమైన మార్పు ఉందని చూపించడానికి వినియోగించింది. యెంచబడ్డాడు అనే క్రియాపదం నేపథ్య సమాచారాన్ని చూపిస్తుంది.

కాబట్టి అతడింకా అనేక ఇతర ప్రోత్సాహ వాక్కులతో ప్రజలకు ప్రకటించాడు. తరువాత రాష్ట్రాధికారి అయిన హేరోదు చేసిన పనులన్నిటి విషయం అతడు హీరోదియ విషయం యోహాను అతణ్ణి మందలించాడు.మరియు హేరోదు ఆ చెడుపనులన్నిటితో మరో దానిని కలిపాడు .యోహానును ఖైదులో వేయించాడు. (లూకా 3:18-20 యు.ఎల్.టి).

గుర్తించిన వాక్యాలు యోహాను హీరోడును మందలించడానికి ముందు జరిగాయి. ఇంగ్లీషులో చేసాడు, జరిగించాడు పదాలు యోహాను హేరోదును మందలించడానికి ముందే హేరోదు చేసాడని చూపిస్తున్నాయి.

(2). ముందున్న సంఘటనలు మొదట ప్రస్తావించబడేలా సమాచారాన్ని తిరిగి క్రమపరచండి

తరువాత హాగరు అబ్రాముకు ఒక కొడుకును కన్నది. అబ్రాము హాగరు కన్న తన కొడుకుకు ఇష్మాయేల్ అనే పేరు పెట్టాడు.అబ్రాముకు హాగరు ఇష్మాయేల్ ను కన్నప్పుడు అతని వయస్సు 86 సంవత్సరాలు (ఆదికాండం 16:16 యు.ఎల్.టి)

అబ్రాము 86 సంవత్సారాల వయసులో ఉన్నప్పుడు, హాగరు అబ్రాముకు ఒక కొడుకును కన్నది. అబ్రాము తన కొడుకుకు ఇష్మాయేల్ అనే పేరు పెట్టాడు.

కాబట్టి అనేక ఇతర సంగతులను గురించి అతడు ప్రోత్సాహపరుస్తూ ప్రజలకు ప్రకటించాడు. తరువాత చతుర్ధాతి పతి అయిన హేరోదు చేసిన పనులన్నిటి విషయం అతడి తోబుట్టువు ఫిలిప్పు భార్య అయిన హీరోదియ విషయం యోహాను అతణ్ణి మందలించాడు మరియుహేరోదు ఆ చెడు పనులన్నిటితో మరో దానిని కలిపాడుయోహానును ఖైదులో వేయించాడు (లూకా 3:18-20 యు.ఎల్.టి)

ఈ క్రింద ఉన్న అనువాదం యోహాను మందలింపు, హేరోదు చర్యలను తిరిగి క్రమంలో ఉంచుతుంది.

”ఇప్పుడు చతుర్ధాతిపతి హేరోదు తన సోదరుని భార్య హేరోదియను వివాహం చేసుకొన్నాడు, అతడు చాలా చెడ్డపనులు చేసాడు, కనుక యోహాను అతనిని గద్దించాడు. అయితే అప్పుడు హేరోదు మరొక దుష్ట కార్యం చేసాడు. అతడు యోహానును చెరసాలలో బంధించాడు.