te_ta/translate/translate-ordinal/01.md

9.9 KiB
Raw Permalink Blame History

వివరణ

ఒక జాబితాలో ఏదైన ఒక స్థానాన్ని గురించి చెప్పడానికి బైబిలులో ముఖ్యంగా వరుస క్రమసంఖ్యలను ఉపయోగించారు.

ఆయన సంఘంకు మొదట గా అపొస్తలులనూ, రెండవది గా ప్రవక్తలనూ, మూడవది గా బోధకులునూ, ఆ తరువాత శక్తివంతమైన పనులు చేయువారిని ఇచ్చాడు (1కొరిథీయులు 12:28 ULT )

ఇది దేవుడు సంఘానికి క్రమ పద్దతిలో ఇచ్చిన పనివారి జాబితా.

ఇంగ్లీషు భాషలోని వరుస క్రమ సంఖ్యలు

సాధారణంగా ఇంగ్లీషు భాషలో అనేక వరుస క్రమ సంఖ్యల చివర "-th" ను జతపరచడం జరుగుతుంది.

సంఖ్యావాచకం సంఖ్య వరుస క్రమ సంఖ్య
4 నాలుగు నాలుగవది
10 పది పదవది
100 వంద వందవది
1,000 వెయ్యి వెయ్యివది

ఇంగ్లీషులో కొన్ని వరుస క్రమ సంఖ్యలు ఆ పద్ధతిని అనుసరించవు.

సంఖ్యావాచకం సంఖ్య వరుస క్రమ సంఖ్య
1 ఒకటి మొదట
2 రెండు రెండవ
3 మూడు మూడవ
5 ఐదు ఐదవ
12 పన్నెండు పన్నెండవ

దీనికి కారణం అనువాద సమస్య:

జాబితాలోని అంశాలను క్రమంగా చూపడానికి కొన్నిభాషలలో ప్రత్యేక సంఖ్యలు ఏమీ లేవు. దీనిని పరిష్కరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి.

బైబిలు నుండి ఉదాహరణలు

మొదట భాగం యెహోయారీబుకు వెళ్ళింది, రెండవది యెదాయాకు, మూడవది హారీముకు, నాల్గవది శెయొరీముకు,… ఇరవైమూడవది దెలాయ్యాకు,ఇరవైనాలుగవది మయజ్యాకు.(1దినవృత్తాతములు24: 7-18 ULT)

ప్రజలలో అనేక మంది ఉన్నారు, అయినప్పటికి వారికిచ్చిన క్రమంలోఈ వ్యక్తులు వెళ్ళారు.

అందులో మీరు నాలుగు వరుసలలో విలువైన రత్నాలను ఉంచాలి. మొదట వరుసలోమాణిక్యం, గోమేధికం, పచ్చ ఉండాలి. రెండవ వరుసలో పద్మరాగం, నీలం, వజ్రం ఉండాలి. మూడవ వరుసలో పుష్యరాగం, కెంపు, ఊదామణి ఉండాలి. నాల్గవ వరుసలో ఫిరోజా, సులిమాను, సూర్యకాంతపు రాయి ఉండాలి. వాటన్నిటిని బంగారు జవలలో పొదగాలి. (నిర్గమకా28:17-20 ULT)

ఇది నాలుగు వరుసలలో ఉన్న రత్నాలను గురించి వివరిస్తుంది. మొదటి వరుస బహుశా ఎగువ వరుస, నాల్గవ వరుస బహుశా దిగువ వరుస.

అనువాద వ్యూహాలు

మీ భాషలో వరుస క్రమ సంఖ్యలు ఉంటే, వాటిని ఉపయోగించినప్పడు అవి సరైన అర్ధాన్ని ఇస్తే, అవి వాడే విధానాన్ని పరిశీలించండి. అలా లేకపోతే, వాటిని ఎలా పరిగణించాలో వ్యూహాలనేవి ఇక్కడ ఉన్నాయి:

(1). మొదటివస్తువుకు "ఒకటి" అని మిగిలినవాటికి "మరొకటి" లేదా "దాని తరువాతది" అని వాడండి. (2). మొత్తం వస్తువుల సంఖ్యను చెప్పండి, ఆపై వాటిని, లేదా వాటితో కలసి ఉన్న వాటి జాబితాను చెప్పండి.

అనువాదంలో వ్యూహాల కోసం ఉదాహరణలు అనువర్తించడమైంది

(1). మొత్తం వస్తువుల సంఖ్యను చెప్పండి. మొదటి వస్తువు "ఒకటి" అని, మిగిలిన వాటిని "మరొకటి" లేదా "దాని తర్వాత" అని ఉపయోగించండి.

మొదటి భాగం యెహోయారీబుకు, రెండవది యెదాయాకు, మూడవది హారీముకు, నాల్గవది శెయొరీముకు,… ఇరవై మూడవది దెలాయ్యాకు, ఇరవై నాలుగవది మయజ్యాకు.(1 దినవృత్తాతములు24: 7-18 ULT)

  • అక్కడ ఇరవైనాలుగు భాగాలు ఉన్నాయి. ఒకభాగం యెహోయారీబుకు, మరొక భాగం యెదాయాకు, ఇంకొకటి హారీముకు,… మరొకటి దెలాయ్యాకు, చివరిది మయజ్యాకు వచ్చింది.
  • అక్కడ ఇరవైనాలుగు భాగాలు ఉన్నాయి. ఒకభాగం యెహోయారీబుకు,దాని తర్వాతద యెదాయాకు,ఆ తర్వాతది హారీముకు,…ఆ తర్వాత దెలాయ్యాకు,చివరిది మయజ్యాకు వచ్చింది.

ఆ తోటను తడపడానికి ఏదెను నుండి ఒక నది పారుతూ వెళ్ళింది. ఆ నది అక్కడ చీలి నాలుగునదులయింది. మొదటినది పేరు పీషోను. ఇది హవీలా ప్రాంతం అంతా పారుతుంది, ఆ ప్రాంతంలో బంగారం ఉంది. ఆ భూమి బంగారం శ్రేష్టమైoది. అక్కడ గుగ్గిలమూ, సులిమాను రాయి కూడా దొరుకుతుంది. రెండవ నది పేరు గీహోను. ఇది కూషు దేశాన్నంతా చుట్టి ప్రవహిస్తుంది. మూడవ నది పేరు హిద్దెకెలు, ఇది అష్షూరుకు తూర్పున ప్రవహిస్తుంది. నాల్గవ నది యూఫ్రటీసు.(ఆదికాండము 2:10-14 ULT)

ఆ తోటను తడపడానికి ఏదెను నుండి ఒక నది పారుతూ వెళ్ళింది. అక్కడ ఆ నది చీలి నాలుగు నదులయింది. దానిలో ఒక దాని పేరు పీషోను. ఇది హవీలా ప్రాంతం అంతా పారుతుంది, ఆ ప్రాంతంలో బంగారం ఉంది. ఆ భూమి బంగారం శ్రేష్టమైoది. అక్కడ గుగ్గిలమూ, సులిమాను రాయి కూడా దొరుకుతుంది.తర్వాత నది పేరు గీహోను. ఇది కూషు దేశాన్నంతా చుట్టి ప్రవహిస్తుంది.ఆ తర్వాత నది పేరు హిద్దెకెలు, ఇది అష్షూరుకు తూర్పున ప్రవహిస్తుంది.చివరి నది యూఫ్రటీసు.

(2). మొత్తం వస్తువుల సంఖ్యను చెప్పండి, ఆపై వాటిని, లేదా వాటితో కలసి ఉన్న వాటిని జాబితాగా చేయండి.

  • మొదటిభాగం యెహోయారీబుకు, రెండవది యెదాయాకు, మూడవది హారీముకు, నాల్గవది శెయొరీముకు,…ఇరవైమూడవది దెలాయ్యాకు, ఇరవైనాలుగవది మయజ్యాకు. (1 దినవృత్తాంతములు 24:7 -18 ULT)
  • వారు ఇరవై నాలుగు భాగాలు వేశారు. ఈ భాగాలు యెహోయారీబుకు, యెదాయాకు, హారీముకు, శెయొరీముకు,…దెలాయ్యాకు, మయజ్యాకు వెళ్ళాయి.