te_ta/translate/translate-numbers/01.md

12 KiB

వివరణ

బైబిలులో చాలా సంఖ్యలు ఉన్నాయి. వాటిని "ఐదు" అని అక్షరాలుగా గానీ, లేదా "5" అనే అంకెలుగాకూడా వ్రాయవచ్చు. "రెండువందలు" (200), "ఇరవైరెండువేలు" (22,000), లేదా "పది కోట్లు" (100,000,000.) వంటి కొన్నిసంఖ్యలు చాలా పెద్దవిగా ఉంటాయి. కొన్ని భాషలలో ఈ సంఖ్యలన్నింటికి పదాలు లేవు. సంఖ్యలను ఎలా అనువదించాలో,వాటిని పదాలుగా లేదా అంకెలుగా ఎలా రాయాలనేది అనువాదకులు నిర్ణయించు కోవాలి.

కొన్ని సంఖ్యలు కచ్చితమైనవి గానూ మరికొన్ని సంఖ్యలు వాటికి దగ్గరగా ఉంటాయి.

హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాముకు ఎనభై ఆరుసంవత్సరాలు. (ఆదికాండము 16:16 యు.ఎల్.టి)

ఎనభై ఆరు (86) అనేది ఒక కచ్చితమైన సంఖ్య.

ఆ రోజు ఇంచుమించు 3,000 మనుషులు మరణించారు. (నిర్గమకాండము 32:28 యు.ఎల్.టి)

ఇక్కడ మూడు వేలు అనే సంఖ్య ఇంచుమించు దగ్గరగా ఉన్న ఒక సంఖ్య. ఇది దాని కంటే కొంచెం ఎక్కువ లేదా దాని కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చు. "ఇంచుమించు" అనే పదం అది కచ్చితమైన సంఖ్య కాదని చూపిస్తుంది.

కారణం ఇది అనువాద సమస్య

కొన్నిభాషలలో ఈలాంటి సంఖ్యలకు సంబంధించి కొన్నింటికి పదాలు లేవు.

అనువాద సూత్రాలు

  • కచ్చితమైన సంఖ్యలకు దగ్గరగా గానీ లేదా నిర్దిష్టంగా గాని అనువదించాలి.
  • ఇంచుమించు దగ్గరగా ఉన్న సంఖ్యలను సాధారణంగా అనువదించవచ్చు.

బైబిలునుండి ఉదాహరణలు

యెరెదు 162 సంవత్సరాలు జీవించి, హనోకుకు తండ్రి అయ్యాడు. అతడు హనోకుకు తండ్రి అయిన తరువాత, 800 ఎనిమిదివందలసంవత్సరాలు జీవించిన తరువాత ఎక్కువ మంది కుమారులు, కుమార్తెలకు తండ్రి అయ్యాడు. యెరెదు 962 సంవత్సరాలు జీవించి, ఆ తరువాత మరణించాడు. (ఆదికాండం 5:18-20 యు.ఎల్.టి)

162, 800, మరియు 962 అనే సంఖ్యలు కచ్చితమైన సంఖ్యలు. వాటిని వీలైనంత దగ్గరగా ఉన్న సంఖ్యలతో అనువదించాలి.

మా సహోదరీ, నీవు వేలు పది వేల మందికి తల్లివగుదువు గాక (ఆదికాండం 24:60 యు.ఎల్.టి)

ఇది ఇంచుమించు దగ్గరగా ఉన్న సంఖ్య. ఆమె ఎంతమంది వారసులను కలిగి ఉండాలో అది కచ్చితంగా చెప్పడం లేదు, అయితే అది వారిలో చాలా ఎక్కువ సంఖ్య.

అనువాదం వ్యూహాలు

(1). సంఖ్యావాచకాలను ఉపయోగించి సంఖ్యలను వ్రాయండి.

(2). మీ భాషలో పదాలను ఉపయోగించి సంఖ్యలను రాయండి లేదా ఆ సంఖ్యల కోసం గేట్‌వే భాషాపదాలను ఉపయోగించి సంఖ్యలను వ్రాయండి.

(3). పదాలను ఉపయోగించి సంఖ్యలలో వ్రాసి, వాటి తరువాత అంకెలను కుండలీకరణాలలో(చిన్న బ్రాకెట్టు) ఉంచండి.

(4). పెద్ద సంఖ్యల కోసం పదాలలో రాయండి.

(5). చాలా పెద్ద సంఖ్యల కోసం సాదారణంగా ఇంచుమించు సంఖ్యలను ఉపయోగించండి. ఆ తరువాత వాటిని కుండలీకరణాలలో (చిన్న బ్రాకెట్టు) ఆ సంఖ్యనువ్రాయండి.

అన్వయింపబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

మనం ఉదాహరణ కోసం ఈ క్రింది వచనాన్ని ఉపయోగిస్తాము:

ఇదిగో, నేను చాలా కష్టపడి యెహోవా మందిరం కోసం 1,00,000 తలాంతుల బంగారాన్ని, 1,000,000 తలాంతుల వెండిని, ఇంకా పెద్ద మొత్తంలో ఇత్తడి, ఇనుమును సిద్ధం చేశాను. (1 దిన వృత్తాంతములు 22:14ఎ యు.ఎల్.టి )

(1). సంఖ్యావాచకాలను ఉపయోగించి సంఖ్యలను వ్రాయండి.

నేను యెహోవా మందిరం కోసం 1,00,000 తలాంతుల బంగారాన్ని, 1,000,000 తలాంతుల వెండిని, పెద్ద మొత్తంలో ఇత్తడి, ఇనుమును సిద్ధం చేశాను.

(2). మీ భాషలో ఉన్న పదాలను ఉపయోగించి సంఖ్యలను రాయండి, లేదా ఆ సంఖ్యల కోసం గేట్‌వే భాషాపదాలను ఉపయోగించి వ్రాయండి.

నేను యెహోవా మందిరం కోసం పై ఒక లక్ష తలాంతుల బంగారం, పది లక్షల తలాంతుల వెండి, ఇంకా పెద్ద మొత్తంలో ఇత్తడి, ఇనుము సిద్ధం చేసాను.

(౩). పదాలను ఉపయోగించి సంఖ్యలను వ్రాయండి మరియు వాటిని కుండలీకరణాలో ఉంచండి.

నేను యెహోవా మందిరం కోసం ఒక వంద వేలు (1,00,000) తలాంతుల బంగారం, పది లక్షలు (1,000,000) తలాంతుల వెండి, ఇంకా పెద్ద మొత్తంలో ఇత్తడి, ఇనుము సిద్ధం చేశాను.

(4). పెద్ద సంఖ్యల కోసం పదాలను కలపండి.

నేను యెహోవా మందిరం కోసం లక్ష తలాంతుల బంగారం, పది లక్షల తలాంతుల వెండి, పెద్ద మొత్తంలో ఇత్తడి, ఇనుము సిద్ధం చేశాను..

(5). ఇంచుమించు చాలా దగ్గరగా ఉండే పెద్ద సంఖ్యల కోసం తరువాత సంఖ్యావాచకాలను కుండలీకరణాలలో చాలా సాధారణ వ్యక్తీకరణను ఉపయోగించండి.

నేను యెహోవా మందిరం కోసం పెద్ద మొత్తంలో (1,00,000 తలాంతుల) బంగారం, పది లక్షల తలాంతుల వెండి (1,000,000 తలాంతులు) పెద్ద మొత్తంలో ఇత్తడి, ఇనుము సిద్ధం చేసాను.

స్థిరత్వం

మీ అనువాదాలలో స్థిరంగా ఉండండి. సంఖ్యావాచకాలను లేదా సంఖ్యలను ఉపయోగించి సంఖ్యలు ఎలా అనువదించాలో నిర్ణయించండి. స్థిరంగా ఉండటానికి వివిధ మార్గాలు ఉన్నాయి.

  • సంఖ్యలను సూచించడానికి పదాలను ఉపయోగించండి. (మీకు చాలా పొడవైన పదాలు ఉండవచ్చు.)
  • అన్నిసార్లు సంఖ్యలను సూచించడానికి సంఖ్యా వాచకాలను ఉపయోగించండి.
  • మీ భాషలో సంఖ్యలను సూచించడానికి పదాలు ఉంటే ఉపయోగించండి. మీ భాషలో పదాలు లేని సంఖ్యలకు సంఖ్యావాచకాలను ఉపయోగించండి.
  • తక్కువ సంఖ్యలకు పదాలనూ, అధిక సంఖ్యలకు సంఖ్యావాచకాలను ఉపయోగించండి.
  • కొన్ని పదాల కంటే ఎక్కువ అవసరమయ్యే సంఖ్యలకు కొన్ని పదాలు, సంఖ్యలు అవసరమయ్యే సంఖ్యల కోసం పదాలను ఉపయోగించండి.
  • సంఖ్యలను సూచించడానికి పదాలను ఉపయోగించండి. తర్వాత కుండలీకరణాలలో సంఖ్యావాచకాలను వ్రాయండి.

యు.ఎల్.టి, యు.ఎస్.టి లో స్థిరత్వం

  • అన్‌ఫోల్డింగ్ వర్డ్® లిటరల్ టెక్స్ట్ (ULT) మరియు అన్‌ఫోల్డింగ్ వర్డ్® సింప్లిఫైడ్ టెక్స్ట్ (UST) ఒకటి నుండి పది సంఖ్యల కోసం పదాలను ఉపయోగిస్తాయి మరియు పది పైన ఉన్న అన్ని సంఖ్యలకు సంఖ్యలను ఉపయోగిస్తాయి.

ఆదాము 130 సంవత్సరాలు జీవించి, తన పోలికెగా, తన స్వరూపంలో కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాడు. ఆదాము షేతుకు తండ్రి అయిన తరువాత, అతడు 800 సంవత్సరాలు జీవించి మరి అధికంగా కుమారులు, కుమార్తెలకు తండ్రి అయ్యాడు. ఆదాము 930 సంవత్సరాలు జీవించి ఆ తరువాత మరణించాడు. (ఆదికాండం 5:3-5 ULT)