te_ta/translate/figs-synecdoche/01.md

5.1 KiB

వివరణ

ఉపలక్షణము అనేది ఒక భాషా రూపం, దీనిలో ఉపన్యాసకుడు తాను మాట్లాడుతున్న పూర్తి విషయాన్ని సూచించడానికి ఒక చిన్న భాగాన్ని వినియోగిస్తాడు లేదా ఒక భాగాన్ని సూచించడానికి పూర్తి విషయాన్ని వినియోగిస్తాడు.

నా ఆత్మ ప్రభువును ఘనపరచుచున్నది. (లూకా 1:46బి ULT)

ప్రభువు చేయబోతున్నదానిని గురించి మరియ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆమె “నా ఆత్మ”అని చెప్పింది, అంటే ఆమె అంతరంగం, ఆమె భావోద్వేగ భాగం, ఆమె పూర్తి ఆత్మను సూచిస్తున్నాయి.

కాబట్టి పరిసయ్యులు “చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయు చున్నారు? అని ఆయనను అడిగారు. (మార్కు 2:24ఎ ULT)

అక్కడ నిలబడి ఉన్న పరిసయ్యులు అందరూ ఒకేసారి ఒకే మాటలు చెప్పలేదు. దానికి బదులుగా ఆ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక వ్యక్తి ఆ మాటలు చెప్పే అవకాశం ఉంది.

కారణాలు ఇది ఒక అనువాదం సమస్య

  • కొంతమంది పాఠకులు ఉపలక్షణాన్ని గుర్తించకపోవచ్చు మరియు ఆ విధంగా పదాలను అక్షరార్ధమైన ప్రకటనగా అపార్ధం చేసుకొంటారు.
  • కొంతమంది పాఠకులు వారు పదాలను అక్షరాలా అర్థం చేసుకోలేరని గ్రహించవచ్చు, అయితే దాని అర్థం ఏమిటో వారికి తెలియకపోవచ్చు.

బైబిలు నుండి ఉదాహరణ

అప్పుడు నేను నా చేతులు పూర్తిచేసిన పనులన్నిటినీ ఒకసారి కలయ చూశాను. . (ప్రసంగి 2:11ఎ ULT)

“నా చేతులు” పదం పూర్తి వ్యక్తికి ఒక ఉపలక్షణం, ఎందుకంటే స్పష్టంగా చేతులూ, మరియు శరీరంలోని మిగిలిన భాగాలూ, మరియు మనస్సు కూడా వ్యక్తి యొక్క పనులలో పాల్గొన్నాయి. వ్యక్తికి ప్రాతినిధ్యం వహించడానికి చేతులు ఎంచుకోబడ్డాయి. ఎందుకంటే అవి పనిలో ప్రత్యక్షంగా పాల్గొనే శరీర భాగాలు.

అనువాదం వ్యూహాలు

ఉపలక్షణం సహజంగా ఉండి, మీ భాషలో సరైన అర్ధాన్ని ఇస్తున్నట్లయితే దానిని వినియోగించడం గురించి పరిశీలించండి. లేనట్లయితే ఇక్కడ మరొక ఎంపిక ఉంది:

(1). ఉపలక్షణం దేనిని సూచిస్తుందో విశేషంగా చెప్పండి.

అన్వయించబడిన అనువాద వ్యూహాల ఉదాహరణలు.

(1) ఉపలక్షణం దేనిని సూచిస్తుందో విశేషంగా చెప్పండి.

నా ఆత్మ ప్రభువును ఘనపరచుచున్నది.” (లూకా 1:46బి ULT)

నేను ప్రభువును ఘనపరచుచున్నాను.”

కాబట్టి పరిసయ్యులు ఆయనతో చెప్పారు... (మార్కు 2:24ఎ ULT)

పరిసయ్యుల ప్రతినిధి ఒకడు ఆయనతో చెప్పాడు....

అప్పుడు నేను నా చేతులు పూర్తిచేసిన పనులన్నిటినీ ఒకసారి కలయ చూశాను. . (ప్రసంగి 2:11ఎ ULT)

నేను పూర్తిచేసిన పనులన్నిటినీ నేను ఒకసారి కలయ చూశాను.