te_ta/translate/figs-pronouns/01.md

7.5 KiB
Raw Permalink Blame History

వివరణ

సర్వనామాలు అంటే నామవాచకాల స్థానంలో ఎవరినన్నా దేనినన్నా సూచించడానికి సర్వనామాలు. నేను, నీవు, అతడు, అది, ఇది తాను ఎవరో మొదలైనవి కొన్ని ఉదాహరణలు వీటిలో ఎక్కువగా కనిపించేవి వ్యక్తిగత సర్వనామాలు

వ్యక్తిగత సర్వనామాలు

వ్యక్తిగత సర్వనామాలు మనుషులను వస్తువులను సూచిస్తాయి. మాట్లాడే వాడు తన గురించే చెబుతున్నాడా, వింటున్న వాణ్ణి సూచిస్తున్నాడా లేక వేరొకరినా. ఈ క్రింది రకాల సమాచారాన్ని వ్యక్తిగత సర్వనామాలు ఇస్తాయి. ఇతర కోవలకు చెందిన సర్వనామాలు కూడా ఈ సమాచారం ఇవ్వగలుగు తాయి.

వ్యక్తి

  • ప్రథమ పురుష మాట్లాడే వాడు, ఇంకా కొందరు. (నేను, నా, మేము, మన)
  • [ప్రత్యేకమైన, సహితమైన "మనం"]

(../figs-exclusive/01.md)

  • మధ్యమ పురుష మాట్లాడే వాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో వాళ్ళు ఇంకా ఇతరులు (నీవు)
  • [నీవు రూపాలు] (../figs-you/01.md)
  • ఉత్తమ పురుష - మాట్లాడే వాడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో వాళ్ళు కాక ఇతరులు (అతడు, ఆమె, అది, వారు)

సంఖ్య

  • ఏకవచనం - ఒకటి (నేను, నీవు, అతడు, ఆమె, అది.)
  • బహువచనం ఒకటి కన్నా ఎక్కువ (మేము, మీరు, వారు)
  • [సమూహాలకు వర్తించే ఏకవచన సర్వనామాలు] (../figs-youcrowd/01.md)
  • ద్వంద్వ - రెండు (కొన్ని భాషల్లో ఇద్దరిని లేక రెంటిని సూచించే సర్వనామాలు ఉంటాయి.)

లింగం

  • పుంలింగం అతడు
  • స్త్రీ లింగం ఆమె
  • నపుంసక లింగం అది

వాక్యంలో ఇతర పదాలతో సంబంధం

  • కర్తకు చెందిన క్రియ:నేను, నీవు, అతడు, ఆమె, అది, మేము, వారు.
  • క్రియకు చెందిన కర్మ లేక ప్రత్యయం:నాకు, నీకు, అతనికి, ఆమెకు, దానికి, మాకు, వారికి.
  • ఒక నామవాచకం స్వార్థకం:నా, నీ, అతని, ఆమె (యొక్క), దాని, వారి.
  • నామవాచకం లేకుండా స్వార్థకం:నా యొక్క, నీ యొక్క, అతని, ఆమె యొక్క, మన, దాని, వారి యొక్క మొ.

ఇతర కోవలకు చెందిన సర్వనామాలు

[పరావర్తన సర్వనామాలు] (../figs-rpronouns/01.md) ఒకే వాక్యంలో వేరొక నామవాచకాన్ని, లేక సర్వనామాన్ని సూచిస్తుంది. నాకు నేనే, నీకు నీవే, తనకు తానే, దానికదే, మాకుమేమే, వారికి వారే.

  • జాన్ తనను తానే అద్దంలో చూసుకున్నాడు. "తనను తానే" అనేది జాన్ ను సూచిస్తున్నది.

ప్రశ్నార్థక సర్వనామాలు ప్రశ్నించడానికి వాడేది. కేవలం అవును, కాదు జవాబు కోరేది కాదు:ఎవరూ, ఎవరికి, ఎవరి, ఏమిటి, ఎప్పుడూ, ఎక్కడ, ఎందుకు, ఎలా.

  • ఈ ఇల్లు ఎవరు కట్టారు?

సాపేక్ష సర్వనామాలు సంబంధిత వాక్యాన్ని చూపిస్తుంది. సాపేక్ష సర్వనామాలు, ఎవరు, ఎవరు, ఎవరి, ఏది మరియు అది వాక్యం యొక్క ప్రధాన భాగంలో నామవాచకం గురించి మరింత సమాచారాన్ని అందిస్తాయి. కొన్నిసార్లు, సాపేక్ష క్రియా విశేషణాలు ఎప్పుడు మరియు ఎక్కడ కూడా సాపేక్ష సర్వనామాలుగా ఉపయోగించవచ్చు.

  • జాన్ కట్టిన ఇల్లు నేను చూశాను. “జాన్ కట్టిన ఇల్లు” అనేది సంబంధిత సర్వనామం.
  • ఇల్లు కట్టిన వానిని నేను చూశాను. "ఎవరైతే కట్టారో" అనే ఉపవాక్యం నేను చూసిన వాణ్ణి సూచిస్తున్నది.

ప్రత్యక్ష సర్వనామాలు ఒకరివైపుకు లేక ఒక దాని వైపుకు మన దృష్టి సారింప జేసేది; మాట్లాడే వాడికి, వేరొకడికి, లేదా వేరొక దానికి దూరం చూపించేది:ఇది, ఇవి, అది, అవి.

  • నీవు ఇక్కడ దీన్ని చూసావా?
  • అక్కడ ఉన్నది ఎవరు

నిరవధిక సర్వనామాలు ఇదమిద్ధమైన నామవాచకం దేన్నీ చెప్పక పోయినా ఉపయోగించేది: ఏదైనా, ఎవరైనా, ఒకరు, ఏదో ఒకటి. కొన్నిసార్లు వ్యక్తిగత సర్వనామాన్ని సాధారణ అర్థంతో దీనికోసం వాడతారు:నీవు, వాళ్ళు, అతడు, అది.

  • ఎవరితోనూ అతడు మాట్లాడదలుచుకోలేదు.
  • ఒకరు దానిని బాగుచేసారు. ఎవరో తెలియదు.
  • వారు అంటున్నారు, నువ్వు నిద్ర పోతున్న కుక్కను లేపకూడదు.

చివరి ఉదాహరణలో "వాళ్ళు" నువ్వు అనేవి మనుషులను సూచిస్తున్నాయి.