te_ta/translate/figs-nominaladj/01.md

5.5 KiB

వివరణ

కొన్ని భాషల్లో విశేషణం అనే దానిని అది వర్ణించే వస్తు సముదాయాన్ని చెప్పడానికి వాడవచ్చు. అలా చేసినప్పుడు అది నామవాచకం లాగా పని చేస్తుంది. ఉదాహరణకు "ధనిక" అనేది విశేషణం. దీన్ని విశేషణంగా వాడిన ఉదాహరణలు ఇవి.

… ధనవంతుడికి చాలా గొర్రె మందలూ, పశువులూ ఉన్నాయి… (2 సమూయేలు 12:2 ULT)

“ధన” అనే విశేషణం "మనిషి" అనే పదానికి ముందు వచ్చింది. అది మనిషిని వర్ణిస్తున్నది.

అతడు ధనవంతుడిగా ఉండడు అతడి ధనం నిలబడదు; (యోబు 15:29 ULT)

"ధనవంతుడుగా ఉండడం" అనే విశేషణం "ఉండడం" అనే క్రియ తర్వాత వస్తుంది మరియు "అతణ్ణి* వర్ణిస్తుంది.

ఇక్కడ "ధనవంతుడుగా ఉండడం" అనేది నామవాచకంగా కూడా పనిచేస్తుందని చూపే వాక్యం.

… విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి. (నిర్గమ 30:15 ULT)

నిర్గమ 30:15 లో "ధనవంతుడు"" అనేది నామవాచకంగా పనిచేసింది. అది ధనికులకు వర్తిస్తుంది. “పేద” అనేది నామవాచకంగా పేదవారికి కూడా వర్తిస్తుంది.

కారణం ఇది అనువాదం సమస్య

  • చాలా సార్లు బైబిల్ విశేషణాలను ఒక వర్గాన్ని చెప్పడానికి నామవాచకంగా వాడతారు. * కొన్ని భాషలు విశేషణాన్ని ఇలా ఉపయోగించవు. * ఈ భాషల పాఠకులు ఇక్కడి వాచకం ఎవరో ఒక వేరే వ్యక్తిని గురించి రాసినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే వాస్తవానికి అక్కడ ఆ విశేషణం ఎవరిని వర్నిస్తున్నదో వారినే సూచిస్తున్నది.

బైబిల్ నుండి ఉదాహరణలు

నీతిమంతులు. పాపం చేయకుండా ఉండేలా నీతిమంతుల వారసత్వంపై దుష్టుల రాజదండం పెత్తనం చెయ్యదు. (కీర్తనలు 125:3 ULT)

ఇక్కడ "నీతిమంతులు" అంటే మంచివారు. ఎవరో ఒకవ్యక్తి కాదు.

సాధుగుణం గలవారు ధన్యులు. (మత్తయి 5:5 ULT)

"ఇక్కడ "సాధువులు" అంటే సాధుగుణం గలవారంతా. ఎవరో ఒకే సాధు గుణం గలవాడు కాదు.

అనువాదం వ్యూహాలు

మీ భాష విశేషణాలను ఒక వర్గానికి చెందిన వారిని సూచించడానికి నామవాచకాలుగా వాడుతుంటే తర్జుమాలో విశేషణాన్ని అలా వాడవచ్చు. అది వింతగా ధ్వనిస్తున్నట్టయితే లేదా అర్థం అస్పష్టంగా తప్పుగా వస్తుంటే వేరొక ఉపాయం ఉంది:

(1).  విశేషణాన్ని బహువచన రూపంలో అది వర్ణించే నామవాచకంగా వాడండి.

అనువాదం వ్యూహాలు అన్వయయించిన ఉదాహరణలు.

(1).  విశేషణాన్ని బహువచన రూపంలో అది వర్ణించే నామవాచకంగా వాడండి.

నీతిమంతులు. పాపం చేయకుండా ఉండేలా నీతిమంతుల వారసత్వంపై నీతిమంతులు దుష్టుల రాజదండం పెత్తనం చెయ్యదు (కీర్తనలు 125:3 ULT)

దుష్టుల రాజదండం నీతిమంతుల వారసత్వంపై పెత్తనం చెయ్యదు.

సాధుగుణం గలవారు ధన్యులు. (మత్తయి 5:5ఎ ULT)

సాధుగుణం గలవారు ధన్యులు…