te_ta/translate/figs-merism/01.md

6.7 KiB

నిర్వచనం

వివరణార్థక నానార్థాలు అంటే ఏదన్నా సంగతిని ఒక మనిషి దానిలోని రెండు ఈ చివరిదీ ఆ చివరిదీ అయిన వాటిని ప్రస్తావించడం ద్వారా వర్ణిస్తాడు. అలా చెయ్యడం ద్వారా ఆ రెంటి మధ్యనున్న వాటిని మనసుకు తెస్తాడు.

ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు." (ప్రకటన 1:8, ULT)

ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి,. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు. (ప్రకటన 22:13, ULT)

ఆల్ఫా, ఒమేగా గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు. ఇవి ఆరంభం నుండి అంతం వరకూ ఉన్న వివరణార్థక నానార్థాలు. దీని అర్థం శాస్వతుడు.

తండ్రీ పరలోకానికి మరియు భూమికి ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తున్నాను. (మత్తయి 11:25 ULT)

పరలోకానికి మరియు భూమి అనేది వివరణార్థక నానార్థాలు, అంటే ఈ రెంటి మధ్య ఉన్నవాటన్నిటినీ సూచిస్తుంది.

కారణం ఇది అనువాదం సమస్య

కొన్ని భాషల్లో వివరణార్థక నానార్థాలు ఉపయోగించరు. ఆ భాషల్లో పాఠకులు ఆ పదబంధం ఆ రెండు విషయాలకే వర్తిస్తాయి అనుకుంటారు. ఆ రెండు విషయాలు గాక ఆ రెంటి మధ్య ఉన్న వాటికి ఇది వర్తిస్తుంది.

బైబిల్ నుండి ఉదాహరణలు

సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. (కీర్తన 113:3 ULT)

మందంగా ఉంచిన పదబంధం వివరణార్థక నానార్థాలు, ఎందుకంటే అది తూర్పుకు పడమరకు వాటి మధ్యనున్న వాటన్నిటికీ వర్తిస్తున్నది. “అంతటా” అని దీని అర్థం.

పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. (కీర్తన 115:13)

మందంగా ఉంచిన పదబంధం వివరణార్థక నానార్థాలు. ఎందుకంటే అది వృద్ధులను యువతను ఆ మధ్య వయసులో ఉన్న అందరినీ సూచిస్తున్నది.

అనువాదం వ్యూహాలు

వివరణార్థక నానార్థాలు మీ భాషలో సహజంగా ధ్వనిస్తే సరైన అర్థం ఇస్తుంటే వాడండి. కాకుంటే వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

(1). విభాగాలను ప్రస్తావించకుండా వివరణార్థక నానార్థాలను గుర్తించండి.

(2). వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.

అన్వయించబడిన అనువాదం వ్యూహాలకు ఉదాహరణలు

(1). విభాగాలను ప్రస్తావించకుండా వివరణార్థక నానార్థాలను గుర్తించండి.

తండ్రీ పరలోకానికి మరియు భూమికి ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను (మత్తయి 11:25 ULT)

తండ్రీ సమస్తానికి ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను

సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. (కీర్తన 113:3 ULT)

అన్నీ చోట్లా, మనుషులు యెహోవాను స్తుతించాలి.

(2). వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.

తండ్రీ పరలోకానికి మరియు భూమికి ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను (మత్తయి 11:25 ULT)

తండ్రీ పరలోకంలో ఉన్నవి మరియు భూమిమీద ఉన్నవి అయిన సమస్తానికి ప్రభువా నేను నిన్ను స్తుతిస్తున్నాను

పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. (కీర్తన 115:13 ULT)

అయన తనపట్ల భయభక్తులు గలవారిని అందరినీ వారు యవనులు లేదా ముసలివారు అనే నిమిత్తం లేకుండా ఆశీర్వదిస్తాడు.