te_ta/translate/figs-litany/01.md

14 KiB

వివరణ

ప్రకరణము అనేది భాషాల రూపాలలో ఒకటి. దీనిలో ఒక విషయం యొక్క వివిధ భాగాలు అనేక సారూప్య ప్రకటనల శ్రేణిలో జాబితా చేయబడ్డాయి. వక్త తాను చెప్పేది సమగ్రంగానూ మరియు ఎటువంటి మినహాయింపులు లేకుండా అర్థం చేసుకోవాలని సూచించడానికి ఇలా చేస్తాడు.

కారణం ఇది అనువాద సమస్య

అనేక భాషలు ప్రకరణములను ఉపయోగించవు మరియు పాఠకులు వాటి ద్వారా గందరగోళానికి గురవుతారు. వక్త అదే విషయాన్ని తిరిగి తిరిగి చెపుతున్నట్లు ఎందుకని వారు ఆశ్చర్యపోవచ్చు.

బైబిలు నుండి ఉదాహరణలు

వారు పాతాళములో చొచ్చి పోయినను అక్కడ నా హస్తము వారిని బయటికి లాగును; వారు ఆకాశమునకెక్కి పోయినను అక్కడ వారిని కిందకు తీసుకొని వచ్చెదను. వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకుదును, వారిని తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్ర అడుగున దాగుకొనినను అక్కడ సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. (ఆమోసు 9:2-4 యు.ఎల్.టి).

ఇశ్రాయేలు ప్రజలను తాను శిక్షించినప్పుడు, వారిలో ఎవరూ తప్పించుకోరని ఈ వాక్యభాగంలో దేవుడైన యెహోవా చెపుతున్నాడు.

అయితే నీ సహోదరుని దినమున, అతని శ్రమానుభవదినమును నువ్వు చూడకూడదు. మరియు యూదావారి నాశనదినమున వారి స్థితిని చూచి నీవు ఆనందించకూడదు. ఆపద్దినమున నీ నోటిని గొప్పగా చేసికొనకూడదు. వారి శ్రమదినమున నా ప్రజల గుమ్మములలోనికి నీవు ప్రవేశించకూడదు. అవును నువ్వు! అతని విపత్తు దినమున అతని దుష్టత్వాన్ని నీవు చూడకూడదు. మరియు స్త్రీలైన మీరు అతని విపత్తు దినమున అతని సంపదను దోచుకొనకూడదు. మరియు అతని పరజనులను నరికివేయడానికి మీరు కూడలిలో నిలబడి ఉండకూడదు. మరియు ఆపద దినములో ప్రాణంతో నిలిచియున్నవారిని అప్పగించకూడదు (ఓబద్యా 1:12-14)

బబులోను వారిచేత జయించబడినప్పుడు యూదా ప్రజలకు సహాయం చేసి ఉండాలని ఈ వచనభాగంలో యెహోవా ఎదోము ప్రజలకు చెపుతున్నాడు.

అనువాదం వ్యూహాలు

ప్రకరణం యు.ఎల్.టి లో ఉన్న విధంగా అర్థం అయినట్లయితే, ప్రకరణాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనువదించండి. ఇది అర్థం కాకపోయినట్లయితే, కింది వ్యూహాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని ప్రయత్నించండి.

(1) తరచుగా బైబిలులో ప్రకరణం ప్రారంభంలో లేదా ముగింపులో ఒక సాధారణ ప్రకటన ఉంటుంది, అది దాని మొత్తం అర్థాన్ని సంగ్రహిస్తుంది. మీరు ఆ ప్రకటనను ప్రకరణం యొక్క అర్ధాన్ని ఇచ్చే సారాంశ ప్రకటన అని చూపించే విధంగా రూపొందించవచ్చు.

(2) మీరు ప్రకరణం యొక్క ప్రతి వాక్యాన్ని ప్రత్యేక పంక్తిలో ఉంచవచ్చు. అంతే కాకుండా, ప్రకరణంలోని ప్రతి వాక్యం రెండు భాగాలను కలిగి ఉన్నట్లయితే, మీరు ప్రతి వాక్యం యొక్క సమాన భాగాలు వరుసలో ఉండేలా ప్రకరణాన్ని రూపొందించవచ్చు. ప్రతి వాక్యం ఒకే అర్థాన్ని బలపరుస్తున్నట్లు చూపే దీనిని లేదా ఏదైనా ఇతర రూపాలను ఉపయోగించండి.

(3) మీరు వాక్యాల ప్రారంభంలో “మరియు,” "అయితే" మరియు "లేదా" వంటి పదాలను తొలగించవచ్చు, తద్వారా ప్రకరణంలోని భాగాలు అన్నీ వరుసగా జాబితా చేయబడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

(1) కలిపి (3):

తరచుగా బైబిలులో ప్రకరణం ప్రారంభంలో లేదా ముగింపులో ఒక సాధారణ ప్రకటన ఉంటుంది, అది దాని మొత్తం అర్థాన్ని సంగ్రహిస్తుంది. మీరు ఆ ప్రకటనను ప్రకరణం యొక్క అర్ధాన్ని ఇచ్చే సారాంశ ప్రకటన అని చూపించే విధంగా రూపొందించవచ్చు;

మీరు వాక్యాల ప్రారంభంలో “మరియు,” "అయితే" మరియు "లేదా" వంటి పదాలను తొలగించవచ్చు, తద్వారా ప్రకరణంలోని భాగాలు అన్నీ వరుసగా జాబితా చేయబడి ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

విదేశీయులు ఇశ్రాయేలీయుల సంపదను దోచుకున్నప్పుడు మీరు వారికి సహాయం చెయ్యడానికీ ఏమీ చేయలేదు. వారు యూదా పట్టణాలన్నిటినీ జయించారు, యెరూషలేమును కూడా దోచుకున్నారు. మరియు మీరు ఆ విదేశీయుల వలె చెడ్డవారుగా ఉన్నారు, ఎందుకంటే మీరు సహాయం చేయడానికి ఏమీ చేయలేదు:

అయితే నీ సహోదరుని దినమున, అతని శ్రమానుభవదినమును నువ్వు చూడకూడదు. మరియు యూదావారి నాశనదినమున వారి స్థితిని చూచి నీవు ఆనందించకూడదు. ఆపద్దినమున నీ నోటిని గొప్పగా చేసికొనకూడదు. వారి శ్రమదినమున నా ప్రజల గుమ్మములలోనికి నీవు ప్రవేశించకూడదు. అవును నువ్వు! అతని విపత్తు దినమున అతని దుష్టత్వాన్ని నీవు చూడకూడదు. మరియు స్త్రీలైన మీరు అతని విపత్తు దినమున అతని సంపదను దోచుకొనకూడదు. మరియు అతని పరజనులను నరికివేయడానికి మీరు కూడలిలో నిలబడి ఉండకూడదు. మరియు ఆపద దినములో ప్రాణంతో నిలిచియున్నవారిని అప్పగించకూడదు (ఓబద్యా 1:12-14)

పైనున్న ఉదాహరణలో 11 వ వచనం తరువాత 12-14 వచనాలలో ఉన్న ప్రకరణం కోసం సారాంశాన్ని మరియు అర్థాన్ని అందిస్తుంది.

(1) కలిపి (2):

తరచుగా బైబిలులో ప్రకరణం ప్రారంభంలో లేదా ముగింపులో ఒక సాధారణ ప్రకటన ఉంటుంది, అది దాని మొత్తం అర్థాన్ని సంగ్రహిస్తుంది. మీరు ఆ ప్రకటనను ప్రకరణం యొక్క అర్ధాన్ని ఇచ్చే సారాంశ ప్రకటన అని చూపించే విధంగా రూపొందించవచ్చు.

మీరు ప్రకరణం యొక్క ప్రతి వాక్యాన్ని ప్రత్యేక పంక్తిలో ఉంచవచ్చు. అంతే కాకుండా, ప్రకరణంలోని ప్రతి వాక్యం రెండు భాగాలను కలిగి ఉన్నట్లయితే, మీరు ప్రతి వాక్యం యొక్క సమాన భాగాలు వరుసలో ఉండేలా ప్రకరణాన్ని రూపొందించవచ్చు. ప్రతి వాక్యం ఒకే అర్థాన్ని బలపరుస్తున్నట్లు చూపే దీనిని లేదా ఏదైనా ఇతర రూపాలను ఉపయోగించండి.

వారిలో ఒక్కడును వెళ్ళలేడు, వారిలో ఒక్కడును తప్పించు కోలేడు.

వారు పాతాళములో చొచ్చి పోయినను అక్కడ నా హస్తము వారిని బయటికి లాగును; వారు ఆకాశమునకెక్కి పోయినను అక్కడ వారిని కిందకు తీసుకొని వచ్చెదను. వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకుదును, వారిని తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్ర అడుగున దాగుకొనినను అక్కడ సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరచును. తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. (ఆమోసు 9:1-4 యు.ఎల్.టి)

పై ఉదాహరణలో, ప్రకరణముకు ముందు వాక్యం దాని పూర్తి అర్థాన్ని వివరిస్తుంది. ఆ వాక్యాన్ని ఉపోద్ఘాతంగా పెట్టుకోవచ్చు. ప్రతి వాక్యం యొక్క రెండవ సగభాగం పైన పేర్కొన్న విధంగా అవరోహణ మెట్ల నమూనా రూపంలో ఉంచబడుతుంది లేదా ప్రతి వాక్యం యొక్క మొదటి సగం వలె సమానంగా వరుస క్రమంలో ఉంటుంది లేదా మరొక విధంగా ఉంటుంది. ఈ వాక్యాలన్నీ ఒకే సత్యాన్ని తెలియపరచేలా ఉన్నాయని, దేవుని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని చూపించే ఏ రూపాన్ని అయినా ఉపయోగించండి.