te_ta/translate/figs-imperative/01.md

12 KiB

వివరణ

అజ్ఞార్థక వాక్యాలను ముఖ్యంగా వేరొకరు ఫలానాది చెయ్యాలని ఒక అభిమతాన్ని, లేక ఆవశ్యకతను వ్యక్తపరచడానికి వినియోగిస్తారు. కొన్ని సార్లు బైబిలులో అజ్ఞార్థక వాక్యాలకు ఇతర ఉపయోగాలు ఉన్నాయి.

కారణం ఇది అనువాదం సమస్య

కొన్నిభాషల్లో బైబిలులో వాడిన రీతిలో అజ్ఞార్థక వాక్యాలను వాడరు.

బైబిల్ నుండి ఉదాహరణలు

వినే వారిని ఏదన్నా చెయ్యమని చెప్పడానికి అజ్ఞార్థక వాక్యాలు ఉపయోగిస్తారు. ఆది 2లో దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ ఐగుప్తుకు వెళ్ళవద్దని చెప్పాడు. దేవుడు ఉండమన్న చోటనే నిలిచిపొమ్మన్నాడు,

అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. “నువ్వు ఐగుప్తుకి "వెళ్ళవద్దు. నేను నీతో చెప్పే దేశంలోనే నివసించు” (ఆది 26:2 ULT)

కొన్నిసార్లు బైబిలులోని అజ్ఞార్థక వాక్యాలకు వేరే ఉపయోగాలు ఉంటాయి.

పనులు జరిగించే అజ్ఞార్థకాలు

అలా జరగాలని దేవుడు ఆజ్ఞాపిస్తే అవి జరుగుతాయి. స్వస్థపడమని ఒకడికి యేసు ఆజ్ఞ ఇస్తే వాడు బాగయ్యాడు. ఆ ఆజ్ఞ పాటించడంలో అతని పాత్ర ఏమీ లేదు. అలా అజ్ఞాపించడం ద్వారా అతణ్ణి బాగు చేశాడు. ("శుద్దుడివి కా” అంటే “స్వస్థత పొందు” అని అర్థం.)

"యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు శుద్దుడివు కమ్ము అన్నాడు. (మత్తయి 8:3 ULT)

ఆది 1 లో వెలుగు ఉండాలని దేవుడు అజ్ఞాపించాడు. అలా అజ్ఞాపించడం ద్వారా ఆయన వెలుగు ఉనికిలోకి రప్పించాడు. బైబిల్ హీబ్రూ వంటి కొన్ని భాషల్లో ఆజ్ఞలు ఉత్తమ పురుషలో ఉంటాయి. ఇంగ్లీషు భాషలో ఆ సంప్రదాయం లేదు. కాబట్టి ULT లో ఉన్నట్టుగా ఉత్తమ పురుషను సాధారణ మధ్యమ పురుషగా మార్చుకోవాలి.

దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. (ఆది 1:3 ULT)

ఉత్తమ పురుష ఆజ్ఞలు ఉన్న భాషలు బైబిల్ హీబ్రూ మూల భాష పద్ధతిని “వెలుగు కలుగు గాక” వంటి వాటిని ఉపయోగించవచ్చు.

ఆశీర్వచనాలుగా అజ్ఞార్థకాలు

బైబిలులో అజ్ఞార్థకాలు ఉపయోగించి దేవుడు దీవిస్తాడు. వారి విషయంలో ఆయన సంకల్పాన్ని తెలియజేస్తున్నది.

దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, "సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా నిండించి, "భూమిని లోబరచుకొని దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ "పరిపాలించండి” అని చెప్పాడు. (ఆదికాండం 1 :28 ULT)

షరతులుగా ఉపయోగపడే అజ్ఞార్థకాలు

అజ్ఞార్థక వాక్యాన్ని ఏదైనా జరగాలంటే ఉన్న షరతును చెప్పడానికి కూడా వాడతారు. ముఖ్యంగా సామెతలు జీవితం గురించీ అందులో తరుచుగా జరిగే సంగతుల గురించీ చెప్పుతుంటాయి. ఈ క్రింద సామెతలు 4:6 లోని ముఖ్య ఉద్దేశం ఆజ్ఞ ఇవ్వడం కాదు. మనుషులు “ఒకవేళ” జ్ఞానాన్ని ప్రేమిస్తే ఏమి జరుగుతుందో బోధించడమే.

జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దానిని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది. (సామెతలు 4:6 ULT)

ఈ క్రింద ఉన్న సామెతలు 22:6 ఉద్దేశం మనుషులు తమ పిల్లలకు వారు పోవలసిన దారిని నేర్పిస్తే ఏమి జరుగుతుందో చెప్పడమే.

పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు. (సామెతలు 22:6 ULT)

అనువాదం వ్యూహాలు

(1). బైబిలులో వాడిన రీతిగా మీ భాషలో అజ్ఞార్థక వాక్యాలు వాడకపోయినట్లయితే బదులుగా ప్రకటన వాక్యం ఉపయోగించండి.

(2). ఒక విషయం జరిగేలా చేయడానికి ఒక వాక్యం వాడారని పాఠకులకు అర్థం కాకపోతే “కాబట్టి” వంటి పదం వాడండి. చెప్పిన దాని ఫలితంగా అక్కడ క్రియ జరిగిందని చూపించండి.

(3). మీ భాషలో ఆజ్ఞను ఒక షరతుగా ఉపయోగించడం లేకపోతే “అలాగైతే” “అప్పుడు” తదితర పదాలతో తర్జుమా చెయ్యండ

అనువాదం వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

(1). బైబిలులో వాడిన రీతిగా మీ భాషలో అజ్ఞార్థక వాక్యాలు వాడకపోతే దానికి బదులుగా ప్రకటన వాక్యం ఉపయోగించండి

శుద్దుడివి కమ్ము. (మత్తయి 8:3 ULT)

"నీవిప్పుడు శుద్దుడివి." "ఇప్పుడు నిన్ను శుద్దుడిగా చేస్తున్నాను."

దేవుడు వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. (ఆది 1:3 ULT)

దేవుడు వెలుగు కలిగింది అన్నాడు. వెలుగు కలిగింది.

·> > > దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, "సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా నిండించి, "భూమిని లోబరచుకొని దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ "పరిపాలించండి” అని చెప్పాడు. (ఆదికాండం 1 :28 ULT)

దేవుడు వారిని ఆశీర్వదించి వారితో ఇలా అన్నాడు, “మీరు ఫలించి మరియు విస్తరించడం, భూమిని నిండించి దానిని లోబరచుకోవడం మీకోసం నా చిత్తం. మరియు సముద్రపు చేపల మీదా, ఆకాశ పక్షుల మీదా, భూమి మీద సంచరించే ప్రతి జీవి మీదా నీకు ఆధిపత్యం ఉండాలి.

(2). ఒక విషయం జరిగేలా చేయడానికి ఒక వాక్యం వాడారని పాఠకులకు అర్థం కాకపోతే “అందుకని” వంటి పదం వాడండి. చెప్పిన దని ఫలితంగా అక్కడ క్రియ జరిగిందని చూపించండి..

దేవుడు వెలుగు కలుగు గాక అన్నాడు. వెలుగు కలిగింది. (ఆది 1:3 ULT)

దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. కాబట్టి, వెలుగు కలిగింది.

దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. “దాని ఫలితంగా, వెలుగు కలిగింది.

(3). మీ భాషలో ఆజ్ఞను ఒక షరతుగా ఉపయోగించడం లేకపోతే “అలాగైతే” “అప్పుడు” తదితర పదాలతో తర్జుమా చెయ్యండి.

పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు, వయసు పైబడిన వాడు అందులో నుండి తొలగడు. (సామెతలు 22:6 ULT)

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు:

చిన్నపిల్లకు వారు నడవవలసిన మార్గమేదో వాడికి నేర్పిన యెడల అప్పుడు వాడు వయసు పైబడిన అయినా అందులోనుండి తొలగడు."