te_ta/translate/figs-hendiadys/01.md

13 KiB

వివరణ

“మరియు” పదంతో అనుసంధానించబడిన రెండు పదాలను ఉపయోగించడం ద్వారా ఒక వక్త ఒకే ఆలోచనను వ్యక్తం చేసినప్పుడు, దీనిని హెండియాడిస్ (విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు) అంటారు. ఈ పదంలో రెండు పదాలు కలిసి పనిచేస్తాయి. సాధారణంగా పదాలలో ఒకటి ప్రాధమిక ఆలోచననూ, మరొక పదం ప్రాధమికమైన దానిని మరింత వివరిస్తాయి.

… తన సొంత రాజ్యము మరియు మహిమ. (1 థెస్సలోనికయులు 2:12bబి ULT)

“రాజ్యము” మరియు “మహిమ” రెండూ పదాలు నామవాచకాలు అయినప్పటికీ “మహిమ” వాస్తవానికి ఆ రాజ్యం ఎటువంటిదో చెపుతుంది. అది ఒక మహిమ యొక్క రాజ్యం లేదా మహిమతో కూడిన రాజ్యం (1 థెస్సలోనికయులు 2:12b ULT)

“మరియు” ద్వారా అనుసంధానించబడిన రెండు పదాలు ఒకే వ్యక్తినిగానీ లేదా వస్తువునుగానీ లేదా సంఘటనను గానీ సూచిస్తున్నప్పుడు అవి ఒకే వ్యక్తి, విషయం లేదా సంఘటనను సూచించినప్పుడు అవి విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు కూడా కావచ్చు.

మన మహా దేవుడు,మరియు రక్షకుడు యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ, మరియు మహిమ యొక్క ప్రత్యక్షత పొందడానికి ఎదురుచూస్తూ ఉన్నాము. (తీతు 2:13బి ULT)

తీతు 2:13 వచనంలో విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు రెండు ఉన్నాయి. “శుభప్రదమైన నిరీక్షణ” మరియు “మహిమ యొక్క ప్రత్యక్షత” రెండూ కూడా ఒకే విషయాన్ని చెపుతున్నాయి. యేసుక్రీస్తు తిరిగి రావడం గొప్పగా ఎదురుచూచినదీ ఆశ్చర్యకరమైనది అనే తలంపును బలపరచడానికి ఉపయోగిస్తుంది. అంతే కాకుండా “మన మహా దేవుడు” మరియు “రక్షకుడైన యేసుక్రీస్తు” ఒకే వ్యక్తిని సూచిస్తున్నాయి, ఇద్దరిని కాదు.

కారణాలు ఇది ఒక అనువాదం సమస్య

  • తరచుగా విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదం ఒక భావనామం. కొన్ని భాషలకు ఒకే అర్ధంతో ఉన్న నామవాచకం ఉండకపోవచ్చు.
  • చాలా భాషలు తరచుగా విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలను ఉపయోగించవు, కాబట్టి రెండవ పదం మొదటిదానిని మరింతగా వివరిస్తుందని ప్రజలు అర్థం చేసుకోలేరు.
  • అనేక భాషలు తరచుగా విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలను ఉపయోగించవు, కాబట్టి దాని అర్థం ఒక వ్యక్తి లేదా విషయం మాత్రమే, ఇద్దరు కాదు అని ప్రజలు అర్థం చేసుకోలేరు.

బైబిలు నుండి ఉదాహరణలు

ఒక నోటిని మరియు జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. (లూకా 21:15ఎ ULT)

“ఒక నోరు” మరియు “జ్ఞానం” పదాలు నామవాచకాలు, అయితే ఈ భాషా రూపంలో “జ్ఞానం” నోటినుండి వచ్చేదానిని వివరిస్తుంది.

మీరు సమ్మతించి మరియు విధేయత చూపినట్లయితే... (యెషయా 1:19ఎ ULT)

“సమ్మతించడం” మరియు “విధేయత” విశేషణాలు, అయితే “సమ్మతించడం” “విధేయతను” వివరిస్తుంది.

అనువాదం వ్యూహాలు

విశేషణ వాచకమును విడదీసి ప్రత్యేకముగా వాడే పదాలు సహజంగా ఉండి మరియు మీ భాషలో సరైన అర్ధాన్ని ఇస్తున్నట్లయితే దానిని ఉపయోగించడాన్ని పరిశీలించండి. లేనట్లయితే ఇక్కడ ఇతర ఎంపికలు ఉన్నాయి:

(1) వివరించే నామవాచకాన్ని అదే అర్థాన్ని కలిగియున్న ఒక విశేషణంతో ప్రత్యామ్నాయం చేయండి.

(2) వివరించే నామవాచకాన్ని అదే అర్థాన్ని ఇచ్చే ఒక పదంతో ప్రత్యామ్నాయం చేయండి.

(3) వివరించే విశేషణాన్ని అదే అర్థాన్ని ఇచ్చే క్రియా విశేషణంతో ప్రత్యామ్నాయం చేయండి.

(4) ఒకే అంశానికి సంబంధించిన ఒకే అర్థాన్ని ఇచ్చే ఇతర భాషా రూపంతో ప్రత్యామ్నాయం చేయండి మరియు ఆ ఒక పదం లేదా వాక్యం మరొకదానిని వివరించేలా చూడండి.

(5) ఒక విషయం మాత్రమే అర్థాన్ని ఇస్తుంది అని స్పష్టంగా తెలియకపోతే, ఇది స్పష్టంగా కనిపించే విధంగా వాక్యాన్ని మార్పుచెయ్యండి.

అన్వయించబడిన అనువాదం వ్యూహాల ఉదాహరణలు

(1) వివరించే నామవాచకాన్ని అదే అర్థాన్ని కలిగియున్న ఒక విశేషణంతో ప్రత్యామ్నాయం చేయండి.

ఒక నోటిని మరియు జ్ఞానమును. నేను మీకు అనుగ్రహింతును. (లూకా 21:15ఎ ULT)

నేను నీకు జ్ఞానముగల మాటలు అనుగ్రహింతును

తన సొంత రాజ్యము మరియు మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనుడి. (1 థెస్సలోనికయులు 2:12b ULT)

తన సొంత మహిమగల రాజ్యమునకు పిలుచుచున్న దేవునికి తగిన విధానంలో మీరు నడుచుకొనుడి.

(2) వివరించే నామవాచకాన్ని అదే అర్థాన్ని ఇచ్చే ఒక పదంతో ప్రత్యామ్నాయం చేయండి.

ఒక నోటిని మరియు జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. (లూకా 21:15ఎ ULT)

ఎందుకనగా నేను నీకు జ్ఞానముగల మాటలు అనుగ్రహింతును.

తన సొంత రాజ్యము మరియు మహిమనకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనుడి. (1 థెస్సలోనికయులు 2:12b ULT)

తన సొంత మహిమ యొక్క రాజ్యమునకు మిమ్మును పిలుచుచున్న దేవునికి తగిన విధానంలో మీరు నడుచుకొనుడి.

(3) వివరించే విశేషణాన్ని అదే అర్థాన్ని ఇచ్చే క్రియా విశేషణంతో ప్రత్యామ్నాయం చేయండి.

మీరు సమ్మతించి మరియు విధేయత చూపినట్లయితే... (యెషయా 1:19ఎ ULT)

మీరు సమ్మతించి విదేయులైనట్లయిన యెడల

(4) ఒకే అంశానికి సంబంధించిన ఒకే అర్థాన్ని ఇచ్చే ఇతర భాషా రూపంతో ప్రత్యామ్నాయం చేయండి మరియు ఆ ఒక పదం లేదా వాక్యం మరొకదానిని వివరించేలా చూడండి.

మీరు సమ్మతించి మరియు విధేయత చూపినట్లయితే (యెషయా 1:19ఎ ULT)

“విధేయులై” విశేషణం “లోబడండి” క్రియా పదంతో ప్రత్యామ్నామం చెయ్యబడవచ్చు.

మీరు సమ్మతితో విదేయులు అయినట్లయితే

(4) మరియు (5) ఒక విషయం మాత్రమే అర్ధం అయినట్లు అస్పష్టంగా ఉంటే, ఇది స్పష్టంగా కనిపించే విధంగా పదాలను మార్చండి.

మన మహా దేవుడు,మరియు రక్షకుడు యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ, మరియు మహిమ యొక్క ప్రత్యక్షత పొందడానికి ఎదురుచూస్తూ ఉన్నాము. (తీతు 2:13బి ULT)

మనం ఎదురుచూస్తున్న యేసు ప్రత్యక్షతను స్పష్టం చెయ్యడానికి “మహిమ” అనే నామవాచకాన్ని “మహిమగల” అనే విశేషణానికి మార్చవచ్చు, అలాగే, “యేసుక్రీస్తు” అనే పదం “మహా దేవుడు మరియు రక్షకుడు” వాక్యం ముందుకు తీసుకొని రావచ్చును. ఇది ఒకే వ్యక్తి యేసు క్రీస్తును వివరించే సాపేక్ష రూపంలో ఉంచవచ్చు.

మన మహా దేవుడు,మరియు రక్షకుడు యేసు క్రీస్తు మనం ఆశతో చూస్తూ ఉన్న శుభప్రదమైన నిరీక్షణ, మరియు మహిమగల ప్రత్యక్ష్తత కోసం ఎదురుచూస్తూ ఉన్నాము.