te_ta/translate/figs-explicitinfo/01.md

12 KiB

వర్ణన

కొన్ని భాషల్లో పలుకుబడులు ఆ భాష మాట్లాడే వారికి సహజంగా అనిపిస్తాయి. కానీ వేరే భాషలోకి తర్జుమా చేసినప్పుడు కొత్తగా అనిపిస్తాయి. దీనికి ఒక కారణం కొన్ని భాషల్లో సంగతులను అవ్యక్త సమాచారంగా వదిలేసే విషయాలను కొన్ని భాషల్లో స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది.

దీన్ని అనువాద సమస్య అనడానికి కారణాలు

మూల భాషలోని స్పష్ట సమాచారం అంతటినీ లక్ష్య భాషలో స్పష్టం సమాచారంగా తర్జుమా చేస్తే లక్ష్య భాషలో అది కొత్తగా అసహజంగా ఒకవేళ అయోమయంగా కూడా అనిపించవచ్చు. దానికి బదులు అలాంటి సమాచారాన్ని లక్ష్య భాషలో అవ్యక్తంగా ఉంచెయ్యడం మంచిది.

బైబిల్ నుండి ఉదాహరణలు

మరియు. అబీమెలెకు ఆ గోపురం దగ్గరికి వచ్చి దాని మీద యుద్ధం చేసి అగ్నితో దాన్ని కాల్చడానికి. ఆ గోపుర ద్వారం దగ్గరికి వచ్చాడు. (న్యాయాధి 9:52 ESV)

బైబిల్లో వాడిన హీబ్రూ భాషలో ఒక వాక్యాన్ని వేరొక వాక్యంతో డానికి ఉన్న సంబంధం తెలపడానికి “మరియు” తదితర పదాలు వాడడం కద్దు. ఇంగ్లీషులో అలా చేయడం వ్యాకరణ విరుద్ధం. అది ఇంగ్లీషు పాఠకుడికీ విసుగుగా అనిపిస్తుంది. రాసిన వాడు పామరుడు అనే భావం కలుగుతుంది. ఇంగ్లీషులో వాక్యాల మధ్య సంబంధం అనే భావాన్ని ఎక్కువ భాగం కలిపే పదాన్ని వదిలి పెట్టి అవ్యక్తంగా వదిలి వేయడం మంచిది.

బైబిల్లో వాడిన హీబ్రూ భాషలో, ఒక వస్తువును అగ్నితో తగలబెట్టారు అని రాయడం సహజం. ఇంగ్లీషులో తగలబెట్టడం అని చెప్పడంలో అగ్ని అనే మాట కూడా చేర్చడం అసహజం. ఈ రెంటినీ స్పష్టంగా చెప్పడం అసహజం. తగలబెట్టారు అని చెప్పి, అగ్నితో అనే దాన్ని అవ్యక్తంగా ఉంచెయ్యడం బావుంటుంది.

ఆ శతాధిపతి జవాబిస్తూ అన్నాడు, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు. (మత్తయి 8:8 TELIRV)

బైబిల్లో వాడిన భాషలో, సాధారణంగా ప్రత్యక్ష వాక్యాన్ని మాటను సుచుంచే రెండు క్రియపదాలతో సూచిస్తారు. ఒకటి సంబోధన విధం, రెండవది మాట్లాడుతున్న వాడి మాటలను పరిచయం చేసేది. ఇంగ్లీషు మాట్లాడే వారు ఈ సంప్రదాయం పాటించరు. అందువల్ల రెండు క్రియాపదాలు వాడడం అయోమయాన్ని అసహజత్వాన్ని సృష్టిస్తుంది. ఇంగ్లీషు మాట్లాడే వారికి మాట్లాడడం అనే దానిలోనే జవాబివ్వడం ఇమిడి ఉంది. ఇంగ్లీషులో రెండు క్రియాపదాలు వాడడం రెండు వేరువేరు ప్రస్తావనలుగా అనిపిస్తాయి. కాబట్టి ఇంగ్లీషులో ఒకే క్రియాపదం వాడితే మంచిది.

అనువాద వ్యూహాలు

  1. మూల భాషలోని స్పష్ట సమాచారం లక్ష్య భాషలో సహజంగా ధ్వనిస్తే దాన్ని స్పష్ట సమాచారంగానే తర్జుమా చెయ్యండి.
  2. మూల భాషలోని స్పష్ట సమాచారం లక్ష్య భాషలో సహజంగా ధ్వనించకపోతే లేదా అది అనవసరం గానో గందరగోళం గానో అనిపిస్తే స్పష్ట సమాచారాన్ని అవ్యక్తంగానే ఉంచెయ్యండి. ఈ సమాచారాన్ని పాఠకుడు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోగలిగితేనే ఇలా చెయ్యండి. అయినా కూడా ఈ భాగం లోనుండి పాఠకుడిని ఒక ప్రశ్న అడగడం ద్వారా పరీక్షించ వచ్చు.

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

  1. మూల భాషలోని స్పష్ట సమాచారం లక్ష్య భాషలో సహజంగా ధ్వనిస్తే దాన్ని స్పష్ట సమాచారంగానే తర్జుమా చెయ్యండి.
  • ఈ వ్యూహం వాడినప్పుడు వాచకంలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ కారణం వల్ల ఏ ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం లేదు.
    1. మూల భాషలోని స్పష్ట సమాచారం లక్ష్య భాషలో సహజంగా ధ్వనించకపోతే లేదా అది అనవసరం గానో గందరగోళం గానో అనిపిస్తే స్పష్ట సమాచారాన్ని అవ్యక్తంగానే ఉంచెయ్యండి. ఈ సమాచారాన్ని పాఠకుడు సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోగలిగితేనే ఇలా చెయ్యండి. అయినా కూడా ఈ భాగం లోనుండి పాఠకుడిని ఒక ప్రశ్న అడగడం ద్వారా పరీక్షించ వచ్చు.
  • అబీమెలెకు ఆ గోపురం దగ్గరికి వచ్చి దాని మీద యుద్ధం చేసి అగ్నితో దాన్ని కాల్చడానికి ఆ గోపుర ద్వారం దగ్గరికి వచ్చాడు. (న్యాయాధి 9:52 ESV)
    • అబీమెలెకు ఆ గోపురం దగ్గరికి వచ్చి దాని మీద యుద్ధం చేసి అగ్నితో దాన్ని కాల్చడానికి లేక తగలబెట్టడానికి. ఆ గోపుర ద్వారం దగ్గరికి వచ్చాడు.

ఇంగ్లీషులో, ఈ వచనంలోని క్రియ అంతకుముందు వచనంలోని క్రియ తరువాత వచ్చిందని “మరియు” వంటి పదాలు లేకుండానే స్పష్టంగా తెలుస్తున్నది. కాబట్టి అలాటి వాటిని వదిలి వేయవచ్చు. మరొకటి. “అగ్నితో” అనే మాట కూడా వదిలి వేయ వచ్చు. ఎందుకంటే ఈ సమాచారం “తగలబెట్టాడు” అనే పదంలోనే అవ్యక్తంగా ఉంది. “తగలబెట్టాడు”అనేదానికి ప్రత్యామ్నాయం “నిప్పంటించాడు” సహజంగా ఇంగ్లీషులో “అగ్నితో” “తగలబెట్టాడు” అనే రెండు పదాలు వాడడం సహజంగా అనిపించదు. కాబట్టి ఇంగ్లీషు అనువాదకుడు ఎదో ఒక్కటే ఎంచుకోవాలి. అవ్యక్త సమాచారం పాఠకుడికి అర్థం అయిందో లేదో పరీక్షించ వచ్చు. “తలుపు ఎలా తగలబడింది?” మంటల్లో కాలిపోయింది అని వారికి తెలిస్తే వారికి అవ్యక్త సమాచారం అర్థం అయిందన్న మాట. లేక రెండవ ప్రత్యామ్నాయం ఎంచుకుంటే “తలుపుకు నిప్పంటిస్తే ఏమౌతుంది?” అని అడగవచ్చు. పాఠకుడు “అది తగలబడి పోతుంది” అంటే అతడు అవ్యక్త సమాచారం అర్థం చేసుకున్నాడన్న మాట.

  • ఆ శతాధిపతి జవాబిస్తూ అన్నాడు, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు’ (మత్తయి 8:8 TELIRV)
    • ఆ శతాధిపతి జవాబిస్తూ అన్నాడు, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు.

ఇంగ్లీషులో, శతాధిపతి ఇలా మాట్లాడడం ద్వారా జవాబిచ్చాడు అనే సమాచారం ఆ క్రియాపదంలోనే ఉంది. కాబట్టి “అన్నాడు” అనే క్రియాపదం అవ్యక్తం గా ఉంచవచ్చు. అవ్యక్త సమాచారం పాఠకుడికి అర్థం అయిందో లేదో పరీక్షించ వచ్చు. “శతాధిపతి ఎలా జవాబిచ్చాడు?” మాట్లాడడం ద్వారా జవాబిచ్చాడు అని వారికి తెలిసిందంటే అవ్యక్త సమాచారం వారికి అర్థం అయిందన్న మాట.