te_ta/translate/figs-exmetaphor/01.md

15 KiB

వర్ణన

విస్తృత రూపకాలంకారం ఎవరన్నా ఒక సందర్భాన్ని వేరే సందర్భంగా చెప్పినప్పుడు కనిపిస్తుంది. మొదటి దాన్ని శక్తివంతంగా వర్ణించడానికి అది రెండవ దాన్ని పోలిన ప్రాముఖ్యత ఉందని చెప్పడానికి ఉపయోగిస్తారు. రెండవ సందర్భంలో వ్యక్తుల, వస్తువుల, చర్యల గురించి ఒకటి కన్నా ఎక్కువ రూపాలు ఉంటాయి. అవి మొదటి సందర్భాన్ని సూచిస్తాయి.

ఇది అనువాద సమస్య కారణాలు.

  • చదివే వారు ఈ పోలికలు వేరువేరు వాటిని గురించి చెప్పుతున్నాయి అనుకోవచ్చు.
  • పోలికగా ఉపయోగించినది చదివే వారికి పరిచయం లేకపోవచ్చు.
  • విస్తృత రూపకాలంకారాలు కొన్ని సార్లు ఎంత నిగూఢమైనవిగా ఉంటాయంటే అనువాదకుడు ఆ అలంకారం వల్ల వచ్చిన అర్థాన్ని అనువాదంలో చూపలేక పోవచ్చు.

అనువాద సూత్రాలు

  • విస్తృత రూపకాలంకారం అర్థం సాధ్యమైనంత స్పష్టంగా మూల భాష చదివే వారికి ఉన్నంత స్పష్టంగా లక్ష్య భాష చదివే వారికి ఉండేలా చూడండి.
  • మూల భాష వారికి ఉన్నంత కంటే మరింత స్పష్టంగా లక్ష్య భాష వారికి ఉండకూడదు.
  • విస్తృత రూపకాలంకారం ఎవరైనా వాడుతుంటే అతడు చెప్పుతున్న దానిలో ఆ పోలికలు చాలా ప్రాముఖ్యమైనవి.
  • లక్ష్య భాష వారికి కొన్ని పోలికలు పరిచయం లేకపోతే వారు అర్థం చేసుకునేలా అనుకూలం చెయ్యాలి. తద్వారా వారు మొత్తంగా విస్తృత రూపకాలంకారాన్ని అర్థం చేసుకోగలగాలి.

బైబిల్ నుండి ఉదాహరణలు.

కీర్తన 23:1-4లో కవి అంటున్నాడు. తన ప్రజల పట్ల దేవునికి ఉన్న శ్రద్ధ తన మంద పట్ల కాపరికి ఉండే శ్రద్ధ వంటిది. గొర్రెలకు కావలసినది కాపరి ఇస్తాడు. వాటిని భద్రమైన ప్రదేశాలకు తీసుకుపోతాడు. కాపాడతాడు. నడిపిస్తాడు. దేవుడు తన ప్రజల పట్ల చేసేవి ఇవే.

1 యెహోవా నా కాపరి. నాకు ఏ లోటూ లేదు. 2 పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు. 3 నా ప్రాణాన్ని ఆయన పునరుద్ధరిస్తాడు. తన నామాన్ని బట్టి సరైన మార్గాల్లో నన్ను నడిపిస్తాడు. 4 చావు నీడ ఉన్న లోయ గుండా నేను నడిచినా, ఏ హానికీ భయపడను ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు. నీ దండం, నీ చేతికర్ర నాకు ఆదరణ కలిగిస్తాయి.( ULT)

యెషయా 5:1-7లో, తన ప్రజల విషయంలో దేవుని నిరుత్సాహాన్ని యెషయా చిత్రీకరిస్తున్నాడు. ఒక ద్రాక్ష తోట చెడ్డ కాయలు కాస్తే రైతు బాధ పడినట్టు ఆయన బాధ పడతాడు. అలాంటి తోటను సాగు చెయ్యడం ఇక మానుకుంటాడు. 1- 6 వచనాలు రైతు గురించి చెప్పి 7వ వచనం ఇదంతా దేవుడు తన ప్రజలు గురించి అని తెలియజేస్తున్నది.

1 ... నా ప్రియుణ్ణి గురించి పాడతాను వినండి. అతని ద్రాక్షతోట విషయమై నాకు ఇష్టమైన వాణ్ణి గురించి గానం చేస్తాను. వినండి. సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది. 2 ఆయన దాన్ని బాగా దున్ని రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించాడు. దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది పిచ్చి ద్రాక్షకాయలు కాసింది.

3 కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా; నా ద్రాక్షతోట విషయం నాకు న్యాయం చెప్పమని మీకు విన్నవించుకుంటున్నాను. 4 నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే మరి ఇంకా ఏమి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాస్తుందని నేను ఎదురు చూస్తే అది పిచ్చి ద్రాక్షలు ఎందుకు కాసింది? 5 ఆలోచించండి, నేను నా ద్రాక్షతోటకు చేయబోయే దాన్ని మీకు వివరిస్తాను. దాన్ని పశువులు మేసేలా దాని కంచెను కొట్టి వేస్తాను; అందరూ దాన్ని తొక్కేలా దాని గోడను పడగొట్టి పాడుచేస్తాను. 6 ఎవరూ దాన్ని బాగు చెయ్యరు. పారతో త్రవ్వరు. దానిలో గచ్చపొదలు ముళ్ళ చెట్లు పెరుగుతాయి, దాని మీద కురవవద్దని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాను.

7 ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది. నీతి కోసం చూస్తే రోదనం వినిపించింది; (ULT)

అనువాద వ్యూహాలు

మొదటి పాఠకులు అర్థం చేసుకున్నట్టుగానే ఇప్పటి మీ పాఠకుడు అర్థం చేసుకోగలిగే విస్తృత రూపకాలంకారాలు ఉపయోగించండి. అలా వీలు కాకపోతే ఇక్కడ కొన్ని వ్యూహాలు ఇస్తున్నాము.

(1). లక్ష్య భాషలో పాఠకుడు ఇక్కడ ఉన్న పోలికను అక్షరార్థంగా గ్రహించాలంటే “వలె” “లాగా” అనే మాటలు ఉపయోగించి అనువాదం చెయ్యండి. ఇక్కడ మొదటి, లేక రెండవ వాక్యంలో అలా చేస్తే సరిపోవచ్చు. (2). లక్ష్య భాషలో పాఠకునికి ఆ పోలిక తెలియకపోతే తెలిసేలా ఏదైనా పోలిక వాడండి. (3). లక్ష్య భాషలో పాఠకునికి ఆ పోలిక ఇంకా తెలియకపోతే, దాన్ని స్పష్టంగా చెప్పండి.

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

  1. లక్ష్య భాషలో పాఠకుడు ఇక్కడ ఉన్న పోలికను అక్షరార్థంగా గ్రహించాలంటే “వలె” “లాగా” అనే మాటలు ఉపయోగించి అనువాదం చెయ్యండి. ఇక్కడ మొదటి, లేక రెండవ వాక్యంలో అలా చేస్తే సరిపోవచ్చు. ఉదాహరణగా కీర్తన 23:1-2 చూడండి.

యెహోవా నా కాపరి; నాకు ఏ లోటూ లేదు. పచ్చిక బయలుల్లో ఆయన నన్ను పండుకునేలా చేస్తాడు. ప్రశాంతమైన జలాల ఒడ్డున నన్ను నడిపిస్తాడు. (ULT)

దీన్ని ఇలా తర్జుమా చెయ్య వచ్చ `

"యెహోవా నాకు కాపరి వంటి వాడు; తన గొర్రెలను పచ్చిక బయళ్ళలో పరుండబెట్టే, ప్రశాంత జలాలకు నడిపించే కాపరి వలె అయన నన్ను నడిపిస్తాడు. అయన నాకు శాంతినిస్తాడు."

(2). లక్ష్య భాషలో పాఠకునికి ఆ పోలిక తెలియకపోతే తెలిసేలా ఏదైనా పోలిక వాడండి.

సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది. ఆయన దాన్ని బాగా దున్న రాళ్లను ఏరి అందులోశేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించాడు. దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది పిచ్చి ద్రాక్షకాయలు కాసింది. (యెషయా 5:1-2 ULT).

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు:

" సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది. ఆయన దాన్ని బాగా దున్ని రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించేను. దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది రసానికి పానికి రాని పిచ్చి ద్రాక్షకాయలు కాసింది.”

(3). లక్ష్య భాషలో పాఠకునికి ఆ పోలిక ఇంకా తెలియకపోతే, దాన్ని స్పష్టంగా చెప్పండి.

యెహోవా నా కాపరి ; నాకు ఏ లోటూ లేదు. (కీర్తన 23:1 ULT)

  • "కాపరి తన గొర్రెలకోసం శ్రద్ధ వహించినట్టు యెహోవా నా పట్ల శ్రద్ధ వహిస్తాడు కాబట్టి నాకు ఏ లోటూ లేదు

ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట. యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం; ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనిపించింది; నీతి కోసం చూస్తే రోదనం వినబడింది. (యెషయా 5:7 ULT)

దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు:

  • ఇశ్రాయేలు వంశం సేనల ప్రభువైన యెహోవా ద్రాక్షతోట వంటిది,
  • యూదా ప్రజలు ఆయనకిష్టమైన వనం వంటివారు;
  • ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది.
  • నీతి కోసం చూస్తే రోదనం వినబడింది.

లేదా

  • చెడ్డ కాయలు కాసినందుకు ఒక రైతు తన ద్రాక్ష తోటను ఇక పట్టించుకోవడం మానేసినట్టే,
  • యెహోవా ఇక యూదా ఇశ్రాయేల్ వారిని సంరక్షించడం మనుకుంటాడు.
  • ఎందుకంటే ఏది మంచో వారికి తెలియదు.
  • ఆయన న్యాయం కావాలని చూడగా బలాత్కారం కనబడింది;
  • నీతి కోసం చూస్తే రోదనం వినిపించింది.