te_ta/translate/figs-declarative/01.md

9.6 KiB

వివరణ

సాధారణంగా సమాచారం ఇవ్వడానికి ప్రకటనలు వాడతారు. అయితే కొన్ని సార్లు వాటిని ఇతర ఉపయోగాలకోసం కూడా బైబిలులో వాడారు.

కారణం ఇది అనువాద సమస్య

బైబిలులో ప్రకటనలను ఉపయోగించినట్టు కొన్ని భాషల్లో ప్రకటనలను ఉపయోగించరు.

బైబిల్ నుండి ఉదాహరణలు

సాధారణంగా సమాచారం ఇవ్వడానికి ప్రకటనలు వాడతారు. ఇక్కడ యోహాను 1:6-8లో ఇచ్చిన వాక్యాలన్నీ ప్రకటనలే, వాటి ఉపయోగం సమాచారం ఇవ్వడం.

దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. అందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. 8ఈ యోహానే ఆ వెలుగు కాదు. అయితే ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. (యోహాను 1:6-8 ULT)

ఒక ప్రకటనను ఆజ్ఞ గా ఎవరికైనా ఏమి చెయ్యాలో చెప్పడానికి ఉపయోగించవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో ప్రధాన యాజకుడు ప్రజలు ఏమి చెయ్యాలో చెప్పడానికి ప్రకటనలు చేస్తున్నాడు.

మీరు చేయాల్సిందేమిటంటే మీలో విశ్రాంతి దినం పరిచర్య కోసం వచ్చే వారు మూడు బృందాలై ఒక బృందం రాజు ఇంటికి కాపలాగా ఖచ్చితంగా ఉండాలి. మరో బృందం సూరు గుమ్మం దగ్గరా మరో బృందం మందిరం వెనుక ఉన్న ద్వారం దగ్గరా ఉండాలి. ఇలా మీరు మందిరాన్ని భద్రపరచాలి. (2 రాజులు 11:5 ULT)

ఒక ప్రకటనను సూచనలు ఇవ్వడానికి వాడవచ్చు.ఇక్కడ మాట్లాడుతున్నవాడు కేవలం యోసేపు రాబోయే రోజుల్లో ఏమి చేస్తాడో చెప్పడానికి మాత్రమే కాక, ఏమి చెయ్యాలో కూడా సూచనలు ఇస్తున్నాడు.

ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు. (మత్తయి 1:21 ULT)

ఒక ప్రకటనను విజ్ఞప్తి చెయ్యడానికి కూడా ఉపయోగిస్తారు. కుష్టు రోగి యేసు ఏమి చెయ్యగలడో చెప్పడం మాత్రమే గాక తనను బాగు చెయ్యమని కూడా అడుగుతున్నాడు.

ఇదిగో ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు. (మత్తయి 8:2 ULT)

ఒక ప్రకటనను ఒక పనిని చెయ్యడానికి వాడతారు. ఆదాము మూలంగా నేలకు శాపం తగిలిందని చెప్పడం ద్వారా దేవుడు ఇక్కడ నేలను శపిస్తున్నాడు.

నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు (ఆది 3:17 ULT)

ఒక మనిషి పాపాలకు క్షమాపణ దొరికిందని చెప్పడం ద్వారా యేసు ఆ మనిషి పాపాలు క్షమించాడు.

యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు." (మార్కు 2:5 ULT)

అనువాదం వ్యూహాలు

(1).  ఒక ప్రకటన ఉద్దేశం మీ భాషలో సరిగ్గా అర్థం కాకపోతే ఆ ఉద్దేశాన్ని వివరించే వాక్య శైలి ఉపయోగించండి.

(2).  ఒక ప్రకటన ఉద్దేశం మీ భాషలో సరిగ్గా అర్థం కాకపోతే వాక్య శైలిని జోడించండి.

(3).  ఒక ప్రకటన ఉద్దేశం మీ భాషలో సరిగ్గా అర్థం కాకపోతే ఆ పనిని వ్యక్తపరిచే క్రియారూపాన్ని ఉపయోగించండి.

అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

(1).   ఒక ప్రకటన ఉద్దేశం మీ భాషలో సరిగ్గా అర్థం కాకపోతే ఆ ఉద్దేశాన్ని వివరించే వాక్య శైలి ఉపయోగించండి.

ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు. (మత్తయి 1:21 ULT)

"ఆయనకు యేసు అనే పేరు పెడతావు" అనే పదబంధం ఒక సూచన. మామూలు సూచనను వ్యక్తం చేసే వాక్యం ఉపయోగించవచ్చు.

ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఆయనకు యేసు అనిపేరు పెట్టు, ఎందుకంటేతన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు.

(2).  ఒక ప్రకటన ఉద్దేశం మీ భాషలో సరిగ్గా అర్థం కాకపోతే దానిని వివరించే వాక్య శైలిని జోడించండి.

ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు అన్నాడు. (మత్తయి 8:2 ULT)

"నువ్వు బాగు చేయగలవ అని నాకు తెలుసు" అనే మాటల ఉద్దేశం విన్నపమే. ప్రకటనకు అదనంగా విజ్ఞప్తి జోడిస్తున్నాము.

“ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు. దయ చేసి అలా చెయ్యి.”

ప్రభూ, నీకు ఇష్టమైతే దయచేసి నన్ను బాగు చెయ్యి. నీవు చేయగలవని నాకు తెలుసు.”

(3 ). ఒక ప్రకటన ఉద్దేశం మీ భాషలో సరిగ్గా అర్థం కాకపోతే ఆ పనిని వ్యక్తపరిచే క్రియారూపాన్ని ఉపయోగించండి.

ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి నీవు ఆయనకు యేసు అనే పేరు పెడతావు.(మత్తయి 1:21 ULT)

ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, నువ్వు ఆయనకి యేసు అని పేరు పెట్టాలి, ఎందుకంటే తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు.

కుమారుడా నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు." (మార్కు 2:5 ULT)

కుమారుడా నేను నీ పాపాలు క్షమిస్తున్నాను.

కుమారుడా దేవుడు నీ పాపాలు క్షమించాడు.