te_ta/translate/figs-apostrophe/01.md

5.6 KiB

వివరణ

ఆ వ్యక్తి పట్ల తన సందేశం లేక భావాలు చాలా బలంగా ఉన్నాయని తన శ్రోతలకు చెప్పడానికి ఈ పధ్ధతి ఉపయోగిస్తాడు.

కారణం ఇది అనువాదం సమస్య.

అనేక భాషల్లో ఇది లేదు. శ్రోతలకు అర్థం కాదనే ఉద్దేశం. మాట్లాడే వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో వారికి అర్థం కాదు. లేదా మాట్లాడేవాడు తన మాటలు వినలేని వాళ్లతో మాట్లాడడం చూసి అతనికి పిచ్చి ఉందేమోననుకుంటారు.

బైబిలులోనుండి ఉదాహరణలు

గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక. (2 సమూయేలు 1:21 ULT)

సౌలు రాజు గిల్బోవ కొండపై హతమయ్యాడు. దావీదు ఒక విలాప గీతం రాశాడు. ఆ కొండల్లో మంచు గానీ వర్షం గానీ పడకూడదని చెప్పడం ద్వారా తానెంత దుఃఖంలో ఉన్నాడో తెలియజేస్తున్నాడు.

యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరికి పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, (లూకా 13:34 ULT)

యేసు ఇక్కడ యెరూషలేము ప్రజల గురించి, వారు తన మాటలు వింటున్నారు అన్నట్టుగా తన బాధను తన శిష్యుల ఎదుట, కొందరు పరిసయ్యుల ఎదుట వ్యక్తపరుస్తున్నాడు. యేసు తాను వారి విషయం ఎంత తీవ్రమైన వేదనతో ఉన్నాడో చెబుతున్నాడు.

బలిపీఠమా బలిపీఠమా యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు సంతానంలో యోషీయా అనే పేరుతో ఒక మగ బిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజా స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు.” (1 రాజులు 13:2 ULT)

దేవుని మనిషి ఆ బలిపీఠం తన మాటలు వింటున్నది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే నిజానికి అక్కడ నిల్చుని ఉన్న రాజు తన మాటలు వినాలని అతని ఉద్దేశం.

అనువాదం వ్యూహాలు

సంగ్రహ వాక్యంగా రాయడం అనేది సహజం అయితే, మీ భాషలో సరైన అర్థం ఇస్తున్నట్టయితే దానిని వాడడానికి ఆలోచించండి. కాకుంటే వేరొక ప్రత్యామ్నాయం ఉంది. ఇది మీ ప్రజలకు గందరగోళంగా అనిపిస్తే మాట్లాడేవాడు తన మాటలు వింటున్న వారితో మాట్లాడడం కొనసాగిస్తున్నట్టు తర్జుమా చెయ్యండి. తన మాటలు వినలేని వారికి తన సందేశం, భావాలూ చెపుతున్నట్టు భావించండి.

అన్వయించబడిన అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

బలిపీఠమా బలిపీఠమా యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు సంతానంలో యోషీయా అనే పేరుతో ఒక మగ బిడ్డ పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత పూజా స్థలాల యాజకులను అతడు నీ మీద వధిస్తాడు. అతడు మనిషి ఎముకలను నీ మీద కాలుస్తాడు. (1 రాజులు 13:2 ULT)

ఆయన బలిపీఠం గురించి ఇలా అన్నాడు: “ఈ బలిపీఠం గురించి యెహోవా ఇలా అంటున్నాడు. ‘చూడండి, … వారు ప్రజల ఎముకలను దీనిపై కాల్చివేస్తారు.

గిల్బోవ పర్వతాల్లారా మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక. (2 సమూయేలు 1:21 ULT)

గిల్బోవ పర్వతాల విషయంలో మంచైనా వర్షమైనా వాటిపై పడకపోవు గాక.