te_ta/translate/bita-plants/01.md

5.6 KiB
Raw Permalink Blame History

మొక్కలతో కూడిన బైబిల్ నుండి కొన్ని చిత్రాలు అక్షర క్రమంలో క్రింద ఇచ్చారు. అన్ని పెద్ద అక్షరాలలోని పదం ఒక ఆలోచనను సూచిస్తుంది. చిత్రం ఉన్న ప్రతి పద్యంలో ఈ పదం తప్పనిసరిగా కనిపించదు, కానీ ఈ పదం ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఒక కొమ్మ ఒక వ్యక్తి యొక్క వారసుడిని సూచిస్తుంది

ఈ క్రింది ఉదాహరణలలో, యెషయా యెష్షయి వారసులలో ఒకరి గురించి రాశాడు యిర్మీయా దావీదు వారసులలో ఒకరి గురించి రాశాడు.

యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది. యెహోవా ఆత్మ అతనిపై జ్ఞానం అవగాహన ఇచ్చే ఆత్మగా ఉంటుంది. (యెషయా 11: 2 ULT)

యెహోవా ఇలా చెబుతున్నాడు— “రాబోయే రోజుల్లో— నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు. (యిర్మీయా 23: 5 ULT)

యోబులో "అతని కొమ్మలు నరకబడతాయి" అని చెప్పినప్పుడు, అతనికి వారసులు లేరని అర్థం.

అతని వేళ్లు కింద ఉన్నవి కిందనే ఎండిపోతాయి; పైన అతని కొమ్మలు నరకబడతాయి. భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచి పెట్టుకు పోతాయి; వీధిలో అతనికి పేరు ఉండదు. (యోబు 18:17 ULT)

మొక్క ఒక వ్యక్తిని సూచిస్తుంది

దేవుడు కూడా నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు; అతను జీవిస్తున్న భూమి నుండి… మిమ్మల్ని వేరు చేస్తాడు . (కీర్తన 52: 5 ULT)

ఒక మొక్క భావోద్వేగం లేదా వైఖరిని సూచిస్తుంది

ఒక రకమైన విత్తనాలను నాటడం వల్ల ఆ రకమైన మొక్క పెరుగుతుంది, ఒక విధంగా ప్రవర్తించడం వల్ల ఆ రకమైన పరిణామాలు సంభవిస్తాయి.

వచనాలలోని భావోద్వేగం లేదా వైఖరి క్రింద గీత గీసి చూప్పించారు.

మీ కోసం నీతి విత్తనం వేయండి , నిబంధన విశ్వాస్యత ఫలాలను పొందుతారు. (హోషేయ 10:12 ULT)

నాకు తెలిసినంత వరకు , దుష్టత్వాన్ని, దున్ని, , కీడు, అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు. (యోబు 4: 8 ULT)

ప్రజలు గాలిని విత్తనాలుగా చల్లారు. పెనుగాలిని వారు కోసుకుంటారు. (హోషేయ 8: 7 ULT)

మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు. (అమోసు 6:12 ULT)

అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? (రోమా 6:21 ULT)

ఒక చెట్టు ఒక వ్యక్తిని సూచిస్తుంది

అతడు నీటికాలువల ఒడ్డున నాటి, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.. (కీర్తన 1: 3 ULT)

భీకరుడైన దుర్మార్గుడు స్వంత నేలలో పెరిగిన పెద్ద పచ్చని చెట్టులా విస్తరించడం నేను చూశాను . (కీర్తన 37:35 ULT)

నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను . (కీర్తన 52: 8 ULT)