te_ta/translate/bita-part2/01.md

7.3 KiB

బైబిల్లో ఉపయోగించిన కొన్ని సామాన్య అన్యాపదేశాల జాబితా ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ చెప్పిన పదం తప్పనిసరిగా అలంకారిక భాషలో కనిపించనవసరం లేదు. అయతే ఆ పదంలోని భావం కనిపిస్తుంది

గిన్నె లేక పాత్ర అందులో ఉన్నదానిని సూచిస్తున్నది.

నా గిన్నె నిండి పొర్లుతూ ఉంది. (కీర్తన 23:5 TELIRV)

గిన్నె పూర్తిగా నిండిపోయి అందులోనిది అంచుల మీదుగా కారుతున్నది.

మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు. (1 కొరింతి 11:26 TELIRV)

మనుషులు గిన్నెను తాగరు. గిన్నెలోనిది తాగుతారు.

నోరు అనేది వాక్కును లేక మాటలను సూచిస్తుంది.

మూర్ఖుడి నోరు వాడికే నాశన హేతువు. అతని మాటలే అతనికి ఉరి. (సామెత 18:7 TELIRV)

అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి. (యోబు 16:5 TELIRV)

నోరు పెద్దగా చేసుకుని నువ్వు నాకు విరోధంగా ఎన్నో సంగతులు చెప్పావు. నేను వాటిని విన్నాను. (యెహే 35:13 TELIRV)

నోరు ఒక మనిషి పలికే మాటలను సూచిస్తుందని చెప్పే ఉదాహరణలు ఇవి.

ఒక మనిషి జ్ఞాపకాలు అంటే అతని సంతతి.

ఒక మనిషి జ్ఞాపకాలు అంటే అతని సంతతి, ఎందుకంటే అతణ్ణి గుర్తు ఉంచుకుని గౌరవించవలసినది వారే. ఒక మనిషి జ్ఞాపకాలు చనిపోయాయి అని బైబిల్లో రాసి ఉంటే అతని తరువాతి తరం వారు ఎవరూ ఉండరు అని అర్థం.

నీ యుద్ధ నినాదంతో అన్యజాతులను నువ్వు భయభీతులను చేశావు. నువ్వు దుర్మార్గులను నాశనం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేశావు. తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు. శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి. (కీర్తన 9:5-6 TELIRV)

భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచి పెట్టుకు పోతాయి. భూతలంపై వాళ్ళను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. (యోబు 18:17 TELIRV)

యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు. చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి. (కీర్తన 34:16 TELIRV)

ఒక వ్యక్తి ఆ సమూహాన్ని సూచిస్తాడు.

దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి యెహోవాను అవమానిస్తాడు. (కీర్తన 10:3 TELIRV)

అంటే ఫలానా దుర్మార్గుడు అని కాదు. అందరు దుర్మార్గుల గురించీ చెప్పిన మాట.

ఒక మనిషి పేరు అంటే అతని సంతానం.

దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు. ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు. నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు (ఆది49:19-21 TELIRV)

ఇక్కడ గాదు, ఆషేరు, నఫ్తాలి ఆనే పేర్లు ఆ మనుషులకు కాదు, వారి సంతతిని సూచిస్తున్నాయి.

ఒక వ్యకి తనకు, తన ప్రజకు ప్రతినిధి.

అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు శారయి చాలా అందంగా ఉండడం గమనించారు. (ఆది12:14 TELIRV)

ఇక్కడ అబ్రాము అంటే అతడు, అతనితో ప్రయాణించి వచ్చిన అతని జాతి వారు.

పొడవడం అంటే చంపడం.

ఆయన హస్తం పారిపోతున్న మహా సర్పాన్ని పొడిచింది (యోబు 26:13 TELIRV)

అంటే అయన సర్పాన్ని చంపాడు.

చూడండి! ఆయన మేఘం పై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. (ప్రకటన 1:7 TELIRV)

"పొడిచిన వారు" అంటే యేసును చంపిన వారు.

పాపం (అపరాధం) అంటే పాపాలకు శిక్ష.

యెహోవా మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు. (యెషయా 53:6 TELIRV)

అంటే యెహోవా మనందరికీ పడవలసిన శిక్ష ఆయనకు వేశాడు అని అర్థం.