te_ta/process/process-manual/01.md

2.3 KiB

స్వాగతం

బైబిల్ అనువాదానికి స్వాగతం! దేవుని సందేశాన్ని మీ ప్రజల భాషలోకి అనువదించాలని మీరు కోరుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నాము, ఇది బైబిల్ కథల అనువాదం ద్వారా లేదా గ్రంథ పుస్తకాల ద్వారా అయినా. ఈ ప్రాసెస్ మాన్యువల్ ఒక ప్రాజెక్ట్. ప్రారంభం నుండి అది పూర్తయ్యే వరకు ఏమి చేయాలో అనువాద బృందాలకు తెలుసుకోవడంలో సహాయపడే దశల వారీ మార్గదర్శి. ఈ గైడ్ ప్రారంభ సెటప్ నుండి అనువాదం, తనిఖీ చేసిన కంటెంట్ యొక్క తుది ప్రచురణ వరకు అనువాద బృందానికి సహాయం చేస్తుంది.

మొదలు

అనువాదం చాలా క్లిష్టమైన పని, దీనికి నిబద్ధత, కూర్పు, ప్రణాళిక అవసరం. ఒక ఆలోచన నుండి పూర్తి, తనిఖీ, పంపిణీ, ఉపయోగంలో ఉన్న అనువాదం స్థాయికి తీసుకురావడానికి అవసరమైన అనేక చర్యలు ఉన్నాయి. ఈ ప్రాసెస్ మాన్యువల్‌లోని సమాచారం అనువాద ప్రక్రియలో అవసరమైన అన్ని దశలను తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది.

బైబిలును అనువదించడానికి చాలా నైపుణ్యాలు అవసరం, కాబట్టి మీరు మొదట ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈ పనిని చేయగల బృందాన్ని ఎన్నుకోవడం.