te_ta/intro/uw-intro/01.md

10 KiB
Raw Permalink Blame History

అన్ ఫోల్దింగ్ వర్డ్ ప్రాజెక్టు ఉనికిలో ఉన్న కారణం మేము ప్రతి భాషలోనూ ప్రతిబంధకాలు లేని బైబిల్ విషయం అందుబాటులో ఉండాలని కోరుకోవడమే.

యేసు తన శిష్యులకు ప్రతి ప్రజా జాతివారినీ తనకు శిష్యులనుగా చెయ్యమని చెప్పాడు:

"అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.'" (మత్తయి 28:18-20 ULT)

అన్ని భాషల వారూ పరలోకంలో ఉంటారని వాగ్దానం ఉంది:

"ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు." (ప్రకటన 7:9 ULT)

దేవుని వాక్కును ప్రతి ఒక్కడూ తన హృదయ భాషలో అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం.

”కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తును గురించిన మాట ద్వారా కలుగుతుంది. (రోమా 10:17 ULT)

దీన్ని చేయడమెలా?

ప్రతి భాషలోనూ ప్రతిబంధకాలు లేని బైబిల్ సమాచారం? అనే గమ్యాన్ని సాధించడం ఎలా?

మేము చేసేది ఏమిటి?

  • విషయం - మేము సృష్టించి ఉచితమైన, ప్రతిబంధకాలు లేని బైబిల్ విషయాన్నీ సృష్టించి అనువాదం కోసం దాన్ని అందుబాటులో ఉంచుతాము. వనరులు అనువాదాల పూర్తి జాబితా కోసం చూడండి http://ufw.io/content/ కొన్ని నమూనాలు:
    • ఓపెన్ బైబిల్ కథలు - కాలక్రమానుగత మినీ-బైబిల్. ఇందులో 50 ముఖ్య బైబిల్ కథలు సృష్టి మొదలుకుని ప్రకటన వరకూ, సువార్తీకరణ, శిష్యత్వమూ తదితర ప్రయోజనాల నిమిత్తం అచ్చులో, ధ్వనిరూపంలో వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. (చూడండి. http://ufw.io/stories/).
    • బైబిల్ - ఏకైక దైవ ప్రేరిత, లోప రహిత, అన్ని అవసరాలకు చాలిన, సాధికారికమైన దేవుని వాక్కును ఓపెన్ లైసెన్సు ప్రతిబంధకాలు లేని అనువాదాన్ని వాడకం కోసం, పంపిణికోసం అందుబాటులోకి తెచ్చాము (చూడండి http://ufw.io/bible/).
    • అనువాదం నోట్సు - భాషపరమైన, సాంస్కృతిక, వాక్య వివరణ సహాయకాలను అనువాదకులకు అందించాలి. ఇవి ఓపెన్ బైబిల్ కథలకు, బైబిల్ కు ఉన్నాయి. (చూడండి http://ufw.io/tn/).
    • అనువాదం ప్రశ్నలు - ప్రతి వాచక తునకకు అనువాదకులు, తనిఖీ చేసేవారు అడగదగిన ప్రశ్నలు ఉన్నాయి. తమ అనువాదం సరిగా అర్థం అవుతున్నదా లేదా అని సరి చూసుకోడానికి ఇవి పనికొస్తాయి. ఓపెన్ బైబిల్ కథలకు బైబిల్ కి అందుబాటులో ఉన్నాయి. (చూడండి http://ufw.io/tq/).
    • అనువాదం పదాలు - కొద్ది పాటి వివరణతో కూడిన ప్రాముఖ్య బైబిల్ పదాల జాబితా, క్రాస్ రిఫరెన్సులు, అనువాద సహాయకాలు. ఓపెన్ బైబిల్ కథలకు బైబిల్ కి ఉపకరిస్తాయి. (చూడండి http://ufw.io/tw/).
  • పరికరాలు - అనువాదం, తనిఖీ, పంపిణి పరికరాలు మేము తయారు చేస్తాం. ఇవి ఉచితం ఓపెన్ లైసెన్సు కింద ఉన్నాయి. ఈ పరికరాల పూర్తి జాబితా కోసం చూడండి http://ufw.io/tools/ for a complete list of tools. ఈ క్రింద కొన్ని నమూనాలు ఉన్నాయి.
    • Door43 - ఇది ఆన్ లైన్ అనువాద వేదిక. వ్యక్తులు అనువాదం, తనిఖీ, విషయ నిర్వహణ రంగాల్లో ఒకరికొకరు సహకరించుకోవచ్చు. ఇది అన్ ఫోల్దింగ్ వర్డ్ లో భాగం. (చూడండి https://door43.org/).
    • అనువాదం స్టూడియో - ఇది మొబైల్ ఆప్. డెస్క్ టాప్ ఆప్ కూడా. ఇక్కడ అనువాదకులు ఆఫ్ లైన్ అనువాదాలు చేయవచ్చు. (చూడండి http://ufw.io/ts/).
    • అనువాదం కీ బోర్డు - ఇది వెబ్, మొబైల్ ఆప్. ఏ భాషలకు దాని ప్రత్యేకమైన కీ బోర్డు లేదో వాటికి ప్రత్యేక కీ బోర్డును సృష్టించుకుని వాడడానికి వాడకందారులకు సహాయపడుతుంది. (చూడండి http://ufw.io/tk/).
    • అన్ ఫోల్దింగ్ వర్డ్ ఆప్ - అనువాదాలను పంచిపెట్టడానికి వాడే మొబైల్ ఆప్. (చూడండి. http://ufw.io/uw/).
    • అనువాదం కేంద్రకం - బైబిల్ అనువాదాన్ని సమగ్రంగా తనిఖీ చేయడానికి ఉపయోగపడే ప్రోగ్రాం. (చూడండి http://ufw.io/tc/).
  • శిక్షణ - మాతృ భాష అనువాదక బృందాలకు శిక్షణ ఇచ్చే వనరులు మేమూ సృష్టిస్తాం. అనువాదం అకాడెమీ (ఈ వనరు) మా ప్రాథమిక శిక్షణ పరికరం. మాదగ్గర ధ్వని రికార్డింగులు ఇతర శిక్షణ వనరులు ఉన్నాయి. శిక్షణ సరంజామా పూర్తి జాబితా కోసం చూడండి. http://ufw.io/శిక్షణ/