te_ta/translate/writing-participants/01.md

16 KiB
Raw Permalink Blame History

వివరణ

ఒక కథలో మొదటిసారిగా వ్యక్తులనూ లేదా విషయాలనూ ప్రస్తావించిన యెడల, వారు క్రొత్తగా పాల్గొనే వారు </ u>. ఆ తరువాత, వారిని గూర్చి ప్రస్తావించినప్పుడెల్లా, వారు ఇంతకు మునుపు పాల్గొన్న పాత వారు</ u>.

ఆ సమయంలో ఒక పరిసయ్యుడు ఉన్నాడు, అతని పేరు నికోదేము</ u> ... ఈవ్యక్తి</ u> రాత్రి సమయంలో యేసు వద్దకు వచ్చాడు ... యేసు అతనికి </ u> సమాధానమిచ్చాడు (యోహాను3:1)

మొదట నొక్కి చెప్పిన వాక్యం నికోదేము అనే కొత్తగా కధలో పాలుపంచుకొంటున్న వ్యక్తిని పరిచయం చేస్తుంది. అతను రెండవ సారి పాల్గోన్నప్పుడు ఇంతకు మునుపు పరిచయమైన పాత వ్యక్తిగా సూచిస్తూ "ఈ వ్యక్తి" లేదా "అతడు" అని పిలవడం జరుగుతుంది.

కారణం ఇది అనువాదానికి సంబంధించిన సమస్య

మీ అనువాదాన్ని స్పష్టంగా, సహజంగా చేయడానికి ఇప్పటికే చదివినట్టి పాతవారు గానీ లేదా కొత్తగా పరిచయం చేసే వారైతే ప్రజలకు తెలిసే విధంగా వారిని గూర్చి సూచించాల్సిన అవసరం ఉంది. వివిధ భాషలలో దీన్ని ఈ విధంగా తెలియ చేయడానికి అనేక విధానాలు ఉన్నాయి. మీ భాషలో ఏ విధంగా దీన్ని చేస్తారో ఆ విధానాన్ని మీరు అనుసరించాలి, దీన్ని మూల భాషలో చేసిన విధంగా కాదు.

బైబిలు నుండి ఉదాహరణలు

కొత్తగా పాలు పొందేవారు

ఈ క్రింది ఉదాహరణలో చాలా ముఖ్యమైనట్టి ఒక వ్యక్తి కొత్తగా పాలు పంచుకొనే పరిచయ వాక్యం, అతనిని గురించి "ఒక మనిషి ఉన్నాడు" అని పరిచయం చేయడం జరిగింది. "ఉన్నాడు" అనే పదం ఈ మనిషి ఉనికిని గూర్చి తెలియ చేతుంది. "ఒక మనిషి" అనే పదం రచయిత అతని గురించి మొదటిసారి మాట్లాడుతున్నాడని చెబుతుంది. మిగిలిన వాక్యం ఈ వ్యక్తి ఎక్కడ నుండి వచ్చాడు, కుటుంబం ఎవరు, అతని పేరు ఏమిటో చెబుతుంది.

ఒక మనుష్యుడు ఉన్నాడు </ u>అతను దాను వంశస్థుడునూ జొర్యా పట్టణస్థుడు. అతని పేరు మానోహ. (న్యాయాధిపతులు13:2 యు.ఎల్.టి)

అప్పటికే పరిచయమైన ఒక నూతనమైన వ్యక్తి ముందుగానే పరిచయమైన వ్యక్తులతో తరుచు కలిస్తే అతను కొత్త వ్యక్తికాదు. దిగువ ఉదాహరణలో, మానోహ భార్యను గూర్చి "అతని భార్య" అని చెప్పడం జరిగింది. ఈ వాక్య భాగం అతనితో ఆమెకు గల సంబంధాన్ని చూపిస్తుంది.

దాను వంశస్థుడునూ జొర్యా పట్టణస్థుడునైన ఒక మనుష్యుడుండెను, అతని పేరు మానోహ. అతనిభార్య</ u> గొడ్రాలై కానుపు లేక యుండెను. (న్యాయాధిపతులు13:2 యు.ఎల్.టి)

కొన్నిసార్లు క్రొత్తగా పాలు పంచుకొనే వ్యక్తిని పేరు ద్వారా పరిచయం చేయడం అవుతుంది, ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో పాఠకులకు తెలుసని రచయిత భావిస్తాడు. రాజులు మొదటి గ్రంధం మొదటి వచనంలో రాజైన దావీదు ఎవరో తన పాఠకులకు తెలుసని రచయిత భావించడం వలన అతను ఎవరో మరోసారి పాఠకులకు వివరించాల్సిన అవసరం లేదు.

రాజైన దావీదు బహు వృద్ధుడవడం వలన అతని సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పిన అతనికి వెట్ట కలుగలేదు. (1 రాజులు1: 1 ULT)

ఇంతకు మునుపే పాలుపంచుకొన్న పాత వారు

అప్పటికే కథలోకి తీసుకొనిన వ్యక్తిని ఆ తర్వాత సర్వనామంతో సూచించవచ్చు. దిగువ ఉదాహరణలో, మానోహను "అతని" అనే సర్వనామంతోనే సూచించడం జరిగింది. అంతేకాదు అతని భార్యను "ఆమె" అనే సర్వనామంతో సూచించడం జరిగింది.

అతని</ u> భార్య గొడ్రాలై ఉంది కాబట్టి ఆమె </ u> కు కానుపు లేదు. (న్యాయాధిపతులు13:2 యు.ఎల్.టి)

కథలో ఏమి జరుగుతుందో దానిని ఆధారం చేసుకొని ఇంతకు మునుపే పరిచయమైన వారిని వేరే విధానంలో కూడా చెప్పవచ్చు. ఈ క్రింది ఉదాహరణలో మానోహ భార్యకు పుట్టే కుమారుడు కధలో అతని భార్యను ప్రస్తావిస్తూ "స్త్రీ" అనే నామవాచకంతో పిలవడమైంది.

యెహోవా దూతఆ స్త్రీకి</ u>ప్రత్యక్షమై ఇలా అన్నాడు, (న్యాయాధిపతులు13:3 యు.ఎల్.టి)

ఇంతకు మునుపు పరిచయమైన పాతవారిని గురించి కొంతకాలం వరకు ప్రస్తావించకపోతే, లేదా తరువాత పాల్గొనే వారి మధ్య గందరగోళం ఉంటే, రచయిత వారి పేరును మళ్ళీ ఉపయోగించవచ్చు. దిగువ ఉదాహరణలో, మానోహను అతని పేరుతో సూచిస్తారు, ఇది రచయిత 2వ వచనానికి ముందు ఉపయోగించలేదు.

అప్పుడు మానోహ</ u> యెహోవాకు ప్రార్థించెను... (న్యాయాధిపతులు13:8 యు.ఎల్.టి)

కొన్ని భాషలలో క్రియ అనేది మనకు కధ విషయంమై ఏదో విషయాన్ని చెబుతుంది. కొన్నిభాషలలోని ప్రజలు మునుపు చెప్పినట్టి పాత వ్యక్తులను గురించి తరచు నామవాచకం లేదా సర్వనామాల వంటి పదబంధాలను ఉపయోగించరు. వినేవారికి ఆ వ్యక్తి ఎవరో అర్థం చేసుకోవడానికి తగిన సమాచారాన్ని క్రియ ఇస్తుంది. (చూడండి క్రియలు)

అనువాదానికి సంబంధించిన వ్యూహాలు

  1. పాలు పొందే వ్యక్తులు క్రొత్తవారైతే, క్రొత్తవారిని పరిచయం చేయడానికి మీ భాషలోని ఉన్న విధానాన్ని ఉపయోగించండి.
  2. సర్వనామం ఎవరిని సూచిస్తుందో స్పష్టంగా తెలియకపోతే, నామవాచకం లేదా పేరును వాడండి.
  3. ఇంతకు మునుపే ఉన్న పాతవారిని గురించిన వారి పేరు లేదా నామవాచకం ద్వారా సూచిస్తే, ఇది మరొక కొత్త వ్యక్తి అని ప్రజలు విస్తుపోతే, దానికి బదులుగా సర్వనామం ఉపయోగించటానికి ప్రయత్నించండి. ఒకవేళ సర్వనామం అవసరం లేకుండా సంధర్భాన్ని బట్టి మనుషులు స్పష్టంగా అర్థం చేసుకుంటే, అప్పుడు సర్వనామం వాడకుండా వదిలివేయండి.

అనువాదాన్ని అన్వయించడానికి కోసం వ్యూహాలను ఉదాహరణలుగా ఇవ్వడమైంది

  1. పాలుపొందే వ్యక్తులు క్రొత్తవారైతే, క్రొత్తవారిని పరిచయం చేయడానికి మీ భాషలోని ఉన్న విధానాన్ని ఉపయోగించండి.
  • లేవీయుడగు యోసేపు అను ఒకడు కుప్రలో ఉండెను. ఇతనికి అపొస్తలుల ద్వారా బర్నబా అనే పేరు పెట్టడం జరిగింది (అనగా, ఆదరణ పుత్రుడు అని అర్ధం). (అపొస్తలులకార్యములు 4:36-37 యు.ఎల్.టి) వాక్య ప్రారంభంలో అతనిని గురించిన పరిచయం చేయకపోతే యోసేపు అనే పేరు కొన్నిభాషలలో గందరగోళంగా ఉండవచ్చు.
  • కుప్రలో లేవీయుడగు ఒక మనుష్యుడు. అతని పేరు యోసేపు, ఇతనికి అపొస్తలులు ద్వారా ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబా అను పేరు పెట్టిరి (అనగా, ఆదరణ పుత్రుడు అని అర్ధం).
  • యోసేపు అనే పేరు గల ఒక లేవీయుడు కుప్రలో ఉండెను. అపొస్తలులు అతనికి బర్నబా అనే పేరు పెట్టారు, అంటే దాని అర్ధం ఆదరణ పుత్రుడు.
  1. సర్వనామం ఎవరిని సూచిస్తుందో స్పష్టంగా తెలియకపోతే, నామవాచకం లేదా పేరును వాడండి.
  • ఆయన</ u>యొక చోట ప్రార్థన చేసి ముగించినప్పుడు, ఆయన శిష్యులలో ఒకడు, "ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థనచేయడం నేర్పండి” అని ఆయన అడిగాడు. (లూకా11:1 యు.ఎల్.టి) ఇది అధ్యాయంలోని మొదటివచనం కాబట్టి, "ఆయన" అని చెప్పినప్పుడు ఆ మాట ఎవరిని సూచిస్తుందిఅని పాఠకులు ఆశ్చర్య పోవచ్చు.
  • యేసు</ u>ఒక చోట ప్రార్థన చేసి ముగించినప్పుడు, ఆయన శిష్యులలో ఒకడు, " ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థన చేయడం నేర్పండి” అని ఆయన అడిగాడు.
  1. ఇంతకు మునుపే ఉన్న పాతవారిని గూర్చి వారి పేరు లేదా నామవాచకం ద్వారా సూచిస్తే, ఇది మరొక కొత్త వ్యక్తి అని ప్రజలు విస్తుపోతే, దానికి బదులుగా సర్వనామం ఉపయోగించటానికి ప్రయత్నించండి. ఒకవేళ సర్వనామం అవసరం లేకుండా సంధర్భాన్ని బట్టి మనుషులు స్పష్టంగా అర్థం చేసుకుంటే, అప్పుడు సర్వనామం వాడకుండా వదిలివేయండి.
  • ** యోసేపు </ u>యాజమాని యోసేపు </ u>ను తీసుకొనిపోయి అతనిని</ u>చెరసాలలో రాజు ఖైదీలందరినీ బంధించి ఉంచే ప్రదేశంలో ఉంచాడు, మరియు యోసేపు </ u>అక్కడే ఉండడం జరిగింది.** (ఆదికాడము39:20 యు.ఎల్.టి) కథలో యోసేపు ప్రధానమైన వ్యక్తి కాబట్టి, కొన్నిభాషలలో అతని పేరును ఎక్కువగా ఉపయోగించడం అసహజంగా లేదా గందరగోళంగా అనిపించవచ్చు. వారు సర్వనామాన్ని ఉపయోగించేందుకు ఇష్టపడతారు.
  • యోసేపు యజమానిఅతనిని </ u>పట్టుకొనిపోయి,అతనిని </ u>చెరసాలలో రాజు ఖైదీలందరినీ బంధించి ఉంచే ప్రదేశంలో ఉంచాడు,అతడు</ u>అక్కడే చెరసాలలో ఉండిపోయాడు.