te_ta/translate/translate-wforw/01.md

9.7 KiB
Raw Permalink Blame History

నిర్వచనం

పదం కోసం పదం ప్రత్యామ్నాయం అనువాదానికి అత్యంత సాహిత్య రూపం. మంచి అనువాదాలు చేయడానికి ఇది ఉత్తమ ఎంపిక కాదు. పదం కోసం పదం అనువాదం మూల భాషలోని ప్రతి పదానికి లక్ష్య భాషలో సమానమైన పదాన్ని ప్రత్యామ్నాయం చేస్తుంది.

అనువాదాలలో పదం కోసం పదం

  • ఒక్కో సమయంలో ఒక్కో ఒక పదం మీద లక్ష్యం ఉంటుంది.
  • సహజ వాక్య నిర్మాణం, పదబంధ నిర్మాణాలు, లక్ష్య భాష లోని భాషా భాగాలు విస్మరించుతాయి.

పదం కోసం పదం అనువాదం ప్రక్రియ చాలా సులభం.

  • మూల వాక్యభాగంలోని మొదటి పదం సమానమైన పదం ద్వారా అనువదించబడింది.
  • అప్పుడు తదుపరి పదం జరుగుతుంది. వచనం అనువదించే వరకు ఇది కొనసాగుతుంది.
  • పదం కోసం పదం విధానం ఆకర్షణీయంగా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా సులభం. అయినప్పటికీ, ఇది నాణ్యత లేని అనువాదానికి దారితీస్తుంది.

పదం కోసం పదం ప్రత్యామ్నాయం అనువాదాలకు చదవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అవి తరచూ గందరగోళంగానూ, తప్పుడు అర్ధాన్ని ఇచ్చేవిగానూ, అర్థాన్ని ఇవ్వనివిగానూ ఉంటాయి. మీరు ఈ రకమైన అనువాదం చేయకుండా తప్పించాలి. ఇవి కొన్ని ఉదాహరణలు:

పద క్రమం

యు.ఎల్.టి లో లూకా 3:16 ఉదాహరణ ఇక్కడ ఉంది:

వారందరికీ యోహాను ఇచ్చిన జవాబిది: “నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నిజమే. గానీ నాకంటే బలప్రభావాలున్నవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పవిత్రాత్మలోనూ మంటల్లోనూ మీకు బాప్తిసమిస్తాడు.”

ఆ అనువాదం స్పష్టంగానూ, అర్థం చేసుకోవడం సులభంగానూ ఉంది. అయితే అనువాదకులు పదం కోసం పదం పద్ధతిని ఉపయోగించారని అనుకుందాం. అనువాదం ఏవిధంగా ఉంటుంది?

ఇక్కడ, ఆంగ్లంలో అనువదించిన పదాలు ఆరంభ గ్రీకుభాషలా అదే క్రమంలో ఉన్నాయి.

వారందరికీ యోహాను ఇచ్చిన జవాబిది: “నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నిజమే. గానీ నాకంటే బలప్రభావాలున్నవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పవిత్రాత్మలోనూ అగ్నిలోనూ మీకు బాప్తిసమిస్తాడు.”

ఈ అనువాదం ఇబ్బందికరమైనది, ఆంగ్లంలో అర్ధం కాదు.

పైన ఉన్న యు.ఎల్.టి అనువాదాన్ని మళ్ళీ చూడండి. ఇంగ్లీష్ యు.ఎల్.టి అనువాదకులు అసలు గ్రీకు పద క్రమాన్ని ఉంచలేదు. వారు ఆంగ్ల వ్యాకరణ నియమాలకు తగినట్లుగా వాక్యంలోని పదాలను కదిలించారు. వారు కొన్ని పదజాలాలను కూడా మార్చారు. ఉదాహరణకు, ఇంగ్లీష్ యు.ఎల్.టి “యోహాను ఇలా చెప్పడం ద్వారా అందరికి జవాబిచ్చాడు” అనే డానికి బదులు "యోహాను వారందరికీ చెప్పడం ద్వారా జవాబిచ్చాడు,” వచనం సహజంగా ధ్వనించబడడానికి వారు వేరే పదాలను వేరే క్రమంలో ఉపయోగించారు, తద్వారా ఇది అసలు అర్థాన్ని విజయవంతంగా తెలియచెయ్యగలుగుతుంది.

అనువాదం గ్రీకు వచనం వలె అదే అర్థాన్ని తెలియజేయాలి. ఈ ఉదాహరణలో, యు.ఎల్.టి అనేది ఇబ్బందికరమైన పదం కోసం పదం అనువాదం కంటే మెరుగైన ఆంగ్ల అనువాదం.

పద అర్ధాల పరిధి

అదనంగా, పదం కోసం పదం ప్రత్యామ్నాయం సాధారణంగా అన్ని భాషలలోని చాలా పదాలకు అర్థాల పరిధి ఉందని పరిగణనలోకి తీసుకోదు. ఏదైనా ఒక వచన భాగంలో, సాధారణంగా రచయిత తన మనస్సులో ఒక అర్ధాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. వేరే భాగంలో, అతను మనస్సులో వేరే అర్థాన్ని కలిగి ఉండవచ్చు. అయితే పదం కోసం పదం అనువాదాలలో, సాధారణంగా ఒక అర్ధం మాత్రమే ఎంచుకోబడుతుంది, అది అనువాదం అంతటా ఉపయోగించబడుతుంది.

ఉదాహరణకు, "అగ్గేలోస్" అనే గ్రీకు పదం మానవ దూతను లేదా ఒక దేవదూతను సూచిస్తుంది.

”ఇతణ్ణి గురించే ఈ మాటలు వ్రాసి ఉన్నాయి. ‘ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందర నీ దారిని సిద్ధం చేస్తాడు. (లూకా 7:27)

"అగ్గేలోస్" పదం మానవ సందేశకుడిని సూచిస్తుంది. యేసు బాప్తిస్మం ఇచ్చు యోహానును గురించి మాట్లాడుతున్నాడు.

దేవదూతలు వారిని విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత (లూకా 2:15)

ఇక్కడ "అగ్గేలోస్" పదం పరలోకం నుండి వచ్చిన దేవదూతలను సూచిస్తుంది.

రెండు వేర్వేరు రకాల జీవులను సూచించడానికి ఉపయోగించినప్పటికీ, ఒక పదం కోసం పదం అనువాద ప్రక్రియ రెండు వచనాలలోని ఒకే పదాన్ని ఉపయోగించవచ్చు. ఇది పాఠకుడికి గందరగోళంగా ఉంటుంది.

భాషా రూపాలు

చివరగా, పదం కోసం పదం అనువాదంలో భాషారూపాలు సరిగ్గా తెలియపరచబడవు. భాషా రూపాలు అవి రూపొందించబడిన వ్యక్తిగత పదాలకు భిన్నమైన అర్థాలను కలిగి ఉంటాయి. వారు పదం కోసం పదం అనువాదం చేసినప్పుడు భాషారూపాలు అర్థం కోల్పోతాయి. లక్ష్య భాష సాధారణ పద క్రమాన్ని అనుసరించే విధంగా అవి అనువదించబడినప్పటికీ, పాఠకులకు వాటి అర్థాన్ని అవగాహన చేసుకోలేరు. వాటిని సరిగ్గా అనువదించడం ఎలాగో తెలుసుకోవడానికి గణాంకాలు పేజీని చూడండి.