te_ta/translate/translate-tform/01.md

4.3 KiB

అర్థం ప్రాముఖ్యత

బైబిలు గ్రంథాన్ని రాసిన వారు దేవుని నుండి సందేశాలను పొందారు, ప్రజలు వాటిని అర్థం చేసుకోడానికి దేవుడు కోరాడు. ఈ ఆదిమ రచయితలు తమ ప్రజలు మాట్లాడే బాషను వినియోగించారు. తద్వారా వారూ, వారి ప్రజలు దేవుని సందేశాలను అర్థం చేసుకొన్నారు. అవే సందేశాలను ఈనాడు ప్రజలు అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అయితే చాలా కాలం క్రితం బైబిలు రాసిన బాషలను ఈనాడు ప్రజలు మాట్లాడడం లేదు. అందుచేత ఈనాడు ప్రజలు మాట్లాడే బాషలలోనికి బైబిలును అనువదించే కర్తవ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు.

దేవుని సందేశాలను అందించడానికి ప్రజులు వినియోగించే ఒక నిర్దిష్టమైన బాష ప్రాముఖ్యమైనది కాదు. దానిలో వినియోగించే నిర్దిష్ట పదాలు ప్రాముఖ్యం కాదు. అయితే ఆ పదాలు అందించే అర్థాలు ముఖ్యమైనవి. దానిలో అర్థం దాని సందేశం అవుతుంది, పదాలు గానీ, బాష గానీ సందేశం కాదు. అందుచేత మనం పదాలను గానీ లేదా మూల బాషలలోని వాక్యాల రూపాలను గానీ అనువదించము కాని దాని అర్థాన్ని అనువదించాలి.

ఈ కింద ఉన్న జతల వాక్యాలను గమనించండి

  • రాత్రంతా వర్షం కురిసింది./రాత్రంతా వర్షం పడింది
  • వార్తలు విన్నప్పుడు జాన్ ఆశ్చర్యపోయాడు./ జాన్ విన్నప్పుడు ఆ వార్తలు అతనిని ఆశ్చర్యచకితుణ్ణి చేసాయి.
  • ఇది చాలా వేడిగా ఉన్న రోజు./ఈ రోజు చాలా వేడిగా ఉంది.
  • పేతురు ఇల్లు / పెతురుకు చెందిన ఇల్లు

ఈ వాక్యాలలో వేరు వేరు పదాలు వినియోగించినప్పటికీ జతలుగా ఉన్న ఈ వాక్యాలలోని అర్థం ఒక్కటే, మంచి అనువాదంలో ఈ విధంగా ఉంటుంది. మూల గ్రంథంలో ఉన్నదానికంటే వివిధ పదాలను వినియోగిస్తాం. అయితే ఒకే అర్థాన్ని కలిగియుండేలా చూస్తాము. మన ప్రజలు అర్థం చేసుకొనేలా పదాలను వినియోగిస్తాము. మన బాషలో సహజంగా ఉండేలా వాటిని వినియోగిస్తాము. మూల గ్రంథంలో ఉన్న విధంగా ఒకే అర్థాన్ని స్పష్టంగానూ, సహజమైన రీతిలో తెలియపరచడం అనువాదం లక్ష్యం.

  • కృతజ్ఞతలు:

: బార్న్‌వెల్ నుండి ఉదాహరణ వాక్యాలు, పేజీలు 19-20, (సి) SIL ఇంటర్నేషనల్ 1986, అనుమతితో ఉపయోగించారు. *