te_ta/translate/translate-problem/01.md

7.9 KiB

సాహిత్య రూపాల అర్థం మారుతుంది

లక్ష్యంగా ఎంచుకొన్న గ్రంధంలో మూల గ్రంధానికి సంబంధించిన నమూనా ఉంటుంది. కొంతమంది అనువాదకులు దీన్ని చేయాలనుకోవచ్చు, ఎందుకంటే "సాహిత్య స్వరూపం ప్రాముఖ్యత" అనే బోధనా కొలప్రమాణoలో మనం చూసినట్లుగా, మూలగ్రంధపు రూపం, మూలగ్రంధ అర్ధాన్ని ప్రభావితం చేస్తుంది. ఏదేమైనా, వివిధ సంస్కృతుల ప్రజలు సాహితీ రూపాల అర్థాన్ని భిన్నంగా అర్థం చేసుకుంటారని మనం గుర్తుంచుకోవాలి. వేర్వేరు సంస్కృతులలో, ఒకే రూపాన్ని వివిధ రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మూల రూపాలను ఉంచడం ద్వారా, జరుగుతున్న మార్పు నుండి మూల అర్థాన్ని రక్షించడం సాధ్యం కాదు. పాత సంస్కృతిలో పాత విధానం చేసినట్లుగా క్రొత్త సంస్కృతిలో పాత అర్థాన్ని రక్షించేందుకు ఉన్న ఏకైక మార్గం, క్రొత్త స్వరూపంలో పాత అర్ధాన్ని మార్చడం.

వేర్వేరు భాషలు విభిన్నమైన పదాలనూ, పద బంధాల క్రమాన్నీ ఉపయోగిస్తాయి

మీరు మీ అనువాదంలో మూల పదాలకు సంబంధించిన క్రమాన్ని ఉంచితే, మీ భాష మాట్లాడే వ్యక్తులు దానిని అర్థం చేసుకోవడం చాలా కష్టం, కొన్నిసార్లు అది అసాధ్యం. మీరు అనువాదానికి లక్ష్యoగా ఎంచుకొన్న మీ భాషకు సంబంధించి కచ్చితంగా సహజమైన పదక్రమాన్ని ఉపయోగించాలి, దాని వలన ప్రజలు మూల వాక్యాన్ని అర్థాన్ని అర్థం చేసుకుంటారు.

వేర్వేరు భాషలు వేర్వేరు జాతీయాలూ, వ్యక్తీకరణలూ ఉపయోగించడం జరుగుతుంది

ప్రతి భాషలో శబ్దాలు లేదా భావోద్వేగాలను సూచించే పదాలకు సంబంధించి దాని స్వంత జాతీయాలూ, ఇతర భావవ్యక్తీకరణలు ఉంటాయి. ఈ క్రమంలో అర్ధాన్ని వ్యక్తీకరించడానికి, మీరు అనువాదం కోసం లక్ష్యంగా ఎంచుకొన్న భాషలో ప్రతిపదాన్ని అనువదించడమే కాకుండా, అదే అర్ధాన్ని కలిగి ఉన్న ఒక జాతీయాన్ని లేదా పరిభాషను ఎంచుకోవాలి. మీరు ప్రతిపదాన్ని అనువదిస్తే వాటి జాతీయంలో లేదా భావంలో తప్పు అర్ధం ఉంటుంది.

కొన్ని పదాలకు సంబంధించి ఇతర సంస్కృతులలో సమానమైన పదాలు లేవు

ఇప్పుడు ఉనికిలో లేని అనేక రూపాలను బైబిలు కలిగి వుంది, పురాతన కాలంలోని బరువులు (స్టేడియా, క్యూబిట్), డబ్బు (దీనారం, స్టేటర్), కొలతలు (హిన్, ఎఫా) వంటి విషయాలలో ఇప్పుడు బైబిలు సరియైన పదాలను కలిగి లేదు. లేఖనాలలో ఉన్న జంతువులు ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉండక పోవచ్చు (నక్క, ఒంటె). ఇతర సంస్కృతులు గురించి కొన్ని సంస్కృతులలో తెలియకపోవచ్చు (మంచు, సున్నతి). అలాంటి పరిస్థితులలో ఈ పదాలకు సమానమైన పదాలను ప్రత్యామ్నాయంగా చూపడం సాధ్యంకాదు. అందువలన అనువాదకుడు మూల అర్థాన్ని తెలియజేయడానికి మరొక మార్గాన్ని కనుగొనాలి.

బైబిలు అర్థం చేసుకోవడానికే ఉద్దేశించబడింది

లేఖనాలు వాటంతటవే అర్థమయ్యేలా ఉద్దేశించబడినది అని సాక్ష్యం ఇస్తుంది. బైబిలు మూడు భాషలలో వ్రాయడం జరిగింది. ఎందుకంటే దేవుని ప్రజలు ఉపయోగించిన భాష వేర్వేరు కాలంలో భిన్నంగా ఉంటుంది. యూదులు ప్రవాసం నుండి తిరిగి వచ్చినప్పుడూ, హీబ్రూ భాషను మరచిపోయారు, యాజకులు పాత నిబంధనలోని పఠనాలను అరామిక్ భాషలోకి అనువదించారు, అందువలన వారు అర్థం చేసుకోగలిగారు (నెహెమ్యా8:8). ఆ తరువాత క్రొత్త నిబంధన సాధారణo కొయినే గ్రీకు భాషలో వ్రాయడం జరిగింది, ఆ రోజుల్లో ఈ భాష హీబ్రూ, అరామిక్, సంప్రదాయ గ్రీకు భాష కంటే కూడా చాలా మంది మాట్లాడే భాష. సాధారణ ప్రజలు హీబ్రూ, అరామిక్ భాషలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది .

ప్రజలు తన మాటను అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నట్లు ఇక్కడ చూపుతున్న విషయాలూ, మరి ఇతర కారణాలు అగుపడుతున్నాయి. కాబట్టి బైబిలులో ఉన్న అర్ధాన్ని మనం అనువదించాలని ఆయన కోరుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది, అయితే దాని రూపాన్ని పునరుత్పత్తి చేయకూడదు. ఎందుకంటే రూపం కంటే కూడా లేఖనాల అర్థం చాలా ప్రాముఖ్యం.