te_ta/translate/figs-order/01.md

5.3 KiB

వర్ణన

వాక్యంలోని భాగాలను వరుస క్రమంలో అమర్చడానికి అన్ని భాషల్లోనూ పధ్ధతి ఉంటుంది. అన్నీ భాషల్లో ఒకేలా ఉండదు. అనువాదకులు తమ భాషలో ఆ క్రమం ఏమిటో తెలిసి ఉండాలి.

ముఖ్య వాక్య భాగాలు

సాధారణంగా వాక్యంలో మూడు మౌలిక భాగాలు ఉంటాయి. కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ సాధారణంగా నామవాచకాలు (అంటే వ్యక్తి, వస్తువులు, భావం మొ.) లేదా సర్వనామాలు. క్రియలు పనిని, స్థితిని సూచిస్తాయి.

కర్త

వాక్యం సాధారణంగా కర్తతో ప్రారంభం అవుతుంది. అది సాధారణంగా అక్కడ వర్ణిస్తున్న ఎదో ఒక పనిని నిర్వహిస్తుంది. కర్త క్రియాత్మకంగా ఉండవచ్చు. అంటే అది ఎదో ఒకటి పాడడం, పని, చెప్పడం మొదలైనవి చేస్తుంది.

  • పీటర్ చక్కగా పాట పాడాడు.

కర్తకు ఏదన్నా జరగ వచ్చు.

  • పీటర్ కు మంచి అన్నం పెట్టారు.

కర్త ను వర్ణించవచ్చు, లేక ఏదన్నా స్థితిలో ఉన్నట్టు, అంటే సంతోషంగా, విచారంగా, కోపంగా ఉన్నట్టు చెప్పవచ్చు.

  • అతడు పొడగరి.
  • బాలుడు సంతోషంగా ఉన్నాడు.

కర్మ

** కర్మ** అంటే కర్త చేసే దానిఇకి గురి అయ్యేది.

  • పీటర్ బంతినితన్నాడు.
  • పీటర్ పుస్తకంచదివాడు.
  • పీటర్ పాటచక్కగా పాడాడు.
  • పీటర్ మంచి అన్నంతిన్నాడు.

క్రియ

క్రియ అనేది జరిగిన పనిని, లేదా స్థితిని చూపిస్తుంది.

  • పీటర్ చక్కగా పాటపాడాడు.
  • పీటర్ పాడుతున్నాడు.
  • పీటర్ పొడవుగా ఉన్నాడు.

కోరదగిన పద క్రమం

భాషలన్నిటికీ కోరదగిన పద క్రమం ఉంటుంది. ఈ “పీటర్ బంతిని తన్నాడు” ఉదాహరణలో కర్త, కర్మ, క్రియ క్రమాన్ని కొన్ని భాషల్లో పాటిస్తారు. ఇంగ్లీషు వంటి కొన్ని భాషల్లో ఈ క్రమం కర్త-క్రియ-కర్మ.

  • పీటర్ తన్నాడు బంతిని.

కొన్ని భాషల్లో క్రమం కర్త-కర్మ-క్రియ.

  • పీటర్ బంతిని తన్నాడు.

మరి కొన్నింటిలో క్రియ-కర్త-కర్మ.

  • తన్నాడు పీటర్ బంతిని.

పద క్రమంలో మార్పులు

పద క్రమం వాక్యం తరహాను బట్టి పదక్రమం మారవచ్చు:

  • ప్రశ్న లేక ఆజ్ఞ
  • స్థితి వర్ణన (అతడు సంతోషంగా ఉన్నాడు. అతడు పొడవుగా ఉన్నాడు.)
  • షరతును వ్యక్తపరుస్తున్నట్టయితే
  • దానికో స్థలం ఉంటే
  • సమయ నిర్ణయం ఉంటే
  • పద్య శైలి అయితే

పద క్రమం ఇలా కూడా మారుతుంది.

  • వాక్యంలో ఎదో ఒక భాగంపై ఊనిక ఉంటే.
  • వాక్యం నిజంగా కర్త ప్రధానం కాకుంటే

అనువాద సూత్రాలు

  • మీ భాషలో పద క్రమంకోరదగిన తెలుసుకోండి.
  • పదక్రమం మార్చడానికి వేరే కారణం ఏదీ లేకపోతే మీ భాషలో కోరదగిన పద క్రమమే ఉపయోగించండి.
  • అర్థం స్పష్టంగా కచ్చితంగా సహజంగా ఉండేలా వాక్యాన్ని తర్జుమా చెయ్యండి.

ఇక్కడ వీడియో చూడవచ్చు rc://*/ta/man/translate/figs-order.