te_ta/translate/figs-litotes/01.md

5.5 KiB

వర్ణన

ద్వంద్వ నకారాలు అంటే మాట్లాడే వాడు రెండు నకారాలు వాడడం ద్వారా బలమైన సకారాత్మకం పలికే భాషాలంకారం. లేక ఒక నకారంతో బాటు తన భావానికి వ్యతిరేక అర్థం ఇచ్చే ఒక పదం జోడించడం. నకరాలకు కొన్ని ఉదాహరణలు "కాదు," "ఏదీ లేదు," "ఎప్పుడూ కాదు" మొదలైనవి. "మంచి" కి వ్యతిరేక పదం "చెడు" కొన్ని సార్లు "అంత కష్టంగా లేదు (not bad)" అంటే బాగానే ఉంది అని అర్థం.

ఇది అనువాద సమస్య అనడానికి కారణాలు

కొన్ని భాషల్లో ద్వంద్వ నకారాలు వాడారు. ఆ బాషలు మాట్లాడే వారికి ద్వంద్వ నకారాలు వాడడం నిజానికి సకార భావాన్ని బలపరుస్తుందని తెలియక పోవచ్చు. డానికి బదులు అది సకార భావాన్ని బలహీన పరుస్తుందని, వమ్ము చేస్తుందని అనుకుంటారు.

బైబిల్ నుండి ఉదాహరణలు

సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం వ్యర్థం కాలేదని, మీకు తెలుసు. (1 తెస్సలోనిక 2:1 TELIRV)

ద్వంద్వ నకారాలు వాడడం ద్వారా పౌలు తాను వారి దగ్గరికి రావడం చాలా ప్రయోజనకరంగా ఉంది అంటున్నాడు.

తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు కాస్తాకూస్తా గాభరాపడ లేదు. (అపో. కా. 12:18 TELIRV)

ద్వంద్వ నకారాలు వాడడం ద్వారా పేతురుకు ఏమి జరిగిందోనని సైనికుల్లో చాలా ఎక్కువ గలిబిలి, ఆందోళన కలిగిందని లూకా రాస్తున్నాడు. (పేతురు చెరసాలలో ఉన్నాడు. సైనికులు కాపలా ఉన్నప్పటికీ దేవా దూత అతణ్ణి బయటికి కొనిపోయినందున తప్పించుకున్నాడు. అందువల్ల వారు గాభరా పడుతున్నారు.)

యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు. (మత్తయి 2:6 TELIRV)

ద్వంద్వ నకారాలు వాడడం ద్వారా ప్రవక్త బేత్లెహేము చాలా ప్రాముఖ్యమైన పట్టణం అవుతుంది అని చెప్పాడు.

అనువాద వ్యూహాలు

ద్వంద్వ నకారాలను పాఠకులు స్పష్టంగా అర్థం చేసుకుంటారనుకుంటే అలానే వాడండి.

  1. నకారంతో అర్థం స్పష్టంగా లేకపోతే సకార అర్థాన్ని బలంగా చెప్పండి.

అనువాద వ్యూహాలు అన్వయానికి ఉదాహరణలు

  1. నకారంతో అర్థం స్పష్టంగా లేకపోతే సకార అర్థాన్ని బలంగా చెప్పండి.
  • ** సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం వ్యర్థం కాలేదని, మీకు తెలుసు. ** (1 తెస్సలోనిక 2:1 TELIRV)
    • " సోదరులారా, మీ దగ్గరికి మేము రావడం చాలా ప్రయోజనకరంగా ఉందని మీకు తెలుసు.
  • ** తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు కాస్తాకూస్తా గాభరాపడ లేదు..** (అపో. కా. 12:18 TELIRV)
    • "తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు చాలా గాభరా పడ్డారు.“
    • " తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు చాలా గాభరా పడ్డారు. “