te_ta/translate/figs-informremind/01.md

11 KiB
Raw Permalink Blame History

కొన్ని భాషల్లో ఒక పదాన్ని, పదబంధాన్ని నామవాచకంతో కలిపి వాడడం ద్వారా ఆ నామవాచకం గురించిన సమాచారం ఇవ్వడం, ఇతరులకు దాన్ని గుర్తు చేయడం ఉంటుంది.

  • మేరీ కొంచెం అన్నంఅందుకు కృతజ్ఞత వ్యక్త పరచిన తన చెల్లెలికి ఇచ్చింది.

"అందుకు కృతజ్ఞత వ్యక్త పరచిన" అనే పదబంధం చెల్లెలు అనే దాని తరువాత వచ్చింది. మేరీ పెట్టిన అన్నానికి చెల్లి ఎలా స్పందించిందో ఇది చెప్పుతున్నది. మేరీకీ ఒకవేళ వేరొక చెల్లి ఉంటే ఆ తేడా ఇక్కడ కనపడడం లేదు. కేవలం ఆ చెల్లి గురించి కొంత అదనపు సమాచారం ఇస్తున్నది.

వర్ణన

కొన్ని భాషల్లో ఒక పదాన్ని, పదబంధాన్ని నామవాచకంతో కలిపి వాడడం ద్వారా ఆ నామవాచకం గురించిన సమాచారం ఇవ్వడం, ఇతరులకు దాన్ని గుర్తు చేయడం ఉంటుంది.

  • మేరీ కొంచెం అన్నంఅందుకు కృతజ్ఞత వ్యక్త పరచిన తన చెల్లెలికి ఇచ్చింది

"అందుకు కృతజ్ఞత వ్యక్త పరచిన" అనే పదబంధం చెల్లెలు అనే దాని తరువాత వచ్చింది. మేరీ పెట్టిన అన్నానికి చెల్లి ఎలా స్పందించిందో ఇది చెప్పుతున్నది. మేరీకీ ఒకవేళ వేరొక చెల్లి ఉంటే ఆ తేడా ఇక్కడ కనపడడం లేదు. కేవలం ఆ చెల్లి గురించి కొంత అదనపు సమాచారం ఇస్తున్నది..

** ఈ పదబంధాలు వాడే కారణాలు**: మనుషులు తరచుగా పైపైన ఎదో సంగతి గుర్తు చెయ్యడం, కొత్త సమాచారం ఇవ్వడం చేస్తుంటారు. తన శ్రోత తాను చెప్పుతున్న వేరొక దానిపై ఎక్కువ ధ్యాస పెట్టాలని వారి ఉద్దేశం. పై ఉదాహరణలో మాట్లాడే వాడు మేరీ చేసినది ముఖ్యంగా చెప్పుతున్నాడు. ఆమె చెల్లి ఎలా స్పందించింది అనే దానిపై కాదు.

** ఇది అనువాద సమస్య అనడానికి కారణాలు: ** వివిధ భాషల్లో శ్రోత ఏ భాగాన్ని ఎక్కువగా గుర్తించాలి అనేది సూచించడానికి రకరకాల విధానాలు ఉంటాయి.

అనువాద సూత్రాలు

  • కొత్త సమాచారం ఇవ్వడానికి, వేరొక సంగతి గుర్తు చెయ్యడానికి మీ భాషలో నామవాచకం తో బాటు వాడదగిన పదాలు, పదబంధాలు లేకపోతే అలాంటి సమాచారాన్ని ఆ వాక్యంలో వేరే భాగంలో ఉంచాలి.
  • దాన్ని కొంత బలహీనమైన రీతిలో చెప్పడానికి ప్రయత్నించండి.
  • ఆలోచించండి: నా భాషలో సమాచారాన్ని బలమైన రీతిలో, బలహీనమైన రీతిలో వ్యక్తం చేయడం ఎలా?

బైబిల్లో నుండి ఉదాహరణలు

మూడో నది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్న హిద్దెకెలు. (ఆది 2:14 TELIRV)

హిద్దెకెలు అనే ఒకే ఒక నది ఉంది. “అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్న" అనే పదబంధం ఈ నది ఎక్కడ ఉన్నదనే దాని గురించి అదనపు సమాచారం అందిస్తున్నది. ప్రారంభ పాఠకులకు అష్షూరు ఎక్కడున్నదో తెలుసుగాబట్టి ఈ సమాచారం సహాయకరంగా ఉండి ఉంటుంది.

కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. (ఆది 6:7 TELIRV)

"నేను సృష్టించిన" అనే పదబంధం దేవునికీ మానవాళికి మధ్యనున్న సంబంధాన్ని తెలుపుతున్నది. మానవజాతిని తుడిచి పెట్టడానికి దేవునికి హప్పు ఉన్నది అనడానికి ఇది కారణం.

మెంఫిస్ పట్టణపు పనికిరాని విగ్రహాలను లేకుండా చేస్తాను. (యెహే 30:13 TELIRV)

విగ్రహాలన్నీ పనికి రానివే. అందుకే దేవుడు వాటిని ధ్వంసం చేస్తాను అంటున్నాడు.

... నీ న్యాయవిధులు మంచివి. (కీర్తనలు 119:39 TELIRV)

దేవుని విధానలన్నీ మంచివే. అందుకే కీర్తనకారుడు ఇలా రాశాడు.

అనువాద వ్యూహాలు

ఒక పదబంధం లేక నామవాచకం ఉద్దేశం అర్థం చేసుకోవాలంటే ఆ రెంటినీ ఒకే చోట పెట్టండి. లేదా అవి రెంటినీ సమాచారం అందించడానికి, వేరేది గుర్తు చెయ్యడానికి ఉపయోగించారని చూపించడానికి ఇక్కడ మరి కొన్ని వ్యూహాలు ఇస్తున్నాము.

  1. సమాచారాన్ని ఆ వాక్యంలో వేరే భాగంలో ఉంచి దాని ప్రయోజనాన్ని తెలిపే పదాలు జోడించండి.
  2. సమాచారాన్ని ఇవ్వడానికి మీ భాషలో బలహీనమైన విధానాన్ని వాడండి. ఒక చిన్న పదం జోడించడం ద్వారా అది ద్వనించే పద్ధతిని మార్చడం ద్వారా దీన్ని చేయవచ్చు. కొన్ని సార్లు బ్రాకెట్లు, కామాలు వంటి విరామ చిహ్నాల సాయంతో స్వరంలోని మార్పులను సూచించవచ్చు.

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

  1. సమాచారాన్ని ఆ వాక్యంలో వేరే భాగంలో ఉంచి దాని ప్రయోజనాన్ని తెలిపే పదాలు జోడించండి.
  • ** పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం. * (కీర్తనలు 31:6 TELIRV) - By saying " పనికిమాలిన విగ్రహాలు” అనడం ద్వారా దావీదు అన్నీ విగ్రహాల గురించీ వ్యాఖ్యానిస్తూ వాటికి మొక్కేవారిని తాను ఎందుకు ద్వేషిస్తున్నాడో చెబుతున్నాడు. పనికిమాలిన విగ్రహాలకు, పనికొచ్చే విగ్రహాలకు అతడు తేడా చెప్పడం లేదు.
    • "విగ్రహాలు పనికిమాలినవి కాబట్టి విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం."
  • **... నీ న్యాయవిధులు మంచివి. * (కీర్తనలు 119:39 TELIRV)
    • ... నీ విధులున్యాయమైనవిగనక అవి మంచివి.
  • ** తొంభై ఏళ్ల శారా పిల్లవాణ్ని కంటుందా? ** (ఆది 17:17-18 TELIRV) - "తొంభై ఏళ్ల" అనే పదబంధం శారా వయసును తెలుపుతున్నది. అబ్రాహాము ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడో ఇది తెలియజేస్తున్నది.అంత వయసు మళ్ళిన స్త్రీ పిల్లలు కంటుందని అతడు అనుకూవడం లేదు.
    • " తొంభై ఏళ్ళు వచ్చినా కూడా శారా పిల్లవాణ్ని కంటుందా?"
  • స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను... (2 సమూ 22:4 TELIRV) యెహోవా ఒక్కడే ఉన్నాడు. "స్తుతికి అర్హుడైన" అనే పదబంధం యెహోవాకు మొర పెట్టడానికి గల కారణాలను ఇస్తున్నది.
    • "నేను యెహోవాకు మొర పెట్టాను. ఎందుకంటే అయన స్తుతికి అర్హుడు.
  1. సమాచారాన్ని ఇవ్వడానికి మీ భాషలో బలహీనమైన విధానాన్ని వాడండి
  • ** మూడో నది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్న హిద్దెకెలు. ** (ఆది 2:14 TELIRV)
    • " మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది.