te_ta/translate/figs-inclusive/01.md

6.3 KiB

వివరణ

కొన్ని భాషలలో “మనం”పదానికి ఒకటి కంటే ఎక్కువ రూపాలు ఉన్నాయి: “నేను మరియు నువ్వు” అనే అర్థాన్నిచ్చే అంతర్గ్రాహ్య రూపం, మరియు “నేను మరియు మరొకరు, అయితే నువ్వు కాదు”అనే అర్థాన్నిచ్చే ప్రత్యేక రూపం. అంతర్గ్రాహ్య రూపంలో మాట్లాడే వ్యక్తీ మరియు ఇతరులూ ఉంటారు. ఇది “మనము,” “మన,” “మనది,”“మనమే”పదాలకు కూడా వర్తిస్తుంది. కొన్ని భాషలలో వీటిలో ప్రతిదానికీ అంతర్గ్రాహ్య రూపాలూ, ప్రత్యేక రూపాలు ఉన్నాయి.

చిత్రాలను చూడండి. కుడి వైపున ఉన్న ప్రజలతో ప్రసంగీకుడు మాట్లాడుతున్నాడు. పసుపురంగుతో పేర్కొన్న పదం అంతర్గ్రాహ్య “మనం,”ప్రత్యేక “మనం” ఎవరో చూపిస్తుంది.

కారణం ఇది ఒక అనువాదం సమస్య

బైబిలు మొదట హీబ్రూ, అరామిక్, గ్రీకు భాషలలో వ్రాయబడింది. ఇంగ్లీషు మాదిరిగా, ఈ భాషలకు “మనం”పదం అంతర్గ్రాహ్య, ప్రత్యేక రూపాలు లేవు. వారి భాషలో “మనం”పదం అంతర్గ్రాహ్య, ప్రత్యేక రూపాలు ఉన్న అనువాదకులు వక్త చెపుతున్న అర్థాన్ని గ్రహించాలి తద్వారా వారు “మనం” పదంలో ఏ రూపాన్ని వినియోగించగలరో వారు నిర్ణయించుకొంటారు.

బైబిలు నుండి ఉదాహరణలు

అంతర్గ్రాహ్యం

ఆ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, మనం నిజముగా బేత్లెహేముకు వెళ్దాం మరియు జరిగిన ఈ విషయం చూద్దాం, ప్రభువు మనకు తెలియజేశాడు. (లూకా 2:15బి ULT)

గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారు “మనకు”అని చెప్పినప్పుడు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న వారిని కలుపుకున్నారు.

ఒకానొక రోజున ఇది జరిగింది, ఆయన మరియు ఆయన శిష్యులూ ఒక పడవ ఎక్కారు, “మనం సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి”అన్నాడు. వారు పడవ సరస్సులోకి త్రోసి బయలుదేరారు. (లూకా 8:22 ULT)

యేసు “మనం”అని చెప్పినప్పుడు, ఆయన తననూ, మరియు తాను మాట్లాడుతున్న శిష్యులనూ సూచిస్తున్నాడు, కాబట్టి ఇది అంతర్గ్రాహ్య రూపం.

ప్రత్యేకం

మేము దానిని చూచాము మరియు మేము దానిని గురించి సాక్ష్యం చెపుతున్నాం, తండ్రిదగ్గర ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ శాశ్వత జీవాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. (1 యోహాను 1:2బి ULT)

యేసును చూడని మనుష్యులకు తానూ, ఇతర అపొస్తలులూ చూచిన యేసును గురించి యోహాను చెపుతున్నాడు. కాబట్టి “మేము” మరియు “మాకు” పదాల ప్రత్యేక రూపాలు ఉన్న బాషలు ఈ వచనంలో ప్రత్యేక రూపాలను వినియోగిస్తాయి.

అందుకు వారు ఇలా చెప్పారు, “మేము వెళ్ళి ఈ ప్రజలందరికోసం వెళ్లి మరియు భోజనం కొనకుండా ఉంటే మన దగ్గర ఉన్నది అయిదు రొట్టెలు రెండు చేపలూ. మరేమీ లేదు.” (లూకా 9:13 ULT)

ప్రధమ ఉపవాక్యంలో, శిష్యులు తమ మధ్య ఎంత ఆహారం ఉందో యేసుకు చెపుతున్నారు, కాబట్టి ఈ “మన”పదం అంతర్గ్రాహ్య రూపం లేదా ప్రత్యేక రూపంగా ఉండవచ్చు. రెండవ ఉపవాక్యంలో శిష్యులు వారిలో కొందరు ఆహారాన్ని కొనడానికి వెళ్ళబోతున్నారని మాట్లాడుతున్నారు, తద్వారా “మేము” పదం ప్రత్యేక రూపం అవుతుంది, ఎందుకంటే యేసు ఆహారం కొనడానికి వెళ్ళడు.