te_ta/translate/figs-hypo/01.md

15 KiB
Raw Permalink Blame History

ఈ వాక్యాలను పరిశీలించండి: “సూర్యుడు ప్రకాశించడం ఆగిపోతే...”, “సూర్యుడు ప్రకాశించడం ఆగిపోతే ఏమౌతుంది...” మరియు “సూర్యుడు ప్రకాశించడం ఆగిపోకుండా ఉన్నట్లయితే.” ఊహాత్మక పరిస్థితులను తయారుచేయడానికి ఇటువంటి మనం అలాంటి వ్యక్తీకరణలను ఉపయోగిస్తాము, ఏమి జరిగి ఉంటుందో అని ఊహించడం, లేదా భవిష్యత్తులో ఏమి జరగబోతుంది, అయితే ఏమీ జరుగక పోవచ్చు. మన విచారాన్ని లేదా శుభములను వ్యక్తపరచదానికి కూడా వీటిని వినియోగిస్తాము. ఊహాత్మక వ్యక్తీకరణలు బైబిలులో తరచుగా జరుగుతాయి. మీరు (అనువాదకులు) ఈ సంఘటన వాస్తవానికి జరగలేదని ప్రజలకు తెలుసుకొనేలా వాటిని అనువదించాలి మరియు ఈ సంఘటన ఎందుకు ఊహించబడిందో వారు అర్థం చేసుకుంటారు.

వివరణ

ఊహాత్మక పరిస్థితులు వాస్తవమైన పరిస్థితులు కావు. అవి గతంలోగానీ, వర్తమానంగానీ లేదా భవిష్యత్తులో గానీ ఉండవచ్చు. గతంలోనూ, ప్రస్తుతంలోనూ ఉన్న పరిస్థితులు సంభవించలేదు. భవిష్యత్తులో జరిగేవికూడా జరగేవిగా ఉండవు.

ప్రజలు కొన్నిసార్లు పరిస్థితుల గురించి చెపుతారు, ఆ షరతులు నెరవేరినట్లయితే ఏమి జరుగబోతుందో చెపుతారు. అయితే ఈ విషయాలు జరగలేదని లేదా బహుశా జరగబోవనీ వారికి తెలుసు. (షరతులు “అయితే.” పదంతో ప్రారంభమయ్యే వాక్యాలను కలిగి ఉంటాయి)

  • అతను వంద సంవత్సరాల వయస్సు వరకూ జీవించి ఉండి ఉంటే, అతను తన మనవడి మనవడిని చూసేవాడు. (అయితే అతను అలా జీవించలేదు.)
  • అతను వంద సంవత్సరాల వయస్సు వరకూ జీవించి ఉండి ఉంటే అతను ఈనాటికీ జీవించి ఉండేవాడు. (అయితే అతను జీవించలేదు.)
  • అతను వంద సంవత్సరాల వయస్సు వరకూ జీవించి ఉండి ఉంటే, అతను తన మనవడి మనవడిని చూస్తాడు. (అయితే అతను బహుశా అలా చేయడు.)

ప్రజలు కొన్నిసార్లు జరగని లేదా జరుగుతాయని ఎదురుచూడని విషయాల గురించి కోరికలు వ్యక్తం చేస్తారు.

  • అతను వచ్చియుంటాడని నేను కోరుకుంటున్నాను.
  • అతను ఇక్కడ ఉంటాడని నేను కోరుకుంటున్నాను.
  • అతను రావాలని కోరుకుంటున్నాను.

ప్రజలు కొన్నిసార్లు జరగని లేదా జరుగుతాయని ఎదురుచూడని విషయాల గురించి విచారాన్ని వ్యక్తం చేస్తారు.

  • అతను వచ్చి ఉండి ఉంటే.
  • అతను ఇక్కడ ఉండి ఉంటే.
  • అతను ఒకవేళ వచ్చి ఉండి ఉంటే

కారణం ఇది ఒక అనువాదం సమస్య

  • అనువాదకులు బైబిలులోని వివిధ రకాల ఊహాత్మక పరిస్థితులను గుర్తించాల్సిన అవసరం ఉంది, అవి అవాస్తవమని అర్థం చేసుకోవాలి.
  • అనువాదకులు వివిధ రకాలైన ఊహాత్మక పరిస్థితుల గురించి మాట్లాడడంలో వారి స్వంత భాష యొక్క విధానాలను తెలుసుకోవాలి.

బైబిలు నుండి ఉదాహరణలు

గతంలో ఉన్న ఊహాత్మక పరిస్థితులు

కొరాజీనా నీకు శ్రమ, బేత్సయిదా నీకు శ్రమ, తూరు సీదోను పట్టణములలో మీ మధ్యను చేయబడిన అద్భుతములు చేయబడిన యెడల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. (మత్తయి 11:21 ULT)

ఇక్కడ మత్తయి 11:21, యేసు చెప్పాడు, తూరు సీదోనుల పురాతన పట్టణములలోని ప్రజలు ఆయన జరిగించిన అద్భుతములను చూచిన యెడల వారు చాలా కాలం క్రితమే పశ్చాత్తాపపడి యుండేవారు. తూరు, సీదోను ప్రజలు వాస్తవానికి ఆయన అద్భుతాలు చూసారు, మరియు పశ్చాత్తాపపడలేదు. ఆయన అద్భుతాలను చూసారు మరియు అయినా పశ్చాత్తాపపడని కొరాజీనా, బేత్సయిదా ప్రజలను గద్దించడానికి ఆయన దీనిని చెప్పాడు.

అప్పుడు మార్త యేసుతో చెప్పింది, “ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చనిపోయి ఉండడు.” (యోహాను 11:21 ULT)

తన సోదరుడు చనిపోకుండా ఉండటానికి యేసు త్వరగా వచ్చి ఉండాలని ఆమె కోరికను వ్యక్తపరచడానికి మార్తా ఇలా చెప్పింది. యేసు త్వరగా రాలేదు మరియు ఆమె సోదరుడు చనిపోయాడు.

ప్రస్తుతంలో ఊహాత్మక పరిస్థితులు

ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; **అయితే ఆ విధంగా చేసిన యెడల, క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, మరియు రసము కారిపోవును, మరియు తిత్తులును పాడవుతాయి. **(లూకా 5:37 ULT)

ఒక వ్యక్తి క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఉంచిన యెడల జరగబోతున్నదానిని గురించి యేసు చెప్పాడు. అయితే ఎవరూ ఆ విధంగా చేయరు. కొన్ని సమయాలలో కొత్త వాటిని పాతవాటితో మిశ్రమం చెయ్యడం అజ్ఞానం అని చూపించడానికి ఒక ఉదాహరణగా ఈ ఊహాత్మక పరిస్థితిని ఆయన ఉపయోగించాడు. ప్రజలు ఆచారంగా చేసిన ఉపవాసాన్ని తన శిష్యులు ఎందుకు ఆచరిన్చారో ప్రజలు తెలుగుకోడానికి ఆయన ఈ విధంగా చేసాడు.

యేసు వారితో చెప్పాడు, “మీలో ఏ మనుష్యునికైనను ఒక గొఱ్ఱ ఉండి ఒకవేళ అది విశ్రాంతిదినమున గుంటలో పడిన యెడల దాని పట్టుకొని పైకి తీయడా? (మత్తయి 12:11 ULT)

ఒకని గొఱ్ఱ విశ్రాంతి దినమున ఒక గుంటలో పడినయెడల వారు ఏమి చేస్తారు అని యేసు మతనాయకులను అడిగాడు. వారి గొఱ్ఱ గుంటలో పడుతుందని ఆయన వారితో చెప్పడం లేదు. విశ్రాంతి దినమున ప్రజలను స్వస్థపరిచినందుకు తనను తీర్పు తీర్చడం తప్పు అని వారికి చూపించడానికి ఆయన ఈ ఊహాత్మక పరిస్థితిని ఉపయోగించాడు.

భవిష్యత్తులో ఊహాత్మక పరిస్థితి

ఆ దినములు తక్కువ చేయబడకపోతే యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. అయితే ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. (మత్తయి 24:22 ULT)

చాలా చెడ్డ విషయాలు జరిగబోతున్న భవిష్యత్తు సమయం గురించి యేసు మాట్లాడుతున్నాడు. ఆ శ్రమల రోజులు చాలా కాలం కొనసాగితే ఏమి జరుగుతుందో ఆయన చెప్పాడు. ఆ రోజులు ఎంత ఘోరంగా ఉంటాయో చూపించడానికి అయన ఇలా చేశాడు అవి ఎక్కువ కాలం కొనసాగిన యెడల చాలా చెడుగా ఉంటాయి, ఎవరూ రక్షింపబడరు. అయితే, ఆ శ్రమల రోజులను దేవుడు తగ్గిస్తాడని, తద్వారా ఎన్నుకోబడినవారు (తాను ఎన్నుకున్నవారు) రక్షింపబడతారని ఆయన స్పష్టం చేశాడు.

ఒక ఊహాత్మక పరిస్థితిని గురించి భావోద్రేకాన్ని వ్యక్తపరచడం

ప్రజలు కొన్నిసార్లు విచారాలనూ, కోరికలనూ వ్యక్తీకరించడానికి ఊహాత్మక పరిస్థితులను గురించి మాట్లాడుతారు. పశ్చాత్తాపం గతం గురించి మరియు కోరికలు వర్తమానం మరియు భవిష్యత్తు గురించి వ్యక్తపరుస్తారు.

ఇశ్రాయేలీయులు వారితో చెప్పారు, “**మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన మేము చనిపోయి ఉన్నయెడల బాగుండేది. ** ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరి.” (నిర్గమ 16:3 ULT)

ఇక్కడ ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఆకలితో శ్రమపడవలసి ఉంది మరియు చనిపోవలసిఉందని భయపడ్డారు, కాబట్టి వారు ఐగుప్తులో ఉండి కడుపు పూర్తిగా నిండి అక్కడే చనిపోవాలని వారు కోరుకున్నారు. ఇది జరగలేదని విచారం వ్యక్తం చేస్తూ వారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు.

నీ చేసిన క్రియలను నేనెరుగుదును, మరియు నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; **నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండాలని నేను కోరుకుంటున్నాను! ** (ప్రకటన 3:15 ULT)

మనుష్యులు చల్లగానైనను వెచ్చగానైనను ఉండాలని యేసు కోరుకున్నాడు. ఆయన వారిని గద్దిస్తున్నాడు, ఈ విషయంలో కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు.

అనువాదం వ్యూహాలు

మీ భాష మాట్లాడే వ్యక్తులు ఏవిధంగా చూపిస్తారో కనుగొనండి:

  • ఏదో జరిగి ఉండవచ్చు, కానీ జరగలేదు.
  • ఇప్పుడు ఏదో నిజం కావచ్చు, కానీ అది కాదు.
  • భవిష్యత్తులో ఏదో జరగవచ్చు, కానీ ఏదైనా మార్పు జరిగితే తప్ప జరుగదు.
  • వారు ఏదో కోరుకుంటారు, కానీ అది జరగదు.
  • ఏదో జరగలేదని వారు చింతిస్తున్నారు.

ఈ రకమైన విషయాలను చూపించే మీ భాష యొక్క మార్గాలను ఉపయోగించండి.

మీరు http://ufw.io/figs_hypo వద్ద వీడియోను కూడా చూడవచ్చు.