te_ta/translate/figs-genericnoun/01.md

7.8 KiB
Raw Permalink Blame History

వర్ణన

సాధారణ నామవాచక పదబంధాలు అంటే ఇదమిద్ధం కాకుండా సాధారణ వ్యక్తులు, విషయాలు. ఇది సాధారణంగా సామెతల్లో కనిపిస్తుంది, ఎందుకంటే , సాధారణంగా మనుషులందరికీ సరిపడిన సత్యాలు అందులో ఉంటాయి.

ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కాలకుండా ఉంటాయా?  తన పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు ఆ విధంగానే నాశనం అవుతాడు. ఆమెను తాకిన వాడికి శిక్ష తప్పదు. (సామెత 6:28 TELIRV)

అండర్ లైన్ చేసిన పదబంధాలు ఎవరో ఒక మనిషినీ ఉద్దేశించి రాసినవి కావు. ఇలాంటివి చేసిన అందరి గురించీ రాసినవి.

ఇది అనువాద సమస్య అనడానికి కారణాలు

వివిధ భాషల్లో నామవాచక పదబంధాలను సాధారణ విషయానికి వర్తింపజేసే పద్ధతులు ఉంటాయి. అనువాదకులు ఈ సాధారణ అంశాలను తమ భాషలో సహజంగా ఉండే విధానాల్లో ఉపయోగించాలి.

బైబిల్ నుండి ఉదాహరణలు

ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు. (సామెత 11:8 TELIRV)

పై వచనంలో అండర్ లైన్ చేసిన పదబంధాలు ఎవరి గురించీ ప్రత్యేకంగా చెప్పినవి కాదు. సరిగా ప్రవర్తించని వారందరికీ ఈ మాటలు వర్తిస్తాయి.

ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి. (సామెత 11:26 TELIRV)

ఇది ఒక మనిషిని ఉద్దేశించినది కాదు. ధాన్యం అమ్మకుండా నిల్వ చేసే వారి గురించి సాధారణంగా చెప్పినది.

నీతిమంతుణ్ణి, యెహోవా దయతో చూస్తాడు. చెడ్డ తలంపులు మనసులో ఉంచుకున్నవాణ్ణి, ఆయన నేరస్తుడిగా ఎంచుతాడు. (సామెత 12:2 TELIRV)

నీతిమంతుడు అనే మాట ప్రత్యేకంగా ఎవరికీ వర్తించడం లేదు, మంచి వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పిన మాట. అలానే చెడ్డ తలంపులు మనసులో ఉంచుకున్నవాణ్ణి అనేది ప్రత్యేకంగా ఎవరికీ వర్తించడం లేదు, చెడ్డ వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్పిన మాట

అనువాద వ్యూహాలు

మీ భాషలో సాధారణంగా ఇదమిద్ధంగా కాక సాధారణంగా మనుషులు విషయాలు గురించి చెప్పడంలో TELIRV లో రాసినట్టే రాయండి. మీరు ఉపయోగించ గలిగే కొన్ని వ్యూహాలు.

  1. నామవాచక పదబంధంలో “ఒక” అనే పదం వాడండి.
  2. నామవాచక పదబంధంలో ‘ఒక” అనే పదం వాడండి.
  3. "ఎవరైనా" లేక "ఎవరైతే" అనే పదం వాడండి.
  4. “మనుషులు” వంటి బహువచనం వాడండి.
  5. మీ భాషలో సహజంగా ధ్వనించే ఏ పద్దతి అయిన వాడండి.

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

  1. నామవాచక పదబంధంలో “ఒక” అనే దాన్ని వాడండి.
  • నీతిమంతుణ్ణి, యెహోవా దయతో చూస్తాడు. చెడ్డ తలంపులు మనసులో ఉంచుకున్నవాణ్ణి, ఆయన నేరస్తుడిగా ఎంచుతాడు. (సామెత 12:2 TELIRV)
    • "నీతిమంతుణ్ణి, యెహోవా దయతో చూస్తాడు. చెడ్డ తలంపులు మనసులో ఉంచుకున్నవాణ్ణి, ఆయన నేరస్తుడిగా ఎంచుతాడు." (సామెత 12:2)
  1. నామవాచక పదబంధంలో “ఒక” అనే దాన్ని వాడండి.
  • ** ధాన్యం అక్రమంగా నిల్వ చేసే మనిషిని ప్రజలు శపిస్తారు.** (సామెత 11:26 TELIRV)
    • " ధాన్యం అక్రమంగా నిల్వ చేసే మనిషిని ప్రజలు శపిస్తారు."
  1. "ఎవరైనా" లేక "ఎవరైతే" అనే పదం వాడండి."
  • ** ధాన్యం అక్రమంగా నిల్వ చేసే మనిషిని ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి.** (సామెత 11:26 TELIRV)
    • " ధాన్యం అక్రమంగా నిల్వ చేసే ఎవరినైనా ప్రజలు శపిస్తారు.
  1. “మనుషులు” వంటి బహువచనం వాడండి. (లేదా ఈ వాక్యంలో వాడినట్టు “వ్యక్తులు” అనే అర్థం ఇచ్చే పదం వాడండి).
  • ** ధాన్యం అక్రమంగా నిల్వ చేసే మనిషిని ప్రజలు శపిస్తారు. ** (సామెత 11:26 TELIRV)
    • " ధాన్యం అక్రమంగా నిల్వ చేసే మనుషులను ప్రజలు శపిస్తారు. "

మీ భాషలో సహజంగా ధ్వనించే ఏ పద్దతి అయిన వాడండి

  • ** ధాన్యం అక్రమంగా నిల్వ చేసే మనిషిని ప్రజలు శపిస్తారు. ** (సామెత 11:26 TELIRV)
    • "ఎవరైతే ధాన్యం అక్రమంగా నిల్వ చేస్తారో అలాంటి మనిషిని ప్రజలు శపిస్తారు."