te_ta/translate/figs-gendernotations/01.md

9.4 KiB
Raw Permalink Blame History

బైబిల్ లో కొన్ని చోట్ల “పురుషులు” సహోదరులు” “కుమారులు” అనే పదాలు పురుషులకు మాత్రమే వర్తిస్తాయి. మరి కొన్ని చోట్ల స్త్రీ పురుషులకు వర్తిస్తాయి. స్త్రీ పురుషులను ఉద్దేశించి రచయిత రాస్తున్నట్టయితే అనువాదకులు వాడిన పదం కేవలం పురుషులకు మాత్రమే వర్తించేదిగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి.

వర్ణన

కొన్ని భాషల్లో పురుషులకు సాధారణంగా వర్తించే పదాలను సాధారణ రీతిలో స్త్రీ పురుషులకు కూడా వాడవచ్చు. ఉదాహరణకు బైబిల్ కొన్ని సార్లు సహోదరులు' అని చెప్పినప్పుడు అది సోదరీ సోదరులకు వర్తిస్తుంది.

కొన్ని భాషల్లో, పుంలింగ సర్వనామాలు "అతడు" "అతని" అనే వాటిని మరింత సాధారణ రీతిలో స్త్రీ పురుష భేదం లేకపోతే గనక ఎవరికైనా వాడవచ్చు. ఈ క్రింది ఉదాహరణలో "అతని" అనే సర్వనామం వాడారు గానీ అది పురుషులకు మాత్రమే పరిమితం కాదు.

జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు. (సామెత10:1 TELIRV)

ఇది అనువాద సమస్య అనడానికి కారణం

  • కొన్ని సంస్కృతుల్లో "మనిషి" "సోదరుడు," "కుమారుడు" వంటి పదాలు పురుషులకు మాత్రమే వర్తిస్తాయి. అనువాదంలో మరింత విస్తృత రీతిలో ఉపయోగిస్తే ఈ పదం స్త్రీలకు కూడా వర్తించే అవకాశం ఉన్నట్టు పాఠకులు అర్థం చేసుకుంటారు.
  • కొన్ని సంస్కృతుల్లో, పుంలింగ సర్వనామాలు "అతడు" "అతనికి" అనేవి పురుషులకు మాత్రమే వర్తిస్తాయి. పుంలింగ సర్వనామం వాడితే అక్కడ చెప్పినది స్త్రీలకు వర్తించదు అని అనుకుంటారు.

అనువాద సూత్రాలు

ఒక మాట స్త్రీ పురుషులకు వర్తించేదైతే అలా ఇద్దరికీ వర్తిస్తుంది అని అర్థమయ్యేలా తర్జుమా చెయ్యండి.

బైబిల్ నుండి ఉదాహరణలు

సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలోని సంఘాల పై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం. (2 కొరింతి 8:1 TELIRV)

ఈ వచనం కొరింతి నగర విశ్వాసులకు రాసింది. కేవలం పురుషులకు మాత్రమే కాదు. స్త్రీ పురుషులిద్దరికీ. **.

అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకొని, తన సిలువను మోసుకుంటూ రావాలి. (మత్తయి 16:24-26 TELIRV)

యేసు ఇక్కడ కేవలం పురుషులకు మాత్రమే కాదు.** స్త్రీ పురుషులిద్దరికీ** చెప్పుతున్నాడు.

** గమనిక**: కొన్ని సార్లు ప్రత్యేకించి పురుషులను మాత్రమే ఉద్దేశించి పుంలింగ పదాలు వాడతారు. అవి స్త్రీలకు కూడా వర్తిస్తాయి అనిపించే పదాలు వాడవద్దు. ఈ క్రింద అండర్ లైన్ చేసినవి కేవలం పురుషులకే.

ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి’ అని మోషే చెప్పాడు. (మత్తయి 22:24 TELIRV)

అనువాద వ్యూహాలు

“మనిషి” “సోదరుడు” “అతడు” వంటే పుంలింగ పదాలు స్త్రీలకు కూడా వర్తిస్తాయని పాఠకులకు అర్థం అయితే వాటిని వాడండి. లేకుంటే స్త్రీలకు వర్తిస్తుందని తెలిసేలా కొన్ని అనువాద విధానాలు ఉన్నాయి.

  1. స్త్రీ పురుషులిద్దరికీ వాడదగిన నామవాచకాలు వాడండి.
  2. స్త్రీ పురుషులిద్దరికీ వాడదగిన నామవాచకాలు వాడండి.
  3. స్త్రీ పురుషులిద్దరికీ వాడదగిన నామవాచకాలు వాడండి

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

  1. స్త్రీ పురుషులిద్దరికీ వాడదగిన నామవాచకాలు వాడండి.
  • ** బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు. ** (ప్రసంగి 2:16 TELIRV)
    • "బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు "
    • " బుద్ధిహీనుడు చనిపోయినట్టే జ్ఞానం గల వారు కూడా చనిపోతారు.
  1. స్త్రీ పురుషులిద్దరికీ వాడదగిన నామవాచకాలు వాడండి.
  • **సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. ** (2 కొరింతి 1:8) పౌలు స్త్రీ పురుషులిద్దరికీ రాస్తున్నాడు.
    • " u>సోదరసోదరీలారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు." (2 కొరింతి 1:8)
  1. స్త్రీ పురుషులిద్దరికీ వాడదగిన నామవాచకాలు వాడండి.
  • ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకొని, తన సిలువను మోసుకుంటూ రావాలి." (మత్తయి 16:24 TELIRV) ఇంగ్లీషు మాట్లాడేవారు పుంలింగ ఏకవచన సర్వనామాలను అంటే “అతడు” “అతని” మొదలైన వాటిని పుంలింగ బహువచనాలుగా చెప్పగలుగుతారు. కేవలం పురుషులకే గాక మనుషులందరికీ ఇది వర్తిస్తుందని చూపగలుగుతారు.
    • "ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వారు తమను తాము తిరస్కరించుకొని, తమ సిలువను మోసుకుంటూ రావాలి."**