te_ta/translate/figs-extrainfo/01.md

6.5 KiB
Raw Permalink Blame History

ఉహా పరిజ్ఞానాన్ని అవ్యక్త సమాచారాన్ని స్పష్టంగా చెప్పడం కొన్ని సార్లు మంచిది కాదు.

వర్ణన

కొన్ని సార్లు ఉహా పరిజ్ఞానాన్ని అవ్యక్త సమాచారాన్ని స్పష్టంగా చెప్పడం మంచిది కాదు. ఇది చెయ్యకుండా ఉండే పద్ధతులు ఈ పేజీ సూచిస్తున్నది.

అనువాద సూత్రాలు

  • మాట్లాడే వాడు, లేక రచయిత దేన్నైనా కావాలనే అస్పష్టంగా వదిలేస్తే, దాన్ని మరింత స్పష్టంగా చెయ్యడానికి ప్రయత్నించ వద్దు.
  • మాట్లాడుతున్నవాడు చెబుతున్నది మూల శ్రోతలకు సరిగ్గా అర్థం కాకపోతే మీ పాఠకులకు అది స్పష్టంగా అర్థం అయ్యేలా చెయ్యవద్దు. అలా చేస్తే మూల శ్రోతలకు ఈ సంగతి ఎందుకు అర్థం కాలేదు? అని మీ పాఠకులు అనుకోవచ్చు.
  • ఉహా పరిజ్ఞానాన్ని అవ్యక్త సమాచారాన్ని స్పష్టంగా చెప్పవలసి వస్తే మీ పాఠకులు ఆనాటి మూల శ్రోతలకు ఇలాటివి స్పష్టంగా చెబుతే బాగుండేది కదా అనుకొనేలా ఉండకూడదు.
  • సందేశాన్ని చెల్లాచెదరు చేసే విధంగా దాన్ని స్పష్టం చెయ్యవద్దు. అసలు విషయం పాఠకులకు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది.
  • మీ పాఠకులకు ఇప్పటికే అర్థం అయితే గనక ఉహా పరిజ్ఞానాన్ని అవ్యక్త సమాచారాన్ని స్పష్టంగా చెప్పా వద్దు.

బైబిల్ నుండి ఉదాహరణలు

“తినే దాంట్లోనుండి తిండి వచ్చింది. బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” (న్యాయాధి 14:14 TELIRV)

ఇది పొడుపు కథ. కావాలనే సంసోను తన శత్రువులకు అర్థం కాకుండా ఉండాలని ఇలా చెప్పాడు. కాబట్టి తినేది బలమైనది సింహం అనీ తీపి అంటే తేనె అనీ స్పష్టం చెయ్యవద్దు.

అప్పుడు యేసు, “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో అన్నాడు. అయితే శిష్యులు “మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు” అని తమలో తాము చర్చించుకున్నారు." … (మత్తయి 16:6,7 TELIRV)

ఇక్కడ బహుశా ఆవ్యక్త జ్ఞానం ఏమిటంటే పరిసయ్యుల, సద్దూకయ్యుల దుర్బోదల విషయం శిష్యులకు తెలిసి ఉండాలి. కానీ యేసు శిష్యులు ఇది అర్థం చేసుకోలేదు. యేసు మామూలు రొట్టె, పులి పిండి గురించి మాట్లాడుతున్నాడని వారు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ పులి పిండి అంటే దుర్బోధ అని స్పష్టంగా చెప్పడం సరి కాదు. మత్తయి 16:11 లో యేసు చెప్పినది వినే దాకా ఆయన మాటల్లో భావం ఏమిటో శిష్యులకు అర్థం కాలేదు.

"నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో చెప్పాడు. అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు. (మత్తయి 16:11,12 TELIRV)

తాను మామూలు రొట్టె గురించి మాట్లాడడం లేదని యేసు వివరణ ఇచ్చాకే శిష్యులు ఆయన పరిసయ్యుల, సద్దూకయ్యుల దుర్బోధ గురించి మాట్లాడుతున్నాడని గ్రహించారు. కాబట్టి మత్తయి 16:6లోని అవ్యక్త సమాచారాన్ని స్పష్టంగా చెప్పడం పొరపాటు.

అనువాద వ్యూహాలు

ఈ పేజీ లో అనువాద వ్యూహాలు ఏమీ లేవు.

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

ఈ పేజీలో అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు ఏమీ లేవు.