te_ta/translate/figs-exclusive/01.md

6.8 KiB

కొన్ని భాషలలో “మేము”పదానికి ఒకటి కంటే ఎక్కువ రూపాలు ఉన్నాయి: అంతర్గ్రాహ్య రూపం అంటే “నేను మరియు మీరు”అని అర్ధం మరియు ప్రత్యేకమైన రూపం అంటే “నేను మరియు మరొకరు కాని మీరు కాదు”అని అర్ధం. ప్రత్యేకమైన రూపం మాట్లాడుతున్న వ్యక్తిని మినహాయిస్తుంది. అంతర్గ్రాహ్య రూపం మాట్లాడుతున్న వ్యక్తిని కలుపుకొంటుంది, సాధ్యమైనట్లయితే ఇతరులను కలుపుకొంటుంది. “మన(లను)/(మాకు)” “మన,” “మాది (మనది)”మరియు “మేమే”పదాల విషయంలో కూడా ఇది వాస్తవం. కొన్ని భాషలలో వీటిలో ప్రతిదానికీ అంతర్గ్రాహ్య రూపాలు మరియు ప్రత్యేకమైన రూపాలు ఉన్నాయి. ఈ పదాల కోసం ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్య రూపాలతో కూడిన భాషలు కలిగి ఉన్న అనువాదకులు వక్త ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలి, తద్వారా వారు ఏ రూపాన్ని ఉపయోగించాలో నిర్ణయించుకోవచ్చు.

చిత్రాలు చూడండి. కుడి వైపున ఉన్నప్రజలు వక్త మాట్లాడుతున్న వ్యక్తులు. పసుపు రంగు అంతర్గ్రాహ్య “మేము”మరియు ప్రత్యేకమైన “మేము” ఎవరిని సూచిస్తుందో చూపిస్తుంది.

!

!

కారణం ఇది ఒక అనువాదం సమస్య

బైబిలు మొదట హీబ్రూ, అరామిక్ మరియు గ్రీకు భాషలలో వ్రాయబడింది. ఇంగ్లీషు మాదిరిగా, ఈ భాషలకు “మేము” కోసం ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్యమైన రూపాలు లేవు. మీ భాషకు “మేము”పదానికి ప్రత్యేకమైన మరియు అంతర్గ్రాహ్య రూపాలు ఉంటే, అప్పుడు వక్త చెపుతున్నదేమిటో మీరు అర్థం చేసుకోవాలి, తద్వారా “మేము”విషయంలో ఏ రూపాన్ని ఉపయోగించాలో మీరు నిర్ణయించుకోవచ్చు.

బైబిలు నుండి ఉదాహరణలు

వారు చెప్పారు, “మన యొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలు కంటే ఎక్కువేమీ లేవు - మేము వెళ్లి మరియు యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొంటే తప్ప. (లూకా 9:13 ULT)

ద్వితీయ ఉపవాక్యంలో శిష్యులు వారిలో కొందరు ఆహారాన్ని కొనడానికి వెళ్ళబోతున్నారని మాట్లాడుతున్నారు, తద్వారా “మనం”ప్రత్యేకమైన రూపంలో ఉంటుంది, ఎందుకంటే యేసు ఆహారం కొనడానికి వెళ్ళడు.

మేము దానిని చూచాము, మరియు మేము దానికి సాక్ష్యం ఇస్తున్నాము. మేము మీకు నిత్య జీవమును ప్రకటించుచున్నాము, అది తండ్రియొద్ద ఉండి మరియు అది మాకు ప్రత్యక్షపరచబడింది. (1 యోహాను 1:2 ULT)

యేసును చూడని ప్రజలకు తానూ మరియు ఇతర అపొస్తలులు ఏమి చూసారో యోహాను చెపుతున్నాడు. కాబట్టి “మేము”మరియు “మనలను”యొక్క ప్రత్యేక రూపాలను కలిగి ఉన్న భాషలు ఈ వచనంలో ప్రత్యేక రూపాలను ఉపయోగిస్తాయి.

గొఱ్ఱెల కాపరులు యొకనితోనొకడు చెప్పుకొన్నారు, “మనం ఇప్పుడు బేత్లెహేముకు వెళ్దాం, మరియు జరిగిన యీ కార్యమును చూద్దాం, దానిని ప్రభువు మనకు తెలియజేయించి యున్నాడు. (లూకా 2:15బి ULT)

గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వారు “మనకు” అని చెప్పినప్పుడు వారు తాము మాట్లాడుతున్నవారిని కలుపుకొంటున్నారు - ఒకరితో ఒకరు.

ఆ రోజుల్లో ఒకరోజున ఇది జరిగించి, ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెలోనికి ఎక్కాడు, మరియు ఆయన వారితో చెప్పాడు, “మనం సరస్సు అద్దరికి వెళ్దాం.” కాబట్టి వారు బయలుదేరారు. (లూకా 8:22 ULT)

యేసు “మనకు” అని చెప్పినప్పుడు, ఆయన తననూ మరియు తాను మాట్లాడుతున్న శిష్యులనూ సూచిస్తున్నాడు, కాబట్టి ఇది అంతర్గ్రాహ్య రూపం.