te_ta/translate/figs-exclamations/01.md

10 KiB
Raw Permalink Blame History

వర్ణన

ఆశ్చర్యం, ఆనందం, కోపం, భయం వంటి తీవ్రమైన భావాలను వెల్లడించేవి ఆశ్చర్యార్థకాలు. TELIRVలోనూ USTలోనూ సాధారణంగా వాక్యం చివర్లో ఆశ్చర్యార్థక గుర్తు తో వీటిని సూచిస్తారు. ఇది ఆశ్చర్యార్థకం అని ఈ గుర్తు తెలియజేస్తుంది. ఆ పరిస్థితి, అక్కడ వ్యక్తులు పలికిన మాట వారు వ్యక్త పరుస్తున్న భావాలను తెలుపుతాయి. ఈ క్రింది ఉదాహరణలో మత్తయి 8లో వ్యక్తులు హడలిపోయారు. మత్తయి 9లోని ఉదాహరణలో వ్యక్తులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారు ఇంతకు ముందెన్నడూ చూడనిది జరిగింది.

“ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” (మత్తయి 8:25 TELIRV)

దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు!" (మత్తయి 9:33 TELIRV)

ఇది అనువాద సమస్య అనడానికి కారణం

ఒక వాక్యం తీవ్రమైన భావావేశాన్నితెలుపుతున్నదని సూచించడానికి వివిధ భాషల్లో వివిధ పద్ధతులు ఉన్నాయి.

బైబిల్ నుండి ఉదాహరణలు

కొన్ని ఆశ్చర్యార్థకాల్లో భావావేశాన్నీ తెలిపే పదం ఏదన్నా ఉంటుంది. ఈ క్రింది వాక్యంలో “ఆహా” అనేది మాట్లాడుతున్నవాడి ఆశ్చర్యాన్ని తెలుపుతున్నది. .

ఆహా</u, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం! (రోమా 11:33 TELIRV)

ఈ క్రింది వాక్యంలో “ఆహా” అనేది గిద్యోను నివ్వెరపోయాడని సూచిస్తున్నది.

గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు (న్యాయాధి 6:22 TELIRV)

కొన్ని ఆశ్చర్యార్థకాలు అవి ప్రశ్నలు కాకపోయినా ఎలా, ఎందుకు అనే ప్రశ్నార్ధకాలతో మొదలౌతాయి. దేవుని నిర్ణయాలు ఎంత నిగూఢమైనవోనని ఈ వ్యక్తి ఆశ్చర్యపోవడం ఈ క్రింది వాక్యంలో కనిపిస్తుంది.

ఆహా</u, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం! (రోమా 11:33 TELIRV)

బైబిల్లో కొన్ని ఆశ్చర్యార్థకాలకు ముఖ్య క్రియాపదం ఉండదు. ఈ క్రింది ఆశ్చర్యార్థకం ఈ వ్యక్తి తాను మాట్లాడుతున్న మనిషి పట్ల ఎంత విసుగుగా ఉన్నదో తెలుపుతున్నది..

‘పనికి మాలినవాడా! (మత్తయి 5:22 TELIRV)

అనువాద వ్యూహాలు

  1. మీ భాషలో ఆశ్చర్యార్థకానికి క్రియాపదం అవసరమైతే దాన్ని జోడించండి.
  2. మీ భాషలో ప్రగాఢమైన భావాన్ని తెలపడానికి ఆశ్చర్యార్థకం వాడండి.
  3. ప్రగాఢమైన భావాన్ని వ్యక్తపరిచే వాక్యంతో ఆశ్చర్యార్థకాన్ని తర్జుమా చెయ్యండి.
  4. ప్రగాఢమైన భావాన్ని వ్యక్తపరిచే వాక్య భాగాన్ని ఎత్తి చూపడం కోసం ఒక పదం వాడండి.
  5. లక్ష్య భాషలో ప్రగాఢమైన భావం స్పష్టంగా లేకపోతే ఆ వ్యక్తి ఎలాటి అనుభూతిలో ఉన్నాడో చెప్పండి.

అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు

  1. మీ భాషలో ఆశ్చర్యార్థకానికి క్రియాపదం అవసరమైతే దాన్ని జోడించండి.
  • >‘పనికి మాలినవాడా! (మత్తయి 5:22 TELIRV)
    • "నువ్వు చాలా పనికిమాలిన వాడివి!"
  • ** ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం!** (రోమా 11:33 TELIRV)
    • " ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంతో లోతైనది!
  1. మీ భాషలో ప్రగాఢమైన భావాన్ని తెలపడానికి ఆశ్చర్యార్థకం వాడండి. “అబ్బో” “అరే” అనే పదాలు ఆశ్చర్యాన్ని భయానకమైనవి జరిగిన దాన్నీ సూచిస్తాయి.
  • ** ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు."** (మార్కు7:36 TELIRV)
    • " ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది, "అబ్బో! “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు”.
  • “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు (న్యాయాధి 6:22 TELIRV)
    • "అయ్యో, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను!"
  1. ప్రగాఢమైన భావాన్ని వ్యక్తపరిచే వాక్యంతో ఆశ్చర్యార్థకాన్ని తర్జుమా చెయ్యండి.
  • అయ్యో, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను”! (న్యాయాధి 6:22 TELIRV)
    • యెహోవా ప్రభూ, నాకు ఇప్పుడు ఏమి జరుగుతుందో? నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను!”
    • నాకేది దిక్కు, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను”!
  1. ప్రగాఢమైన భావాన్ని వ్యక్తపరిచే వాక్యం భాగాన్ని నొక్కి చెప్పే పదం వాడండి.
  • ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం! (రోమా 11:33 TELIRV)
    • "ఆయన తీర్పులు ఎంత లోతైనవి! ఆయన మార్గాలు ఎంతగా ఉహకు అందనివి!"
  1. లక్ష్య భాషలో ప్రగాఢమైన భావం స్పష్టంగా లేకపోతే ఆ వ్యక్తి ఎలాటి అనుభూతిలో ఉన్నాడో చెప్పండి
  • ** గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు!"** (న్యాయాధి 6:22 TELIRV)
    • " గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “భయ కంపితుడై, “ఆహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు!" (న్యాయాధి 6:22 TELIRV)