te_ta/translate/figs-euphemism/01.md

5.3 KiB
Raw Permalink Blame History

వర్ణన

సభ్యోక్తి అంటే చావు, లేదా ఎవరికీ కనిపించకుండా చేసే ఇబ్బందికరమైన కటువైన సాంఘికంగా ఆమోదం కానీ మాటను ఒక మృదువైన, మర్యాదకరమైన రీతిలో చెప్పే పధ్ధతి.

నిర్వచనం

... అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు. (1 దిన10:8 TELIRV)

అంటే సౌలు అతని కొడుకులు చనిపోయారు. అయితే ముఖ్యమైన విషయం వాళ్ళు పడి ఉన్నారని కాదు, చనిపోయారన్నదే. ఇది సభ్యోక్తి. కొన్నిసార్లు మరణం అనేది అమంగళం కాబట్టి మనుషులు సూటిగా దాన్ని గురించి మాట్లాడరు.

ఇది అనువాద సమస్య అనడానికి కారణం

వివిధ భాషలు వివిధ సభ్యోక్తులు వాడతాయి. లక్ష్య భాషలో మూల భాషలో వాడిన సభ్యోక్తి లేకపోతే చదివే వారు అర్థం చేసుకోలేక పోవచ్చు. అక్కడున్న మాటలకు అక్షర అర్థాన్నే వారు తీసుకునే అవకాశం ఉంది.

బైబిల్ నుండి ఉదాహరణలు

... సౌలు మూత్ర విసర్జన కోసం వెళితే, దావీదు, అతని అనుచరులు ఆ గుహ లోపలి భాగంలో ఉన్నారు… (1 సమూయేలు 24:3 TELIRV)

మొదటి శ్రోతలకు సౌలు మూత్రవిసర్జన కోసం గుహలోకి వెళ్ళాడు అనే అర్థం అవుతుంది. అయితే రచయిత చదివే వారికి అమర్యాదగా ఉండకూడదని స్పష్టంగా సౌలు ఇందుకోసం వెళ్ళాడో చెప్పడం లేదు.

మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. (లూకా 1:34 TELIRV)

ఇక్కడ మర్యాద కోసం, మరియ తనకు పురుషునితో లైంగిక సంబంధం లేదు అని చెప్పడానికి సభ్యోక్తి వాడుతున్నది.

అనువాద వ్యూహాలు

సభ్యోక్తి మీ భాషలో సహజం అయితే సరైన అర్థం ఇస్తుంటే దాన్ని వాడండి. అలా కాకుంటే కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవి-

  1. మీ సంస్కృతిలో ఉన్న సభ్యోక్తి వాడండి.
  2. సభ్యోక్తి వాడక పొతే అక్కడ ఇచ్చిన సమాచారం కటువుగా ధ్వనిస్తుంటే సభ్యోక్తి వాడండి.

అనువాద వ్యూహాలకు ఉదాహరణలు

  1. మీ సంస్కృతిలో ఉన్న సభ్యోక్తి వాడండి.
  • ... గుహ ఉన్నచోట సౌలు మూత్ర విసర్జనకు (1 సమూయేలు 24:3 TELIRV) కొన్ని భాషల్లో ఇలాటి సభ్యోక్తులు ఉంటాయి.
    • "గుంట తవ్వడానికి" సౌలు వెళ్ళాడు"
    • "...మరుగు కోసం" సౌలు గుహలోకి వెళ్ళాడు."
  • మరియ దేవా దూతతో ఇలా అంది. “ఇదెలా జరుగుతుంది? నాకు పురుషునితో లైంగిక సంబంధం లేదు కదా?” (లూకా 1:34 TELIRV)
    • మరియ దేవదూతతో ఇలా అంది. “ఇదెలా జరుగుతుంది నేను పురుషుణ్ణి ఎరగని దాన్ని కదా?” (ఇది గ్రీకు మూల భాషలో సభ్యోక్తి)
  1. సభ్యోక్తితో పని లేకుండా ఆ సమాచారం అంత కటువైనది కాకపోతే సూటిగానే చెప్పండి.
  • **సౌలు, అతని కొడుకులు గిల్బోవ పర్వతంపై పడి ఉన్నారు. ** (1 దిన10:8 TELIRV)
    • "వారు సౌలును, అతని కొడుకులు గిల్బోవ పర్వతంపై చచ్చి పడి ఉండడం చూసారు.