te_ta/translate/choose-team/01.md

8.4 KiB

అనువాద బృందం

బైబిల్ అనువాదమనేది ఒక బృహత్ప్రణాలిక. ఇందుకోసం చాలా మంది అవసరం. బైబిల్ అనువాదక బృందం సభ్యులకు ఉండవలసిన నైపుణ్యతలను ఈ భాగం వివరిస్తుంది. వీరికి ఉన్న బాధ్యతలు కూడా. బృందంలో కొందరికి ఒకటి కన్నా ఎక్కువ నైపుణ్యతలు, బాధ్యతలు ఉండాలి. కొందరికి పరిమితంగా ఉంటే సరిపోతుంది. ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ప్రతి బైబిల్ అనువాదక బృందంలోనూ అన్నీ రకాల నైపుణ్యతలు కనిపించేలా చాలినంత మంది వ్యక్తులు ఉండాలి.

సంఘ నాయకులు

అనువాదం ప్రారంభించక ముందు ఎన్ని వీలైతే అన్ని సంఘ సమాఖ్యలను సంప్రదించాలి. అనువాద ప్రక్రియలో భాగస్వాములు కమ్మని వారిని ప్రోత్సహించాలి. లేదా అనువాద బృందంలో ఉండేందుకు మనుషులను పంపమని అడగాలి. అనువాద ప్రక్రియలో వారి అభిప్రాయాలూ దాని ఉద్దేశం, క్రమం గురించి తెలుసుకోవాలి.

అనువాద కమిటీ

ఆ సంఘాల నాయకులు, సంఘాల నెట్ వర్క్ లు ఈ పని నిర్వహణ కోసం ఒక బృందం వేస్తే మంచిది. ఈ బృందం అనువాదకుల ఎంపిక, సమస్యల పరిష్కారం, సంఘాలను ప్రార్థించమని, ఆర్థికంగా ఆదుకొమ్మని కోరడం మొదలైనవి చేస్తుంది.

కచ్చితత్వం 2, 3 స్థాయిల్లో పని చేయవలసిన వారిని కూడా ఈ బృందం ఎన్నుకుంటుంది.

సమయం విషయానికొస్తే ఈ బృందం అనువాద చట్రం గురించి కూడా నిర్ణయాలు చేస్తుంది. పనిని ఎలా కేటాయించాలి అనే సంగతిని, అనువదించిన వాచకాన్ని సంఘాల్లో వాడే అవకాశాన్ని ఈ సంఘం చూస్తుంది.

అనువాదకులు

అనువాద చిత్తు ప్రతులు తయారు చేసేది వీరే. అనువాద బృందం వీరిని నియమిస్తుంది. వీరు లక్ష్య బాష మాతృ భాషగా ఉండి, మూల భాష (గేట్ వే భాష)ను చక్కగా చదవ గలిగిన వారై ఉండాలి. తమ క్రైస్తవ వ్యక్తిత్వాన్ని బట్టి సమాజంలో మంచి పేరు పొంది ఉండాలి. మరిన్ని వివరాల కోసం చూడండి Translator Qualifications.

ప్రథమ చిత్తు ప్రతిని తాయారు చేయడమే గాక వీరు అనువాదక బృందంలో కేంద్ర స్థానంలో ఉండి ఒకరి పనిని మరొకరు సంస్కరించే పనిలో ఉండాలి. భాష సమాజం వారి సలహాలను చూడాలి. లెవెల్ 1, లెవెల్ 2 లో వస్తున్న సలహాలను చూసుకోవాలి. ప్రతి పునర్విమర్శ, లేక పరిశీలన తరువాత అనువాదానికి అవసరమైన దిద్దుబాట్లు చేసి అది సర్వ శ్రేష్టమైన రీతిలో అర్థాన్ని ఇచ్చేదిగా చెయ్యాలి. ఆ విధంగా వీరు అనువాదాన్ని మళ్ళీ మళ్ళీ చుస్తుండాలి.

టైపు చేసే వారు.

అనువాదకులు తామే అనువాదాన్ని కంప్యూటర్ లో టైపు చెయ్యక పొతే బృందంలోని వేరొకరు ఇది చెయ్యాలి. ఎక్కువ తప్పులు లేకుండా టైపు చేసేలా ఉండాలి. విరామ చిహ్నాలను సరిగా, నిలకడగా ఉపయోగించడం తెలిసి ఉండాలి. ఇదే వ్యక్తి ప్రతి రౌండ్ తరువాత మళ్ళీ చేసిన అనువాదాలను, దిద్దుబాట్లను చక్కగా వాచకంలో పెట్టగలిగి ఉండాలి.

అనువాద పరీక్షకులు

అనువాదం లక్ష్య భాషలో సహజంగా స్పష్టంగా ఉన్నదో లేదో ఆ భాష సమాజాన్ని అడిగి అనువాదాన్ని పరీక్షించే వ్యక్తులు కొందరు ఉండాలి. సాధారణంగా వీరు అనువాదకులే. వేరే వాళ్ళు కూడా అయి ఉండవచ్చు. ఈ పరీక్షకులు అనువాదాన్ని కొందరికి చదివి వినిపించి వారికి ఎలా అర్థం అవుతున్నదో తెలుసుకోడానికి ప్రశ్నలు అడగాలి. ఈ పని వివరణ కోసం చూడండి Other Methods.

సరి చూసే వారు

అనువాదాన్ని కచ్చితత్వం కోసం శరీ చూసే వారు మూల భాషలో బైబిల్ ఎరిగిన వారై ఉండాలి. మూల భాషనూ బాగా చదివే వారై ఉండాలి. వీరు అనువాదాన్ని మూల భాష బైబిల్ తో పోల్చి చూడాలి. మూల భాషలో ఉన్న దానంతటినీ అనువాదం చూపిస్తున్నదో లేదో వారు చూస్తారు. వీరు అనువాద పనిలో ఆసక్తి గలవారుగా, ఇలాంటి చెకింగ్ చెయ్యడానికి సమయం కేటాయించగలిగిన వారుగా ఉండాలి. లక్ష్య భాష మాట్లాడే వివిధ సంఘాల సభ్యులు, అనువాదాన్ని ఉపయోగించబోతున్న సంఘాల సభ్యులు ఇందులో ఉంటే మంచిది. లెవెల్ 2 లో చెక్ చేసే వారు తమ స్థానిక సంఘం పెద్దలై ఉండాలి. లెవెల్ 3 లో ఉన్న వారు డినామినేషన్ నాయకులై ఉండి, విస్తారమైన భాషా సమూహాల్లో గౌరవనీయులై ఉండాలి. ఇలాంటి వారు చాలా బిజీ గా ఉంటారు ఒకరిద్దరికి పని మొత్తం ఇవ్వడం కంటే కాబట్టి వివిధ వ్యక్తులకు వేరు వేరు బైబిల్ పుస్తకాలూ అధ్యాయాలు పంపించడం మంచిది.