te_ta/translate/bita-phenom/01.md

13 KiB
Raw Permalink Blame History

బైబిల్లో ప్రకృతిసిద్ధమైన అంశాల గురించి వాడిన అలంకారాలు ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ చెప్పిన పదం తప్పనిసరిగా అలంకారిక భాషలో కనిపించనవసరం లేదు. అయతే ఆ పదంలోని భావం కనిపిస్తుంది.

వెలుతురు అంటే ఒకరి ముఖం. (కొన్ని సార్లు ముఖం అంటే సన్నిధి).

యెహోవా, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశించు. (కీర్తన 4:6 TELIRV)

వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి, వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు (కీర్తన 44:3 TELIRV)

నా ముఖ కాంతిని వారు తోసిపుచ్చలేదు. (యోబు 29:24 TELIRV)

యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు. (కీర్తన 89:15 TELIRV)

వెలుగు మంచి తనానికీ చీకటి దుష్టత్వానికి గుర్తు.

నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా! (మత్తయి 6:23 TELIRV)

నీడ, లేక చీకటి మరణానికి సూచన.

కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు. (కీర్తన 44:19)

అగ్ని అంటే తీవ్రమైన భావాలు, ముఖ్యంగా ప్రేమ, క్రోధం వంటివి.

అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది(మత్తయి 24:12 TELIRV)

ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు (పరమ8:7 TELIRV)

నా కోపాగ్ని రగులుకుంది. పాతాళ అగాధం వరకూ అది మండుతుంది నా . భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. (ద్వితీ 32:22 TELIRV)

ఫలితంగా యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు… (న్యాయాధి 3:8 TELIRV)

యెహోవా ఈ మాట విని కోపగించాడు. యాకోబు సంతానాన్ని దహించడానికి ఆయన అగ్ని రాజుకుంది. ఇశ్రాయేలు సంతానం మీద ఆయన కోపం రగులుకుంది. (కీర్తన 78:21 TELIRV)

అగ్ని. దీపం అంటే జీవం.

నా రక్త సంబంధులందరూ నీ దాసిని నామీదికి వచ్చి, ‘తన సోదరుణ్ణి చంపినవాణ్ణి అప్పగించు. వాడు తన సోదరుని ప్రాణం తీసినందుకు మేము వాణ్ణి చంపి వాడికి హక్కు లేకుండా చేస్తాము’ అంటున్నారు. ఈ విధంగా వారు నా భర్త పేరట భూమిపై ఉన్న హక్కును, కుటుంబ వారసత్వాన్ని లేకుండా చేయబోతున్నారు” అని రాజుతో చెప్పింది. 2 సమూ 14:7 TELIRV)

దావీదు మనుషులు “ఇశ్రాయేలీయులకు దీపమైన నువ్వు ఆరిపోకుండా. ఉండేలా ఇకపై మాతో కలసి యుద్ధాలకు రావద్దు” అని చెప్పి, అతని చేత ఒట్టు పెట్టించారు. (2 సమూ 21:17 TELIRV)

నా పేరు అక్కడ ఉండేలా నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా సమక్షంలో నా సేవకుడైన దావీదుకోసం ఒక దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. (1 రాజులు 11:36 TELIRV)

అందుకే దావీదు కోసం అతని తరువాత అతని సంతానం వాణ్ణి నిలపడానికీ యెరూషలేమును స్థిరపరచడానికీ అతని దేవుడు యెహోవా యెరూషలేములో ఒక దీపంగా అతనిని ఉంచాడు. (1 రాజులు 15:4 TELIRV)

భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ ఇళ్ళల్లో దీపాలు వెలగకుండా పోతాయి. వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది. (యోబు 18:5-6 TELIRV)

నా దీపానికి వెలుగును ఇచ్చేవాడివి నువ్వే. నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేస్తాడు. (కీర్తన 18:28 TELIRV)

రెపరెపలాడుతున్న వత్తిని ఆర్పడు. (యెషయా 42:3 TELIRV)

వీసాల స్థలం భద్రతను, క్షేమాన్ని సౌఖ్యాన్ని సూచిస్తుంది.

ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు! విశాలమైన స్థలానికి ఆయన నన్ను తీసుకు వచ్చాడు. నన్నుబట్టి ఆయన సంతోషించాడు గనక ఆయన నన్ను రక్షించాడు. (కీర్తన 18:18-19 TELIRV)

నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. (2 సమూ 22:37 TELIRV)

మనుషులు మా మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. మేము నిప్పులగుండా నీళ్ళ గుండా నడిచి వెళ్ళాం. అయినా నువ్వు మమ్మల్ని విశాలమైన స్థలానికి రప్పించావు. (కీర్తన 66:12 TELIRV)

ఇరుకు చోటు ప్రమాదాన్ని, ఇబ్బందులను సూచిస్తున్నది.

నా నీతిన్యాయాలకు ఆధారమైన దేవా, నేను విజ్ఞప్తి చేసినప్పుడు నాకు జవాబివ్వు. ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలత ఇవ్వు. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు. కీర్తన 4:1 TELIRV)

ఒక వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. (సామెత23:27 TELIRV)

జలం నైతిక లక్షణాన్ని తెలుపుతున్నది. (అంటే భావాలూ, ప్రవృత్తి, వాలకం, జీవం మొదలైనవి)

జలప్రవాహాలు. కొట్టుకు పోయినట్టు యెహోవా నా శత్రువులను నా ముందు నిలబడకుండా చేశాడని” (2 సమూ 5:20 TELIRV)

పొంగి పొర్లుతున్న నీళ్ళలాగా ఆయన ఆ నగరాన్ని నాశనం చేస్తాడు. (నహుము 1:8 TELIRV)

విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది (కీర్తన 119:28 TELIRV)

నన్ను నీళ్ళలా పారబోస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పాయి. (కీర్తన 22:14 TELIRV)

తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. (యోవేలు 2:28 TELIRV)

నా ప్రాణం కరిగి నీరైపోతున్నది. (కీర్తన 42:6 TELIRV)

కాబట్టి యెహోవా మన మీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు.” (2 దిన34:21 TELIRV)

నీరు అంటే ఒకరు పలికే మాట.

గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం (సామెత19:13 TELIRV)

అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి. (పరమ5:13 TELIRV)

నేను చేసే ఆక్రందనలు నీళ్లలాగా పారుతున్నాయి. (యోబు 3:24 TELIRV)

మనిషి పలికే మాటలు లోతుగా ప్రవహించే ప్రవాహం; వంటివి. జ్ఞానపు ఊటలో; నుండి పారే సెలయేరు వంటివి. (సామెత18:3 TELIRV)

వరద ప్రవాహం విపత్తుకు సూచన.

లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి. (కీర్తన 69:2 TELIRV)

వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. (కీర్తన 69:15 TELIRV)

మహా జలప్రవాహాల నుండి, విదేశీయుల చేతిలోనుండి నన్ను విడిపించు. (కీర్తన 144:7 TELIRV)

నీటి ఊట అనే ఒకదాని మూలం.

యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. (సామెత14:27 TELIRV)

బండ అంటే భద్రత

మన దేవుడు తప్ప ఆశ్రయశిల ఏది? (కీర్తన 18:31 TELIRV)

యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా,. (కీర్తన 19:14 TELIRV)