te_ta/translate/bita-part3/01.md

31 KiB
Raw Permalink Blame History

వర్ణన

సాంస్కృతిక నమూనాలు అనేవి జీవితం, ప్రవర్తన ల గురించి మనుషుల మనస్సులో మెదిలే ఊహా చిత్రాలు. ఈ చిత్రాలు ఈ అంశాల గురించి మనం ఊహించుకోడానికి తోడ్పడతాయి. ఉదాహరణకు అమెరికా ప్రజలు చాలా విషయాలను అంటే వివాహం, స్నేహం మొదలైన వాటిని యంత్రాలుగా చూస్తారు. అతని కాపురం పాడైపోయింది, లేక వారి స్నేహం ఫుల్ స్పీడులో వెళ్తోంది, అంటారు. ఇక్కడ మానవ సంబంధాలను యంత్రంతో పోల్చడం చూడవచ్చు.

బైబిల్లోని కొన్ని సాంస్కృతిక నమూనాలు, లేక ఊహాచిత్రాలు జాబితా ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ చెప్పిన పదం తప్పనిసరిగా అలంకారిక భాషలో కనిపించనవసరం లేదు. అయతే ఆ పదంలోని భావం కనిపిస్తుంది

దేవుణ్ణి మనిషిగా చిత్రీకరిస్తారు.

దేవుడు మనిషి కాదని బైబిల్ స్పష్టంగా చెబుతున్నప్పటికీ అయన మనుషులు చేసే పనులు చేస్తున్నట్టుగా బైబిల్లో ఉంటుంది. కానీ దేవుడు మనిషి కాదు. కాబట్టి దేవుడు మాట్లాడాడు అని బైబిల్లో రాస్తే ఆయనకి స్వరపేటిక ఉన్నదని మనం అనుకోనవసరం లేదు. అయన తన చేతితో ఏదన్నా చేశాడు అని రాస్తే ఆయనకి రక్తమాంసాలతో ఉన్న చెయ్యి ఉందని అనుకోరాదు.

మన దేవుడు యెహోవా స్వరం ఇంకా వింటే చనిపోతాం. (ద్వితీ 5:25 TELIRV)

నా దేవుడైన యెహోవా కాపుదల నాకు తోడుగా ఉన్నందువల్ల నేను బలపడి, నాతో కలసి పనిచేయడానికి ఇశ్రాయేలీయుల ప్రధానులను సమావేశపరిచాను. (ఎజ్రా 7:28 TELIRV)

యెహోవా ఆజ్ఞను బట్టి రాజు, అతని అధికారులు, ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చేలా యూదా వారికి ఏక మనస్సు కలిగించ డానికి దేవుని హస్తం వారి మీద ఉంది (2 దిన 30:12 TELIRV)

iఇక్కడ “హస్తం” అంటే దేవుని శక్తిని సూచించే అన్యాపదేశం. (చూడండి: అన్యాపదేశం)

దేవుణ్ణి రాజుగా చూపిస్తారు.

ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. (కీర్తన 47:7 TELIRV)

ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే. (కీర్తన22:28 TELIRV)

దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయ రాజదండం. నీ రాజదండం. న్యాయ రాజదండం. (కీర్తన 45:6 TELIRV)

యెహోవా ఇలా చెబుతున్నాడు, "ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. (యెషయా 66:1 TELIRV)

దేవుడు అన్ని జాతులల పైనా పరిపాలన చేస్తున్నాడు. ఆయన తన పవిత్ర సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. జాతుల అధిపతులు అబ్రాహము దేవుని ప్రజలతో కూడి ఉన్నారు. భూమిపై రక్షణ డాళ్ళు దేవునికే చెందుతాయి. భూమిపై అత్యున్నత స్థానం ఆయనదే. (కీర్తన47:8-9 TELIRV)

దేవుణ్ణి కాపరి గానూ అయన ప్రజలను గొర్రెలుగాను చిత్రీకరించారు.

యెహోవా నా కాపరి; నాకు ఏ లోటూ లేదు (కీర్తన23:1 TELIRV)

అయన ప్రజలు గొర్రెలు.

ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు! (కీర్తన95:7 TELIRV)

గొర్రెలను తోలినట్టు అయన తనప్రజలను నడిపిస్తాడు.

ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు. (కీర్తన78:52 TELIRV)

గొర్రెలను కాపాడడానికి అయన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే.

నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. 15నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి. (యోహాను 10:14-15 TELIRV)

దేవుణ్ణి యుద్ధ వీరునిగా చిత్రించారు.

యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా (నిర్గమ 15:3 TELIRV)

యెహోవా శూరునిలాగా. బయటికి కదిలాడు. యోధునిలాగా. రోషంతో ఆయన బయలుదేరాడు. తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని. కనపరుస్తాడు. (యెషయా 42:13 TELIRV)

యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది. (నిర్గమ 15:6 TELIRV)

కానీదేవుడు వారిని కాల్చివేస్తాడు; suddenly they will be wounded with his arrows. (కీర్తన65:7 TELIRV)

నువ్వు వాళ్ళను వెనక్కి తిప్పుతావు. వాళ్ళ ఎదుట నువ్వు నీ విల్లు ఎక్కుపెడతావు. (కీర్తన21:12 TELIRV)

నాయకుడిని కాపరిగాను అతడు నడిపించే వారిని గొర్రెలుగాను చిత్రీకరించారు.

ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాలవారు హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. వారు “రాజా, విను. మేమంతా నీకు దగ్గర బంధువులం. గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు మా సంరక్షకుడుగా ఉన్నావు. ‘నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించి వారికి కాపరిగా ఉంటావు’ అని నిన్ను గురించి యెహోవా చెప్పాడు (2 సముయేలు 5:1-2 TELIRV)

నా మందలో చేరిన గొర్రెలను నాశనం చేస్తూ చెదరగొట్టే కాపరులకు బాధ.” (యిర్మీయా 23:1 TELIRV)

ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం. కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి. నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై. జాలి చూపరు. 30అతేకాక శిష్యుల్ని తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. (అపో. కా. 20:28-30 TELIRV)

కన్నును దీపంగా చెప్పారు.

దీనికి అనుబంధంగా చెడు చూపు నిలపడం అనే మాట ప్రపంచంలో అనేక చోట్ల వాడతారు. బైబిల్లో కనిపించే అనేక సాంస్కృతిక నమూనాల్లో ఈ క్రింది అంశాలు కనిపిస్తాయి.

ఒక వస్తువు పై పడుతున్న కాంతి మూలంగా కాక తమ కళ్ళ కంటి వాటిపై పడినందువల్ల మనుషులు వస్తువులను చూస్తారు.

శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది (మత్తయి 6:22 TELIRV)

కంటి నుంచి ప్రసరించే కాంతి ఆ వ్యక్తి గుణాలను తెలియజేస్తుంది.

భక్తిలేని వాడి మనస్సు అస్తమానం కీడు చేయాలని చూస్తుంటుంది. అతని పొరుగు వాడికి అతని కన్నుల్లో దయ. ఎంతమాత్రం కనిపించదు. (సామెత 21:10 TELIRV)

అసూయ, శాపనార్థాలు పెట్టడం ఎదుటి వ్యక్తిపై చెడు చూపు నిలపడం. దయగా చూడడం చల్లని చూపు.

చెడు చూపు నిలిపే వ్యక్తి ముఖ్య భావం అసూయ. మార్కు 7 లో అసూయ అని తర్జుమా చేసిస్ గ్రీకు పదం కన్ను అనే అర్థం ఇచ్చేది.

ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21ఎదుకటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22వ్యభిచార, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు (మార్కు 7:20-22 TELIRV)

మత్తయి 20:15 సందర్భంలో చెడ్డది అంటే అసూయతో కూడినది అని అర్థం

నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా? “అని అన్నాడు (మత్తయి 20:15 TELIRV)

ఒకడి కన్ను చెడ్డదైతే ఇతరుల సిరిసంపదలు చూసి ఓర్వలేడు. .

శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే, నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది. నీ కన్ను పాడైతే, నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా! ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు (మత్తయి 6:22-24 TELIRV)

విషపు చూపు నిలపడం ద్వారా వేరొకడి పట్ల అసూయగల వాడు అతణ్ణి చూడడం మూలంగానే అతనిపై చేతబడి వంటిది చెయ్యగలడు.

తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? (గలతి 3:1 TELIRV)

మంచి చూపు ఉన్నవాడు ఎదుటి వల్లి చూడడం ద్వారా అతణ్ణి దీవిస్తాడు.

నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు (1 సముయేలు 27:5 TELIRV)

జీవానికి గుర్తు రక్తం.

ఈ నమూనాలో ఒక మనిషి, లేక జంతువు రక్తం ప్రాణానికి గుర్తు.

కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు. (ఆది 9:4 TELIRV)

రక్తం చిందించడం అంటే ఆ జీవిని చంపడమే.

మనిషి రక్తాన్ని, ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని, కూడా మనిషే చిందించాలి. (ఆది 9:6 TELIRV)

పొరపాటున ఒకడి చంపినవాడు అక్కడికి పారిపోయి హత్యవిషయమై ప్రతిహత్య చేసేవాడు, చంపకుండా ఉండేలా సమాజం ముందు నిలబడే వరకూ ఇశ్రాయేలీయులందరికీ వారి మధ్య నివసించే పరదేశులకూ నియమించిన పట్టణాలు ఇవి. (యెహో 20:9 TELIRV)

రక్తం మొర్ర పెడుతుంటే ప్రకృతే ఒక మనిషిని చంపిన వాడి పై పగ సాధించాలని ఘోష పెడుతుంది. (ఇందులో వ్యక్తిత్వారోపణ ఉంది. ఎందుకంటే రక్తాన్ని మొర్ర పెట్టే ఒక మనిషిగా చిత్రీకరణ జరిగింది. చూడండి:వ్యక్తిత్వారోపణ)

దేవుడు “నువ్వు చేసిందేమిటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతూ ఉంది (ఆది 4:10 TELIRV)

దేశాన్ని ఒక స్త్రీగా దేవుడిని ఆమె భర్తగా చిత్రీకరిస్తారు.

మళ్ళీ బయలుదేవుళ్ళను అనుసరించి, వ్యభిచారులై, బయల్బెరీతును తమకు దేవుడుగా చేసుకున్నారు. (న్యాయాధి 8:33 TELIRV)

ఇశ్రాయేల్ జాతి దేవుని కుమారుడు.

ఇశ్రాయేలు పసిప్రాయంలో నేను అతనిపట్ల ప్రేమగలిగి, నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలోనుండి పిలిచాను. (హోషేయ 11:1 TELIRV)

సూర్యుడు ఒక గదిలో ఉన్నట్టు చెప్పారు.

అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు. సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు. (కీర్తన19:4-5 TELIRV)

కీర్తన110 సూర్యుణ్ణి తల్లి గర్భం లోనుంచి బయటికి వస్తున్నట్టు చూపుతున్నది.

అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది. (కీర్తన110:3 TELIRV)

వడిగా కదిలే వాటికి రెక్కలున్నట్టు చెప్పారు.

ముఖ్యంగా ఆకాశంలో, గాలిలో చలించేవాటికి వర్తిస్తుంది.

సూర్యుడు రెక్కలున్న బిళ్ళ. అది తూర్పు నుంచి పడమరకు రెక్కలతో ఎగిరిపోతున్నట్టు ఉంటుంది. కీర్తన139లో, "వేకువ రెక్కలు” అంటే సూర్యుడు. మలాకి 4 లో దేవుడు తనను నీతి సూర్యుడు అని పిలుచుకుంటున్నాడు. సుర్య్డికి రెక్కలున్నట్టు మాట్లాడుతున్నాడు.

నేను ఉదయకాలం రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి సముద్రపు లోతుల్లో దాక్కుంటాను. (కీర్తన 139:9 TELIRV)

అయితే నా పట్ల భయభక్తులు ఉన్న మీ కోసం నీతిసూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల చాటున మీకు రక్షణ కలుగుతుంది. (మలాకి 4:2 TELIRV)

వేగంగా వీచే గాలికి రెక్కలున్నట్టు చెప్పారు.

ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. (2 సమూ. 22:11 TELIRV)

కెరూబు మీద స్వారీ చేస్తూ ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద. ఆయన తేలి వచ్చాడు (కీర్తన18:10 TELIRV)

మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద ప్రయాణిస్తున్నాడు. (కీర్తన104:3 TELIRV)

వ్యర్థత అనేది గాలికి కొట్టుకు పోయే దానిలా ఉంది.

ఈ నమూనాలో పానికి రని వాటిని గాలి ఎగరగొట్టగా అవి లేకుండా పోయినట్టు చిత్రీకరించారు.

కీర్తన 1లో, యోబు 27 లో దుర్మార్గులు పనికిమాలిన వారని, వారు ఎక్కువ కాలం ఉండరని రాసి ఉంది.

దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు. (కీర్తన1:4 TELIRV)

తూర్పు గాలి అతణ్ణి ఎగరగొడుతుంది,. వాడు ఇక ఉండడు. అది అతని స్థలంలో నుండి అతణ్ణి ఊడ్చివేస్తుంది. (యోబు 27:21 TELIRV)

ప్రసంగి గ్రంథకర్త అంతా వ్యర్థం అంటాడు.

పొగమంచులో ఆవిరిలాగా అది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది.  గాలి కదలిక లాగా, ప్రతిదీ మాయమైపోతున్నదని ప్రసంగి చెబుతున్నాడు సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? (ప్రసంగి 1:2-3 TELIRV)

యోబు 30:15, యోబు తన గౌరవ ప్రతిష్టలు మాయమయ్యాయని వాపోతున్నాడు.

భీతి నాపై దాడి చేసింది. గాలికి కొట్టుకుపోయినట్టు నా గౌరవం ఎగిరిపోయింది. మేఘం లాగా నా అభివృద్ధి కదిలి వెళ్లి పోయింది. (యోబు 30:15 TELIRV)

మనుషుల యుద్ధాలు దేవుని యుద్ధాలుగా చెప్పారు.

జాతుల మధ్య యుద్ధం జరిగితే ఆ జాతుల దేవుళ్ళు యుద్ధమడుతూ ఉన్నారని భావించారు.

అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు. (సంఖ్యా 33:4 TELIRV)

నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజలవంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా, నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్పకార్యాలు చేసేలా దేవుడవైన నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశంలో నుండి విడిపించావు. (2 సముయేలు 7:23 TELIRV)

అయితే సిరియా రాజు బెన్హదదు సేవకులు అతనితో ఇలా అన్నారు. “"వాళ్ళ దేవుడు కొండల దేవుడు. అందుకే వాళ్ళు మన కంటే బలంగా ఉన్నారు. అయితే మనం మైదానంలో వాళ్ళతో యుద్ధం చేస్తే తప్పకుండా గెలుస్తాం. (1 రాజులు 20:23 TELIRV)

జీవితంలో ప్రతిబంధకాలు భౌతిక అడ్డంకులు గా చూపారు.

ఈ క్రింది వచనాల్లో ఉన్నవి నిజమైన భౌతిక ఆటంకాలు కాదు, జీవితంలో ఎదురయ్యే కష్టాలు.

ఆయన నా చుట్టూ గోడ కట్టాడు. నేను తప్పించుకోలేను. నా సంకెళ్ళు బరువుగా చేశాడు. (విలాప 3:7 TELIRV)

ఆయన నా దారికి అడ్డంగా చెక్కుడు రాళ్ళ గోడలను ఉంచాడు. నేను ఎక్కడికి తిరిగినా నాకు దారి కనిపించలేదు. (విలాప 3:9 TELIRV)

మనోహరమైన స్థలాల్లో నాకోసం హద్దులు గీసి ఉన్నాయి. కచ్చితంగా శ్రేష్ఠమైన స్వాస్థ్యం నాది. (కీర్తన16:6 TELIRV)

ప్రమాదకరమైన చోట్లను ఇరుకు స్థలాలుగా చెప్పారు.

కీర్తన 4 లో తనను కాపాడమని దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు.

నా నీతిన్యాయాలకు ఆధారమైన దేవా, నేను విజ్ఞప్తి చేసినప్పుడు నాకు జవాబివ్వు. ఇరుకులో ఉన్నప్పుడు నాకు విశాలత ఇవ్వు. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించు. (కీర్తన4:1 TELIRV)

దురవస్థ అనేది అరణ్య ప్రదేశం.

యోబు తనకు జరిగిన విషాదాలన్నిటిని బట్టి దుఃఖిస్తూ తాను కారడవిలో ఉన్నానని అంటున్నాడు. నక్కలు, ఉష్ట్రపక్షులు అక్కడ నివాసం ఉంటాయి.

నా పేగులు మానక మండుతున్నాయి అపాయ దినాలు నన్నెదుర్కొన్నాయి. సూర్య కాంతి కరువై వ్యాకులపడుతూ నేను సంచరిస్తున్నాను. సమాజంలో నిలబడి మొరపెడుతున్నాను. నేను నక్కలకు సోదరుడుని , నిప్పుకోళ్లకు మిత్రుడిని అయ్యాను. (యోబు 30:27-29 TELIRV)

క్షేమ స్థితిని భౌతిక పరిశుభ్రతగా దుష్టత్వాన్ని మురికిగా రాసారు.

కుష్టు అనేది ఒక వ్యాధి. ఇది సోకినా వాణ్ణి అపవిత్రుడు అన్నారు.

ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు. యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు బాగుపడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది (మత్తయి 8:2-3 TELIRV)

"అపవిత్రాత్మ" అంటే దురాత్మ.

అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. (మత్తయి 12:43 TELIRV)