te_ta/translate/bita-manmade/01.md

5.6 KiB

బైబిల్లో మానవ నిర్మితాలైన వస్తువుల గురించి వాడిన అలంకారాలు ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ చెప్పిన పదం తప్పనిసరిగా అలంకారిక భాషలో కనిపించనవసరం లేదు. అయతే ఆ పదంలోని భావం కనిపిస్తుంది

ఇత్తడి బలాన్ని సూచిస్తుంది.

నా చేతులకు యుద్ధం చెయ్యడం, ఇత్తడి . విల్లును వంచడం నేర్పిస్తాడు. కీర్తన 18:34 TRLIRV)

గొలుసులు అదుపును సూచిస్తాయి.

వాళ్ళు మనకు వేసిన సంకెళ్ళు తెంపేద్దాం రండి. వాళ్ళ గొలుసులు. విసిరి పారేద్దాం రండి, అని చెప్పుకుంటున్నారు. కీర్తన 2:3

వస్త్రాలు నైతిక లక్షణాలను (భావాలూ, ప్రవృత్తులు, వాలకం, జీవం) సూచిస్తాయి.

ఒక నడికట్టులాగా నాకు బలం ధరింపజేసేవాడు ఆయనే. (కీర్తన 18:32 TRLIRV)

అతని నడుముకు న్యాయం, అతని మొలకు సత్యం నడికట్టుగా ఉంటాయి (యెషయా 11:5 TRLIRV)

నా విరోధులు అవమానం ధరించుకుంటారు. గాక. తమ సిగ్గునే ఉత్తరీయంగా కప్పుకుంటారు గాక. (కీర్తన 109:29 TRLIRV)

అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను. అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది. (కీర్తన 132:18 TRLIRV)

ఉచ్చు, లేక వల పక్షులను జంతువులను పట్టుకునేది, మరణానికి గుర్తు.

వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. (కీర్తన 91:3 TRLIRV)

మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది (కీర్తన 116:3 TRLIRV)

భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు. (కీర్తన 119:61 TRLIRV)

నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు. (కీర్తన 119:110 TRLIRV)

యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు (కీర్తన 9:16 TRLIRV)

అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి. (కీర్తన 106:35-36 TRLIRV)

ఇక్కడ ఉరి అంటే చెడు చెయ్యడానికి ప్రేరణ. అది మరణానికి దారి తీస్తుంది.

గుడారం అనేది ఇల్లు, ఒక కుటుంబంలోని పరివారం, సంతానం అని అర్థం.

కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. (కీర్తన 52:5 TRLIRV)

దుర్మార్గుడి ఇల్లు నాశనం అవుతుంది. యథార్థవంతుల గుడారం స్థిరంగా నిలుస్తుంది. (సామెత 14:11 TRLIRV)

నిబంధనా నమ్మకత్వంతో సింహాసన స్థాపన జరుగుతుంది. దావీదు గుడారంలోనుంచి ఒకడు అక్కడ నమ్మకంగా కూర్చుంటాడు. అతడు తీర్పు తీరుస్తాడు, న్యాయం వెదకుతాడు, నీతి జరిగిస్తాడు.. (యెషయా 16:5 TRLIRV)