te_ta/translate/bita-humanbehavior/01.md

31 KiB
Raw Permalink Blame History

బైబిల్లో మానవ ప్రవర్తనకు చెందిన అలంకారాలు ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ చెప్పిన పదం తప్పనిసరిగా అలంకారిక భాషలో కనిపించనవసరం లేదు. అయితే ఆ పదంలోని భావం కనిపిస్తుంది

వంగి ఉండడం అంటే నిరాశ

కూలిపోతున్నవాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు. (కీర్తన 145:14 TELIRV)

పురిటినొప్పులు అంటే ఒక కొత్త స్థితిని పొందడానికి పదే బాధ.

సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా నొప్పులు పడుతూ కను. ఎందుకంటే మీరు పొలంలో బతికేలా, పట్టణం వదిలిపెట్టండి. బబులోను వెళ్తారు. అక్కడ మీకు విడుదల కలుగుతుంది. అక్కడే యెహోవా మీ శత్రువుల చేతిలోనుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. (మీకా 4:10 TELIRV)

జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి. 8ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే. (మత్తయి 24:7-8 TELIRV)

నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకూ మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను. (గలతి 4:19 TELIRV)

ఏదైనా పేరుతొ పిలవడం అంటే దానికి ప్రతినిధిగా ఉండడం.

నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు. (యెషయా 54:5b TELIRV)

అంటే అయన వాస్తవంగా లోకమంతటికి దేవుడు.

హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు (సామెత 16:21a TELIRV)

అంటే అతడు స్వతహా గా వివేకి.

ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. (లూకా 1:32 TELIRV)

ఆయన నిజంగానే సర్వోన్నతుని కుమారుడు.

అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు. (లూకా 1:35 TELIRV)

ఎందుకంటే అయన నిజంగా దేవుని కుమారుడు

ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. (లూకా 2:23 TELIRV)

ఎందుకంటే వాస్తవంగా ప్త్రభువుకు ప్రతిష్టించాలి.

పరిశుభ్రత అంటే దేవుని ప్రయోజనాలకు ఆమోదయోగ్యం.

అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు. (ఆది 8:20 TELIRV)

ఏడో రోజు యాజకుడు అతణ్ణి రెండోసారి పరీక్షించాలి. వ్యాధి తగ్గి ఆ మచ్చ చర్మం పైన వ్యాపించకుండా ఉంటే అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. అది పొక్కు మాత్రమే. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. అప్పుడు శుద్ధుడుగా ఉంటాడు. (లేవీ 13:6 TELIRV)

శుద్ధత, పవిత్ర పరచడం అంటే దేవుని పనుల నిమిత్తం ఒక దానిని ఆమోదయోగ్యం చెయ్యడం.

తరువాత అతడు బయట యెహోవా సమక్షంలో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళి దానికోసం పరిహారం చేయాలి. అతడు ఆ కోడె దూడ రక్తంలో కొంత, మేక రక్తంలో కొంత తీసుకుని బలిపీఠం కొమ్ములకు పూయాలి. 19ఆ రక్తాన్ని ఏడు సార్లు తన వేలితో బలిపీఠంపై చిలకరించాలి. అలా దాన్ని పవిత్ర పరచి ఇశ్రాయేలు ప్రజలు చేసే అశుద్ధ పనుల నుండి దాన్ని శుద్ధీకరించాలి. (లేవీ 16:18-19 TELIRV)

ఎందుకంటే ఆ రోజు యెహోవా సమక్షంలో మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికై మీ పాపాలకు శుద్ధీకరణ చేసేందుకు మీ కోసం పరిహారం జరిగింది.. (లేవీ 16:30 TELIRV)

అపవిత్రత అంటే అంటే దేవుని పనుల నిమిత్తం ఒక దానిని నిషేధంగా ఉండడం.

చీలిన డెక్కలు ఉండి ఏ జంతువు అయితే నెమరు వేస్తుందో ఆ జంతువుని మీరు ఆహారంగా తీసుకోవచ్చుఅయితే జంతువుల్లో కొన్ని నెమరు వేస్తాయి. కొన్నిటికి చీలిన డెక్కలుంటాయి. ఇలాంటి వాటిని మీరు ఆహారంగా తీసుకోకూడదు,. ఒంటె లాంటి జంతువులు నెమరు వేస్తాయి. కానీ దానికి చీలిన డెక్కలుండవు. కాబట్టి ఒంటెను మీరు అపవిత్రంగా, ఎంచాలి. (లేవీ 11:3-4 TELIRV)

ఒకవేళ అవి చనిపోయిన తరువాత వాటి కళేబరాలు దేని పైన పడతాయో అవి చెక్క వస్తువులైనా, వస్త్రంతో చేసినవైనా, చర్మంతో చేసినవైనా, గోనె గుడ్డతో చేసినవైనా అవి అపవిత్రం అవుతాయి. ఆ వస్తువు ఏదైనా, దేనికోసం వాడుతున్నా అపవిత్రం అయినప్పుడు దాన్ని నీళ్ళలో ఉంచాలి. సాయంకాలం వరకూ అది అపవిత్రంగా ఉంటుంది. తరువాత అది పవిత్రం అవుతుంది. (లేవీ 11:32 TELIRV)

దేన్నైనా పవిత్ర పరచడం అంటే దేవుని ప్రయోజనాలకు ఆమోదయోగ్యం చేయడం.

ఇంకా ఒక వ్యక్తి దేవుడు అపవిత్రమని నిర్దేశించిన ఏ అశుద్ధ జంతువు కళేబరాన్ని గానీ, పశువు కళేబరాన్ని గానీ, పాకే జంతు కళేబరాన్ని గానీ తెలియక తాకితే ఆ వ్యక్తి అపవిత్రుడూ, అపరాధీ అవుతాడు. (లేవీ 5:2 TELIRV)

దేని నుండైనా కొట్టివేయడం అంటే వేరు చేయడం.

రాజైన ఉజ్జియా చనిపోయే వరకూ కుష్టురోగిగానే ఉన్నాడు. కుష్టురోగిగా యెహోవా మందిరంలోకి పోకుండా కడగా ఉన్నాడు. కాబట్టి అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించేవాడు. (2 దిన 26:21 TELIRV)

కొట్టివేయడం అంటే సంహరించడం

అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. ఎవరైతే అ దిన్నాన్ని అపవిత్రం చేస్తారో అతనికి మరణశిక్ష విధించాలి ఆ దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి . (నిర్గమ 31:14-15 TELIRV)

అందువల్ల మీరు విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి. అది మీకు పవిత్రమైనది. ఆ దినాన్ని అపవిత్రం చేసే వాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి. 15ఆరు రోజులు పని చేసిన తరువాత యెహోవాకు ప్రతిష్ఠితమైన ఏడవ రోజును విశ్రాంతి దినంగా పాటించాలి. విశ్రాంతి దినాన పని చేసే ప్రతివాడికీ తప్పకుండా మరణశిక్ష విధించాలి. (లేవీ 23:29-30 TELIRV)

నా ప్రజల దుర్మార్గానికి ఆయనకు శిక్ష పడింది. సజీవుల భూమిలోనుంచి అతడు హతమయ్యాడు. (యెషయా 53:8 TELIRV)

వచ్చి ఒకరి ఎదుట నిలబడడం అంటే ఆయని సేవించడం.

నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు! నీ ఎదుట ఎప్పుడూ నిలబడి నీ జ్ఞానవాక్కులు వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్య జీవులు! (1 రాజులు 10:8 TELIRV)

కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి. (కీర్తన 89:14 TELIRV)

నిబంధన నమ్మకత్వం నమ్మదగిన గుణం ఇక్కడ ఒక వ్యక్తిగా చెప్పడం చూడవచ్చు. (చూడండి వ్యక్తిత్వారోపణ)

తాగుబోతుతనం బాధ గానూ మద్యం తీర్పు గాను ఇక్కడ రాసి ఉంది.

విపరీతంగా తాగితే మనిషి బలహీనమై తూలుతాడు. అలానే దేవుడు శిక్షిస్తే మనిషి బలహీన పడతాడు. కాబట్టి మద్యం అనేది దేవుని తీర్పును సూచిస్తున్నది.

నీ ప్రజలకు నీ కఠినమైన కార్యాలు కనపరిచావు. మేము తూలిపోయేలా చేసే మద్యాన్ని. మాకు తాగించావు. (కీర్తన 60:3 TELIRV)

కీర్తన నుండి మరొక ఉదాహరణ.

ఆయన దాన్ని పోషిస్తున్నాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. అందులోని ద్రాక్షారసం, పొంగుతూ ఉంది , అది సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. ఆయన దాన్ని పోషిస్తున్నాడు. భూమి మీద ఉన్న దుర్మార్గులంతా ఆఖరి బొట్టు వరకు దాన్ని తాగాలి. (కీర్తన 75:8 TELIRV)

ప్రకటన నుండి ఒక ఉదాహరణ.

వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారు చేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. (ప్రకటన 14:10 TELIRV)

తిని వేయడం అంటే నాశనం చెయ్యడం.

దేవుడు ఐగుప్తులోనుంచి అతన్ని రప్పించాడు. అతనికి అడవిదున్నకు ఉన్నంత బలం ఉంది. అతడు తనకు విరోధంగా పోరాడే వారిని మింగేస్తాడు. వారి ఎముకలు విరిచేస్తాడు. తన బాణాలతో వారిని చంపేస్తాడు. సంఖ్యా 24:8 TELIRV)

తిని వేయడం అనేదానికి మరొక పదం మింగి వేయడం.

అగ్నిజ్వాల చెత్త పరకలను కాల్చివేసినట్టు. ఎందుకంటే వారు సేనల ప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును కొట్టి పారేసారు. ఎండిన గడ్డి మంటలో భస్మమై పోయినట్టు వారి వేరు కుళ్లి పోతుంది. వారి పువ్వు ధూళివలె కొట్టుకుపోతుంది, (యెషయా 5:24 TELIRV)

యెషయా నుండి మరొక ఉదాహరణ.

కాబట్టి యెహోవా అతని మీదకి రెజీనును, అతని విరోధిని లేపుతాడు. అతని శత్రువులను రేపుతాడు. నోరు తెరచి ఇశ్రాయేలును మింగేస్తారు. ఇంత జరిగినా కోపంలో ఉన్న యెహోవా ఆగడు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంది. తూర్పున సిరియా, పడమట ఫిలిష్తీయులు, నోరు తెరచి ఇశ్రాయేలును మింగేస్తారు. (యెషయా 9:11-12 TELIRV)

ద్వితీయోపదేశ కాండం నుంచి ఒక ఉదాహరణ.

నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. నా కత్తి మాంసం భక్షిస్తుంది! చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, శత్రువు అధికారులనూ అవి తింటాయి. శత్రువు అధికారులనూ అవి తింటాయి. (ద్వితీ 32:42 TELIRV)

మీద పడడం, లేక అవరించడం అంటే ప్రభావం చూపడం.

అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. (ఆది 2:21 TELIRV)

ఆయన ప్రభావం మీకు భయం కలిగించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా? (Job 13:11 TELIRV)

ఆ తరువాత యెహోవా ఆత్మ నా పైకి వచ్చాడు. ఆయన నాకిలా చెప్పాడు. (యెహె 11:5 TELIRV)

ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. (అపో. కా. 13:11 TELIRV)

ఎవరినన్నా వెంబడించడం అంటే ఆ వ్యక్తికి నమ్మకంగా ఉండడం.

ఐగుప్తుదేశంలోనుంచి వాళ్ళను రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరించి, వాళ్ళ చుట్టూ ఉండే ఆ ప్రజల దేవుళ్ళకు సాగిలపడి, యెహోవాకు కోపం పుట్టించారు. వాళ్ళు యెహోవాను విడిచిపెట్టి బయలును అష్తారోతును పూజించారు.

సొలొమోను అష్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్నీ అనుసరించి నడిచాడు. (1 రాజులు 11:5 TELIRV)

కాబట్టి వారి పితరులకు ప్రమాణ పూర్వకంగా నేనిచ్చిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను పట్టించుకోని వారిలో ఎవరూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు వీళ్ళ లాంటి వాడు కాదు. అతడు పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన కారణంగా అతడు పరిశీలించడానికి వెళ్ళిన దేశంలో అతన్ని ప్రవేశపెడతాను. (సంఖ్యా 14:23-24 TELIRV)

ముందుగా నడవడం, కలిసి వెళ్ళడం లేక ఒక రాజు పరివారంతో సహా వెంబడించడం అంటే సేవించడం అని అర్థం.

ఇదిగో, ఆయన బహుమానం ఆయన దగ్గర, ఉంది. తానిచ్చే జీతం ఆయన తీసుకు వస్తున్నాడు(యెషయా 62:11 TELIRV)

నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది. (కీర్తన 85:13 TELIRV)

వారసత్వంగా పొందడం అంటే శాశ్వతంగా సొంతం చేసుకోవడం.

తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి (మత్తయి 25:34)

రాజు ఎవరితో మాట్లాడుతున్నాడో వారికి సంపూర్ణ దైవపాలన శాశ్వతంగా ఉంటుంది.

సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు (1 కొరితి15:50 TELIRV)

మనుషులు తమ మర్త్య దేహాలలో ఉండగా దేవుని రాజ్యాన్ని శాశ్వత వారసత్వంగా పొందలేరు.

** వారసత్వం** అంటే ఒకరికి శాశ్వతంగా సంక్రమించేది.

నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ. పర్వతానికి తెస్తావు. (నిర్గమ 15:17 TELIRV)

దేవుణ్ణి ఆరాధించే పర్వతాలు అయన శాశ్వత ఆస్తి.

మా అపరాధాలను, పాపాలను క్షమించు. మమ్మల్ని నీ సొత్తుగా స్వీకరించు” అన్నాడు. (నిర్గమ 34:9 TELIRV)

మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు. అయన ఇశ్రాయేల్ ప్రజలను తన ప్రత్యేక సొత్తుగా చేసుకో మంతున్నాడు. అంటే శాశ్వతంగా ఆయనకు చెంది ఉండే వారుగా.

పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన (ఎఫెసి 1:18 TELIRV)

దేవుడు ప్రత్యేకించుకున్న వారికి ఆయనిచ్చే ఆశ్చర్యకరమైన విషయాలు శాస్వతమైన ఆస్తిపాస్తులు.

** వారసుడు** అంటే దేనినైనా శాశ్వతంగా తనదిగా చేసుకునే వాడు.

అబ్రాహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. (రోమా 4:13 TELIRV)

లోకమంతటిని అబ్రాహాము సంతానం శాశ్వత ఆస్తిగా పొందుతారనే వాగ్దానం.

ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. (హెబ్రీ 1:2 TELIRV)

దైవ కుమారుడు సమస్తాన్నీ శాశ్వత వారసత్వం గా పొందుతాడు.

ఇలా చేయడం ద్వారా నోవహు లోకంపై నేరం మోపాడు. విశ్వాసం ద్వారా వచ్చే నీతికి వారసుడయ్యాడు (హెబ్రీ 11:7 TELIRV)

నోవహు నీతి న్యాయాలను శాశ్వత ఆస్తిగా పొందాడు.

పండుకోవడం అంటే చనిపోవడం.

నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన, తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను. (2 సముయేలు 7:12 TELIRV)

వాళ్ళతో ఇలా అను, ‘మిగతావాళ్ళకంటే నువ్వు నిజంగా అందగత్తెవా? సున్నతిలేని వాళ్ళ దగ్గరికి దిగి వెళ్లి పడుకో కత్తితో చచ్చిన వాళ్ళతోబాటు వాళ్ళు కూలుతారు. అది కత్తిపాలవుతుంది. ఆమె విరోధులు ఆమెనూ ఆమె సేవకులనూ ఈడ్చుకుపోతారు (యెహె 32:19-20 TELIRV)

పరిపాలించడం అంటే అదుపులో ఉంచుకోవడం.

అదే విధంగా శాశ్వత జీవం కలగడానికి నీతి ద్వారా కృప మన ప్రభు యేసు క్రీస్తు మూలంగా ఏలడానికి పాపం విస్తరించిన చోటెల్లా కృప అపరిమితంగా విస్తరించింది. (రోమా 5:21 TELIRV)

కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. (రోమా 6:12 TELIRV)

విశ్రాంతి, విశ్రాంతి స్థలం అనేది శాశ్వత క్షేమ స్థితిని సూచిస్తుంది.

తరువాత రూతుతో నయోమి ఇలా చెప్పింది. “అమ్మా, నువ్వు స్థిరపడేలా, ఏదైనా ఏర్పాటు చెయ్యాలి కదా. నీకు క్షేమం చేకూరేలా నేను చూడాలి. (రూతు 3:1 TELIRV)

కాబట్టి, వాళ్ళు నా విశ్రాంతి స్థలంలో ఎన్నడూ ప్రవేశించరని నేను నా కోపంలో శపథం చేశాను. (కీర్తన 95:11 TELIRV)

ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను. (కీర్తన 132:14 TELIRV)

ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది. (యెషయా 11:10 TELIRV)

లేవడం, నిలబడడం అంటే చర్యకు ఉపక్రమించడం.

మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు. (కీర్తన 44:26 TELIRV)

దేనినైనా చూడడం అంటే అక్కడ ఉండడం అని అర్థం.

నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు (కీర్తన 16:10 TELIRV)

అమ్ముకోవడం అంటే వేరొకరి అదుపులో ఉంచడం. కొనడం అంటే తన అదుపులోకి తెచ్చుకోవడం.

ఫలితంగా యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద మండినప్పుడు ఆయన ఆరాము నహరాయిము రాజైన కూషన్ రిషాతాయిము కు బానిసలుగా ఉండడానికి వాళ్ళను అమ్మి వేశాడు (న్యాయాధి 3:8 TELIRV)

కూర్చోవడం అంటే పరిపాలించడం

దావీదు గుడారంలోనుంచి ఒకడు అక్కడ నమ్మకంగా కూర్చుంటాడు ( యెషయా 16:5 TELIRV)

నిలవడం అంటే విజయవంతంగా తిప్పి కొట్టడం

కాబట్టి తీర్పులో దుర్మార్గులు నిలవరు. అలానే నీతిమంతుల సభలో పాపులు నిలవరు. (కీర్తన 1:2 TELIRV)

నడవడం, మార్గం ప్రవర్తనను సూచిస్తాయి.

దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు. కీర్తన 1:1 TELIRV)

నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం (కీర్తన 1:6 TELIRV)

మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి (కీర్తన 119:28 TELIRV)

నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను. (కీర్తన 119:32 TELIRV)