te_ta/translate/bita-hq/01.md

15 KiB
Raw Permalink Blame History

వివరణ

బైబిల్లో శరీర భాగాలకు మానవ లక్షణాలకు చెందిన అలంకారాలు ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ చెప్పిన పదం తప్పనిసరిగా అలంకారిక భాషలో కనిపించనవసరం లేదు. అయితే ఆ పదంలోని భావం కనిపిస్తుంది.

శరీరం అంటే ఒక ప్రజా సమూహం.

మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. (1 కొరింతి 12:27 TELIRV)

ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది. (ఎఫెసి 4:15-16 TELIRV)

ఈ వచనాల్లో క్రీస్తు శరీరం అంటే క్రీస్తును అనుసరించే ప్రజ.

ముఖం అంటే ఒకరి సన్నిధి.

యెహోవా చెప్పేదేమంటే, నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? (యిర్మియా 5:22 TELIRV)

ఒకరి ముఖం ఎదుట ఉండడమంటే ఆ వ్యక్తి ఎదుట ఉండడం. అంటే అతనితో.

ముఖం అనేది ఒకరు దృష్టిని సూచిస్తుంది.

కాబట్టి నువ్వు ప్రకటన చేసి వాళ్లకి ఈ సంగతి చెప్పు. కాబట్టి నీవు వాళ్లకి సంగతి తెలియజేసి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహాలను హృదయంలో ప్రతిష్టించుకున్న వారెవరైనా, లేదా తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్న ఎవరైనా, ఆ తరువాత ప్రవక్త దగ్గరికి వస్తే యెహోవానైన నేను వాడు పెట్టుకున్న విగ్రహాల సంఖ్యను బట్టి వాడికి జవాబిస్తాను. (యెహె 14:4 TELIRV)

ఒకడు తన ముఖం ఎదుట దేన్నైనా పెట్టుకోవడం అంటే దాన్ని తదేకంగా చూడడం, లేక దాని పై ధ్యాస పెట్టడం.

పరిపాలకుని అనుగ్రహం కోరే వారు అసంఖ్యాకం. (సామెత 29:26 TELIRV)

ఎవరైనా ఒక వ్యక్తి ముఖం వెదకడం అంటే ఆ వ్యక్తి తనపై ధ్యాస పెడతాడని ఆశించడం.

నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు? (కీర్తన 44:24 TELIRV)

ముఖం దాచుకోవడం అంటే పట్టించుకోక పోవడం.

ముఖం అంటే ఉపరితలం

ప్రదేశమంతా కరువు వ్యాపించింది. (ఆది 41:56 TELIRV)

దాని మీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు. (యోబు 26:9 TELIRV)

చెయ్యి అంటే ఒక మనిషి ప్రయత్నం లేక బలం

ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నా చేత నా శత్రువులను నాశనం చేయించాడు. (1 దిన 14:11 TELIRV)

వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు, అంటే వారి వినాశనానికి దేవుడు నన్ను వాడుకున్నాడు అని అర్థం.

నీ చెయ్యి నీ శత్రువులందరినీ పట్టుకుంటుంది. నిన్ను ద్వేషించే వాళ్ళందరినీ నీ కుడిచెయ్యి పట్టుకుంటుంది. (కీర్తన 21:8 TELIRV)

నీ చెయ్యి నీ శత్రువులందరినీ పట్టుకుంటుంది" అంటే నీ శక్తి ద్వారా నీ శత్రువులను బంధిస్తావు అని అర్థం.

యెహోవా హస్తం రక్షించలేనంత కురుచగా అయిపోలేదు. (Isaiah 59:1 TELIRV)

"చెయ్యి పొట్టిగా అయి పోలేదు,” అంటే అయన బలం తగ్గలేదు.

తల అనేది పరిపాలకుని సూచిస్తున్నది. అతనికి ఇతరులపై అధికారం ఉంటుంది.

దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు. ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత. (ఎఫెసి 1:22 TELIRV)

స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి. క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. (ఎఫెసి 5:22-23 TELIRV)

యజమాని అంటే ఏదైనా పని చేయించే వాడికి గుర్తు.

ఇద్దరు యజమానులకు, ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. (మత్తయి 6:24 TELIRV)

దేవున్ని సేవించడం అంటే దేవుని ప్రేరణ కింద పని చెయ్యడం. ధన సేవనం అంటే డబ్బు ప్రేరణతో పని చెయ్యడం.

పేరు అనేది ఆ పేరు గల మనిషికి గుర్తు.

పైగా రాజు సేవకులు తమ యజమాని, రాజు అయిన దావీదుకు కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చారు. ‘దేవుడు నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువ ఖ్యాతి కలిగేలా, నీ రాజ్యం కంటే అతని రాజ్యం ఘనంగా ఉండేలా చేస్తాడు గాక’ అని చెప్పారు. 1 రాజులు 1:47 (TELIRV)

నేను నా ఘన నామంపైప్రమాణం చేసి చెప్తున్నాను. ఐగుప్తులో ఉన్న యూదులంతా ఇప్పుడు ‘యెహోవా జీవం తోడు’ అంటూ ఉంటారు. అయితే ఐగుప్తులో ఉన్న యూదుల్లో ఎవ్వరూ ఇక మీదట నా పేరునుతమ నోటితో పలకరు. (యిర్మియా 44:26 TELIRV)

ఎవరి పేరైనా ఘనమైనదైతే అతడు చాలా గొప్పవాడన్నమాట.

యెహోవా, దయచేసి విను. నీ దాసుడినైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. …. Nehemiah 1:11 (TELIRV)

ఒకరి పేరును గొప్ప చేయడమంటే అతణ్ణి గౌరవించడం.

నామం అంటే ఆ వ్యక్తి ఖ్యాతిని కీర్తిని సూచిస్తున్నది.

మీ అర్పణల వల్ల, మీ విగ్రహాల వల్ల, నా పవిత్రమైన పేరును అపవిత్రం చెయ్యొద్దు. యెహె 20:39 (TELIRV)

దేవుని పేరును అపవిత్రం చెయ్యడమంటే ఆయనను కించపరచడం. అంటే మనుషులు ఆయన్ను గురించి ఆలోచించే దాన్ని పాడు చేయడం.

మీ మూలంగా ఇతర రాజ్యాల్లో దూషణకు గురి అయిన నాగొప్ప పేరు ఎంత పవిత్రమో నేను చూపిస్తాను యెహె 36:23 (TELIRV)

దేవుని నామం పవిత్రం చెయ్యడం అంటే దేవుడు పవిత్రుడని అందరూ గ్రహించేలా చెయ్యడం.

వారు “నీ దేవుడైన యెహోవా నామాన్ని బట్టి నీ దాసులమైన మేము బహు దూరం నుండి వచ్చాం. దానికి కారణం ఆయన కీర్తినీ, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తాన్నీ … (యెహో 9:9 TELIRV)

వారు యెహోవాను గురించిన వార్త విన్నామని చెప్పడాన్ని బట్టి “యెహోవా నామాన్ని బట్టి” అంటే అయన కీర్తిని విని అని అర్థం.

ముక్కు అనేది కోపాన్ని సూచిస్తున్నది.

ఆయన ముక్కు పుటాలనుంచి. పొగ లేచింది. (కీర్తన 18:15 TELIRV)

నీ ముక్కుపుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి (నిర్గమ 15:8 TELIRV)

ఆయన ముక్కుపుటాల్లోనుంచి నుండి పొగ లేచింది. (2 సముయేలు 22:9 TELIRV)

ఆ రోజున, అంటే గోగు ఇశ్రాయేలీయుల దేశం మీదికి రాబోయే రోజున, నా కోపం విపరీతంగా మండుతుంది (యెహె 38:18 TELIRV)

ముక్కులోనుంచి లేచే పొగ తీవ్ర కోపాన్ని సూచిస్తుంది.

పైకెత్తిన కళ్ళు గర్వానికి సూచన.

గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు! (కీర్తన 18:27 TELIRV)

పైకెత్తిన కళ్ళు ఆ మనిషి గర్వానికి సూచన.

దేవుడు గర్విష్టులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు. (యోబు 22:29 TELIRV)

కళ్ళు దించుకోవడం నమ్రతకు సూచన.

ఫలానా పుత్రుడు అంటే అదే గుణ లక్షణాలు కలిగిన వాడు.

దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు. (కీర్తన 89:22b TELIRV)

దుర్మార్గ పుత్రుడు అంటే దుర్మార్గుడు అని అర్థం.

ఖైదీల నిట్టూర్పులు నీ దగ్గరికి రానివ్వు, నీ గొప్ప బలంతో చావనై ఉన్న వారిని కాపాడు. (కీర్తన 79:11 TELIRV)

మరణ సంతానం అంటే ఇతరుల చేతిలో చావనై ఉన్న వారు.

పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం. (ఎఫెసి 2:3 TELIRV)

ఉగ్రత సంతానం అంటే ఎవరి విషయంలో దేవుడు కోపంగా ఉన్నారో వారు.

అనువాద వ్యూహాలు

(అనువాద వ్యూహాలు చూడండి. బైబిల్ అలంకారాలు సాధారణ నమూనాలు)