te_ta/translate/bita-farming/01.md

11 KiB

బైబిల్లో వ్యవసాయానికి సంబంధించిన కొన్ని అలంకారాలు ఇక్కడ ఇస్తున్నాము. ఇక్కడ చెప్పిన పదం తప్పనిసరిగా అలంకారిక భాషలో కనిపించనవసరం లేదు. అయతే ఆ పదంలోని భావం కనిపిస్తుంది.

రైతు దేవునికి గుర్తుగా ఉన్నాడు. ద్రాక్ష తోట ఆయన ఎన్నుకున్న ప్రజ.

సారవంతమైన నేల గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్షతోట ఉంది.

ఆయన దాన్ని బాగా దున్ని రాళ్లను ఏరి అందులో శేష్ఠమైన ద్రాక్షతీగెలను నాటించాడు. దాని మధ్య కావలి గోపురం ఒకటి కట్టించి ద్రాక్షలు తొక్కే తొట్టి తొలిపించాడు. ద్రాక్షపండ్లు కాయాలని ఎదురు చూశాడు గానీ అది పిచ్చి ద్రాక్షకాయలు కాసింది. (యెషయా 5:1-2)

ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు. (మత్తయి 20:1 TELIRV)

ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు. (మత్తయి 21:33 TELIRV)

నేల అంటే మనుషుల హృదయాలు. (అంతరంగం)

యూదా వారికీ యెరూషలేము నివాసులకూ యెహోవా చెప్పేదేమంటే, మీ బీడు భూమిని దున్నండి. ముళ్ల పొదల్లో విత్తనాలు చల్లవద్దు. (యిర్మీయా 4:3 TELIRV)

ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే. రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు. అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు. ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు. మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు. అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు.”. (మత్తయి 13:19-23 TELIRV)

ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి. యెహోవాను వెదకడానికి ఇదే అదను.... (హోషేయ 10:12 TELIRV)

విత్తనాలు చల్లడం అంటే మనుషుల చర్యలు, ప్రవృత్తులు. పంట కోత అంటే తీర్పు, లేక ప్రతిఫలం.

నాకు తెలిసినంత వరకు దుష్టత్వాన్ని దున్ని, కీడు అనే విత్తనాలు చల్లే వాళ్ళు ఆ పంటనే కోస్తారు. (యోబు 4:8 TELIRV)

మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు. ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు. (గలతీ 6:7-8 TELIRV)

దుళ్ళగొట్టడం, తూర్పార బట్టడం అంటే మంచి వారి నుంచి చెడ్డవారిని వేరు చేయడం.

రైతులు గోధుమ, లేక ఇతర పంట కోసిన తరువాత దాన్ని కళ్ళం (చదునుగా ఉన్న గట్టి నేల) దగ్గరికి తెచ్చి పానల నుండి ధాన్యం రాల్చడానికి బండ్లతో, పశువులతో తొక్కిస్తారు. అప్పుడు ధాన్యం గింజలూ ఉపయోగం లేని తాలు గింజలూ వేరౌతాయి. అటు తరువాత పంటికోలతో, దానంతటిని తూర్పారబట్టడం ద్వారా తప్ప గింజలు గాలికి ఎగిరి పోతాయి. మంచివి నేలపై పడతాయి. వాటిని సేకరించి ఆహారంగా దాచుకుంటారు. (దుళ్ళగొట్టు తూర్పార బట్టు పేజీలు చూడండి. translationWords “దుళ్ళగొట్టు”” తూర్పార బట్టు" అనే మాటలు అనువదించడానికి)

దేశం గుమ్మాల్లో నేను వారిని చేటతో తూర్పారపడతాను. నా ప్రజలు తమ పద్ధతులను విడిచి నా దగ్గరికి రావడం లేదు కాబట్టి వాళ్ళను నాశనం చేస్తాను. (యిర్మీయా 15:7 TELIRV)

“తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.” (లూకా 3:17 TELIRV)

అంటుకట్టడం అంటే అన్య జాతుల వారిని దేవుడు తన ప్రజలుగా చేసుకునే పధ్ధతి.

ఎలాగంటే, నిన్ను ఒక అడవి ఒలీవ చెట్టు నుండి కోసి, అసహజంగా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టగలిగిన వాడు సహజమైన కొమ్మలను మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టుకు అంటుకట్టగలడు కదా! సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకూ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు కఠినమయ్యాయి. (రోమా 11:24-25 TELIRV)

వర్షం దేవుడు తన ప్రజలకు ఇచ్చే వరం.

... ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ... (హోషేయ 10:12 TELIRV)

ఇది ఎలాగంటే, నేల తరచుగా తనపై కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలనిస్తూ దేవుని దీవెనలు పొందుతుంది. అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై శాపానికి గురి అవుతుంది. తగలబడిపోవడంతో అది అంతం అవుతుంది. (హెబ్రీ 6:7-8 TELIRV)

కాబట్టి సోదరులారా, ప్రభువు రాక వరకూ ఓపికగా ఉండండి. రైతు తొలకరి వాన, కడవరి వాన కురిసే దాకా విలువైన పంట కోసం ఓపికతో ఎదురు చూస్తూ వేచి ఉంటాడు కదా. (యాకోబు 5:7 TELIRV)