te_ta/translate/bita-animals/01.md

11 KiB
Raw Permalink Blame History

బైబిల్లో శరీర భాగాలు, అవి సూచించే గుణ లక్షణాలు అలంకారిక భాష జాబితా ఇక్కడ ఇచ్చాం. ప్రతివచనంలోను ఇది కనిపించకపోవచ్చు కానీ అలంకారిక భాష మాత్రం అన్నిట్లో ఉంది.

జంతువు కొమ్ము బలాన్ని సూచిస్తున్నది.

యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు. నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయ స్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు. (2 సమూయేలు 22:3 IEV)

“రక్షణ కొమ్ము” అంటే నన్ను కాపాడే బలమైన వాడు.

అక్కడే దావీదు వంశానికి కొమ్ము మొలిచేలా చేస్తాను.” (కీర్తనలు 132:17 IEV)

“ దావీదుకొమ్ము" అంటే దావీదు సైనిక బలం.

పక్షులు అంటే ప్రమాదం లో ఉండి భద్రత లేని వారిని సూచిస్తున్నాయి.

ఎందుకంటే కొన్నిపక్షులను తేలికగా వల పన్ని పట్టుకోవచ్చు.

ఒకడు పక్షిని తరిమినట్టు నా శత్రువులు అకారణంగా నన్ను కనికరం లేకుండా తరిమారు. (విలాప 3:52 IEV)

వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో. (సామెతలు 6:5 IEV)

బోయవాడంటే ఉచ్చు పన్ని పక్షుల్ని పట్టుకునే వాడు

వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము (కీర్తనలు 124:7 IEV)

మాంసం తినే పక్షులు త్వరగా దాడి చేసే శత్రువును సూచిస్తున్నాయి.

హబక్కూకు, హోషేయ గ్రంథాల్లో ఇశ్రాయేల్ వారి శత్రువులు దాడి చేసే గరుడ పక్షుల్లా ఉన్నారు.

ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు! (హబ 1:8 IEV)

కాబట్టి యెహోవానైన నా ఇంటి మీద వాలడానికి గద్ద వస్తూ ఉంది అని ప్రకటించు. ... కానీ ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించారు, కాబట్టి శత్రువు వారిని తరుముతాడు. (హోషేయ 8:1,3 IEV)

యెషయాలో ఒక విదేశీ రాజును దేవుడు వేటాడే పక్షితో పోల్చాడు. ఎందుకంటే అతడు మెరుపు వేగంతో వచ్చి ఇశ్రాయేల్ వారి శత్రువులపై దాడి చేస్తాడు

తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తున్నాను. దూరదేశం నుండి నా సంకల్పాన్ని జరిగించే వ్యక్తిని పిలుస్తున్నాను (యెషయా 46:11 IEV)

పక్షి రెక్కలు భద్రతను సూచిస్తాయి.

పక్షులు తమ రెక్కలు చాపి పిల్లలను చేర్చుకుంటాయి.

నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.  నా మీద దాడి చేసే దుర్మార్గుల నుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువుల నుంచి నన్ను కాపాడు. (కీర్తనలు 17:8-9 IEV)

రెక్కలు భద్రతను ఎలా సూచిస్తున్నాయో చూడండి.

దేవా, నన్ను కరుణించు. నన్ను కరుణించు. ఈ ఆపదలు తొలగిపోయే వరకూ నా ప్రాణం నీ రెక్కల నీడలో ఆశ్రయం కోరుతున్నది. (కీర్తనలు 57:1 IEV)

ప్రమాదకరమైన జంతువులు ప్రమాదకరమైన వ్యక్తులను సూచిస్తున్నాయి.

కీర్తనల్లో, దావీదు తన శత్రువులను సింహాలతో పోలుస్తున్నాడు.

నా ప్రాణం సింహాల మధ్య ఉంది. ఆగ్రహంతో ఊగిపోతున్న వారి మధ్య నేను పండుకుని ఉన్నాను. వారి పళ్ళు శూలాలు, బాణాలు, వారి నాలుకలు పదునైన కత్తులు. దేవా, ఆకాశంకంటే అత్యున్నతుడవుగా నిన్ను నీవు కనపరచుకో (కీర్తనలు 57:4 IEV)

సాతానును గర్జించే సింహంతో పేతురు పోలుస్తున్నాడు.

నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. (1 పేతురు 5:8 IEV)

మత్తయి సువార్తలో యేసు అబద్ధ ప్రవక్తలను తోడేళ్ళు అని పిలుస్తున్నాడు. ఎందుకంటే వారు తమ అబద్ధాలతో మనుషులకు హాని చేస్తారు.

అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రె తోలు కప్పుకొని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వారు క్రూరమైన తోడేళ్ళు. (మత్తయి 7:15 IEV)

మత్తయి సువార్తలో బాప్తిసమిచ్చే యోహాను మతనాయకులను విష సర్పాలుగా పిలుస్తున్నాడు. వారు తమ అబద్ధాలతో హాని చేస్తారు.

చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు, “విషసర్పాల పిల్లలారా, రాబోయే దేవుని ఆగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? (మత్తయి 3:7 IEV)

గరుడ పక్షి బలాన్ని సూచిస్తున్నది.

నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు. మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు. (కీర్తనలు 103:5 IEV)

యెహోవా ఇలా చెప్తున్నాడు. “తన రెక్కలను విప్పార్చుకుని ఎగిరే గద్దలా శత్రువు మోయాబు పైకి వస్తున్నాడు (యిర్మీయా 48:40 IEV)

గొర్రెలు, గొర్రెల మంద అంటే, భద్రత అవసరమైన, లేక ప్రమాదంలో ఉన్న మనుషులు.

నా ప్రజలు దారి తప్పిన గొర్రెలు. వారి కాపరులు వారిని పర్వతాల పైకి తీసుకు వెళ్లి దారి మళ్ళించారు. (యిర్మీయా 50:6 IEV)

ఆ తరవాత ఆయన తన ప్రజలను గొర్రెలను తోలినట్టుగా నడిపించాడు. ఒకడు తన మందను ఎలా నడిపిస్తాడో అరణ్యంలో ఆయన వారిని అలా నడిపించాడు. (కీర్తనలు 78:52 IEV)

ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు. సింహాలు వాటిని చెదరగొట్టి, తరిమాయి. మొదటిగా అష్షూరు రాజు వాళ్ళను మింగివేశాడు. దాని తర్వాత బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వాళ్ళ ఎముకలు విరగ్గొట్టాడు. (యిర్మీయా 50:17 IEV)

తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా, పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి. 17మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు (మత్తయి 10:16 IEV)