te_ta/intro/translate-why/01.md

4.8 KiB
Raw Permalink Blame History

నీకు బైబిల్ అనువాదకునిగా శిక్షణనివ్వడమే ఈ అనువాదం అకాడెమీ ఉద్దేశం. నీ స్వభాషలోకి బైబిల్ తర్జుమా చేసి నీ స్వజాతి ప్రజలను యేసు శిష్యులుగా ఎదిగేలా చెయ్యడం చాలా ప్రాముఖ్యమైన పని. నీవు ఈ పని పట్ల నిబద్ధత కలిగి ఉండాలి, నీపై ఉన్న బాధ్యతను సీరియస్ గా తీసుకోవాలి. ప్రభువు నీకు సహాయం చెయ్యాలని ప్రార్థించాలి.

దేవుడు బైబిల్లో మనతో మాట్లాడాతాడు. తన వాక్కును హిబ్రూ, అరమేయిక్, గ్రీకు భాషల్లో రాయడానికి బైబిల్ రచయితలను ఆయన ప్రేరేపించాడు. దాదాపు 40మది వేరువేరు రచయితలు క్రీ. పూ. 1400 నుం డి క్రీ. శ. 100 వరకూ బైబిల్ రాశారు. మధ్య ప్రాచ్యంలో, ఉత్తర ఆఫ్రికాలో ఐరోపాలో రాసిన వివిధ వ్రాత ప్రతులున్నాయి. ఈ భాషల్లో తన వాక్కును గ్రంథస్తం చెయ్యడం ద్వారా ఆ కాలంలో ఆనాటి ప్రజలు తన వాక్కును అర్థం చేసుకొనేలా దేవుడు చూశాడు

ఈనాడు నీ దేశంలో ప్రజలకు హిబ్రూ, అరమేయిక్, గ్రీకు భాషలు అర్థం కావు. కానీ దేవుని వాక్కును వారి భాషలోకి తర్జుమా చేస్తే వారు అర్థం చేసుకోగలుగుతారు!

"మాతృభాష" లేదా "హృదయ భాష" అంటే ఒక మనిషి బాల్యంలో మొట్టమొదటగా తన ఇంట్లో మాట్లాడిన భాష. ఈ భాష వారికి ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. వారు తమ లోతైన భావాలను వ్యక్తం చేయడానికి ఈ భాషనే వాడతారు. ప్రతి ఒక్కరూ తమ హృదయ భాషలో దేవుని వాక్కును చదవాలని మా ఆశయం..

అన్నిభాషలు ప్రముఖ్యమే, ప్రశస్తమైనవే. మీ దేశంలో మాట్లాడే జాతీయ భాష ఎంత ముఖ్యమో తక్కువ మంది మాట్లాడే భాష కూడా అంటే ముఖ్యం. అవి కూడా అంటే బాగా అర్థాన్ని వ్యక్తపరచగలవు. ఎవరూ కూడా తన భాషలో మాట్లాడడానికి సిగ్గు పడనక్కర లేదు. కొన్ని సార్లు ఈ అల్పసంఖ్యాక వర్గాలు తమ భాష విషయంలో బిడియపడి ఆ దేశంలో అధిక సంఖ్యలో ఉన్న వారి సమక్షంలో దాన్ని మాట్లాడడానికి జంకుతారు. అయితే జాతీయ భాష విషయంలో స్వతహాగా స్థానిక భాష కన్నా మరింత ప్రాముఖ్యం, మరింత ప్రతిష్టాత్మకం, మరింత విద్యా సంబంధం, ఏమీ లేదు. ప్రతి భాషలోనూ దానికదే విలక్షణమైన నాజూకు అర్థ భేదాలు, అర్థ అంతరాలు ఉంటాయి. మనకు ఏది అన్నిటికన్నా సౌకర్యమో దాన్ని ఉపయోగించాలి. దేని సహాయంతో సర్వ శ్రేష్టంగా ఇతరులతో మాటలాడగలుగుతామో దాన్ని ఎంచుకోవాలి.

  • మూలం. టాడ్ ప్రైస్ Ph.D. CC BY-SA 4.0*"బైబిల్ అనువాదం,సిద్ధాంతం, ఆచరణ" నుండి తీసుకోన్నారు.