te_ta/intro/statement-of-faith/01.md

7.2 KiB

  • ఈ పత్రం అధికారిక ప్రతి ఇక్కడ ఉంది. http://ufw.io/faith/.*

  • ఈ పత్రాన్ని రచించడంలో పాల్గొన్న సంస్థలన్నీ ఈ విశ్వాస ప్రమాణానికి, ఈ క్రింద ఇచ్చిన ఇతర ప్రమాణాలకు కట్టుబడి ఉన్నాయి unfoldingWord, Nicene Creed, మరియు Athanasian Creed; ఇంకా Lausanne Covenant.*

క్రైస్తవ విశ్వాసాన్ని రెండు భాగాలుగా విభజించ వచ్చని మేము నమ్ముతున్నాము అవసరమైన నమ్మకాలు మరియు అనుబంధ నమ్మకాలు (రోమా 14).

అవసరమైన నమ్మకాలు

అవసరమైన నమ్మకాలు అంటే యేసు క్రీస్తును అనుసరించే వారంతా ఎప్పటికీ రాజీ పడలేనివి, నిర్లక్ష్య పెట్టనివి.

  • కేవలం బైబిల్ మాత్రమే దైవ ప్రేరణ కలిగిన, లోపరహితమైన, అన్నిటికీ చాలిన, అధికారిక దైవ వాక్కు అని మేము నమ్ముతున్నాము (1 తెస్సలోనిక 2:13; 2 తిమోతి 3:16-17).
  • ఒకే దేవుడు, శాశ్వత ఉనికి కలిగినవాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని మేము నమ్ముతున్నాము: తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ (మత్తయి 28:19; యోహాను 10:30).
  • యేసు క్రీస్తు దైవత్వాన్ని మేము నమ్ముతున్నాము (యోహాను 1:1-4; ఫిలిప్పి 2:5-11; 2 పేతురు 1:1).
  • యేసు క్రీస్తు మానవత్వాన్ని, ఆయన కన్య జననాన్ని, పాపా రహిత జీవనాన్ని ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చిందించిన రక్తం ద్వారా ఆయన చేసిన ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తాన్ని ఆయన శారీరిక పునరుత్థానాన్ని తండ్రి కుడి వైపుకు ఆయన ఆరోహణాన్ని మేము నమ్ముతున్నాము (మత్తయి 1:18,25; 1 కొరింతి 15:1-8; హెబ్రీ 4:15; అపో.కా.1:9-11; అపో.కా. 2:22-24).
  • ప్రతి వ్యక్తీ స్వతహాగా పాపి అనీ శాశ్వత నరకానికి పాత్రుడనీ మేము నమ్ముతున్నాము (రోమా 3:23; యెషయా 64:6-7).
  • రక్షణ అనేది దేవుని ఉచిత వరం అనీ అది యేసు క్రీస్తు త్యాగపూర్వక మరణ పునరుత్థానాల మూలంగా సిద్ధించిందనీ, అది కేవలం విశ్వాస మూలంగా కృప ద్వారానే లభించిందని, నీతిక్రియల మూలంగా కాదని మేము నమ్ముతున్నాము (యోహాను 3:16; యోహాను 14:6; ఎఫెసి 2:8-9, తీతు 3:3-7).
  • నిజమైన విశ్వాసం తోబాటు పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ మూలంగా కలిగే పునర్జన్మ ద్వారా వస్తుందనీ మేము నమ్ముతున్నాము (యాకోబు 2:14-26; యోహాను 16:5-16; రోమా 8:9).
  • ప్రస్తుతం పరిశుద్ధాత్మ యేసు క్రీస్తును అనుసరించిన వారందరిలో నివసిస్తున్నాడని, భక్తిగల జీవితం గడపడానికి ఆయనే శక్తినిస్తాడని పరిశుద్ధాత్మ పరిచర్య ఇదేనని మేము నమ్ముతున్నాము (యోహాను 14:15-26; ఎఫెసి 2:10; గలతి 5:16-18).
  • యేసుక్రీస్తు లో విశ్వాసులందరికీ అంటే అన్ని భాషల, జాతుల, ప్రజా సమూహాల వారందరికీ ఆత్మ సంబంధమైన ఐక్యత ఉన్నదని మేము నమ్ముతున్నాము (ఫిలిప్పి 2:1-4; ఎఫెసి 1:22-23; 1 కొరింతి 12:12,27).
  • యేసు క్రీస్తు వ్యక్తిగత శారీరిక పునరాగమనాన్ని మేము నమ్ముతున్నాము (మత్తయి 24:30; అపో.కా. 1:10-11).
  • రక్షణ పొందిన, నశించిన వారిద్దరూ తిరిగి లేస్తారని, రక్షణ లేని వారు నరకంలో శాశ్వత శిక్ష కోసమూ రక్షణ పొందిన వారు దేవునితో పరలోకంలో శాశ్వత ధన్యత కోసమూ తిరిగి లేస్తారని మేము నమ్ముతున్నాము (హెబ్రీ 9:27-28; మత్తయి 16:27; యోహాను 14:1-3; మత్తయి 25:31-46).

అనుబంధ నమ్మకాలు

అనుబంధ నమ్మకాలు అంటే లేఖనాల్లో తక్కినవి అన్నీ. అయితే యథార్థంగా క్రీస్తును అనుసరించేవారికి వీటి విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. (ఉదా. బాప్తిసం, ప్రభువు బల్ల, సంఘారోహణం మొ..). మేము సౌజన్యంతో ఇలాటి వాటిలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడానికి సమ్మతించి ప్రతి ప్రజలోనూ మనుషులను శిష్యులుగా చేయాలన్న ఉమ్మడి లక్ష్యం వైపుకు కలిసి సాగుతాము. (మత్తయి 28:18-20).