te_obs/content/40.md

6.7 KiB

40. యేసు సిలువ వేయబడ్డాడు

OBS Image

సైనికులు యేసును హేళన చేసిన తరువాత, వారు ఆయనను సిలువను వెయ్యడానికి తీసుకొని వెళ్ళారు. ఆయన సిలువ మీద చనిపోయేలా ఆ సిలువను ఆయన మీద ఉంచారు.

OBS Image

“కపాలం” అనే స్థలానికి యేసును తీసుకొని వచ్చారు, ఆయన చేతులను, కాళ్ళనూ సిలువకు మేకులతో కొట్టారు. అయితే యేసు, “తండ్రీ వారిని క్షమించు, ఎందుకంటే వారు చేయుచున్నది వారికి తెలియదు.” ఆయన తలకు పైగా వారు ఒక గుర్తును ఉంచారు. “యూదులకు రాజు” అని దాని మీద రాశారు. ఈ విధంగా రాయాలని పిలాతు చెప్పాడు.

OBS Image

యేసు వస్త్రాల విషయంలో సైనికులు చీట్లు వేసారు. వారు ఆ విధంగా చేసినప్పుడు, “వారు తమ మధ్య నా వస్త్రాలను గురించి చీట్లు వేస్తారు” అనే ప్రవచన నేరవేరింది.

OBS Image

ఆ సమయంలో అక్కడ ఇద్దరు బందిపోటు దొంగలు ఉన్నారు, అదే సమయంలో సైనికులు వారిని కూడా సిలువ వేసారు. వారిని యేసుకు రెండువైపులా వారిని సిలువ వేశారు. ఆ ఇద్దరు దొంగలలో ఒకరు యేసును హేళన చేసాడు, అయితే మరొకడు అతనితో, “దేవుడు నిన్ను శిక్షిస్తాడని నీవు దేవునికి భయపడవా? మనం చేసిన చెడు కార్యాలను బట్టి ఈ శిక్ష మనకు తగినదే. ఈయనలో ఏ పాపమూ లేదు” అని చెప్పాడు. తరువాత యేసు వైపు తిరిగి, “యేసూ నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో” అని అడిగాడు. యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు, “ఈ రోజున నీవు నాతో పరదైసులో ఉంటావు.”

OBS Image

యూదా మతపెద్దలూ, సమూహంలోని ఇతర ప్రజలు యేసును హేళన చేసారు. వారు ఆయన వైపు తిరిగి, “నీవు నిజముగా దేవుని కుమారుడవైతే సిలువనుండి కిందకు దిగుము, నిన్ను నీవు రక్షించుకో! అప్పుడు మేము నిన్ను విశ్వసిస్తాం” అని అన్నారు.

OBS Image

అప్పుడు ఆ ప్రాంతం అంతటిలో అది మధ్యాహ్న సమయ అయినప్పటికీ ఆకాశం పూర్తిగా చీకటి అయ్యింది, పగలు మిట్టమధ్యాహ్నం చీకటి అయ్యింది. మూడు గంటల పాటు చీకటి అయ్యింది.

OBS Image

అప్పుడు యేసు, “సమాప్తం అయ్యింది, అని తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను” అని బిగ్గరగా అరిచాడు. తరువాత ఆయన తన తలను వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన చనిపోయినప్పుడు భయంకరమైన భూకంపం కలిగింది, ప్రజలను దేవునికి మధ్య ఉన్న దేవాలయపు తెర పైనుండి కిందకు రెండుగా చీలిపోయింది

OBS Image

ఆయన మరణం ద్వారా మనుష్యులు దేవుని వద్దకు రాగలిగే మార్గాన్ని యేసు తెరచాడు. జరిగినదాన్నంతటినీ చూసిన అక్కడ ముఖ్య సైనికుడు, “నిజముగా ఇతడు దేవుని నిర్దోషి, ఈయన దేవుని కుమారుడు” అని చెప్పాడు.

OBS Image

యోసేపు, నికోదేము అనే ఇద్దరు యూదా నాయకులు అక్కడికి వచ్చారు. యేసే మెస్సీయ అని వారు విశ్వసించారు. యేసు దేహాన్ని తమకు ఇవ్వాలని వారు పిలాతును మనవి చేసారు. యేసు దేహాన్ని వారు వస్త్రంతో చుట్టారు, రాతినుండి తొలిచిన ఒక సమాధిలో యేసు దేహాన్ని ఉంచడానికి వారు తీసుకొనివెళ్లారు. అప్పుడు వారు సమాధి యెదుట ఉన్న పెద్ద రాయిని తొలగించి సమాధిని తెరిచారు.

మత్తయి 27:27-61; మార్కు 15:16-47; లూకా 23:26-56; యోహాను 19:17-42 నుండి బైబిలు కథ